Coach Factory
-
మోదీ పిట్ట బెదిరింపులకు భయపడం
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ మరోసారి తెలంగాణ ప్రజలను మోసగించారని.. ఎన్నోఏళ్ల కల అయిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఎగనామం పెట్టి, చిన్న వ్యాగన్ రిపేర్ షాప్‌కు శంకుస్థాపన చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై కేంద్ర ఏజెన్సీలు దృష్టిపెట్టాయంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు తాము భయపడే ప్రసక్తే లేదని, ఇలాంటి ఉడత ఊపులు, పిట్ట బెదిరింపులకు కలవరపడే ప్రభుత్వం, నాయకత్వం తమది కాదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ ప్రజలు 45ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ప్రధాని మోదీ ఎగనామం పెట్టారు. రూ.20వేల కోట్ల విలువైన ఫ్యాక్టరీని తన సొంత రాష్ట్రం గుజరాత్‌కు మోసపూరితంగా తరలించుకుపోయారు. సబ్కా సాత్ – సబ్కా వికాస్ అనే నినాదం గుజరాత్‌కా సాత్, గుజరాత్‌కా వికాస్‌గా మారిపోయింది. తెలంగాణ గత తొమ్మిదేళ్లలో కోరిన దేన్నీ కేంద్రం మంజూరు చేయలేదు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పా టు, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునః ప్రారంభంతోపాటు జాతీయ రహదారి ప్రాజెక్టులు, నూతన రైల్వే లైన్లు, ఉన్న రైల్వే లైన్ల బలోపేతం వంటి అన్ని రకాల డిమాండ్లను పక్కన పెట్టారు. మోదీవన్నీ అసత్యాలే.. ప్రధాని పర్యటన మెత్తం ఆత్మవంచన, పరనింద అన్న తీరుగా కొనసాగింది. ప్రధాని రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ తెలంగాణ ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలడం, అసత్యాలు మాట్లాడడం పరిపాటైంది. దేశంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగాన్ని పెంచిన ప్రధాని మోదీని ఉద్యోగాలపై ప్రశ్నిస్తే.. పకోడీలు వేసుకోవడం కూడా ఉద్యోగమే అంటూ అవహేళన చేశారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న సుమారు 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను నింపకుండా, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న ప్రధాని.. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై మాట్లాడటం గురవింద గింజ సామెత కన్నా హీనంగా ఉంది. అన్ని వర్గాలకూ అన్యాయమే.. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని గతంలో బీజేపీ నేత, ప్రస్తుత గవర్నర్ తమిళిసై తొక్కిపెట్టిన విషయంపై ప్రధాని స్పందించకుండా ఖాళీల గురించి మాట్లాడారు. సెంట్రల్ యూనివర్సిటీల ఖాళీలు ప్రధానికి కనిపించలేదా? తెలంగాణ ప్రభుత్వ బడుల వ్యవస్థ గురించి అసత్యాలు మాట్లాడారు. వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకొచ్చి 700 మంది రైతుల మరణాలకు కారణమైన ప్రధాని ఈరోజు వ్యవసాయ రంగం గురించి మాట్లాడడం దుర్మార్గం. ఆదివాసీలు, గిరిజనుల సంక్షేమం గురించి ప్రస్తావించిన ప్రధానికి.. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు ఇవ్వాల్సిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని తొక్కిపెట్టిన విషయం తెలియదా? కుటుంబపాలన అంటే నవ్వుతారు ప్రధాని మోదీ కుటుంబ పాలన గురించి మాట్లాడటం దారుణం. అనేక రాష్ట్రాల్లో బీజేపీ నాయకుల నుంచి తన కేబినెట్లో మంత్రుల వరకు వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారేనన్న విషయాన్ని ప్రధాని గుర్తుంచుకుంటే మంచిది. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కుటుంబంగా, తెలంగాణ ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న తెలంగాణ కుటుంబ పార్టీ మాది..’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
