clothes changed
-
ష్.. గప్‌చుప్..!!.. యువతులు దుస్తులు మార్చుకునే దృశ్యాల చిత్రీకరణ
సాక్షి, కోనసీమ జిల్లా(ఆత్రేయపురం): ఆడపిల్లలకు రక్షణ కరవైంది. తమ ఇంట్లోనూ మహిళలు ఉన్నారనే సంగతి మర్చిపోయి కొందరు మృగాళ్లు సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. షాపింగ్ మాల్స్, ట్రైల్ రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి మహిళలు దుస్తులు మార్చుకునే దృశ్యాలను చాటుగా చిత్రీకరించే విషయాలను చాలా వింటున్నాం. అదే ఓ ప్రభుత్వ కార్యాలయంలోనే ఇలా చేస్తే.. ఎవరిదీ తప్పు. ఆత్రేయపురం మండలం లొల్లలాకుల ఇరిగేషన్ కార్యాలయం వద్ద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఫేస్బుక్ పరిచయంతో స్నేహితులంతా కలసి లొల్లలాకుల వద్ద కార్తిక మాసం సందర్భంగా ఈ నెల 20న వన సమారాధన ఏర్పాటు చేసుకున్నారు. కొందరు యువకులు, యువతులు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. అయితే యువతులు దుస్తులు మార్చుకునేందుకు అక్కడే ఉన్న ఇరిగేషన్ కార్యాలయాన్ని అధికారుల అనుమతితో తీసుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఆ కార్యాలయంలో పనిచేసే ఓ కాంట్రాక్టు సిబ్బంది ఒకరు రహస్యంగా ఆ రూమ్‌లో సెల్‌ఫోన్ రికార్డింగ్ బటన్ ఆన్‌చేసి.. ఎవరికీ కనబడకుండా కేవలం యువతుల దుస్తులు మార్చుకునే ప్రాంతంలో ఏర్పాటు చేశాడు. ఆ విషయం తెలియని ఆ యువతులు మామూలుగానే ఆ రూంలోకి వెళ్లారు. ఒకరిద్దరు దుస్తులు కూడా మార్చుకున్నారు. మరొకరు ఆ రూంలో చూస్తుండగా సెల్‌ఫోన్ కంట పడింది. దీంతో ఆ యువతులు షాక్‌కు గురై వెంటనే తమను ఇక్కడికి ఆహ్వానించిన స్నేహితులకు విషయం చెప్పి.. సెల్‌ఫోన్ అప్పగించారు. ఆ సెల్‌ఫోన్ ఎవరిదని ఆరా తీస్తే.. అక్కడ పనిచేస్తున్న వ్యక్తిది అని తెలిసింది. వెంటనే అతన్ని పట్టుకుని గట్టిగా దేహశుద్ధి చేశారు. అనంతరం ఆత్రేయపురం పోలీసులకు అప్పగించారు. అయితే ఇక్కడ కొందరు పెద్దలు, అధికారులు కలసి విషయాన్ని బయటకు పొక్కకుండా రహస్యంగా రాజీచేసి కేసు లేకుండా ఆ సెల్‌ఫోన్ రికార్డింగ్ చేసిన ప్రబుద్ధుడిని వదిలేశారు. ఇంతటి దారుణానికి పాల్పడిన వ్యక్తిని సాధారణంగా వదిలేస్తే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు, పోలీసులు కుమ్మక్కై వదిలేశారనే ఆరోపిస్తున్నారు. దీనిపై ఎస్సై సీహెచ్ సుధాకర్ వివరణ కోరగా జరిగిన విషయం వాస్తమేనని, అయితే తమకు కేసు వద్దని స్నేహితులంతా తెలిపారన్నారు. దీంతో చట్టపరమైన చర్యలు తీసుకోలేదని ఆయన వివరించారు. -
డ్రెస్ మార్చుకుంటుండగా వీడియో.. బ్లాక్ మెయిల్ చేసి
