cm personal secretary
-
బిభవ్ కుమార్ అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆప్ రాజ్యసభ సభ్యు రాలు స్వాతి మలివాల్‌పై దాడి ఆరోపణ కేసులో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు, కేజ్రీ వాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్‌చేశారు. శనివారం కేజ్రీవాల్ ఇంటికి బిభవ్ వచ్చాడని తెల్సుకుని ఢిల్లీ పోలీసులు అక్కడికి వెళ్లారు. బిభవ్‌ను ప్రశ్నించే నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అరెస్ట్‌చేసినట్లు తర్వాత ప్రకటించారు. సీఎం కేజ్రీవాల్‌ను కలిసేందుకు వెళ్లిన సందర్భంగా బిభవ్ విచక్షణరహితంగా, నెలసరి బాధ ఉందని చెప్పినా వినకుండా చెంపలు చెళ్లుమనిపించి, ఛాతి, పొట్ట, పొత్తికడుపుపై పలుమార్లు తన్నాడని బిభవ్‌పై మలివాల్ ఫిర్యాదు చేయడం తెల్సిందే. శుక్రవారం ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన మరుసటి రోజే నిందితుడిని పోలీసులు అరెస్ట్చేయడం గమనార్హం. కోర్టు ఎదుట బిభవ్‌ను హాజరుపరిచి దర్యాప్తు నిమిత్తం తమ కస్టడీకి కోరతామని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఆరోజు ఘటనాస్థలిలో ఉన్న 10 మంది నుంచి స్టేట్మెంట్లు నమోదుచేశామని వెల్లడించారు. బిభవ్ ఫిర్యాదును పట్టించుకోండి: అతిశిఢిల్లీ పోలీసులు ఈ కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని భావిస్తే మలివాల్‌పై బిభవ్ ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని ఆమెపై ఎఫ్ఐఆర్ నమోద ుచేయాలని ఆప్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ రాష్ట్ర మంత్రి అతిశి శనివారం డిమాండ్‌చేశారు. పత్రకాసమావేశంలో అతిశి సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘ఏసీబీ నమోదుచేసిన ఒక అక్రమ నియామకాల కేసులో మలివాల్ ఇరుక్కున్నారు. అరెస్ట్ నుంచి తప్పించాలంటే కేజ్రీవాల్‌ను కేసులో ఇరికించాలని ఆమెను బీజేపీ బ్లాక్మెయిల్ చేసింది. బీజేపీ చేసిన ఈ కుట్రలో మలివాల్ ఒక పావు మాత్రమే. అపాయింట్మెంట్ లేకుండా సీఎం ఇంటికి ఆమె ఎందుకొచ్చినట్లు? ఒకవేళ సీఎంను కలిసి ఉంటే వాళ్ల ప్లాన్ ప్రకారం బిభవ్‌తో గొడవ, అరెస్ట్ జరిగేవి కాదు. బీజేపీకి ఒక విధానం ఉంది. మొదట కేసులు పెడతారు. తర్వాత బెదిరించి వినకపోతే జైల్లో పెడతారు. సీఎం ఆఫీస్‌లో డ్యూటీలో ఉన్న భద్రతా అధికారిపై మలివాల్ దుర్భాషలాడి గొడవ పడ్డారు. అనుమతిలేకుండా లోపలికి వచ్చారు. ఈ ఉల్లంఘన అంశాలపై ఢిల్లీ పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయట్లేరు? ఎఫ్ఐఆర్ ప్రతిని పోలీసులు కోర్టుకు ఇవ్వరట. నిందితుడి లాయర్‌కు ఇవ్వరట. కానీ రెండ్రోజులుగా మీడియాలో అది చక్కర్లు కొడుతోంది. ఈ కుట్ర ఎంతపెద్ద స్థాయిలో జరిగిందో ఇట్టే అర్థమవుతోంది ’’ అని మోదీ సర్కార్‌పై అతిశి ఆరోపణలు గుప్పించారు. మరో వీడియో విడుదలఘటన జరిగిన రోజునాటి సీసీటీవీ ఫుటేజీ మరొకటి బయటికొచ్చింది. ఆ వీడియోలో కేజ్రీవాల్ భద్రతా సిబ్బంది మలివాల్‌ను చేయిపట్టుకుని ఇంటి బయటకు బలవంతంగా తీసుకొచ్చారు. మహిళా సెక్యూరిటీ గార్డ్ చేతిని మలివాల్ విదిలించుకుని దూరం జరిగి, అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు ఆ వీడియోలో రికార్డయింది. అయితే ‘‘మలివాల్ ఆరోపించినట్లు ఆమె నడవలేకపోతున్నట్లు వీడియోలో లేదు. మామూలుగానే నడుస్తున్నారు. మహిళా పోలీస్ అధికారిని నెట్టిపడేశారు. షర్ట్ చిరిగిందని, బటన్స్ ఊడిపోయాయని చెప్పిందంతా అబద్ధమని ఈ వీడియోలో తేలిపోయింది’’ అని అతిశి ఆరోపించా. అయితే పూర్తి నిడివి ఫుటేజీ విడుదలచేయకుండా కత్తిరించి అతికించిన ఎడిటెడ్ వీడియోను విడుదలచేసి ఆప్ మలివాల్ వ్యక్తిత్వహననానికి పాల్పడుతోందని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ తీవ్రంగా తప్పుబట్టారు. బిభవ్ అరెస్ట్‌తో ఆప్ చెత్త చరిత్ర పేజీలు ఇప్పుడు బయటికొస్తాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో మలివాల్‌కు చేసిన వైద్యపరీక్షల వివరాలు బహిర్గతమయ్యాయి. మెడికో లీగల్ సర్టిఫికెట్ ప్రకారం మలివాల్ ఎడమ కాలు బొటనవేలు సమీపంలో, కుడి చెంపపై గాయాలున్నాయి. -
