బస్సులు తిప్పుతాం : ఆర్టీసీ ఆర్ఎం
అనంతపురం న్యూసిటీ : అఖిలపక్ష పార్టీలు సోమవారం బంద్కు పిలుపునిచ్చినా ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిప్పుతామని ఆర్ఎం చిట్టిబాబు ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.