city people
-
Paragliding: పారా హుషార్..
సాధారణంగా పారాగ్లైడింగ్ అనేది పర్యాటకప్రాంతాల్లో మాత్రమే ఉంటుందనే అపోహ చాలా మందిలో ఉంది. పైగా అది నేర్చుకుంటే ఏం వస్తుందిలే అన్న భావన కూడా ఉంది. అయితే మనకు పారాగ్లైడింగ్ గురించి కనీసం అవగాహన లేని సమయం నుంచే ఇందులో మెళకువలు నేర్చుకుని నగర యువతకు చుక్కానిగా నిలుస్తున్నారు హైదరాబాదీ ప్రభు సుకుమార్ దాస్. చిన్నతనం నుంచే గ్లాలో ఎగరాలనే తన కోరికను పారాగ్లైడింగ్తో సాకారం చేసుకున్నాడు.రెక్కలు తొడిగి... ప్రయాణాలు అంటే ఇష్టంతో ముందుగా బుల్లెట్ బైక్‌పై ఐదు దేశాలు తిరిగాడు. అదే సమయంలో పారాగ్లైడింగ్ గురించి తెలుసుకుని, నేర్చుకున్నాడు. అప్పటి నుంచి దేశ విదేశాల్లో పారాగ్లైడింగ్‌లో అద్భుతాలు సృష్టించాడు. పారాగ్లైడింగ్ చేస్తూ ఈజిప్టులోని గ్రేట్ పిరమిడ్స్, బ్రెజిల్‌లోని రియో క్రీస్ట్ విగ్రహం, అట్లాంటిక్ సముద్రంతో పాటు అమెజాన్ నది, నైలు నది, ఎర్ర సముద్రంపై ఎగిరిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా కర్ణాటక నుంచి రాజస్థాన్ వరకూ పాదయాత్రను ఎగురుకుంటూ ఫాలో అయ్యారు. దీంతో రాహుల్ గాంధీ తనను ప్రత్యేకంగా అభినందించారని సుకుమార్ సంతోషం వ్యక్తం చేశారు.ఎంతో మందికి శిక్షణ..పారాగ్లైడింగ్ చేస్తే వచ్చే అనుభూతి వేరని చెబుతున్న సుకుమార్.. వందలాది మందికి ఇందులో శిక్షణ ఇచ్చాడు. పారాగ్లైడింగ్‌లో కూడా మంచి భవిష్యత్తు ఉందని, ఎంతోమంది పారాగ్లైడింగ్‌లో శిక్షణ తీసుకుని విదేశాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నాడు. అందుకే ఇప్పుడు చాలామంది పారాగ్లైడింగ్ నేర్చుకునేందుకు ముందుకు వస్తున్నారని చెబుతున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కొందరు ఆదివాసీ పిల్లలకు పారాగ్లైడింగ్‌లో ఉచితంగా తర్ఫీదునిచ్చాడు. వారంతా నేషనల్ పారామోటార్ చాంపియన్íÙప్లో పాల్గొన్నారని, అప్పుడు వారి కళ్లల్లో చూసిన ఆనందం తనకు ఎంతో సంతృప్తినిచి్చందని సుకుమార్ చెబుతున్నాడు. ఎంతోమంది కలలను నిజం చేయడంలో ఉన్న ఆనందం మరెక్కడా దొరకదని పేర్కొంటున్నాడు. భవిష్యత్తులో ఎగిరే పోలీసులు..విపత్తుల వేళ పారాగ్లైడింగ్ చేసే వారికి ఎంతో డిమాండ్ ఉంటుందని సుకుమార్ చెబుతున్నాడు. భవిష్యత్తులో ఎగిరే పోలీసులు కూడా వస్తారని అంటున్నాడు. ఇప్పటికే తాము నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలకు శిక్షణ ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూడా పలువురు పోలీసులకు శిక్షణ ఇచ్చానని వివరించాడు. ఇక, తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక తదితర రాష్ట్రాలో ప్రత్యేక పండుగల సందర్భంగా పారాగ్లైడింగ్ చేస్తూ వాటి ప్రత్యేకతను ప్రజలకు తెలియజేసేలా సుకుమార్ ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ముఖ్యంగా తెలంగాణ అవతరణ దినోత్సవం, బతుకమ్మ, సంక్రాంతి పండుగల వేళ పారాగ్లైడింగ్తో వాటి ప్రాముఖ్యత తెలిసేలా చేశాడు. ఇక, మైసూరులో జరిగే దసరా ఉత్సవాల సందర్భంగా చేసే పారాగ్లైడింగ్‌లో ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాడు. -
Sankranti: ఊరెళ్తున్నారా.. జర జాగ్రత్త.. ఈ విషయం మరిచారో అంతే..!
