నూతన ఏడాదిలో జగనే సీఎం
శింగరాయకొండ(కొండపి), న్యూస్‌లైన్: ఈ ఏడాది వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టడం తథ్యమని ఆ పార్టీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త జూపూడి ప్రభాకరరావు అన్నారు. మూలగుంటపాడులోని దేవీ సీఫుడ్స్ వద్ద అతిథి గృహంలో బుధవారం నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ప్రజలకు శుభాలు కలగాలని ఆకాంక్షించారు. వైఎస్ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లగల నాయకుడు జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆయన్ను ప్రజలు వందశాతం విశ్వసిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర సమైక్యత కోసం అన్ని విధాలా పోరాడుతున్న యోధుడు జగన్ మాత్రమేనన్నారు.
కుట్రలు, కుతంత్రాలు, కుయక్తులు, రెండు కళ్ల సిద్ధాంతంతో రెండు ప్రాంతాల ప్రజలను మోసం చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు.. రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరిం చారు. నూతన సంవత్సరంలో అయినా చంద్రబాబుకు మంచి బుద్ధి కలగాలని టీడీపీ కార్యకర్తలు దేవుణ్ణి ప్రార్థించాలని సూచించారు. అసమర్థ కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగి పోయారన్నారు. గడపగడపకూ వైఎస్ఆర్ సీపీ కార్యక్రమాన్ని పాకల నుంచి గురువారం ఉదయం ప్రారంభించనున్నట్లు జూపూడి తెలిపారు.
కార్యక్రమంలో మూల గుంటపాడు సర్పంచ్, శింగరాయకొండ కన్వీనర్ చుక్కా కిరణ్‌కుమార్, కొండపి, జరుగుమల్లి, మర్రిపూడి, టంగుటూరు,పొన్నలూరు మండలాల కన్వీనర్లు బి. ఉపేంద్ర, జి. శ్రీనివాసరావు, బి. రమణారెడ్డి, బి. రామారావు, బి. వెంకటేశ్వర్లు, శింగరాయకొండ యూత్ కన్వీనర్ సామంతుల రవికుమార్‌రెడ్డి , బి. అశోక్‌కుమార్, సర్దార్, మాధవ, ఐదు గ్రామాల సర్పంచ్‌లు, గ్రామాల కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.