chitravathi reservoir
-
అధికారులతో కలిసి రిజర్వాయర్ లో సీఎం వైఎస్ జగన్ బోటింగ్
-
కర్ణాటకలో భారీ వర్షాలు.. చిత్రావతి, పెన్నా, జయమంగళి నదులకు భారీగా వరద
-
పాపం ఆ ప్రేమజంట.. ఆనందంగా గడిపి.. అంతలోనే..
తాడిమర్రి(అనంతపురం జిల్లా): దాడితోట గ్రామ సమీపాన చిత్రావతి నదిలో శుక్రవారం సాయంత్రం ప్రేమజంట గల్లంతయ్యింది. ఎస్ఐ డి.లక్ష్మీనారాయణ తెలిపిన మేరకు... బుక్కరాయసముద్రం మండలం చదళ్ల గ్రామానికి చెందిన ఎర్రి నాగప్ప, నాగేశమ్మ దంపతుల మూడో కుమారుడు అమర్నాథ్ (22) అనంతపురం, తాడిపత్రిలో సెంట్రింగ్ పనులు చేస్తుండేవాడు. అతనితో పాటు సెంట్రింగ్ పనులు చేస్తున్న దాడితోటకు చెందిన పశురాంతో పరిచయమైంది. ఈ క్రమంలో అనంతపురం నగరంలోని ప్రకాష్ రోడ్డుకు చెందిన ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్న రామాంజినమ్మ (20)తో అమర్నాథ్కు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. చదవండి: కన్నతల్లి ఉన్మాదం.. దేవుడు ఆవహిస్తున్నాడని.. వేటకొడవలితో ఈ క్రమంలో వీరిద్దరూ శుక్రవారం ఉదయం దాడితోటలోని పరుశురామ్ ఇంటికి వెళ్లారు. నాలుగు రోజులుగా సీబీఆర్లో ఒక గేట్ ఎత్తి దిగువకు నీటిని వదిలారు. నదిలో నీటిని చూడటానికి ముగ్గురూ కలసి చిత్రావతిలోకి వెళ్లారు. అక్కడ నీటిని చూస్తూ సెల్ఫీలు.. తీసుకుని తిరిగి ఇంటికి వస్తున్న తరుణంలో నీరు తాగడానికని రామాంజినమ్మ నదిలోకి వెళ్లింది. నీరు తాగుతున్నపుడు కాలుజారి ప్రవాహంలో కొట్టుకుపోయింది. వెంటనే అమర్నాథ్ రక్షించేందుకు దూకాడు. ఇద్దరు భయాందోళనకు గురై ఒకరిని ఒకరు పట్టుకుని నీటి ఉధృతిలో కనిపించకుండాపోయారు. సమాచారం అందుకున్న ఎస్ఐ డి.లక్ష్మీనారాయణ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లారు. ముందుగా సీబీఆర్ నుంచి వస్తున్న నీటిని బంద్ చేయించారు. అనంతరం గ్రామస్తుల సహాయంతో నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. -
నీటి కష్టాలు ఏవిధంగా తీరుస్తారు: వైఎస్ జగన్
కడప: పది టీఎంసీల నీరు ఉండాల్సిన చిత్రావతి రిజర్వాయర్ లో ఒక టీఎంసీ నీరుందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన చిత్రావతి రిజర్వాయర్ లో నీటిమట్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తాగునీటి కోసం పులివెందుల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును కనీసం 10 శాతం కూడా నింపలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షన్నర ఎకరాల సాగుభూమి ఉంటే కనీసం కనీసం 12 వేల ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇప్పుడు ఉన్న ఒక్క టీఎంసీ నీటితో 0.95 టీఎంసీ నీరు డెడ్ స్టోరేజీలో ఉండాల్సిందే. ఇక ఏవిధంగా పులివెందుల సాగు, తాగు నీటి కష్టాలు తీరుస్తారని జగన్ ప్రశ్నించారు. ఇటువంటి పరిస్థితులు పులివెందులలో ఉంటే రైతులకు సన్మానం చేస్తామంటూ చంద్రబాబు, దేవినేని చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు. బ్రహంసాగర్ రిజర్వాయర్ కు 12 టీఎంసీల నీరు వైఎస్సార్ ఇస్తే.. చంద్రబాబు ఏ ఈడాది చుక్కనీరు కూడా ఇవ్వలేదని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.