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సెలవులను పురస్కరించుకొని సొంత ప్రాంతాలకు వెళ్లే ఆయా కాలనీ, అపార్టుమెంట్ వాసులు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. గతంలో సంక్రాంతి సెలవుల్లో జరిగిన దొంగతనాలను పరిగణలోకి తీసుకొని ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. సొంత గ్రామాలకు వెళ్లే వారు ఇళ్లల్లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, డబ్బులు ఉంచవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో గానీ, లాకర్లు లేని వారు వాటిని తమ బంధువుల ఇళ్ళలో భద్రపరుచుకోవాలి. అదే విధంగా ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులందరూ ఊరికి ప్రయాణం కట్టిన పరిస్థితుల్లో తెలిసిన వారిని తమ ఇళ్లల్లో రాత్రివేళ పడుకునేలా చర్యలు తీసుకోవాలి. చదవండి: నుమాయిష్‌కు వైరస్ దెబ్బ.. ‘ఏం చేయాలో తోచడం లేదు’ ఊరికి వెళుతున్న విషయాన్ని ప్రచారం చేసుకోకుండా ఉండటం మంచిది. కొందరు తమ వెంట బ్యాగుల్లో బంగారు ఆభరణాలతో బస్సుల్లో ప్రయాణం తలపెడతారు అటువంటి సమయంలో బస్సుల్లో కూడా దొంగతనాలు జరిగే అవకాశం సంఘటనలు ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఊరికి వెళ్లే ముందు కిటికీలు, తలుపుల బోల్ట్‌లు, తాళాలు సరిగా వేసింది లేనిది మహిళలు ఒకటికి రెండు సార్లు పరిశీలించుకుంటే మంచిది. ఆర్ధిక స్థోమత ఉన్న వారు అలారం ఏర్పాటు చేసుకోవటంతో పాటు సెంట్రల్ లాక్ సిస్టమ్ అమర్చుకుంటే మంచిది. సీసీ కెమెరాలు ఉన్నవారు ఆన్‌చేసి వెళ్లాలి. ఆయా కాలనీల సంక్షేమ సంఘాలు ఈ పండుగ సెలవులు ముగిసే వరకు కొందరు యువకులతో రాత్రి సమయాల్లో గస్తీ ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలు అరికట్టవచ్చు. అపార్ట్మెంట్ల్లో సెక్యురిటీని పెంచుకోవాలి. వాటిలోకి వచ్చి పోయే వారి పేర్లు తప్పనిసరిగా నమోదు చేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.. ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, గ్యాస్ స్టవ్ రిపేర్ పేరిట అపార్ట్మెంట్లకు వచ్చే కొత్త వ్యక్తులను అనుమతించ కూడదు. ఇళ్ళకు తాళాలు వేసి వెళ్లే వారు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందజేస్తే దొంగతనాలు జరగకుండా ఆయా గల్లీల్లో పోలీసులు పెట్రోలింగ్ చేపట్టి గట్టి నిఘా ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా ఈ సూచనలు, సలహాలను సంక్రాంతి పండుగకు తమ స్వంత ఊరుకు వెళ్లే ప్రతి ఒక్కరు పాటిస్తే మంచిది. ►ఊరు వెళ్లాల్సివస్తే విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోండి. ►సెలవుల్లో బయటకు వెళుతున్నప్పుడు సెక్యూరిటీ, అలారం మోషన్ సెన్సార్‌ను ఏర్పాటు చేసుకోవటం మంచిది. ►తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వండి. ►కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతూ వుంటే పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి. లేదా 100 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. ►వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేసుకోవాలి. ద్విచక్రవాహనాలకు తాళాలు వేయటంతో పాటు వీలైతే చక్రాలకు కూడా చైన్స్‌తో కూడిన తాళం వేయటం మర్చిపోవద్దు. ►ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాల ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. ►సంక్రాంతి సెలవుల్లో ఊరుకు వెళుతున్న వారు ఇంటి బయట, ఇంటిలో కనీసం 1, 2 లైట్లు వేసి వుంటే మంచిది. ►ఇంటికి ఇరువైపులా నమ్మకమైన వారు ఉంటే మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పి వెళ్లటం మంచిది. జాగ్రత్తలు పాటించాలి సంక్రాంతి సెలవుల్లో తమ స్వంత ఊరుకు వెళ్లే వారు ఇంటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా ఇంట్లో ఉన్న విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. ఇరుగు పొరుగు వారికి తమ ఇంటిపై ఓ కన్నేసి ఎప్పటికప్పుడు పరిశీలించేలా చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా దొంగతనాలను అరికట్టేందుకు ఆటోల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. కరపత్రాలను పంపిణీ చేయటంతో పాటు కాలనీ అసోసియేషన్ సంక్షేమ సంఘాల వారితో సమావేశాలు ఏర్పాటు చేసి జాగ్రత్తలపై పలు సూచనలు చేస్తున్నాం. –కూకట్పల్లి సీఐ నర్సింగ్‌రావు -
పట్నం బాబుల పాలిట్రిక్స్