కాజీపేటలో రైల్ వ్యాగన్ల తయారీ
సాక్షి, హైదరాబాద్: కాజీపేటకు మంజూరు కావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం ఎగ్గొట్టిందని రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతున్న సమయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కాజీపేటకు మంజూరై పనులు ప్రారంభించుకున్న పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్ (పీఓహెచ్) స్థాయి పెంచి వ్యాగన్ల తయారీ యూనిట్‌గా మార్చాలని నిర్ణయించింది. వర్క్‌షాప్ అంచనా వ్యయం రూ.269 కోట్లు కాగా, తాజా నిర్ణయంతో దానిని రూ.521 కోట్లకు పెంచారు. ఐదు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించిన వార్షిక బడ్జెట్లో దీని ఊసు లేకపోవటం గమనార్హం. దీంతో బడ్జెట్ తయారీ తర్వాత కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీనికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు గూడ్స్ రైళ్లకు సంబంధించిన వ్యాగన్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు రైల్వే బోర్డు చర్యలు ప్రారంభించిందని ఓ సీనియర్ రైల్వే అధికారి ‘సాక్షి’తో చెప్పారు. ఆ వివాదంతోనేనా.. కాజీపేటకు 1980లలో కోచ్ ఫ్యాక్టరీ మంజూరైంది. దాని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న సమయంలో నాటి ప్రధాని ఇందిర హత్య జరిగింది. అప్పుడే సిక్కులపై ప్రతీకార దాడులు తీవ్రం కావటంతో పంజాబ్‌లో పరిస్థితి చేయిదాటింది. సిక్కులను చల్లార్చే క్రమంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌లోని కపుర్తలాకు తరలించే నిర్ణయం తీసుకున్నారు. అప్పటినుంచి ఈ డిమాండ్ పెండింగులో ఉండిపోయింది. రాష్ట్ర విభజన సమయంలో దాని ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీ వేస్తామన్న కేంద్రం ఆ మేరకు కమిటీ వేసింది. కోచ్ ఫ్యాక్టరీల అవసరం లేదన్న ఆ కమిటీ అభిప్రాయం మేరకు కాజీపేటకు పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్ మంజూరు చేశారు. ఇది వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. రైల్వేకు ఇది రెండో యూనిట్.. దేశవ్యాప్తంగా రైల్వేకు కోచ్ ఫ్యాక్టరీలు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ గూడ్సు వ్యాగన్ల తయారీకి ప్రభుత్వరంగ కేంద్రం ఒక్కటే ఉంది. కాగా కాజీపేటలో వ్యాగన్ తయారీ కేంద్రం ఏర్పాటైతే ప్రభుత్వ పరంగా రెండో యూనిట్ అవుతుంది. రైల్వే సొంత యూనిట్‌గా మారుతుంది. పవర్ మెక్–టైకిషా జేవీ అన్న సంస్థ కాజీపేట పీఓహెచ్ టెండర్ దక్కించుకున్న విషయం తెలిసిందే. దానికి కావాల్సిన 160 ఎకరాల భూమికి గాను ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వం 150 ఎకరాలను రైల్వేకు అందజేసింది. దీంతో అక్కడ వర్క్‌షాప్ ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర బడ్జెట్లో దానికి రూ.160 కోట్లు కేటాయించారు. -
