civils students
-
‘ఇపుడు తెలంగాణకు కావాల్సింది విద్యే’
సివిల్స్ పరీక్షలో అఖిల భారతస్థాయిలో ప్రథమర్యాంకు సాధించిన దురిశెట్టి అనుదీప్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని అభినందిస్తూ గొప్ప ఐఏఎస్ కావాలని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఆనందింపచేసింది. సివిల్స్‌లో కీర్తి కిరీటాన్ని మెట్పల్లి మట్టికాళ్ల దాకా తీసుకవచ్చి తెలంగాణ ఖ్యాతిని పెంచటంలో అనుదీప్ కృషి అభినందించతగింది. తెలంగాణ వచ్చాక చదువుల రంగం కూడా మున్నెన్నడూ లేని విధంగా పురోగమిస్తోంది. పాఠశాల స్థాయి నుంచి నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి భవిష్యత్తులో వందలమంది అనుదీప్‌లు తయారయ్యేందుకు బాటలు వేసి తీరటం ఖాయం. తెలంగాణ రాష్ట్రం వచ్చాక గురుకుల విద్యాలయాలు 815 అయ్యాయి. ఒక్కొక్క విద్యార్థిపై ఏటా ఒక లక్ష రూపాయలు వెచ్చిస్తున్నారు. పేదపిల్లలకు కార్పోరేట్ విద్యాసంస్థలను తలదన్నే విధంగా చదువు, సౌలభ్యాలు, మౌలిక వసతులు లభిస్తున్నాయి. దాని వల్లనే తొలి సారిగా కార్పోరేట్ విద్యాసంస్థల పాతర్యాంకుల చరిత్రను తలకిందులు చేస్తూ ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ విద్యాసంస్థలు అగ్రస్థానం సాధిస్తున్నాయి. ఇది తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యాలయాల ద్వారా చేస్తున్న నిశ్శబ్ద విప్లవం. జాతీయస్థాయిలో యువతకు ఆదర్శంగా అనుదీప్ నిలిచినందుకు అభినందించటమే గాకుండా సివిల్స్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణను ఇప్పించేం దుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేయబోతుంది. మౌఖిక పరీక్షకు ఎంపిౖకైన రాష్ట్ర అభ్యర్థులకు ఢిల్లీలో నిపుణులతో తర్ఫీదు ఇప్పిస్తానని కేసీఆర్ ప్రకటిం చారు. ఇది బహుజన పిల్లలకు వరంగా మారుతుంది. ఈ ఫలితాలను క్రమంగా మరో ఐదు, పదేళ్లలో తెలంగాణ చూస్తుంది. తెలంగాణకు సేవచేయాలన్నదే తనధ్యేయమని అనుదీప్ చెప్పడం ఆహ్వానించతగింది. ఇపుడు తెలం గాణకు కావాల్సింది ఈ నేలను సస్యశ్యామలం చేసే జ్ఞానార్జన. తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే ఈ మట్టిని దున్నుకుంటూ పోతే వందలమంది అనుదీప్‌లు వస్తారని తేలింది. భవిష్యత్ తెలంగాణ రూపురేఖలు గురుకుల విద్యాలయాల నుంచే రూపొందుతాయి. గురుకుల విద్యాలయాలను బహుజనుల రక్షణ కవచాలుగా మార్చుకోవాలి. జూలూరు గౌరీశంకర్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు 94401 69896 -
'పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్‌కు మద్దతు ఇవ్వాలి'
హైదరాబాద్: ప్రత్యేక హోదా విషయంలో పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వాలని హైదరాబాద్‌లోని వివిధ ఐఏఎస్ స్టడీ సర్కిల్స్‌లో సివిల్స్ పరీక్షల కోసం శిక్షణ తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అన్నారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ ఏం చేసినా విజయం సాధించారని, ప్రత్యేక హోదా విషయంలో కూడా విజయం సాధిస్తారన్న నమ్మకం తమకు ఉందని, అలా జరగాలని కూడా తాము కోరుకుంటున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా విద్యార్థిలోకానికి, యువతకు, సామాన్యకు చాలా అవసరం అని వారు చెప్పారు. కేంద్రం ప్రత్యేక హోదా తప్పకుండా ఇవ్వాలని, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనదని అన్నారు. రాజధాని విషయం నుంచి ప్రతి విషయంలో ఆంధ్రప్రదేశ్ సంస్థాపరంగా, వ్యవస్థాపరంగా చాలా నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని, ఇది ఒక్క ప్రత్యేక హోదాతోనే సాధ్యమని చెప్పారు. నాడు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు, బీజేపీ కూడా హామీ ఇచ్చి మరిచాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ సమస్య తీరాలన్నా, రైతుల సమస్యలు పోవాలన్నా, తీవ్ర అంతరం ఉన్న రెవిన్యూలోటు పూడ్చాలన్నా ప్రత్యేక హోదా అవసరం అని పేర్కొన్నారు. కేంద్రం కొన్ని కొన్ని కారణాలు చూపెడుతూ ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్తోందని, కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు అన్ని రంగాల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడం మూలంగా ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోయిందని, కష్టాల్లో కూరుకుపోయిందని చెప్పారు.