ఉద్యోగం, వ్యాపారం ఇతర కారణాలతో పల్లెలను వదిలి పట్టణాల్లో స్థిరపడ్డ వారు మళ్లీ ఉన్న ఊరిపై మమకారం పెంచుకుంటున్నారు. ఆర్థికంగా బలపడడంతో వారి కన్ను ఇప్పుడు స్థానిక రాజకీయాలపై పడింది. ఇంకేముంది.. డబ్బు సంచులతో గ్రామాల్లో దిగిపోతున్నారు.లోకల్ పవర్ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు విందులు, బేరసారాలు.. సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మొత్తానికి పట్నం బాబుల రాకతో పల్లె రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సాక్షి, యాదాద్రి : స్థానిక సంస్థలకు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో పట్నం బాబుల్లో కదలిక మొదలైంది. రాజధానిలో ఉండి ఆర్థికంగా బలపడిన వారిలో చాలా మంది ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అంతేకాకుండా యాదాద్రి భువనగిరి జిల్లా గ్రేటర్‌కు పొరుగునే ఉండడం.. వచ్చివెళ్లడానికి అంత కష్టమైన పనేమీ కాకపోవడంతో పదవీ కాంక్ష పెంచుకుంటున్నారు. అదే లక్ష్యంగా ముందస్తుగానే గ్రామాలకు చేరుకుని జోరుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి నుంచే ఓటర్లను ఆకర్షించేందుకు చర్యలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా విందులు, బేరసారాలు ఇస్తున్నారు. ఎంత డబ్బయినా ఖర్చు పెడుతామంటూ ఎక్కడికక్కడ సంకేతాలు ఇస్తున్నారు. తాజాగా జరుగుతున్న గ్రామీణ ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకుంటున్నారు. ఇంతకాలం హైదరాబాద్ నగరంలో ఓటరుగా ఉన్న వారు.. ప్రస్తుతం గ్రామాల్లో ఓటు హక్కు పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పాగా వేయడమే లక్ష్యంగా.. జిల్లాలో ప్రస్తుతం 334 గ్రామ పంచాయతీలు, ఒక మున్సిపాలిటీ ఉంది. అదనంగా మరో 100 వరకు నూతన పంచాయతీలు, ఐదు నగర పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. గ్రామ పంచాయతీలకు స ర్పంచ్‌లు, వార్డు సభ్యులను, మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు చైర్మన్లను, కౌన్సిలర్లను ఎన్నుకుంటారు. ఇందుకోసం సర్పంచ్‌లు, నగర, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక పరోక్ష పద్ధతిలో నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలో వార్డు సభ్యులుగా, కౌన్సిలర్లుగా గెలిస్తే ఎం త డబ్బు ఖర్చు చేసైనా పాగా వేయొచ్చనే లక్ష్యంతో పట్నం బాబులు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం వార్డుల వారీగా ఓటర్లు, ప్రస్తుతం ఉన్న జనా భా, కులం, మతం, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వారి కోసం చేయాల్సిన ఖర్చు తదితర అంశాలపై లెక్కలు గడుతున్నారు. పదవికోసం కొందరు.. ఉన్నవారికి సేవ చేసేందుకు మరికొందరు.. ప్రధానంగా జీవనోపాధి, ఉద్యోగం, విద్య, వ్యాపారం నిమిత్తం పల్లెలను వదిలిన పలువురు పట్టణాల్లో ఆర్థికంగా బలపడ్డారు. వీరిలో కొందరు మాతృభూమికి సేవ చేయాలన్న ఆలోచనకు వచ్చారు. ఇందుకోసం స్థానిక సంస్థల్లో పవర్ సాధించడం ద్వారా తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మంచి అవకాశంగా భావిస్తున్నారు. మరికొందరు మాత్రం అధికారం కోసం పావులు కదుపుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజధాని హైదరాబాద్‌కి పొరుగునే ఉండడడంతో పట్నం బాబులు, పల్లెలకు వచ్చి వెళ్లడం చాలా సులువుగా ఉంటుంది. ముమ్మరంగా సాగుతున్న కసరత్తు.. మరోవైపు అధికార యంత్రాంగం నూతన గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల ఏర్పాటుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. నూతన గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలకు సంబంధించిన భౌగోళిక మ్యాప్‌లు, వాటి ఆదాయ, వ్యయాలు, ఓటర్ల విభజన, ఆస్తులను విభజన చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈనెల 25వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపే పనిలో అధికారులు ముందుకు సాగుతున్నారు. -
ఎగిరిపోతే..ఎంత బాగుంటుందో!
వీకెండ్ వచ్చింది.. ఎంజాయ్ చేయాలి. ఐదురోజులు పండగ సెలవులొచ్చాయి.. ఎక్కడికైనా సరదాగా వెళ్లాలి. సిటీలో తిరిగితిరిగీ విసుగొచ్చేసింది.. అందుకే దూరంగా ఎగిరిపోవాలి.. ఆనందంగా విహరించి రావాలి. ఈ ఆలోచన వచ్చిందే తడవు సిటీవాసులు ఆచరణలో పెడుతున్నారు. ఆన్లైన్లో చూస్తున్నారు.. ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తున్నారు.. అప్పటికప్పుడే ‘రెక్కలు’ çకట్టుకుపోతున్నారు. రెండు రోజులు సెలవుదొరికినా సరే సింగపూర్, మలేసియా, దుబాయ్ వంటి దేశాల్లో వాలిపోతున్నారు. విమానయాన సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు అందిస్తున్న ఆకర్షణీయమైన ఆఫర్లతో దిగువ మధ్య తరగతివారు సైతం పక్క రాష్ట్రాలకు విమానంలో వెళ్లొస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల పర్యాటక దృక్పథంలో సరికొత్త మార్పులు వచ్చేశాయి. రోజు రోజుకు దిగివస్తున్న ఫ్లైట్ చార్జీలతో మధ్యతరగతి ప్రజలు అంతర్జాతీయ ప్రయాణాలకు ఆసక్తి చూపుతున్నారు. నాలుగు రోజులు సెలవులొస్తే చాలు ఏ మలేషియా ట్రిప్పుకో, సింగపూర్ టూర్‌కో సన్నద్ధమవుతున్నారు. నగరవాసుల అభిరుచికి తగ్గట్లుగానే ట్రావెలింగ్ సంస్థలు సైతంఆకర్షణీయమైన ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఐఆర్సీటీసీ, అంతర్జాతీయ ట్రావెల్ ఆర్గనైజర్ కాక్స్ అండ్ కింగ్స్ వంటి సంస్థలు ఈ వింటర్లో ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు చక్కటి ప్యాకేజీలతో ముందుకు వస్తున్నాయి. మరోవైపు శని, ఆదివారాలు వంటి వీకెండ్స్‌లో ఎక్కువ శాతం మంది ఊటీ, కొడైకెనాల్, కూర్గ్, పంచాగ్ని వంటి పొరుగు రాష్ట్రాల్లోనిప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. గతేడాది కంటే ఈ సంవత్సరం సిటీ నుంచి అంతర్జాతీయ పర్యాటక ప్రయాణాలు 20 శాతం వరకు, దేశీయ పర్యాటక ప్రయాణాలు 18 శాతం పెరిగినట్లు కాక్స్ అండ్ కింగ్స్‌లో సర్వేలో వెల్లడైంది. ఆ ఐదు దేశాలకే ఎక్కువ డిమాండ్... వ్యాపారం, ఉద్యోగం, ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ నుంచి ఎక్కువ శాతం అమెరికా, యూరోప్ దేశాలకు వెళ్తుండగా సందర్శనీయ స్థలాల కోసం ఎక్కువ మంది దుబాయ్, సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా, ఆస్ట్రేలియాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ వింటర్ హాలిడేస్‌లో ఈ ఐదు దేశాలకే ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు ట్రావెలింగ్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. ఐఆర్సీటీసీ రూపొందించే ప్యాకేజీల్లోనూ దుబాయ్, అబుదాబి వంటి దేశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉండడం గమనార్హం. ఈ ఐదు దేశాల తరువాత ఇండోనేషియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలను సైతం పర్యాటకంగా ఎంపిక చేసుకుంటున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతి రోజు సుమారు 40 వేల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండగా వారిలో ఎక్కువ శాతం ఈ ఐదు దేశాలకు వెళ్లే వాళ్లు ఉండడం విశేషం. వింటర్ హాలిడేస్‌లో ఈ సంఖ్య మరో 10 వేలు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా. డొమెస్టిక్ టూర్స్... అంతర్జాతీయ ప్రయాణాలతో పాటు జాతీయ స్థాయి సందర్శన ప్రాంతాలకు సైతం ఫ్లైట్ ప్యాకేజీలకు డిమాండ్ బాగా పెరిగింది. కేరళ, అండమాన్, గోవా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు ఎక్కువ శాతం తరలి వెళ్తున్నారు. మహారాష్ట్రలోని పంచాగ్ని, కర్ణాటకలోని కూర్గ్, తమిళనాడలోని ఊటి, కొడైకెనాల్‌కు ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు కాక్స్ అండ్ కింగ్స్ వెల్లడించింది. ఇక ప్రయాణికుల అభిరుచికి తగిన విధంగానే ట్రావెలింగ్ ఏజెన్సీలు ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నాయి. విమానప్రయాణంతో పాటు, రోడ్డు రవాణా, భోజనం, వసతి, సైట్‌సీయింగ్, తదితర అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాయి. యూరోప్ దేశాలకు రూ.లక్ష లోపే గ్రూపు ప్యాకేజీలను అందజేస్తున్నాయి. ఐఆర్సీటీసీ ప్యాకేజీలు.. రైల్వే అనుబంధ ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్సీటీసీ విమాన ప్రయాణాలను సైతం అందిస్తోంది. ‘పర్యాటక్ పర్వ్–2017’ లో భాగంగా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్యాకేజీలను సిద్ధం చేసింది. వచ్చే జనవరి 26 నుంచి 4 రోజుల పాటు కొనసాగే దుబాయ్ టూర్లో భాగంగా ఒక ప్రయాణికుడికి రూ.59,814 ప్యాకేజీలో ఫ్లైట్ టిక్కెట్, వసతి, రోడ్డు రవాణా తదితర అన్ని సదుపాయాలను కల్పిస్తోంది. వింటర్ టూర్లో భాగంగా వచ్చే నవంబర్ 17 నుంచి జనవరి 12వ తేదీ వరకు దశలవారీగా శబరి, కొచ్చిన్, గురువాయూర్ తదితర ప్రాంతాలకు ప్యాకేజీలను సిద్ధం చేసింది. ఒక ప్రయాణికుడికి రూ.15,885 ప్యాకేజీలో అన్ని వసతులు కల్పిస్తారు. వచ్చే ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు కొనసాగే సౌత్ గోవా టూర్ చార్జీ రూ.రూ.16,854 మాత్రమే. అహ్మదాబాద్, జూనాగఢ్, సాసన్గిర్ తదితర ప్రాంతాల సందర్శన కోసం మరో ప్యాకేజీని సిద్ధం చేశారు. ఇంలాంటి ప్యాకేజీలు మరెన్నో ఐఆర్సీటీసీ సిద్ధం చేసింది. తరుచూ వెళ్తుంటా.. ఫ్లైట్ చార్జీలు ఇపుడు చాలా వరకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పాటు ఐఆర్సీటీసీ వంటి సంస్థలు మంచి ప్యాకేజీలు అందజేస్తున్నాయి. ఇంటర్నేషనల్ ట్రావెల్ ఏజెన్సీలు కూడా అందుబాటులో ఉండడంతో నేను కుటుంబంతో సహా రెగ్యులర్‌గా సింగపూర్, మలేషియా, దుబాయ్, గోవా, కొడైకెనాల్ ప్రాంతాలకు వెళ్తాను. – ప్రదీప్‌రెడ్డి ఫ్లైట్ జర్నీ ఈజీ అయింది.. ఒకప్పటితో పోల్చుకొంటే ఇప్పుడు ఫ్లైట్ జర్నీ చాలా ఈజీ అయింది. గంటల తరబడి రైళ్లలో ప్రయాణం చేయడం కంటే ఫ్లైట్‌లో వెళ్లడం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. గోవా, విశాఖ,ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రాంతాలకు ట్రైన్ కంటే ఫ్లైట్ బెటర్. – నాగలక్ష్మి, లెక్చరర్ ఐఆర్సీటీసీ ప్యాకేజీలకు బీమా కూడా ఉంది పర్యాటకులకు అన్ని సదుపాయాలతో ప్యాకేజీలను అందజేస్తున్నాం. ఫ్లైట్ టిక్కెట్లతో పాటు, భోజనం, వసతి, రోడ్డు రవాణా, గైడ్స్ వంటి అన్ని సదుపాయాలు ఐఆర్సీటీసి అందజేస్తోంది. పైగా ప్రయాణికులకు బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నాం. – సంజీవయ్య, డిప్యూటీ జనరల్ మేనేజర్, ఐఆర్సీటీసీ -