Delhi Chief Minister Arvind Kejriwal: బీజేపీ ఆఫీస్కొస్తాం
న్యూఢిల్లీ: బెయిల్‌పై బయటికొచ్చాక ఆప్ ఎన్నికల ప్రచారపర్వంలో ఎన్నికల వేడిని రాజేసిన కేజ్రీవాల్ శనివారం ప్రధాని మోదీకి కొత్త సవాల్ విసిరారు. తన వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ పత్రికా సమావేశంలో మాట్లాడారు. ‘‘ ప్రధాని మోదీజీ మీరు కొత్తరకం జైలు ఆట ఆడుతున్నారని తెలుసు. మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్ ఇలా ఆప్ నేతలను ఒకరి తర్వాత మరొకరిని జైలుకు పంపిస్తున్నారు. రేపు(ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు నేను, నాతోపాటు ఆప్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం బీజేపీ ప్రధాన కార్యాలయానికి గుంపుగా వస్తాం. ఎంత మందిని అయితే మీరు జైలులో పడేద్దామనుకుంటున్నారో అంత మందిని ఒకేసారి అరెస్ట్‌చేసి జైల్లో వేసేయండి’’ అని మోదీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ‘ సంజయ్ సింగ్‌ను చెరసాలలో వేశారు. ఈరోజు బిభవ్ కుమార్‌ను అరెస్ట్‌చేశారు. కంటికి శస్త్రచికిత్స తర్వాత మా ఎంపీ రాఘవ్ చద్దా లండన్ నుంచి తిరిగొచ్చారు. ఆయనను కూడా జైలుకు పంపుతామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఢిల్లీ రాష్ట్ర మంత్రులు అతిశి, సౌరభ్ భరద్వాజ్లనూ కారాగారంలో వేస్తామని గతంలో బీజేపీ వెల్లడించింది’ అని ‘ఎక్స్’లో కేజ్రీవాల్ ఒక వీడియోను షేర్చేశారు. డ్రామాలు ఆపండి: బీజేపీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తామన్న కేజ్రీవాల్ ప్రకటనపై బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ స్పందించారు. ‘‘ ఈ డ్రామాలు ఆపండి. మేం చాలా సులభమైన ప్రశ్న అడుగుతున్నాం. మీ సొంతిట్లో మీ పార్టీ ఎంపీని చితకబాదితే ఆరు రోజులైనా మీరు మౌనం వీడట్లేరు. మహిళా ఎంపీపై దాడి ఉదంతంలో బాధ్యులు ఎవరు? ఈ విషయంపై మీరెందుకు స్పందించట్లేరు? చర్యలెందుకు తీసుకోవట్లేరు?’’ అని సచ్దేవ్ నిలదీశారు. -
ఏపీ సంక్షేమం అన్ని రాష్ట్రాలకూ ఆదర్శం: యూపీ సీఎం స్పెషల్ అడ్వైజర్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు విపవాత్మకం అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు సాకేత్ మిశ్రా అభివర్ణించారు. దీనిని గొప్ప కాన్సెప్ట్‌గా భావిస్తున్నానని ప్రశంసించారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో ఏపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, మెరుగు పరుస్తున్న తీరును స్వయంగా పరిశీలించానని, ప్రగతి స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. చివరి వ్యక్తికి కూడా లబ్ధి చేకూర్చడానికి ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించక తప్పదన్నారు. మంగళవారం ఆయన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకూరులో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్, డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా కేంద్రాల పనితీరును స్వయంగా పరిశీలించారు. ఆ తర్వాత సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాలను వైఎస్ జగన్‌తో పంచుకున్నారు. అనంతరం ఐఅండ్‌పీఆర్ ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఏపీని చూసి చాలా నేర్చుకోవచ్చు ఏపీలో పర్యటన మాకు మంచి అనుభవాన్ని ఇచ్చింది. ఏపీలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల వెనుక లక్ష్యాలు, ఉద్దేశాలపై సీఎంతో చర్చించాను. