
‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ రీయూనియన్ పదో యానివర్సరీ సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా జరుపుకున్నారు స్టార్స్. 1980లలో నటించిన స్టార్స్ ప్రతీ ఏడాది సరదాగా కలసి రీయూనియన్ జరుపుకుంటారు. ఈ ఏడాది పదో యానివర్సరీని చిరంజీవి హోస్ట్ చేశారు. ఈ పార్టీ హైదరాబాద్‌లోని చిరంజీవి స్వగృహంలో జరిగింది. ఈ వేడుకకు 40మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇందులో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలకు చెందిన నటీనటులున్నారు.
పైన ఉన్న ఫొటోలో ప్రభు, జయరామ్, సురేశ్, రెహమాన్, ఖుష్భూ, వెంకటేశ్, రాధిక, భానుచందర్, సుమన్, శోభన, నదియా, రాధ, సరిత, అమల, జగపతిబాబు, జయసుధ, సుమలత, నాగార్జున, మోహన్‌లాల్, లిజీ, భాగ్యరాజ్, జయసుధ, శరత్‌కుమార్, వీకే నరేశ్, రమేశ్ అరవింద్, జాకీ ష్రాఫ్, సుహాసిని, రేవతి తదితరులు ఉన్నారు. ప్రతీ ఏడాది జరిగే పార్టీకి ఓ డ్రెస్‌కోడ్ ఉంటుంది. ఈ ఏడాది డ్రెస్ కోడ్ బ్లాక్, గోల్డ్ కలర్స్. అందరూ అదే రంగు దుస్తుల్లో హాజరయ్యారు. ఈ పార్టీలో అంత్యాక్షరీ, మ్యూజికల్ చైర్స్ వంటి సరదా ఆటలతో కాలక్షేపం చేశారని తెలిసింది.