బస్సుల్లో... బలపరీక్ష
నరకం.. నగర ప్రయాణం ⇒ నాయకులూ ఆలోచించండి..! ⇒ మొత్తం బస్సులు 3580 ⇒ మెట్రో (ఏసీ) 80 ⇒ మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు 1000 ⇒ ఆర్డినరీ బస్సులు 2500 ⇒ ప్రస్తుత అవసరం 1000 ⇒ భవిష్యత్ అవసరం 3000 సిటీ ఆర్టీసీ బస్సులో ప్రయాణమంటే సాహసమే. గంటల తరబడి స్టాపులో నిలుచుంటే ఎప్పటికో వస్తాయి. ఎక్కుదామనుకుంటే స్టాపులో ఆగకుండానే వెళ్లిపోతాయి. ఓపికున్నవారు పరుగెత్తి పట్టుకుంటారు. లేనివారు తిట్టుకుంటూ ఆటోను నమ్ముకుంటారు. ఇది ప్రయాణికుల అనుభవం. డ్రైవర్ కొలువు కూడా సాహసమే. స్టాపులో బస్సు నిలపలేదన్న సాకుతో చార్జీ మెమో అందుకోవాలి. అక్కడ ఆగి ఉన్న ఆటోలను మాత్రం ఎవరూ తొలగించరు. పని వేళలు ఎనిమిది గంటలే అయినా.. కనీసం 10 గంటలు తక్కువ కాకుండా విధుల్లో ఉండాల్సిందే. ఇందుకు ట్రాఫిక్‌జాం కారణమని వేరే చెప్పనక్కర్లేదు. రూట్లను బట్టి ఒక్కో డ్రైవర్ రోజుకు 100-150 కిలోమీటర్లు తిరగాలి. గతుకుల రోడ్లలో నడుములు విరిగిపోయి తక్కువ వయసులోనే బస్సులను షెడ్డుకు, దేహాన్ని ఆస్పత్రికి పంపక తప్పడం లేదు. ఇక రాత్రి వేళల్లో మందుబాబులు, ఆకతాయిల నుంచి డ్రైవర్లకు రక్షణ లేని పరిస్థితి. బస్సు నలువైపులా చూస్తూ టిక్కెట్.. టిక్కెట్.. అంటూ పరిగెత్తే కండక్టర్‌కూ ఎన్నో కష్టాలు. ఎస్సార్ సరిగా లేదని అధికారులతో అక్షింతలు. తమ స్టాప్ వద్ద ఆపలేదని ప్రయాణికుల చీవాట్లు. బస్సులు పెంచక, సిబ్బందిని నియమించకపోవడం వల్లే ఈ పరిస్థితి. ఈ నేపథ్యంలో తమ కష్టాన్ని గుర్తించి సమస్యలు పరిష్కరించే వారినే ‘గ్రేటర్’ పీఠం ఎక్కిస్తామంటున్నారు సిటీజనులు. బస్సుల సమస్యలపై వారేమన్నారో వారి మాటల్లోనే.. సమయమంతా ఎదురు చూపులకే.. నువ్వు ఎక్కాల్సిన బస్సు జీవిత కాలం లేటు’ అన్నాడు ఆరుద్ర. ఇది సరిగ్గా నగర ప్రయాణికులకు సరిపోతుంది. సమయానికి బస్సు రాదు. వచ్చినా కాలు తీసి వేయలేని దుస్థితి మధ్య ప్రయా ణం. నా కోర్సు కోచింగ్ సమయం రెండు గంటలైతే.. సిటీ బస్సు కోసం ఎదురు చూసేది మాత్రం మూడు గంటలు. - రాంభూపాల్, సివిల్స్ అభ్యర్థి పడుతూ లేస్తూ ప్రయాణం సిటీ బస్సుతో నాకు 15 ఏళ్ల అనుబంధం ఉంది. రోజూ పంజగుట్ట నుంచి ఓల్డ్ సిటీకి వెళ్తాను. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు లేకపోవడంతో రద్దీ తీవ్రంగా ఉంటోంది. కిలోమీటర్ల పడుతూ లే స్తూ ప్రయాణం సాగించాల్సిందే. - సయ్యద్, ప్రయాణికుడు నిత్యం నిలబడాల్సిందే.. పదేళ్ల నుంచి సిటీ బస్సులో ప్రయాణం చేస్తున్నాను. కోచింగ్ నిమిత్తం జీడిమెట్ల నుంచి అబిడ్స్‌కు వెళ్తుంటా. సమయానికి గమ్యం చేరతానన్న నమ్మకం ఎప్పుడూ లేదు. ఒకవైపు ట్రాఫిక్‌జాం, మరోవైపు సరిగా లేని స్టాపులు.. నిత్యం నిలబడి మూడు గంటల బస్సు ప్రయాణం. రాత్రి తొమ్మిది అయితే బస్సుల సంఖ్య మరీ తగ్గిపోతోంది. - నవ్యత, ప్రయాణికురాలు సాయంత్రం షిఫ్ట్ నరకం.. మార్నింగ్ షిఫ్ట్‌లో డ్యూటీ కాస్త రిలాక్స్‌గా చేసుకోవచ్చు. రెండు గంటల పాటు రద్దీ ఉన్నా ఆ తరువాత పర్వాలేదు. సాయంత్రం షిఫ్ట్ అయితే మాత్రం డ్యూటీ ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు కిక్కిరిసిన ప్రయాణికులను నెట్టుకొని వెళ్లి టికెట్లు ఇచ్చుకోవాల్సిందే. - విజయేందర్‌రెడ్డి, సిటీ బస్ కండక్టర్ సమయానికి రావు.. వచ్చినా ఆగవు.. బస్సు కోసం రోడ్డు వెంట పరుగు పందేలు.. కిక్కిరిసిన జనం.. ఆగినా ఎక్కలేని దుస్థితి.. నెట్టుకుంటూ వెళ్లాల్సిందే. ఫుట్‌బోర్డుపై వేలాడుతూ.. గమ్యం చేరే వరకు బిక్కుబిక్కుమనాల్సిందే. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు తప్పని బలపరీక్ష. ఎంఎంటీఎస్ తర్వాత నగరంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల కష్టాలు ఇవి. కాలం చెల్లిన బస్సులతో కాలం వెళ్లదీస్తోంది సిటీ ఆర్టీసీ. లక్షల మందిని గమ్యం చేర్చే బస్సుల సామర్థ్యం తగ్గిపోయి ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి. ఇప్పటికీ 40 శాతం పాత బస్సులే సేవలంది స్తున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్సులు పెంచకపోవడంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. వీటితో వేగలేక సిబ్బంది లోనూ అసహనమే కనిపిస్తోంది. కూకట్పల్లి-ఎల్బీనగర్ మార్గంలో తిరిగే ఆర్టీసీ సిటీ బస్సులో ‘సాక్షి’ విజిట్ నిర్వహించింది. నిత్యం అనుభవించే మనోవేదనను ఆయా వర్గాలు ప్రత్యక్షంగా ‘సాక్షి’తో పంచుకున్నాయి. ఇలాంటి తరుణంలో సిటీలో బస్సుల సమస్యను పరిష్కరించే వారితోనే ‘గ్రేటర్’ జెండా ఎగరేయిస్తామంటున్నాయి. - కోట కృష్ణారావు -
ట్యాంకర్ల కోసం పడిగాపులు
-
విదేశీ భాషలందు వెలుగు లెస్స..