గురుగ్రామ్: ల్యాబోరేటరీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి డ్రెస్ మార్చుకుంటుండగా ఒకరు వీడియో తీశాడు. అనంతరం ఆమెను ఆ వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ బలత్కారానికి పాల్పడ్డాడు. అతడితో పాటు మరికొందరు ఆమెపై అత్యచారానికి పాల్పడడమే గాక ఆమె గర్భం దాలిస్తే అబార్షన్ చేయించాడు. దీంతో అతడి వేధింపులు తాళలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన హరియాణలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గురుగ్రామ్ సెక్టార్ 52లో ఉన్న ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా ఓ యువతి (26) పని చేస్తోంది. అయితే ల్యాబ్‌లో పని చేసేప్పుడు డ్రెస్ వేరే (యూనిఫార్మ్) ఉంటుంది. ఉద్యోగానికి వచ్చేప్పుడు.. వెళ్లేప్పుడు డ్రెస్ మార్చుకోవాల్సి ఉంటుంది. దీంతో ఒకరోజు యధావిధిగా ఆమె డ్రెస్ మార్చుకుంటోంది. ఆమెతో పాటు ఒకప్పుడు ల్యాబ్‌లో పని చేసిన యువకుడు సచిన్ సింగ్ తివారీ. ఒకరోజు ఆమె డ్రెస్ మార్చుకుంటుండగా వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను యువతికి చూపించి వేధించసాగాడు. ఈ క్రమంలో మంగళవారం ఆమెను బ్లాక్ మెయిల్ చేసి అతడి వద్దకు పిలుపించుకున్నాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా మంగళవారం ‘మాట్లాడుదాం రా’ అని అతడు తన స్వగ్రామం వాజిరబాకు పిలిపించుకున్నాడు. ఆమె రాగానే కారులోకి ఎక్కించుకుని బాద్షాపూర్కు తీసుకెళ్లాడు. అక్కడ మరోసారి బలాత్కారం చేయబోగా యువతి అడ్డగించింది. అయితే కత్తి చూపెట్టి భయపెట్టాడు. కారులోనే ఆమెను బలవంతంగా దాడి చేస్తుండడంతో యువతి అరిచింది. ఆమె కేకలు విన్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. పోలీసులకు ఆమె అతడి దారుణాలను వివరించింది. గతంలో అనేకసార్లు బ్లాక్ మెయిల్ చేసి లోబర్చుకున్నాడని వాపోయింది. గర్భం దాలిస్తే తీయించి వేశాడని కన్నీటి పర్యంతమైంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
రాళ్ల వెనుక దుస్తులు మార్చుకున్నా: హీరోయిన్
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు సినిమా షూటింగ్లో ఓ సమస్య ఏర్పడిందట. తగిన వసతులు లేకపోవడంతో రాళ్ల మాటున దుస్తులు మార్చుకోవాల్సి వచ్చిందని కంగన చెప్పింది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్న రంగూన్ సినిమా షూటింగ్ స్పాట్లో ఆమెకు ఈ సమస్య వచ్చింది. మరో హీరోయిన్ నేహా దూపియా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నో ఫిల్టర్ నేహా షోలో కంగనా ఈ విషయం చెప్పింది. తన సినిమాల షూటింగ్ సందర్భంగా తాను ఎదుర్కొన్న సమస్యలను కంగన ఈ షోలో వెల్లడించింది. క్వీన్ సినిమా షూటింగ్ సందర్భంగా యూరప్‌లో తాను కేఫ్‌లలో దుస్తులు మార్చుకున్నానని చెప్పింది. రంగూన్ సినిమా షూటింగ్ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్‌లో ఇలాంటి సమస్యే ఎదురైందని కంగన తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్‌లో మారుమూల లోయ ప్రాంతాల్లో రంగూన్ సినిమా షూటింగ్ చేశారని.. అక్కడ గ్రామాలు కానీ, విశ్రాంతి గదులు కానీ లేవని.. దీంతో తాను రాళ్ల మధ్యకు వెళ్లి దుస్తులు మార్చుకునేదాన్నని చెప్పింది. మనం ఎంచుకునే ప్రాజెక్టులను బట్టి ఇలాంటి సమస్యలు ఉంటాయని, స్టారయినా, సాధారణ ఆర్టిస్టు అయినా ఇలాంటి ఇబ్బందులు తప్పవని కంగన తన షూటింగ్ విశేషాలు చెప్పింది.