cigaratte smokers
-
సిగరెట్ తాగొద్దన్నందుకు దాడి!
ఖమ్మం: సిగరెట్ తాగుతున్న యువకులను దూరంగా పోయి తాగాలని చెప్పినందుకు వారు దాడి చేశారు. ఈ ఘటనపై ఆదివారం ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శనివారం సాయంత్రం ధంసలాపురానికి చెందిన ఎన్.వెంకటమ్మ ఇంటి ఎదురుగా నలుగురు యువకులు సిగరెట్ తాగుతూ వదులుతున్న పొగ ఇంట్లోకి వస్తోంది. గమనించిన వెంకటమ్మ, కుమారుడు నాగరాజు.. దూరంగా వెళ్లి తాగండని చెప్పారు. దీంతో చంటి అనే యువకుడితో పాటు మిత్రులు మరో ముగ్గురు కలిసి వారిని అసభ్యకరంగా దూషిస్తూ రాళ్లతో దాడి చేశారని, పోలీసులకు చెపితే చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
కాల్చేస్తాం, జరిమానా కట్టేస్తాం
సాక్షి, బెంగళూరు: ధూమపానం అటు ఆరోగ్యాన్ని, ఇటు జేబును నాశనం చేస్తుందని ఎందరు హితోక్తులు చెప్పినా ధూమపాన ప్రియులు చెవికెక్కించుకోవడం లేదు. రాష్ట్రంలో ధూమపానం చేసేవారి సంఖ్య పెరగడమే దీనికి నిదర్శనం. దేశంలోనే అగ్రస్థానంలో కన్నడనాడు నిలిచింది. పబ్లిక్ స్థలాల్లో పొగతాగుతూ పట్టుబడిన వారి జాబితాలోనూ కర్ణాటకదే తొలిస్థానం. సుమారు 35 శాతంతో కర్ణాటక ఇందులో పై వరుసలో ఉంది. ఎన్నిసార్లు జరిమానాలు విధిస్తున్నప్పటికీ పబ్లిక్ ప్రాంతాల్లో ధూమపానం చేయడం మాత్రం ఆగడం లేదు. కర్ణాటక తర్వాత స్థానంలో కేరళ ఉంది. గడిచిన మూడేళ్లలో 5.07 లక్షల మంది పొగ తాగుతూ దొరికిపోయి జరిమానా కట్టారు. కోట్పా చట్టం చూస్తోంది సిగరెట్, పొగాకు ఉత్పత్తుల చట్టం (కోట్పా) అమల్లో ఉంది. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం ఈ చట్టరీత్యా నేరం. కానీ ధూమపానప్రియులు యథావిధిగా రద్దీ ప్రాంతాల్లో పొగాకు కాలుస్తున్నారు. టీ స్టాళ్లు, పాన్ దుకాణాలు, పార్కులు, వీధుల్లో ఇది అధికంగా ఉంది. అధికారుల తనిఖీలలో దొరికితే ఈ నేరానికి రూ. 200 జరిమానా విధిస్తున్నారు. పొగరాయుళ్లు ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదని తూర్పు జోన్ డీసీపీ శరణప్ప తెలిపారు. 5.07 లక్షల జరిమానాలు 2019 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు దేశంలో మొత్తం 14.40 లక్షల మంది బహిరంగ ప్రాంతాల్లో ధూమపానం చేసి జరిమానాలు చెల్లించారు. ఇందులో కర్ణాటక నుంచే సుమారు 5.07 లక్షల మంది ఉండడం గమనార్హం. దేశంలోని మొత్తం కేసులతో పోలిస్తే 35 శాతం ఒక్క బెంగళూరు నుంచే ఉన్నాయి. మొత్తం జరిమానాల్లో 50 శాతం కర్ణాటక, కేరళ రాష్ట్రాల వాటానే ఉంది. (చదవండి: చాటింగ్, హాట్ ఫొటోలతో పారిశ్రామికవేత్తకు టోకరా) -
తెర పై స్మొ ‘కింగ్స్’
రాజేంద్రనగర్‌కు చెందిన ఓ టీనేజర్ ఒకటి తర్వాత ఒకటిగా ప్యాకెట్ సిగిరెట్లు హాంఫట్ చేశాడు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. కేజీఎఫ్ సినిమాలో హీరోను చూసి ఆ కుర్రాడు ఫాలో అయ్యాడనేది తర్వాత తెలిసిన సంగతి. అయితే ఈ తరహాలో టీనేజర్లపై సినిమాలు, వెబ్ సిరీస్ ప్రభావం తీవ్రమవుతోందని, మరింత తీవ్రంగా మారనుందని గతంలోనే నగరం వేదికగా నిర్వహించిన ఓ అధ్యయనం తేల్చింది. ఈ నేపధ్యంలో టీనేజర్ల భవిష్యత్తు ‘పొగ’చూరిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సాక్షి , హైదరాబాద్: మాస్ మీడియా మరియు ఇంటర్నెట్లోని సెలబ్రిటీల విజువల్స్‌కు ప్రభావితమైన యువకులు మద్యపానంతో పాటు ధూమపానానికి అలవాటు పడుతున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సీనియర్ సోషల్ సైంటిస్ట్ (డిప్యూటీ డైరెక్టర్) మేకం మహేశ్వర్ గతంలో నిర్వహించిన అధ్యయనం దీన్ని నిర్ధారించింది. ‘టీనేజర్స్ డైట్ మరియు హెల్త్–రిలేటెడ్ బిహేవియర్‌పై మాస్ మీడియా ప్రభావం’ అనే అంశంపై చేసిన సర్వేలో 15 శాతం మంది అబ్బాయిలు సెలబ్రిటీలను అనుకరించడానికే తాము సిగరెట్ తాగామని స్పష్టం చేశారు. సినిమాతో పాటు వెబ్‌సిరీస్ తదితర సోషల్ మీడియా సెలబ్రిటీలు సైతం వీరిని ప్రభావితం చేశారని తేలింది. మిగతా వయసుల వారితో పోలిస్తే టీనేజర్లపై స్మోకింగ్ సీన్స్ ప్రభావం ఎక్కువగా ఉంటోందని పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి అధ్యయనాలు సైతం వెల్లడించాయి. ఆన్లైన్ లోకం..