- ఇంగ్లిష్తో పోటీగా విదేశీ భాషలకు ఆదరణ - ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలని సిటీజనుల తపన - విదేశీ భాష నేర్చిన వారికి కార్పొరేట్ కంపెనీల ప్రాధాన్యం నడుస్తున్న కార్పొరేట్ ప్రపంచంలో రాణించేందుకు ఇంగ్లిష్ అవసరం.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్ని విదేశీ భాషలొస్తే అన్ని అవకాశాలు.. ప్రపంచవ్యాప్తంగా గణాంకాలు గమనిస్తే.. అత్యధికులు మాట్లాడే భాష చైనీస్ (20.7 శాతం), ఇంగ్లిష్ (6.2శాతం). అంటే 93.8 శాతం మంది జనాభా ఆంగ్లం మాట్లాడడం లేదనే వాస్తవాన్ని ప్రస్తుత తరం పూర్తిగా అర్థం చేసుకుంది. ఈ నేపథ్యంలో మన నగరంలో విదేశీ భాషలపై మక్కువ రెట్టింపవుతోంది. విదేశీ విజృంభణకు కారణాలెన్నో.. ► వేర్వేరు భాషలు నేర్చుకుంటున్న కొద్దీ మెదడు మరింత పదునెక్కుతుందట. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ ఎడింబరో శాస్త్రవేత్తలు పరిశోధనాత్మకంగా స్పష్టం చేశారు. ► భాషలు ఎన్ని ఎక్కువ వస్తే అంత ఆలస్యంగా మతిమరుపు వస్తుందని, బహుభాషా ప్రవీణుల మెదడు అనేక అంశాల్లో చురుకుగా ఉంటుందని వీరు తాజా పరిశోధనతో తేల్చారు. ఇలాంటి పరోక్ష లాభాల సంగతెలా ఉన్నా.. ఐటీ సెక్టార్లో ట్రాన్స్లేషన్, ఇంటర్ప్రిటేషన్లకు ఉన్న భారీ డిమాండ్‌ను ఉపయోగించుకునేందుకు, ఇతర దేశాలకు సంబంధించిన సంస్కృతీ సంప్రదాయాలపై అవగాహన పెంచుకునేందుకు, కనీసం మూడు అన్యభాషలు నేర్చుకుని ఉండ డం కెరీర్‌కు దోహదపడుతుండడం, మల్టీ నేషనల్ కంపెనీలు ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్న వారికి ప్రాధాన్యం ఇస్తుండడం, విదేశాలకు రాకపోకలు సాగించే అవసరాలు పెరగడం.. ఇలా పలు రకాల లాభాలు విదేశీ భాష పట్ల మోజు పెంచుతున్నాయి. ► అప్పటికప్పుడు విదేశీ భాషలు నేర్చుకోవాల్సిన అవసరాలు కూడా మీద పడుతున్నాయి. నగరానికి చెందిన ఒక సంస్థ తమ ఉద్యోగుల బృందాన్ని మెక్సికోకు పంపాల్సి వచ్చింది. ఆఘమేఘాల మీద వారికి నెట్ ద్వారా ప్రాథమిక మెక్సికన్ భాషా పరిజ్ఞానంలో శిక్షణ ఇప్పించింది. ► రామకృష్ణమఠంతో పాటు ఇఫ్లూ, ఓయులో డిప్లొమా కోర్సులు, ఫ్రెంచ్ కోసం అలయెన్స్ ఫ్రాంఛైజ్, జర్మన్ కోసం గోతెజంత్రం ఉన్నాయి. ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా వచ్చాయి. ‘త్వరలో సిటీలో జపనీస్ లాంగ్వేజ్ కోర్సును ఆఫర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు జపాన్ సెంటర్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ ప్రెసిడెంట్ రమాకాంత్. బెస్ట్ ఫ్రెండ్.. ఫ్రెంచ్.. గరంలో అత్యధికులు నేర్చుకుంటున్న భాషల్లో ఫ్రెంచ్ తొలి స్థానంలో నిలుస్తోంది. తర్వాత ఆంగ్లం సెకండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్‌గా పేరొందిన ఫ్రెంచ్ దేశవ్యాప్తంగా చూస్తే 2014లో స్కూల్ టు యూనివర్సిటీ స్థాయిలో నేర్చుకున్నవారి సంఖ్య 2.50 లక్షల పైచిలుకు ఉందట. దీనిలో కేవలం అలయెన్స్ ఫ్రాంఛైజ్ ద్వారా నేర్చుకున్నవారి సంఖ్య 35,800. కెరీర్ పరంగా కూడా ఇది మంచి అవకాశాలు అందిస్తోంది. నగరంలోని కార్పొరేట్ కంపెనీలు ఈ భాష తెలిసిన వారికి మంచి ఆఫర్స్ ఇస్తున్నాయి. కెరీర్ పరంగానూ ఇది ప్రాఫిటబుల్. ‘మొదటి నుంచి ఏదైనా విదేశీ భాష నేర్చుకోవాలనుకున్నా. ఫ్రెంచ్ కాంప్లెక్స్ లాంగ్వేజ్. దీనిలో అడ్వాన్స్డ్ డిప్లొమా చేశాను. అయితే దీన్ని కెరీర్‌గా చూడడం లేదు. కేవలం హాబీగా నేర్చుకున్నానంతే’ అంటూ చెప్పారు జ్యోత్స్న. జోష్.. స్పానిష్.. వకాశాలు, ఆదరణ పరంగా స్పానిష్ లాంగ్వేజ్‌కు రెండో స్థానం దక్కుతోంది. ఈ భాషను నేర్చుకోవడం సులభం అంటారు. దీంతో ఏదైనా ఒక విదేశీ భాష వచ్చి ఉండడాన్ని కనీస అర్హతగా భావిస్తున్న వారు స్పానిష్‌కి సై అంటున్నారు. సరిగా