- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ వెల్లడి
- సక్రమంగా వినియోగించుకోకుంటే విపరిణామాలే
సాక్షి, బెంగళూరు: భారతదేశం డిజిటైజేషన్ అవుతున్న నేపథ్యంలో దీనివల్ల కలిగే ఇబ్బందులపై కూడా దృష్టి సారించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ అభిప్రాయపడ్డారు. బెంగళూరులో సోమవారం జ్యుడీషియల్ అధికారుల 18వ ద్వైవార్షిక రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. పోటీ ప్రపంచంలో భారతదేశం డిజిటైజేషన్ కావడం అనివార్యమన్నారు. ఇందుకు న్యాయవ్యవస్థ సైతం అతీతం కాదని చెప్పారు. ఈ విధానం వల్ల కేసుల విచారణ వేగవంతం కావడమే కాకుండా పారదర్శకత కూడా పెరుగుతుందని తెలిపారు.
డిజిటైజేషన్‌ను సక్రమంగా వినియోగించుకోకపోతే విప రీత పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. సమస్య పరి ష్కారం కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని సూచించారు. ఇటీ వలి కాలంలో న్యాయవ్యవస్థలోని అన్ని విభాగాల్లో ఖర్చులు పెరిగిపోతున్నాయని, దీన్ని తగ్గించడంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుబ్రో కమల్ ముఖర్జీ మాట్లాడుతూ... బాధి తులకు వేగంగా, పారదర్శకంగా న్యాయాన్ని అందిం చినప్పుడే న్యాయవ్యవస్థపై గౌరవం పెరుగుతుంద న్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, న్యాయశాఖ మంత్రి జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.
డిజిటైజేషన్ మంచిదే.. ఇబ్బందులూ చూడాలి
Published Tue, Dec 20 2016 4:26 AM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM
Advertisement
Advertisement