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో భాగంగా వారి ఆరోగ్య చరిత్రను నిక్షిప్తం చేయడం బాగుంది. దీనికి ఐటీ, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం ప్రశంసనీయం. ఏపీలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలి. గ్రామంలో ప్రభుత్వ సేవలపై ఎవరికి ఏ అవసరం వచ్చినా పలు రకాల ఆఫీసుల చుట్టూ తిరిగేకన్నా, గ్రామ సచివాలయం కేంద్రంగా అన్నింటికీ పరిష్కారం లభించడం విప్లవాత్మక ప్రగతిగా భావిస్తున్నా. ఏపీ పర్యటన ద్వారా చాలా నేర్చుకున్నాం. డ్రోన్ల వ్యవస్థ ఆకట్టుకుంది 10 నిమిషాల్లో ఎకరంలో పురుగు మందు పిచికారి చేయడం గొప్ప విషయం. ఆర్బీకేల ద్వారా రైతులకు ఎన్నో విధాలా ఉపయోగం ఉంది. ఎరువులు, పురుగు మందులు, ఈ–క్రాప్, నష్టపరిహారం ఇలా ఎన్నో విషయాల్లో ఏపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలవడం అభినందనీయం. ఇక తాజాగా ఏపీ సీఐడీ కొత్త డీజీగా నియమితులైన ఎన్.సంజయ్ సైతం ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇదీ చదవండి: కేవలం 9 నిమిషాల్లో ఆరోగ్యశ్రీ కార్డు -
సీఎం పీఎస్‌నంటూ ఘరానా మోసం.. అరెస్ట్
హైదరాబాద్: సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీనంటూ ఘరానా మోసానికి పాల్పడిన ఓ వ్యక్తిని సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సీనియర్ జర్నలిస్ట్‌ను, హోంశాఖ కార్యదర్శినంటూ అనేక మందిని బెదిరించిన కేసుల్లో పలుమార్లు జైలుకు వెళ్లాడు. అయినా తీరు మారని సదరు వ్యక్తి మరోసారి కటకటాల పాలైయ్యాడు. సీసీఎస్ డీసీపీ అవినాశ్ మహంతి కథనం ప్రకారం...రంగారెడ్డి జిల్లా కంట్లూరు గ్రామానికి చెందిన రాయబండి సూర్య ప్రకాశచారి... ఖమ్మంలో జర్నలిస్టు కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నానని ఓ రిటైర్డ్ సీటీవోకు సీఎంకు ప్రిన్సిపల్ సెక్రటరీ అంటూ ఫోన్‌కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఇంటర్ వరకు చదివిన ఇతను 2002 నుంచి కొన్నేళ్ల పాటు వివిధ పత్రికలు, మ్యాగజైన్లలో రిపోర్టర్‌గా పనిచేశాడు. పనిచేసిన ప్రతిచోట మద్యం తాగి ఆఫీసుకు రావడంతో పాటు ప్రవర్తన బాగా లేకపోవడంతో అన్ని యజమాన్యాలు అతడిని రిపోర్టర్ ఉద్యోగం నుంచి తొలగించాయి. అయితే రిపోర్టర్‌గా ఉన్న జ్ఞానంతో కొంత మంది వ్యాపారవేత్తలు, ఆస్పత్రులు, స్కూళ్లు, ప్రభుత్వ అధికారులను ఎంపిక చేసుకొని మీడియావాళ్లు కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నారని అందుకు కొంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సులభ పద్ధతిని డబ్బు సంపాదించాలనే ఆశతో సీనియర్ జర్నలిస్ట్‌ను అని, మాజీ సీఎం పీఏను అని, హోంశాఖ కార్యదర్శిని అని, తెలంగాణ సీఎం పీఎస్ అని చెప్పుకుంటూ డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నాడు. గతంలో పలు కేసుల్లో కుషాయిగూడ, చైతన్యపురి, కీసర, మీర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. మాజీ సీఎం పీఏను అని చెప్పి కొరుట్ల మున్సిపల్ కమిషనర్ నుంచి డబ్బు బెదిరింపు వసూళ్లకు పాల్పడిన కేసులో గతేడాది నగర సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే సీఎంకు ప్రిన్సిపల్ సెక్రటరీ అని చెప్పి ఖమ్మంలో జర్నలిస్టు కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నామని, అందుకు కొంత డబ్బులు కావాలని రిటైర్డ్ సీటీవో కె.బాలసముద్రంను డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన ఆయన సీసీఎస్ పోలీసులకు ఇటీవల ఫిర్యాదుచేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు సూర్య ప్రకాశ్చారిని శనివారం అరెస్టు చేశారు.