సాధన చేస్తే ఈ భాషను 18 నెలల స్వల్ప కాలంలోనే నేర్చుకోవచ్చనేది నిపుణుల మాట. కెరీర్ పరంగానూ ఇది మంచి ఆప్షన్. ‘ఆసక్తితో స్పానిష్‌లో ఎంఏ చేశాను. అయితే, ఇప్పుడది నాకు ప్రొఫెషన్‌గా ఉపకరిస్తోంది’ అని చెప్పారు సీతాఫల్మండిలో నివసించే సుమతి. ప్రస్తుతం ఆమె స్పానిష్ టీచర్. సౌత్ అమెరికా, మెక్సికోలో బాగా వినియోగించే స్పానిష్ ప్రపంచంలోనే అత్యధికులు ఉపయోగించే భాషల్లో 3వ స్థానంలో ఉంటుందంటున్నారు సుమతి. జర్మన్‌తో షైన్.. పంచంలో 1.8 శాతం మంది మాత్రమే జర్మన్ మాట్లాడతారు. అయితే మనం జర్మన్ దేశస్తులతో సంభాషించాలంటే తప్పనిసరిగా జర్మన్ నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే జర్మన్లు ఇతర దేశ భాషలను నేర్చుకోవడానికి పెద్దగా ఇష్టపడరట. మరోవైపు జర్మనీ.. క్వాలిటీ సైంటిఫిక్ రీసెర్చ్, ఇన్నోవేషన్స్‌కు హబ్. అందుకనే చాలా మంది మనవాళ్లు అక్కడ చదువుకోవాలని ఆశిస్తారు. జర్మన్ యూనివర్సిటీస్లో చేరాలంటే.. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి కనీస స్థాయిలోనైనా జర్మన్ భాష వచ్చి తీరాలి. పెపైచ్చు భారతీయ విద్యార్థులకు జర్మనీ ఉచిత కోర్సులు కూడా ఆఫర్ చేస్తోంది. ‘ఉన్నత విద్య కోసం జర్మనీ వెళ్లేవారు పెరిగారు. ఎందుకంటే అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తున్నారు. అయితే, అలా చదవాలని కోరుకునే విద్యార్థులకు తప్పనిసరిగా జర్మన్ లాంగ్వేజ్ వచ్చి తీరాల్సిందే’ అని చెప్పారు దీప్తి. జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్న ఆమె తెలుగు, ఇంగ్లిష్, కన్నడ, హిందీ భాషలు వచ్చని చెబుతోంది ఈ మలక్‌పేట నివాసి. జపనీస్‌కు జేజేలు.. ష్టమైన భాషగా జపనీస్‌ను పేర్కొంటారు. అయినా ప్రస్తుతం దేశంలో 20వేల మందికిపైగా జపనీస్ భాష నేర్చుకుంటున్నారని అంచనా. జపనీస్ వెంచర్లు భారీగా దేశానికి తరలివస్తున్న నేపధ్యంలో జపాన్ భాష తెలిసిన వారికి డిమాండ్ బాగా పెరుగుతోంది. దీంతో పలు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పార్ట్‌టైమ్ జపనీస్ లాంగ్వేజ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ‘కెరీర్ ప్లాన్ అని కాకుండా వ్యక్తిగత ఇష్టంతో 1998లోనే సీఫెల్ నుంచి జపనీస్ నేర్చుకున్నాను. ఇది నేర్చుకోవడం నాకు జపాన్‌కు సంబంధించిన అనేక అంశాలపై అవగాహన పెంచింది’ అన్నారు చక్రపాణి. అప్పట్లో జపాన్ ప్రభుత్వం ఖర్చులు భరించి మరీ టీచర్ ట్రైనింగ్ ఇచ్చిన ముగ్గురు భారతీయుల్లో నగరానికి చెందిన చక్రపాణి కూడా ఒకరు. తదనంతర కాలంలో ఆయన జపాన్ లాంగ్వేజ్ టీచర్, బైలింగ్వల్ కన్సల్టెంట్‌గా చేశారు. చైనీస్.. చాలా టఫ్.. పంచవ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన దేశం కాబట్టి.. సహజంగానే చైనీస్ మాట్లాడేవారు కూడా ఎక్కువే. ఎవరైనా సరే తమ దగ్గరకే వచ్చేలా ప్రపంచ దేశాలను ప్రొడక్ట్స్ పరంగా ప్రభావితం చేస్తున్న చైనాకు సిటీ నుంచి రాకపోకలు పెర గడం కూడా సహజమే. ఈ నేపధ్యంలో చైనీస్ లాంగ్వేజ్ పట్ల కూడా నగరవాసుల్లో ఆసక్తి పెరిగింది. అయితే, మిగిలిన భాషలతో పోలిస్తే ఇది నేర్చుకోవడం కాస్తంత కష్టమే అంటున్నారు భాషాభిమానులు. ‘నాకు విదేశీ భాషలు నేర్చుకోవడం ఇష్టం. ఆల్రెడీ జర్మన్లో ఎంఏ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇఫ్లూలో 8 నెలలు పాటు ఈవెనింగ్ టైమ్‌లో చైనీస్ బేసిక్ కోర్సు చేశాను. ఈ లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్ కోర్సు చేస్తే చాలు జనరల్ కన్వర్జేషన్కి సరిపోతుంది. ైచె నా మూవీస్ కూడా చూడవచ్చు. డిప్లొమా ఇన్ చైనీస్ కూడా చేద్దామనుకుంటున్నాను. సిటీలో చైనీస్ ట్రాన్స్లేటర్స్కి డిమాండ్ బాగానే ఉన్నప్పటికీ ఈ లాంగ్వేజ్ గురించి అవేర్నెస్, నేర్చుకునే