కోవిడ్-19 : రైళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో రైల్వే కోచ్‌ల్లో ప్రత్యేక ఏర్పాట్లకు రైల్వే మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. వైరస్‌ను నిర్వీర్యం చేసేందుకు రైల్వే కోచ్‌ల్లో టైటానియం డయాక్సైడ్ కోటింగ్, ప్లాస్మా ఎయిర్ ప్యూరిఫికేషన్, శానిటైజేషన్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం వంటి ప్రణాళికలపై రైల్వే మంత్రిత్వ శాఖ కార్యాచరణకు పూనుకుంది. ప్రయాణీకుల రైళ్లు పట్టాలెక్కేలోగా ఈ చర్యలను చేపట్టాలని భావిస్తోంది. కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ యూనిట్లో ఈ తరహా తొలి నమూనా రైలును రూపొందించారు. రైల్వే కోచ్‌లన్నింటిలో ఈ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేలు యోచిస్తున్నాయి. ఎక్కడా చేతులు ఉపయోగించకుండా కాళ్లతోనే అన్నింటినీ ఆపరేట్ చేసేలా చర్యలు చేపడతామని రైల్వేలు తెలిపారు. కోచ్‌ల్లో కాపర్‌తో చేసిన హాండ్‌రెయిల్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తారు. కాపర్‌పై వైరస్ చేరిన కొద్దిసేపటికే వైరస్‌లోని డీఎన్ఏ, ఆర్ఎన్ఏలను ధ్వంసం చేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్లాస్మా ఎయిర్ పరికరాలు ఏసీ కోచ్‌లో గాలిని, ఉపరితలాలను స్టెరిలైజ్ చేస్తాయని తెలిపాయి. నూతన కోచ్‌లను ఈ తరహాలోనే తయారు చేసేందుకు రైల్వేలు సంసిద్ధమయ్యాయి. భవిష్యత్‌లో కోచ్‌ల తయారీలో వీటిని పొందుపరుస్తామని రైల్వే వర్గాలు వెల్లడించాయి. కరోనా వైరస్ విస్తృత వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణీకుల రైళ్లను ఆగస్ట్ 12 వరకూ నిలిపివేసిన సంగతి తెలిసిందే. చదవండి : నిమ్స్‌లో మొదలైన కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ -
సోనియా కోటలో కాంగ్రెస్‌పై మోదీ ఫైర్
లక్నో : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నియోజకవర్గం రాయ్‌బరేలిలో ఆదివారం తొలి ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. రాఫేల్ వివాదం, అగస్టా స్కామ్ సహా పలు అంశాలపై కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడికి దిగారు. కాంగ్రెస్ సైనిక పాటవాన్ని బలహీనపరిచే చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. రాయ్‌బరేలి ప్రాంతానికి ఆ పార్టీ చేసిందేమీలేదని దుయ్యబట్టారు. సర్జికల్ స్ర్టైక్స్ పై అనుమానాలు వ్యక్తం చేసిన పార్టీ మన సైన్యాన్ని విశ్వసించకుండా ప్రత్యర్థి చెబుతున్న ధరలను నమ్ముతున్నాయని రాఫెల్ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అగస్టా స్కామ్‌లో నిందితుడు క్రిస్టియన్ మైఖేల్‌ను రక్షించేందుకు కాంగ్రెస్ తమ న్యాయవాదులతో పోరాడుతోందని ఎద్దేవా చేశారు. రాయ్‌బరేలిలో మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మించే క్రమంలో 5000 మంది ఉద్యోగులను నియమించాలని నిర్ణయించగా కేవలం అందులో సగానికి మాత్రమే కాంగ్రెస్ హయాంలో నియామకాలు జరిగాయన్నారు. 2014లో ఫ్యాక్టరీలో కొత్తగా ఎవరినీ రిక్రూట్ చేసుకోలేదన్నారు. మోదీ తన పర్యటనలో భాగంగా మోడరన్ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఫ్యాక్టరీలో తయారైన 900వ కోచ్‌కు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. -
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ హుళక్కేనా?
