clean sweep Target
-
టీడీపీకి తడబాటే.. పచ్చ నేతల్లో కొత్త టెన్షన్!
ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతోంది. ఓటింగ్ జరిగిన తీరు, పెరిగిన ఓటింగ్‌తో తెలుగుదేశం పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. పైకి భీకరంగా ఉన్నా.. ఓటమి తప్పదనే నిర్ణయానికి వచ్చేశారు. ఉదయం నుంచే వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడాన్ని చూసి టీడీపీకి గుండె జారిపోయింది. దీంతో వారి కంటి మీద కునుకు కరువైంది. ఇంతకీ ఉత్తరాంధ్రలో ఏం జరగబోతోంది?సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున పోలింగ్ జరగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల నుంచి ఊహించని విధంగా ఓటింగ్ జరగడం వైఎస్సార్సీపీకే అనుకూలమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విశాఖలో అనేక భారీ పరిశ్రమలు రావడంతో యువత వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపిందనే చర్చ జరుగుతోంది.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఓటర్లను పోలింగ్ కేంద్రాల వైపు నడిపించాయని అంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మూలపేట పోర్ట్, ఐటీ రంగం అభివృద్ధితోపాటు, భారీ పరిశ్రమలు ఏర్పాటు, విశాఖ నగర అభివృద్ధి, కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం వంటివి ఓటర్లను వైఎస్సార్సీపీ వైపు మరింతగా ఆకర్షితులను చేశాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో ఉత్తరాంధ్రలో ఉన్న వెనుకబాటుతనం పోతుందనే అభిప్రాయానికి అక్కడ ప్రజలు వచ్చారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అమ్మఒడి, వైయస్సార్ చేయూత, ఆసరా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు మహిళలకు ఎంతో అండగా నిలిచాయి. ఈ పథకాలన్నీ మళ్ళీ కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్ రావాలనే ఆలోచన మహిళల్లో స్పష్టంగా కనిపించింది.పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాలు తెరవకముందు నుంచే మహిళలు వృద్ధులు బారులు తీరారు. గంటల కొద్దీ ఓపికగా క్యూల్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న ఆరు జిల్లాలు విశాఖ సిటీ, ఏజెన్సీ, మైదాన ప్రాంతాలు అనే తేడా లేకుండా మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేశారు. విజయనగరం జిల్లాలో అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ 81 శాతానికి పైగా జరగడం విశేషంగా చెబుతున్నారు.ఉత్తరాంధ్ర జిల్లాలో పెరిగిన ఓటింగ్ టీడీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. హేమా హేమీలైన నేతల్లో వణుకు పుడుతోంది. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బొత్స ఝాన్సీని నిలబెట్టడం వైఎస్సార్సీపీకి కలిసి వచ్చింది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతోపాటు, ఆమె పుట్టినఊరు కావడంతో కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గాల ఓటర్లు సైతం బొత్స ఝాన్సీకి బ్రహ్మరథం పట్టారు.టీడీపీ ఎంపీ అభ్యర్థి గీతం భరత్ ఎన్ని కోట్లు కుమ్మరించినా ప్రజలు బొత్స ఝాన్సీవైపే మొగ్గు చూపారు. గీతం భరత్ ఆయన కుటుంబ సభ్యులు అవినీతి అక్రమాలకు పాల్పడడం, గీతం యూనివర్సిటీ ముసుగులో సాగించిన భూకబ్జాలను విశాఖ ప్రజలు మర్చిపోలేదు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి కూడా ఇదేవిధంగా తయారైంది. ప్రతీ ఎన్నికకు ఒక నియోజకవర్గం మారే గంటాకు ఈసారి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు.ప్రతీ ఎన్నికలోనూ రిగ్గింగ్‌తో గెలిచే అచ్చెన్నాయుడుకు ఈసారి టెక్కలిలో చెక్ పడనుంది. అచ్చెన్న గూండాయిజం, అవినీతితో విసిగిపోయిన ప్రజలు ఈసారి ఆయన్ను పక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుది అదే పరిస్థితి. బూతులతో విరుచుకుపడే అయ్యన్నకు మహిళలు బుద్ధి చెప్పడానికి రెడీ అయ్యారు. నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు, కొత్త రోడ్లు నిర్మాణం, రోడ్లు విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలతో మరోసారి వైఎస్సార్సీపీకి ప్రజలు మొగ్గు చూపించారు. సొంత నియోజకవర్గాల్లో గెలవలేని మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, కళా వెంకటరావులు పక్క నియోజకవర్గాలకు తరలి వెళ్లారు.అనకాపల్లి ఎంపీగా ఒకప్పటి నాటు సారా వ్యాపారి, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్ కూటమి తరపున పోటీ చేశారు. సీఎం రమేష్ నాన్ లోకల్ కావడం, ఓసీ వెలమ కావడంతో స్థానికంగా ఉన్న బీసీ వెలమలు వైఎస్సార్సీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుకే మోగ్గు చూపించారు. ఇక్కడున్న కొద్ది రోజుల్లోనే సీఎం రమేష్ రౌడీయిజంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సీఎం రమేష్ ఎన్నికలపుడే ఇంతటి గుండాయిజం చేస్తున్నాడు. పొరపాటున గెలిస్తే తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతాడనే ఆందోళన అనకాపల్లి ప్రజల్లో కనిపించింది. దీంతో రమేష్‌కు మద్దతివ్వడానికి అనకాపల్లి ప్రజలు ఏమాత్రం అంగీకరించలేదు. ప్రస్తుత ఓటింగ్ జరిగిన తీరును బట్టి చూస్తే ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీకి క్లీన్ స్వీప్ ఖాయం అనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కూటమి తరపున పోటీ చేసిన హేమాహేమీలంతా మట్టి కరుస్తారనే టాక్ నడుస్తోంది. టీడీపీకి గతంలో వచ్చిన కొద్ది సీట్లు కూడా ఈసారి రావనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
Lok sabha elections 2024: ఢిల్లీ గల్లీలు...ఎవరివో!