వాళ్లు, నేర్పేవాళ్లూ తక్కువే’ అంటూ చెప్పారు శరత్. బీఫార్మసీ చేసి ఓయూ హాస్టల్లో ఉంటున్న ఆయన.. పార్ట్‌టైమ్‌గా జర్మన్ లాంగ్వేజ్ టీచర్‌గానూ చేస్తున్నారు. స్కూల్ స్థాయిలోనే.. జూబ్లీహిల్స్‌లోని రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్లో మాండరిన్ (సరళతరమైన చైనీస్)ను విద్యార్థులకు థర్డ్ లాంగ్వేజ్‌గా ఆఫర్ చేస్తున్నారు. ఇప్పటికే 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకూ విద్యార్థులు ఈ లాంగ్వేజ్‌ను ఎంచుకున్నారు కూడా. పిల్లలకు విదేశీ భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు సిటీలోని కొన్ని స్కూల్స్ ఆఫ్టర్ స్కూల్ అకాడమీ నిర్వహించే యోచనలో ఉన్నాయి. -
సిటీలో వర్షం
సేదతీరిన నగరం సాక్షి, సిటీబ్యూరో: ఎండ తీవ్రతతో అవస్థలు పడుతున్న నగర వాసులకు కాస్త ఉపశమనం లభించింది. గురువారం రాత్రి వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇంకొన్ని చోట్ల మోస్తరుగా చినుకులు పడ్డాయి. పాతబస్తీ, అబిడ్స్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, కూకట్పల్లి, గచ్చిబౌలి, మెహిదీపట్నం, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, బాలానగర్, ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజిగిరి ప్రాంతాల్లో కుండపోతగా కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ముందుకు సాగలేని పరిస్థితి ఏర్పడింది. సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనాల రాకపోకలకూ ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. -
బంద్‌తో చెప్పలేనన్ని ఇబ్బందులు
పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను సీమాంధ్రలో కలపడాన్ని నిరసిస్తూ గురువారం తెలంగాణ వ్యాప్తంగా బంద్ నిర్వహించడంతో.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. బంద్ పేరు చెప్పి ముందుగానే సిటీబస్సులను డిపోల లోంచి బయటకు తీయలేదు. దాంతో కాలేజీలు, కార్యాలయాలకు వెళ్లాల్సిన వాళ్లు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ప్రతిరోజూ సిటీబస్సులో వెళ్లేవాళ్లలో కొంతమందికి ద్విచక్ర వాహనాలున్నా.. వాటిలో ఇంధనం సరిపడ ఉందో, లేదో తెలియని పరిస్థితి. పోనీ రోడ్డుమీదకు వెళ్లి ఏదైనా బంకులో పెట్రోలు పోయించుకుందామంటే, నగరం మొత్తమ్మీద ఒకటి, అరా తప్ప పెట్రోలు బంకులు కూడా తెరిచిన పాపాన పోలేదు. ధైర్యం చేసి రోడ్డుమీదకు వెళ్దామంటే, నడిరోడ్డు మీద బండి ఆగిపోతే పరిస్థితి ఏంటోనని ఆందోళన. ఇదే పరిస్థితి సాయంత్రం వరకు కొనసాగింది. ఇక సొంత వాహనాలు లేకుండా కేవలం సిటీబస్సుల మీదే ఆధారపడినవాళ్ల కష్టాలు ఇక చెప్పనలవి కావు. సిటీబస్సులు లేని సమయం చూసి ఆటోవాలాలు విజృంభించారు. సాధారణంగా షేర్ ఆటోకు పది రూపాయలు తీసుకునే చోట కూడా 25 నుంచి 40 రూపాయల వరకు డిమాండ్ చేసి, ముక్కు పిండి మరీ వసూలు చేశారు. రోడ్డు మీద ఏ ఆటో చూసినా కనీసం ఏడెనిమిది మందికి తక్కువ కాకుండా ఎక్కించుకుని వెళ్తున్నా, ట్రాఫిక్ పోలీసులు కూడా పట్టించుకోలేదు. కొన్ని రూట్లలో సెట్విన్ బస్సులు మాత్రం తిరిగాయి. అవి కూడా అతి తక్కువ సంఖ్యలోనే కనిపించాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చేసింది, నాలుగు రోజుల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి.. ఇక తెలంగాణ బంద్‌లు ఉండబోవని ఆశించిన సామాన్య ప్రజలకు గురువారం చుక్కెదురైంది. రోడ్డుమీద ఏ వాహనం వెళ్తున్నా కూడా బొటనవేలు పైకి చూపించి లిఫ్ట్ అడిగేవాళ్ల సంఖ్యకు లెక్కలేదు. ఇక ఏ బస్టాపులో చూసినా ఆటోలు తప్ప మరో వాహనం కనిపించలేదు. ఇలా బంద్ పేరు చెప్పి హైదరాబాద్ నగరవాసులకు మాత్రం ఆఫీసులకు వెళ్లేసరికి దేవుడు కనిపించాడు!!