ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి
నాగర్కర్నూల్రూరల్: రెండో ఏఎ¯Œæఎంలు తమ డిమాండ్ల సాధన కోసం తొమ్మిదిరోజులుగా చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వం మొండివైఖరి వీడి వాటి పరిష్కారానికి కృషిచేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు కందికొండ గీత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నల్లవల్లి చౌరస్తాలో రెండో ఏఎన్ఎంలతో కలిసి రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజారోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ పనిచేస్తున్న రెండో ఏఎన్ఎంలపై ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. చర్చలకు పిలవకపోవడం కార్మికుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలుపుతుందన్నారు. పదో పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని, ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని, డ్యూటీలో మరణించిన ఉద్యోగులకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామయ్య, ఏఎన్ఎంల సంఘం జిల్లా అధ్యక్షురాలు సుగుణ, కళావతి, అరుణ, కృష్ణలీల, లక్ష్మీనర్సమ్మ, విజయలక్ష్మి, శ్రీదేవి, హైమావతి, లక్ష్మి, నాయకులు కొట్ర నవీన్, అశోక్ పాల్గొన్నారు.