దేశానికి ఆయువుపట్టయిన ఢిల్లీని కొల్లగొట్టిన వారే ఎర్రకోటలో జెండా ఎగరేయడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, ఆపై బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ఢిల్లీని క్లీన్‌స్వీప్ చేసి కేంద్రంలో అధికారం చేపట్టాయి. గత రెండు ఎన్నికల్లో రాజధానిలోని మొత్తం 7 ఎంపీ సీట్లనూ కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తోంది. ఎంపీలపై వ్యతిరేకతను అధిగమించేందుకు ఏకంగా ఆరుగురు సిట్టింగులను పక్కన పెట్టేసింది! ఇక కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొన్న ఆప్.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తాలూకు సానుభూతిని అనుకూలంగా మార్చుకోవాలని యోచిస్తోంది. కేజ్రీవాల్ భార్య సునీత పార్టీ ప్రచార బాధ్యతలను తన భుజానికెత్తుకున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా భిన్నమైన తీర్పు ఇవ్వడం ఢిల్లీ ఓటర్లకు కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. దశాబ్దాలుగా ఢిల్లీ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్‌పై 90వ దశకం నుంచి క్రమంగా బీజేపీ ఆధిపత్యం మొదలైంది. ఆ తర్వాత నుండి హస్తినలో అధికారం ఆ రెండు పారీ్టల మధ్యే మారుతూ వచి్చంది. 2009లో ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలనూ కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేయగా 2014, 2019ల్లో అదే ఫీట్‌ను బీజేపీ చేసి చూపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై ‘చీపురు’ తిరగేసిన ఆప్ లోక్‌సభకు వచ్చేసరికి ఒక్క స్థానమూ దక్కించుకోలేకపోయింది. ఓట్లపరంగా కూడా బీజేపీ ఆ రెండు పారీ్టలకు అందనంత ఎత్తులో నిలిచింది. కమలం గుర్తుకు 56.86 శాతం ఓట్లు రాగా హస్తానికి 22.51 శాతం, ఆప్‌కు గుర్తుకు 14.79 శాతం పోలయ్యాయి. కాకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఆప్ చేతిలో వరుసగా భంగపాటు తప్పడం లేదు.కేజ్రీవాల్ అరెస్టు కలిసొచ్చేనా? నయా రాజకీయాలతో సంచలనం అరవింద్ కేజ్రీవాల్ 2012లో పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ నానాటికీ బలపడుతూ వచి్చంది. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్.. 70 సీట్లకు 28 స్థానాలు సాధించింది. బీజేపీకి 32 సీట్లు రావడంతో హంగ్ ఏర్పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ముందుకు రాకపోవడంతో 8 సీట్లొచి్చన కాంగ్రెస్ మద్దతుతో కేజ్రీవాల్ తొలిసారి సీఎం అయ్యారు. కానీ 49 రోజులకే రాజీనామా చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌కు ఒక్క సీటూ రాలేదు. కానీ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 67 సీట్లతో సంచలనం సృష్టించింది. కేజ్రీవాల్ రెండోసారి సీఎం అయ్యారు. మళ్లీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో చేతులెత్తేసినా 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 62 సీట్లతో ముచ్చటగా మూడోసారి సీఎం అయ్యారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి తరఫున సుడిగాలి ప్రచారానికి సన్నద్ధమైన కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై జైలు పాలయ్యారు. ఇది ఆప్‌కు కలిసొస్తుందా, ప్రతికూలంగా మారుతుందా అన్నది ఆసక్తికరం. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిమిత్తం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొనడం ఆప్‌కు ఊరటనిచ్చే పరిణామమే. దీనిపై మే 7న కోర్టు వెలువరించబోయే నిర్ణయం కోసం పార్టీ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. బీజేపీ ‘హ్యాట్రిక్’ గురి... ఢిల్లీలో హ్యాట్రిక్ క్లీన్‌స్వీప్ కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ తివారీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ భోజ్‌పురి సూపర్ స్టార్ 2014లో ఇక్కడి నుంచే బీజేపీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో అరంగేట్రం చేశారు. తర్వాత ఢిల్లీ బీజేపీ పగ్గాలు చేపట్టి 7 సీట్లనూ క్లీన్‌స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈసారి తివారీ తప్ప మిగతా ఆరుగురు సిట్టింగులనూ బీజేపీ మార్చేయడం విశేషం! ఢిల్లీ మద్యం కుంభకోణాన్ని బీజేపీ ప్రధాన ప్రచారాంశంగా జనంలోకి తీసుకెళ్తోంది. మోదీ ఫ్యాక్టర్‌తో పాటు సీఏఏ, అయోధ్య రామ మందిరం, ఆర్టికల్ 370 రద్దు తదితరాలను నమ్ముకుంది. పూర్వాంచలీలు, ముస్లింల ఆధిపత్యముండే ఈశాన్య ఢిల్లీ స్థానంలో బిహార్‌కు చెందిన ఇద్దరు అభ్యర్థుల మధ్య కీలక పోరు జరగనుంది. హ్యాట్రిక్‌తో మూడోసారి లోక్‌సభలో అడుగుపెట్టాలనుకుంటున్న మనోజ్ తివారీ ఒకవైపు, కాంగ్రెస్ నుంచి కన్హయ్య కుమార్ మరోవైపు బరిలో ఉన్నారు. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక సమతూకం పాటించింది. తూర్పు ఢిల్లీ నుంచి పంజాబీ అయిన హరీశ్ మల్హోత్రా, చాందినీ చౌక్ నుంచి బనియా నాయకుడు ప్రవీణ్ ఖండేల్వాల్, దక్షిణ ఢిల్లీ నుంచి గుజ్జర్ నాయకుడు రాంవీర్ సింగ్ బిధూరి, పశ్చిమ ఢిల్లీ నుంచి జాట్ నాయకుడు కమల్జీత్ సెహ్రావత్, ఎస్సీ రిజర్వ్డ్ వాయవ్య ఢిల్లీ నుంచి దళిత నాయకుడు యోగేంద్ర చందోలియాలను బరిలో నిలిపింది. కమల్జీత్తో పాటు న్యూఢిల్లీ నుంచి దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బాసురీ స్వరాజ్ రూపంలో ఇద్దరు మహిళలకూ అవకాశం ఇచి్చంది.సునీతా కేజ్రీవాల్ ప్రచారం... ఢిల్లీలో ఇండియా కూటమి భాగస్వాములుగా ఆప్ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 చోట్ల బరిలో దిగుతున్నాయి. రాజధానిలో బీజేపీకి ఎలాగైనా ముకుతాడు వేయాలని చూస్తున్నాయి. ‘ఢిల్లీ మోడల్’ను కేజ్రీవాల్ ప్రధానంగా ప్రచారం చేశారు. ఆయన జైలుపాలైన నేపథ్యంలో ఆప్ ప్రచార భారాన్ని భార్య సునీతా కేజ్రీవాల్ భుజానికెత్తుకున్నారు. ఆమె సభలకు మంచి స్పందన కూడా లభిస్తోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కార్పొరేట్లతో మోదీ కుమ్మక్కు వంటి అంశాలను ఆప్, కాంగ్రెస్ గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పైనా విమర్శలు గుప్పిస్తున్నాయి. కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో, విపక్షాలపై దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు ఉసిగొల్పుతోందన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి.సర్వేలేమంటున్నాయి... ఢిల్లీలో ఈసారి కూడా బీజేపీ మొత్తం 7 లోక్‌సభ సీట్లనూ క్లీన్‌స్వీప్ చేస్తుందని పలు సర్వేలు అంటున్నాయి. అయితే కేజ్రీవాల్ అరెస్టు తాలూకు సానుభూతిఆప్కు కలిసొస్తే ఆ పారీ్టకి ఒకట్రెండు స్థానాలు దక్కే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. – సాక్షి, న్యూఢిల్లీ -
IND vs ZIM 3rd ODI: క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి
హరారే: ఇప్పటికే 2–0తో సిరీస్ సొంతం చేసుకున్న భారత క్రికెట్ జట్టు క్లీన్‌స్వీప్ లక్ష్యంగా నేడు జరిగే చివరిదైన మూడో వన్డేలో జింబాబ్వేతో తలపడనుంది. ప్రధాన బౌలర్ల గైర్హాజరీలో దీపక్ చహర్, సిరాజ్, శార్దుల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్ రాణించి జింబాబ్వేను కట్టడి చేశారు. బ్యాటింగ్‌లో శుబ్‌మన్ గిల్, శిఖర్ ధావన్ ఆకట్టుకోగా... తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో రాణించి ఫామ్‌లోకి రావాలని భావిస్తున్నారు. రెండు వన్డేల్లో టాస్ గెలిచి జింబాబ్వేను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన కెప్టెన్ రాహుల్ ఈసారి టాస్ గెలిస్తే భారత బ్యాటర్లకు బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశముంది. ఇప్పటికే సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఆఖరి వన్డేలో భారత టీమ్ మేనేజ్మెంట్ ఆల్‌రౌండర్ షహబాజ్ అహ్మద్‌కు తొలిసారి అవకాశం ఇస్తుందో లేదో చూడాలి. మరోవైపు జింబాబ్వే జట్టు అన్ని విభాగాల్లో నిరాశాజనక ప్రదర్శన కనబరుస్తోంది. సొంతగడ్డపై భారత జట్టుపై 2010లో చివరిసారి వన్డేలో గెలిచిన జింబాబ్వే మళ్లీ గెలుపు రుచి చూడాలంటే అద్భుతమే చేయాల్సి ఉంటుంది. -