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని నిర్మించాలన్న ప్రతిపాదనకు చెల్లుచీటీ పలికారా? వరంగల్ జిల్లా కేంద్రంలోని కాజీపేట ప్రాంత అయోధ్యపురంలోని దేవాదాయ శాఖ భూమిలో రైల్వే కోచ్‌ల తయారీ ఫ్యాక్టరీ నిర్మించడానికి 2011-12లో నాటి కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అయితే ఇప్పటికీ కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ఎలాంటి పనులూ మొదలు కాలేదేమిటని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి డిసెంబర్ 9న పార్లమెంట్లో ప్రశ్నిం చారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో తయారవుతున్న వ్యాగన్లు రైల్వే అవసరాలకు సరిపోతున్నందున కొత్త కోచ్ ఫ్యాక్టరీలను ఇప్పట్లో నెలకొల్పడం సాధ్యం కాదని రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో ఉండే రెండు పెద్ద ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. గతంలో వరంగల్ నగరంలోని అజాం జాహి మిల్లు మూయించి 4 వేలమంది కార్మికులను రోడ్డున పడేశారు. ఆ ఫ్యాక్టరీ మూతపడి 20 ఏళ్లు దాటింది. దీంతో మరో తరంలోని రెండింతలమంది కార్మికులు రోడ్డున పడి ఉద్యోగ జీవితాలను కోల్పోయారు. ఆంధ్రోళ్ల కుట్రల వల్లే అజాం జాహి వంటి ఫ్యాక్టరీలు మూత పడుతున్నాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేంద్రంతో కొట్లాడి అయినా సాధించుకోవచ్చని ఆశచూపిన తెరాస అప్పట్లో జనాల్ని నమ్మించింది. మరి గత ప్రభుత్వం అంగీకరించిన కోచ్ ఫ్యాక్టరీని ఇప్పుడు ఏర్పాటు చేయలేమని కేంద్ర మంత్రి జవాబిచ్చినా తెరాస ప్రభుత్వంలో స్పందన లేదు. కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పితే ఫ్యాక్టరీ ఏర్పడనున్న ప్రాంతానికి చెందిన కడిపికొండ, రాంపేట, తరా లపల్లి, వనమాల కనిపర్తి, మల్లకపల్లి, భట్టుపల్లి, మడికొండ గ్రామాలతోపాటు... ధర్మసాగర్, జాఫ ర్గఢ్, వర్ధన్నపేట, సంగెం గీసుగొండ, హసన్‌పర్తి, ఆత్మకూరు మండల ప్రజలకు కూడా ఉద్యోగాలు లభిస్తాయని జిల్లా ప్రజలు ఆశించారు. కానీ కోచ్ ఫ్యాక్టరీ రాదని తేలడంతో ప్రజల్లో నిరాశా నిస్పృ హలు పెరుగు తున్నాయి. ఉన్న ఫ్యాక్టరీల ద్వారానే సరిపడా వ్యాగన్లు తయారు చేసే అవకాశాలు ఉన్నప్పుడు తెలంగాణలో కొత్త ఫ్యాక్టరీకి అనుమ తులు ఎందుకిచ్చినట్లు? రాష్ట్రం తగిన స్థలాన్ని అప్పగిస్తే పనులు ప్రారంభిస్తామని కేంద్రం చెప్పగానే రాష్ట్ర ప్రభు త్వం ఆదేశాల ప్రకారం రెవెన్యూ అధికారులు హడావుడిగా స్థల నిర్ధారణ చేసి అడ్డుగా ఉన్న నివాస ఇండ్లను కూల్చివేసి 54 ఎకరాల స్థలాన్ని కేంద్రానికి అప్పజెప్పారు. ఫ్యాక్టరీ రాకపోగా, కూల్చివేతలో నష్టపోయిన వారికి ఏం సహాయం చేస్తారు? ఆ ప్రాంత ప్రజలకు ఏం సమా ధానం చెబుతారు? వెనుకబడిన లేక వెనుకబడేసిన తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ప్రజలకు దక్కకుండా, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని నిర్మించకుండా ఇతర ప్రాంతాలకు తరలించుకు పోయే ప్రయత్నాలను తెలంగాణ ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలి. నామమాత్ర ప్రస్తావనల తో ఈ సమస్య పరిష్కారం కాదు. మననీళ్లు, మన ఉద్యోగాలు, మన వనరులు అంటూ ఆశ చూపి అధికారంలోకి వచ్చిన పార్టీ అసలు విషయానికి వచ్చేసరికి చేతులెత్తేయడం బాధ్యతా రాహిత్యం. రాంపేట రంజిత్ పౌరహక్కుల సంఘం ఉపాధ్యక్షులు, వరంగల్ మొబైల్ : 9989545123 -
