Cholamandalam Investment and Finance
-
ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్.. వెల్లయన్ సుబ్బయ్య
ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీ చైర్మన్ వెల్లయన్ సుబ్బయ్య ఈవై వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును అందుకున్నారు.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 వేల మంది వ్యాపారవేత్తల నుంచి సుబ్బయ్యను ఎంపిక చేశారు. మొనాకోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. దశాబ్ద కాలంలో భారత్ సాధించిన మూడో విజయం ఈవై రీజియన్లలో ఈ ఘనత సాధించిన ఏకైక దేశంగా తన హోదాను సుస్థిరం చేసుకుంది.ఒకటిన్నర దశాబ్దం క్రితం వెల్లయన్ తన కుటుంబ వ్యాపారంలో నాయకత్వాన్ని చేపట్టి, కల్లోలమైన భాగస్వామ్యం, ప్రపంచ ఆర్థిక మాంద్యం ద్వారా చోళమండలానికి మార్గనిర్దేశం చేశారు. ఆయన చైర్మన్ గా ఉన్న కాలంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 60 రెట్లు పెరిగింది. 2018లో వ్యూహాత్మక పెట్టుబడుల పునర్విభజన, కొనుగోళ్ల ద్వారా 70 ఏళ్ల నాటి తయారీ సంస్థ టీఐఐకి నాయకత్వం వహించారు.నాల్గవ తరం కుటుంబ వ్యాపారంలో భాగంగా వ్యవస్థాపకత్వ స్ఫూర్తి తనలో లోతుగా ఉందని సుబ్బయ్య అన్నారు. సవాళ్లను అవకాశాలుగా స్వీకరించి, స్వీయ అభివృద్ధి పథంలో పయనించడం ద్వారా మనం సాధించేదానికి హద్దులు ఉండవని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు.ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ (డబ్ల్యూఈఓవై) అవార్డు గ్రహీతలుగా డాక్టర్ కిరణ్ మజుందార్ షా (2020), ఉదయ్ కోటక్ (2014), నారాయణమూర్తి (2003) సరసన వెల్లయన్ చేరారు. ఈవై వరల్డ్ ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2024ను వ్యవస్థాపక స్ఫూర్తి, ప్రయోజనం, వృద్ధి, ప్రభావం అనే నాలుగు ప్రధాన ప్రమాణాల ఆధారంగా స్వతంత్ర ప్యానెల్ ఎంపిక చేసింది. -
చోళమండలం ఇన్వెస్ట్ గూటికి పేస్విఫ్
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ పేమెంట్ సొల్యూషన్స్ అందించే పేస్విఫ్ టెక్నాలజీస్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్ల చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ తాజాగా వెల్లడించింది. రూ. 450 కోట్లను వెచ్చించడం ద్వారా 72.12% వాటా సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు వాటా కొనుగోలు ఒప్పందం(ఎస్పీఏ) కుదుర్చుకున్నట్లు పేర్కొంది. కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులతో డీల్ కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. వాటా కొనుగోలు తదుపరి పేస్విఫ్‌ను అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసింది. షేరుకి రూ. 1,622.66 ధరలో నగదు ద్వారా ఒకేసారి లేదా దశలవారీగా మెజారిటీ వాటాను చేజిక్కించుకోనున్నట్లు వివరించింది. బ్యాక్‌గ్రౌండ్ ఇలా: 2013లో ప్రారంభమైన పేస్విఫ్ ఆన్లైన్ పేమెంట్ గేట్‌వే సర్వీసులు అందిస్తోంది. ప్రధానంగా ఈకామర్స్ బిజినెస్‌లకు సేవ లు సమకూర్చుతోంది. ఈకామర్స్ సొల్యూషన్స్‌ను అందిస్తోంది. బిజినెస్ యజమానులు కస్టమర్ల నుంచి చెల్లింపులను ఆమోదించేందుకు వీలుగా ఓమ్నీచానల్ పేమెంట్ లావాదేవీల సొల్యూషన్స్ సమకూర్చుతోంది. స్టోర్లలో, హోమ్డెలివరీ (ఇంటివద్ద), ఆన్లైన్, ఎంపీవోఎస్, పీవోఎస్ తదితరాల ద్వారా చెల్లింపులు నిర్వహించేందుకు వీలు కల్పిస్తోంది. మొత్తం రుణ మంజూరీ విధానంలో ఆధునిక మార్పులు, విస్తరణలకుగాను కంపెనీ అమలు చేస్తున్న దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా తాజా కొనుగోలుకి తెరతీసినట్లు చోళమండలం ఇన్వెస్ట్ పేర్కొంది. ప్రధానంగా ఎస్ఎంఈ విభాగం రుణాల మంజూరీలో ఎకో సిస్టమ్‌ను అమలు చేసేందుకు ఇది తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేసింది. -