క్లీన్ స్వీప్ లక్ష్యం
అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేస్తూ అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం సాగింది. ఆ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా ముందుకు సాగేందుకు కార్యచరణ సిద్ధం చేసింది. ప్రజలతో ప్రతి నాయకుడు, కార్యకర్త ఇప్పటి నుంచి మమేకం కావాలని అధినేత్రి జయలలిత పిలుపునిచ్చారు. సాక్షి, చెన్నై:మూడోసారిగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత సుపరిపాలన లక్ష్యంగా జయలలిత అడుగులు వేస్తున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలను ఆకర్షించే విధంగా పథకాల్ని ప్రవేశ పెడుతున్నారు. అమ్మ క్యాంటీన్ల మొదలు, మెడికల్ షాపుల వరకు పేద, మధ్య తరగతి వర్గాల కోసం ప్రవేశ పెట్టినవే. ఇలాంటి పథకాలను మరిన్ని వేగవంతం చేయడానికి ముందుకు సాగుతున్న జయలలిత సర్కారు అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయ్యింది. నాలుగో వసంతంలోకి అడుగు పెట్టిన జయలలిత సర్కారు, మరో ఏడాదిన్నరలో మళ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. డీఎంకేకు ఎదురవుతున్న వరుస పతనాలను తమకు అనుకూలంగా మలచుకుని ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా కార్యాచరణను ఆ పార్టీ అధినేత్రి జయలలిత సిద్ధం చేశారు. కార్యాచరణ: లోక్ సభ ఎన్నికల్లో 37 అసెంబ్లీ స్థానాలను కైవశం చేసుకోవడం, డీఎంకే డిపాజిట్లను గల్లంతు చేయడం చూస్తే అన్నాడీఎంకేకు అనుకూల పరిస్థితులున్నట్లు తెలుస్తోంది. దీన్ని అలాగే, పదిలం చేసుకోవడం లక్ష్యంగా జయలలిత తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన కీలక అంశాలపై గురువారం నాటి పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో చర్చించారు. పార్టీ పరంగా కీలక మార్పులతోపాటుగా, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లడమే కాకుండా, ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రజలతో మమేకం అయ్యే విధంగా సూచనలు ఇచ్చి ఉన్నారు. ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్టు, ఇవన్నీ సక్రమంగా ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని వివరించి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేసి ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే శ్రమించాలని, అప్పుడే రాష్ట్రంలోని 234 స్థానాలను క్లీన్ స్వీప్ చేయగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. డీఎంకే మీద ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతుండడం, ప్రధాన ప్రతిపక్షం డీఎండీకే చతికిలబడి ఉన్న దృష్ట్యా, ఈ రెండు పార్టీలకు చరమ గీతం పాడేందుకు ప్రజలను సిద్ధం చేస్తూ, క్లీన్ స్వీప్ నినాదంతో ఇక ప్రతి నాయకుడు, కార్యకర్త ముందుకు సాగే రీతిలో ఉపదేశాల్ని జయలలిత ఇచ్చినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీ అనుబంధ విభాగాల నేతృత్వాల్లో ప్రజాకర్షణ కార్యక్రమాలను వేగవంతం చేయడానికి సైతం నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. పార్టీ కోసం శ్రమిస్తున్న వారందరికీ పదవులను కట్టబెట్టే విధంగా నియోజకవర్గాల వారీగా కమిటీల ఏర్పాటుకు నిర్ణయించినట్టు ఆ పార్టీలో ప్రచారం సాగుతుండడం గమనార్హం.