రాష్ట్ర ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వండి
రైల్వే మంత్రిని కోరనున్న కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిధిలోని రైల్వే ప్రాజెక్టులపై రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు సోమవారం భేటీ కానున్నారు. రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హైదరాబాద్ వస్తున్న సురేశ్‌ప్రభు.. కేసీఆర్‌ను సచివాలయంలో కలవనున్నారు. త్వరలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో జరుగుతున్న ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. వచ్చే బడ్జెట్లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని, 13 పెండింగ్ ప్రాజెక్టులపై సానుకూలంగా స్పందించాలని కోరనున్నారు. ముఖ్యంగా కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్, కాజీపేటకు రైల్వే డివిజన్ హోదా అంశాలను ప్రస్తావించనున్నట్లు సమాచారం. నేడు 2 కొత్త రైళ్ల ప్రారంభోత్సవం గత రైల్వే బడ్జెట్లో చోటు దక్కించుకున్న సికింద్రాబాద్-విశాఖ ఏసీ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సురేశ్‌ప్రభు జెండాఊపి ప్రారంభించనున్నారు. అలాగే నాందెడ్-ఔరంగాబాద్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ఇక్కడి నుంచే రిమోట్ వీడియో లింక్ ద్వారా ప్రారంభించనున్నారు. అనంతరం రైల్వేలో పీపీపీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనే అంశంపై నిర్వహించే జాతీయ సదస్సులో పాల్గొననున్నారు. -
సదా.. నిరాశ
రైల్వే బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి - ఒక్క ప్రాజెక్ట్‌నూ ప్రస్తావించని రైల్వే మంత్రి - కమిటీ నివేదిక వచ్చాకే నిర్ణయమని దాటవేత - ఊసే లేని కాజీపేట డివిజన్ హోదా - వ్యాగన్, కోచ్ ఫ్యాక్టరీ, కోల్ కారిడార్‌దీ అదే దారి - కంటితుడుపుగా రెండు హైస్పీడ్.. - మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు సాక్షి, హన్మకొండ : కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్... జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రైల్వేపరంగా హైదరాబాద్ తర్వాత కీలకమైన కాజీపేటపై దృష్టిసారించాలని, అభివృద్ధి పనుల మంజూ రుతోపాటు నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని నరేంద్రమోడీని కోరినా ఫలితం లేకుం డాపోరుంది. ఐదేళ్ల క్రితం మంజూరైన వ్యాగన్ పరిశ్రమ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో ప్రతిపాదించిన కోచ్ ఫ్యాక్టరీ ఊసే ఎత్తలేదు. మూడేళ్ల కిందటి కాజీపేట-విజయవాడ మూడో రైల్వే లేన్ నిర్మాణం సంగతి ఎటూ తేల్చకుండానే సికింద్రాబాద్-నాగ్‌పూర్, హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైలు అని కొత్త పాటందుకున్నారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెండింగ్ ప్రాజెక్ట్‌లు, అభివృద్ధి పనులపై ఓ కమిటీని నియమించాం.. నివేదిక