సెక్యూరిటీ ఇంటెలిజెన్స్- చోళమండలం భళా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఓవైపు సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఇండియా.. మరోపక్క చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కౌంటర్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కంపెనీల షేర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఎస్ఐఎస్ ఇండియా లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఎస్ఐఎస్ ఇండియా లిమిటెడ్ నికర లాభం 42 శాతం జంప్‌చేసి రూ. 108 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 33 శాతం పెరిగి రూ. 2,158 కోట్లను తాకింది. పటిష్ట క్యాష్‌ఫ్లో కారణంగా ఈ కాలంలో రూ. 213 కోట్లమేర రుణాలను తిరిగి చెల్లించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎస్ఐఎస్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 14 శాతం దూసుకెళ్లి రూ. 404కు చేరింది. ప్రస్తుతం 7.2 శాతం లాభంతో రూ. 381 వద్ద ట్రేడవుతోంది. చోళమండలం ఇన్వెస్ట్మెంట్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో చోళమండలం ఇన్వెస్ట్మెంట్ నికర లాభం 41 శాతం జంప్‌చేసి రూ. 432 కోట్లకు చేరింది. ఇందుకు బలపడ్డ నికర వడ్డీ మార్జిన్లు, నిర్వహణ వ్యయాలు తగ్గడం సహకరించినట్లు తెలియజేసింది. ఆస్తుల నాణ్యతకు సంబంధించి స్టేజ్-3 రుణాలు 2.75 శాతంగా నమోదుకాగా.. ప్రొవిజన్ కవరేజీ నిష్పత్తి 42.65కు చేరినట్లు పేర్కొంది. ప్రాపర్టీలపై రుణాల బిజినెస్ నామమాత్రంగా క్షీణించి రూ. 1,052 కోట్లను తాకింది. రూ. 6,802 కోట్ల నగదు నిల్వల ద్వారా పటిష్ట లిక్విడిటీని కలిగి ఉన్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో చోళమండలం షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9 శాతం దూసుకెళ్లి రూ. 273 వద్ద ట్రేడవుతోంది. -
చోళమండలం..తగ్గిన మొండి బకాయిలు
ముంబై: చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.291 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో సాధించిన నికర లాభం (రూ.220 కోట్లు)తో పోల్చితే 33 శాతం వృద్ధి సాధించామని కంపెనీ తెలిపింది. నిధుల వ్యయం తక్కువగా ఉండడం, ఫీజు ఆదాయం ఎక్కువగా ఉండడం, మొండి బకాయిలు తక్కువగా ఉండడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఎమ్డీ ఎన్. శ్రీనివాసన్ తెలిపారు. స్థూల మొండి బకాయిలు 4.66శాతం నుంచి 2.94 శాతానికి, నికర మొండి బకాయిలు 3.19 శాతం నుంచి 1.66 శాతానికి తగ్గాయని వివరించారు. ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో బీఎస్ఈలో ఈ షేర్ ఆల్ టైమ్ హై, రూ.1,714ను తాకింది. -
పేమెంట్ బ్యాంక్ రేసు నుంచి వైదొలుగుతున్నాం
చోళమండలం ఫైనాన్స్ వెల్లడి ముంబై: పేమెంట్ బ్యాంకుల రేసు నుంచి వైదొలుగుతున్నామని మురుగప్ప గ్రూప్‌కు చెందిన చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ బీఎస్ఈకి తెలిపింది. పేమెంట్ బ్యాంక్ ఏర్పాటు కోసం తమ అనుబంధ సంస్థ చోళమండలం డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్(సీడీఎస్ఎల్) ఆర్బీఐ నుంచి సూత్రప్రాయ ఆమోదాన్ని పొందిందని, ఈ ఆమోదాన్ని తిరిగి ఆర్బీఐకే సమర్పిస్తున్నామని పేర్కొంది. పేమెంట్ బ్యాంకులకు సంబంధించిన వ్యాపారంలో తీవ్రమైన పోటీ ఉంటుందని, వ్యాపారం ప్రారంభించడానికే చాలా కాలం పడుతుందని, అందుకే ఈ రంగం నుంచి తప్పుకుంటున్నామని వివరించింది. చెల్లింపు బ్యాంక్ వ్యాపార కార్యకలాపాల కోసం సీడీఎస్‌ఎల్‌లో రూ.75 కోట్లు పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని పేర్కొంది. ఆర్బీఐ గత ఏడాది ఆగస్టులో 11 సంస్థలకు పేమెంట్ బ్యాంకులకు సంబంధించి సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. ఈ పేమెంట్ బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లో రెమిటెన్స్‌ల సేవలు నిర్వహించాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ. 1 లక్ష వరకూ డిపాజిట్లు అంగీకరించవచ్చు. ఖాతాదారులకు ఎలాంటి రుణాలు ఇవ్వడానికి లేదు. మురుగప్ప గ్రూప్‌కు చెందిన ఆర్థిక విభాగం, సీడీఎస్ఎల్.. ఇప్పటికే వాహన, ఎస్ఎంఈ, గృహ రుణాలందిస్తోంది. ఇన్వెస్టర్ అడ్వైజరీ సేవలను కూడా అందజేస్తోంది.