Class of Eighties Re-Union
-
చిరంజీవి ఇంట్లో తారల సందడి
‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ రీయూనియన్ పదో యానివర్సరీ సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా జరుపుకున్నారు స్టార్స్. 1980లలో నటించిన స్టార్స్ ప్రతీ ఏడాది సరదాగా కలసి రీయూనియన్ జరుపుకుంటారు. ఈ ఏడాది పదో యానివర్సరీని చిరంజీవి హోస్ట్ చేశారు. ఈ పార్టీ హైదరాబాద్‌లోని చిరంజీవి స్వగృహంలో జరిగింది. ఈ వేడుకకు 40మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇందులో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలకు చెందిన నటీనటులున్నారు. పైన ఉన్న ఫొటోలో ప్రభు, జయరామ్, సురేశ్, రెహమాన్, ఖుష్భూ, వెంకటేశ్, రాధిక, భానుచందర్, సుమన్, శోభన, నదియా, రాధ, సరిత, అమల, జగపతిబాబు, జయసుధ, సుమలత, నాగార్జున, మోహన్‌లాల్, లిజీ, భాగ్యరాజ్, జయసుధ, శరత్‌కుమార్, వీకే నరేశ్, రమేశ్ అరవింద్, జాకీ ష్రాఫ్, సుహాసిని, రేవతి తదితరులు ఉన్నారు. ప్రతీ ఏడాది జరిగే పార్టీకి ఓ డ్రెస్‌కోడ్ ఉంటుంది. ఈ ఏడాది డ్రెస్ కోడ్ బ్లాక్, గోల్డ్ కలర్స్. అందరూ అదే రంగు దుస్తుల్లో హాజరయ్యారు. ఈ పార్టీలో అంత్యాక్షరీ, మ్యూజికల్ చైర్స్ వంటి సరదా ఆటలతో కాలక్షేపం చేశారని తెలిసింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఈసారి చిరంజీవి హోస్ట్!
‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’... 1980లో నటించిన స్టార్స్ పెట్టుకున్న పేరు ఇది. ప్రతీ ఏడాది ఒక చోట కలుస్తూ రీయూనియన్ జరుపుకుంటారు అప్పటి హీరో హీరోయిన్లు. ఇందులో మోహన్‌లాల్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, వీకే నరేశ్, అర్జున్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, ప్రభు, సుమలత, శోభన, సుహాసిని, రాధిక, భాగ్యరాజ్, ఖుష్భూ, శరత్‌కుమార్, సత్యరాజ్, జయరామ్, నదియా, సుమన్ వంటి స్టార్స్ ఉన్నారు. కలిసిన ప్రతిసారి ఆ పార్టీకి ఓ డ్రెస్ కోడ్ ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ఒక్కో సంవత్సరం ఒక్కో చోట రీ యూనియన్ ప్లాన్ చేస్తుంటారు. దాంతో పాటు టీమ్‌లో ఉన్న ఓ స్టార్ అందరికీ పార్టీ ఇస్తుంటారు. ఈ సంవత్సరం ‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ పదో యానివర్శరీ. టెన్త్ యానివర్శరీ పార్టీ హైదరాబాద్‌లో చిరంజీవి స్వగృహంలో జరగనుందని తెలిసింది. ఇటీవలే చిరంజీవి తన నివాసాన్ని కొత్త హంగులతో రీ మోడలింగ్ చేయించారు. కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల సమక్షంలో కొత్తగా తయారైన ఇంట్లో వేడుక కూడా చేశారు. ఇక రీ–యూనియన్‌కి ఈసారి ఈ ఇల్లే వేదిక అయింది. వచ్చే నెలలో ఈ పార్టీ జరగనుంది. హోస్ట్‌గా ఈ పార్టీని బాగా చేయడానికి చిరంజీవి ప్లాన్ చేస్తున్నారు. -
స్వీట్ మెమొరీస్
వారం రోజులు ‘వారెవ్వా’ అనే విధంగా గడిచిపోతే.. జీవితాంతం గుర్తుపెట్టుకోదగ్గ తీపి జ్ఞాపకాలుగా అవి మిగిలిపోతాయి. చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, సుహాసిని, రాధిక, ఖుష్బూ, లిజీ అలాంటి జ్ఞాపకాలతోనే చైనా టు ఇండియా వచ్చారు. వీళ్లతో పాటు భాగ్యరాజా, ఆయన భార్య పూర్ణిమా భాగ్యరాజా, రాజ్‌కుమార్, సుజాత కూడా ఈ ట్రిప్‌కు వెళ్లారు. 1980లలో రాణించిన హీరో హీరోయిన్లు ‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్ రీ–యూనియన్’ అంటూ ఓ గ్రూప్‌ని ఫామ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ గ్రూప్‌లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ రంగానికి చెందిన పలువురు ప్రముఖ తారలు ఉంటారు. మన టాలీవుడ్ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, సీనియర్ నరేశ్, తమిళంలో రజనీకాంత్, ప్రభు, కన్నడంలో అంబరీష్, మలయాళ నటుడు మోహన్‌లాల్ తదితరులు ఉన్నారు. వీళ్లంతా ప్రతి ఏడాదీ ఒక చోట కలుస్తారు. 2009లో ఇది మొదలైంది. హైదరాబాద్, చెన్నై, కేరళ, బెంగళూరుల్లో వీళ్లందరూ కలిసేవారు. ఈసారి ఇండియా దాటారు. రీ–యూనియన్‌కి చైనా వేదిక అయింది. మామూలుగా ఈ గెట్ టు గెదర్‌ని గోప్యంగా ఉంచుతుంటారు. తర్వాత వాళ్లే కొన్ని ఫొటోలను బయటపెడుతుంటారు. ఇప్పుడు చైనా ట్రిప్ ఫొటోలను ఖుష్బూ, రాధిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘చైనాను మిస్ అవుతున్నాం.. మరచిపోలేని ట్రిప్ ఇది’ అని పేర్కొన్నారు. చిరంజీవి సతీమణి సురేఖ కూడా వెళ్లారని ఫొటోలు చూపించాయి. జనరల్‌గా ప్రతి ఏడాదీ 25, 30 మంది కనిపించేవాళ్లు. ఈసారి మాత్రం సంఖ్య తగ్గిందని ఫొటోలను చూస్తే తెలుస్తోంది. మిగతావాళ్లందరూ షూటింగ్స్తోనో, వేరే కారణాల వల్లో ఈ ట్రిప్‌ను మిస్ అయ్యుంటారని ఊహించవచ్చు.