వచ్చాక వాటిపై నిర్ణయం తీసుకుంటాం’ అని రైల్వే శాఖ మంత్రి దాటవేత వైఖరిని ప్రదర్శించారు. తెలంగాణకు... అందులోనూ వరంగల్ జిల్లా ప్రాజెక్ట్‌ల ప్రస్తావన లేకుండానే మమ అనిపించారు. ‘వ్యాగన్'కు మొండిచేయి ‘గతంలో మంజూరై... నిధుల కోసం ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌ల జాబితానే పెద్దగా ఉంది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిన ప్రాజెక్టుల నిర్మాణం చేపడతాం.’ అని బడ్జెట్‌కు రెండు రోజుల ముంగిట రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ సెలవిచ్చారు. ఈ మేరకు ఐదేళ్ల కిత్రం పీపీపీ పద్ధతిలో మంజూరైన వ్యాగన్ వర్క్‌షాప్ ఏర్పాటుకు నిధులు మంజూరవుతాయని అందరూ భావించారు. కానీ... రైల్వే బడ్జెట్లో దీనిపై ఊసే ఎత్తలేదు. అదేవిధంగా.... ఉత్తర, దక్షిణ, పశ్చిమ భారతదేశాలను కలిపే కీలక జంక్షన్ కాజీపేట మీదుగా న్యూఢిల్లీ-చైన్నై, హైదరాబాద్-చెన్నై మార్గంలో అధిక సంఖ్యలో ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ మార్గంలో కొత్త రైళ్లు నడిపేందుకు స్లాట్ దొరకడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితమే కాజీపేట-విజయవాడ, బల్లార్షా-కాజీపేట మధ్య మూడో లేను నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను సైతం ప్రత్యేక కమిటీకే అప్పగించి చేతులు దులుపుకున్నారు. కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట డివిజన్దీ అదే దారి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా కాజీపేటను ఎంపిక చేసి, కేంద్రానికి తెలిపింది. అంతేకాదు... రైల్వేపరంగా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కాజీపేట కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని కోరింది. ఈ అంశాలన్నింటీని సదానందగౌడ తన బడ్జెట్లో పక్కన పెట్టారు. అదే సమయంలో తన సొంత రాష్ట్రమైన కర్నాటకలోని బెంగళూరు సమీపంలో కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసుకున్నారు. దక్షిణ భారతదేశంలో ఇప్పటికే చెన్నైలో కోచ్ ఫ్యాక్టరీ ఉండగా... రెండేళ్ల క్రితం కేరళలోని పాలక్కాడ్‌కు మంజూరైన నూతన కోచ్ ఫ్యాకరీ నిర్మాణ దశలో ఉంది. పెద్దసంఖ్యలో ఉపాధి కల్పించేటువంటి భారీ పరిశ్రమలైన రైల్ కోచ్ ఫ్యాక్టరీలు ఇప్పటికే మూడు ఉండగా... మరోసారి దక్షిణ భారతదేశానికి మంజూరు కావడం కష్టమేనన్న సందేహాలు జిల్లావాసుల్లో వ్యక్తమవుతున్నాయి. కారు చీకట్లో కోల్ కారిడార్ భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి దోహదం చేసేలా బొగ్గు గనులు ఉన్న ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ పెంచేలా క్రిటికల్ కోల్‌కారిడార్ బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో రైల్వే లేన్లు నిర్మిస్తున్నట్లు ప్రకటించిన మంత్రి మణుగూరు-రామగుండం ప్రాజెక్ట్‌కు మొండిచేయి చూపించారు. దక్షిణ భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి కేవలం తెలంగాణలోనే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పలుమార్లు సర్వేలు పూర్తి కాగా... మణుగూరు-రామగుండం కోల్కారిడార్కు నిధులు మంజూరు చేస్తారని అందరూ ఆశించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కోటాతో ముడిపెట్టి ఈ ప్రాజెక్ట్‌ను నట్టేట ముంచారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం నిడివి 200 కిలోమీటర్లు ఉంటే, ఇందులో 130 కి.