CJI TS Thakur
-
డిజిటైజేషన్ మంచిదే.. ఇబ్బందులూ చూడాలి
- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ వెల్లడి - సక్రమంగా వినియోగించుకోకుంటే విపరిణామాలే సాక్షి, బెంగళూరు: భారతదేశం డిజిటైజేషన్ అవుతున్న నేపథ్యంలో దీనివల్ల కలిగే ఇబ్బందులపై కూడా దృష్టి సారించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ అభిప్రాయపడ్డారు. బెంగళూరులో సోమవారం జ్యుడీషియల్ అధికారుల 18వ ద్వైవార్షిక రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. పోటీ ప్రపంచంలో భారతదేశం డిజిటైజేషన్ కావడం అనివార్యమన్నారు. ఇందుకు న్యాయవ్యవస్థ సైతం అతీతం కాదని చెప్పారు. ఈ విధానం వల్ల కేసుల విచారణ వేగవంతం కావడమే కాకుండా పారదర్శకత కూడా పెరుగుతుందని తెలిపారు. డిజిటైజేషన్‌ను సక్రమంగా వినియోగించుకోకపోతే విప రీత పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. సమస్య పరి ష్కారం కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని సూచించారు. ఇటీ వలి కాలంలో న్యాయవ్యవస్థలోని అన్ని విభాగాల్లో ఖర్చులు పెరిగిపోతున్నాయని, దీన్ని తగ్గించడంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుబ్రో కమల్ ముఖర్జీ మాట్లాడుతూ... బాధి తులకు వేగంగా, పారదర్శకంగా న్యాయాన్ని అందిం చినప్పుడే న్యాయవ్యవస్థపై గౌరవం పెరుగుతుంద న్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, న్యాయశాఖ మంత్రి జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
నా మతంతో నీకేం పని?: సీజేఐ
దేవుడు-మనిషికి మధ్య సంబంధం వ్యక్తిగతం న్యూఢిల్లీ: మనిషికి దేవుడికి మధ్య సంబంధం చాలా వ్యక్తిగతమైనదని, దాని గురించి ఇతరులకు పట్టింపు ఉండకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ టీఎస్ ఠాకూర్ పేర్కొన్నారు. సమాజంలో శాంతికి సహనమే కీలకమని ఆయన నొక్కిచెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహింటన్ ఎఫ్ నారీమన్ జోరాష్ట్రీయనిజం మీద రాసిన పుస్తకం ‘ద ఇన్నర్ ఫైర్, ఫెయిత్, చాయిస్ అండ్ మోడ్రన్ డే లివింగ్ ఇన్ జోరాష్ట్రీయనిజం’ (The Inner Fire, faith, choice and modern-day living in Zoroastrianism)ను జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ భావజాలాల కన్నా మతయుద్ధాల్లోనే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. మతవిశ్వాసాల పేరిట ఈ భూమండలంలో ఎంతో విధ్వంసం, వినాశనం, రక్తపాతం చోటుచేసుకున్నాయని చెప్పారు. ‘నా మతం ఏమిటి? ఎలా నేను నా దేవుడితో అనుసంధానం అవుతాను? నా దేవుడితో నాకు ఎలాంటి సంబంధం ఉంది? అన్నది ఇతరులకు అవసరంలేని విషయం. మీరు మీ దేవుడితో ఎలా ఉండదలుచుకుంటే అలా ఉండొచ్చు’ అని అన్నారు. మనిషికి దేవుడికి మధ్య సంబంధం చాలా వ్యక్తిగతమైనది. దానికి ఇతరులతో ఏం సంబంధం ఉండదని సీజేఐ స్పష్టం చేశారు. ‘సోదరభావం, సహనం, అన్ని మార్గాలు ఒకే మార్గానికి ప్రయాణించి ఒకే దేవుడిని చేరుకుంటాయన్న ఆమోదనీయ భావం ప్రపంచాన్ని శాంతియుతంగా మారుస్తాయి. సుసంపన్నం చేస్తాయి. ఈ విషయంలో రోహింటన్ గొప్ప కృషి చేశారు’ అని జస్టిస్ ఠాకూర్ కొనియాడారు. -
దీర్ఘకాల కేసులే అసలైన సవాల్: సీజేఐ
అహ్మదాబాద్: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించడమే న్యాయ వ్యవస్థ ముందున్న అసలైన సవాలు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ అన్నారు. గుజరాత్ జ్యుడీషియల్ అకాడెమీని శనివారం ఆయన ప్రారంభించి ప్రసంగించారు. తాను పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ లోక్ అదాలత్‌లు నిర్వహించడం ద్వారా 14 లక్షల కేసుల్ని పరిష్కరించానని ఆయన తెలిపారు. అయితే చిన్న కేసుల్ని పరిష్కరించడమంటే చీపురు చేతబట్టి.. ఇంటిలో ఉన్న చెత్తాచెదారాన్ని ఊడ్చటంలాంటిదేనన్న భావన కలిగిందని, దీర్ఘకాలంగా కోర్టుల్లో మూలుగుతున్న కేసులను పరిష్కరించడంలోనే అసలైన సవాలు దాగుందన్న విషయం అవగతమైందని పేర్కొన్నారు.