అవగాహనే శరణ్యం.. ప్రపంచం అంతా ఆన్లైన్ మీదే నడిచే రోజులు వచ్చేస్తున్న పరిస్థితుల్లో పిల్లల్ని స్మోకింగ్ సీన్స్‌కి దూరంగా ఉంచడం అంత సులభ సాధ్యం కాదు. అయినా ఆ ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు ధూమపానం వల్ల కలిగే అనర్ధాలను తరచుగా వారికి వివరించి చెబుతూ ఉండాలని వైద్యులు, మానసిక చికిత్స నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు ఇచ్చే పాకెట్ మనీని నియంత్రించడం, వారి అలవాట్లపై ఓ కన్నేసి ఉంచాలని అంటున్నారు. టీనేజీకి...చాలా ప్రమాదకరం గతంలో టీనేజర్స్ స్మోకింగ్‌కు ఇంట్లో తండ్రో, తాతో, అన్నో.. ప్రభావం కారణమయ్యేది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ప్రభావం సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూపిస్తున్నాయి. సిగరెట్లలలో వందల కొద్దీ హానికారక పదార్ధాలు ఉంటాయి. చిన్నవయసులో అలవాటు పడితే అది ఎదుగుదల హార్మోన్లపైనా చెడు ప్రభావం చూపిస్తుంది. మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. ఆస్తమా, టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మా పిల్లలకు ఆ అలవాటు కాదులే అనే ధీమాకి పోకుండా...స్మోకింగ్‌ను పిల్లలకు దూరంగా ఉంచడానికి వారిలో ముందస్తుగానే అవగాహన పెంచడం అవసరం. –డా.రమణప్రసాద్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, కిమ్స్ ఆసుపత్రి (చదవండి: తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40 మంది అభ్యర్థులకు ఉత్తమ ర్యాంకులు) -
'ఇప్పటికీ విమానాల్లో అగ్గిపెట్టె తీసుకెళ్తున్నా'
విమానాల్లో అగ్గిపెట్టెలు, సిగరెట్ల లాంటివాటిని అనుమతించరు గానీ, తాను ఇప్పటికీ అగ్గిపెట్టెలను తీసుకెళ్తూనే ఉన్నానని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. విమానాల ఆలస్యం గురించి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మీడియా ప్రశ్నలకు సమాధానంగా ఆయనీ విషయం తెలిపారు. ''నేను సిగరెట్లు కాలుస్తా. విమానశ్రయాల్లో నన్ను తనిఖీ చేయడం మానేయగానే అగ్గిపెట్టెలు కూడా తీసుకెళ్తున్నా'' అన్నారు. అయితే ప్యారిస్ విమానాశ్రయంలో మాత్రం తనిఖీలు గట్టిగా ఉంటాయని, వాళ్లు తన జేబులు చూసిన తర్వాత అగ్గిపెట్టె, సిగరెట్లు, పోర్టబుల్ యాష్ ట్రే అన్నింటినీ తీసేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే.. తన అగ్గిపెట్టెతో సహా అన్నింటినీ వాళ్లు తనకు తిరిగి ఇచ్చేశారన్నారు. ఈ సందర్భంగా ఆయన తన పోర్టబుల్ యాష్ ట్రేను తీసి చూపించారు. కొన్ని దేశాల్లో అగ్గిపెట్టెలను విమానాల్లో నిషేధిత వస్తువుగా ప్రకటించారని, కొన్ని దేశాల్లో మాత్రం అలా లేదని అన్నారు. భద్రత అనేది అర్థవంతంగా ఉండాలి తప్ప అర్థరహితంగా ఉండకూడదని వ్యాఖ్యానించారు. భారతీయులందరికీ అగ్గిపెట్టెలు తీసుకెళ్లే హక్కు కల్పించాలంటారా అని విలేకరులు ప్రశ్నించగా, పొగ తాగడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు తనకు తెలుసని, అందువల్ల భారతీయులు పొగతాగకూడదనే తాను చెబుతానని మంత్రి అశోక్ గజపతి రాజు తెలిపారు.