మీ నిడివి వరంగల్ జిల్లాలోనే ఉంది. ఈ ప్రాజెక్ట్ మంజూరైతే ఏజెన్సీలో అభివృద్ధి పట్టాలపై పరుగులు పెట్టేది. కంటితుడుపుగా రెండు హైస్పీడ్ రైళ్లు కాజీపేట మీదుగా సికింద్రాబాద్-నాగ్‌పూర్, హైదరాబాద్ -చెన్నై మధ్య హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ ప్రకటించారు. కంటితుడుపు చర్యగా వీటిని ప్రవేశపెట్టింది. దేశంలో ప్రయోగాత్మకంగా న్యూఢిల్లీ-ఆగ్రా మధ్య హైస్పీడ్ రైలును ఈ నెల మొదటి వారంలో నడిపించారు. ఈ హైస్పీడ్ రైళ్ల వల్ల ఇప్పటికిప్పుడు ఒనగూరే ప్రయోజనం లేదు. ప్రకటించిన రెండు మార్గాల్లో హైస్పీడ్ రైళ్లను నడిపేందుకు గల అవకాశాలను పరిశీలించడం.. అవసరమైన మార్పులు చేసిన తర్వాతే ఈ మార్గంలో కొత్తవి పరుగెడతాయి. ఇందుకు ఏడాది సమయం పట్టొచ్చు. మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు మాత్రమే... మొక్కుబడిగా మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు జిల్లా మీదుగా ప్రయాణించడం ఒక్కటే ఈ బడ్జెట్లో జిల్లాకు చేకూరిన ప్రయోజనం. సికింద్రాబాద్-హజ్రత్‌నిజాముద్దీన్ జనసాధరణ్, విజయవాడ-న్యూఢిల్లీ ప్రీమియం ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాజీపేట, వరంగల్ మీదుగా ప్రయాణం సాగిస్తాయి. వీటిలో విజయవాడ-న్యూఢిల్లీ ప్రీమియం రైలు కావడం వల్ల సాధారణ ప్రయాణికులకు దీని వల్ల ఉపయోగం తక్కువ. సికింద్రాబాద్-నిజాముద్దీన్ జనసాధరణ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫ్రీక్వెన్సీ వస్తే తప్ప... ఎంత ఉపయోగమనేది తేలదు. కాగా, షోలాపూర్-చెన్నై మధ్య మరో రైలును ప్రకటించినా... ఇది కాజీపేట మీదుగా వెళ్లేది, లేనిది అనే అంశంపై స్పష్టత లేదు. కాగా, నిత్యం రద్దీగా ఉండే కాజీపేట- బల్లార్షా మార్గంలో మరో రైలు రానుంది. కాజీపేట నుంచి ముంబరుుకి నేరుగా రైళ్లు నడపాలని ఎన్నాళ్ల నుంచో ఉన్న డిమాండ్‌ను ఈ బడ్జెట్లో రైల్వేశాఖ ఆమోదించింది. కాజీపేట నుంచి బల్లార్ష మీదుగా ముంబరుుకి వీక్లీ రైలును ప్రకటించారు. మొత్తంగా కాజీపేట మీదుగా మూడు రైళ్లు నడుస్తుండగా... ఈ రైలు వల్లనే జిల్లా వాసులకు ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది. అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్లలో ఎస్కలేటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఇదే జరిగితే వరంగల్, కాజీపేట స్టేషన్లలో ఎస్కలేటర్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎంపీలు ప్రయత్నిస్తే.. రైల్వే యూనివర్సిటీ ఈ సారి రైల్వే బడ్జెట్లో సదానందగౌడ ప్రకటించిన ఆసక్తికర అంశాల్లో రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు స్థాపన ముఖ్యమైనది. ప్రస్తుతం ఉన్న టెక్నికల్, రెగ్యులర్ యూనివర్సిటీల సహాయ సహకారాలతో సాధారణ, సాంకేతిక అంశాల్లో పట్టు సాధించేలా రైల్వే యూనివర్సిటీని నెలకొల్పుతామని పేర్కొన్నారు. అరుతే... ఈ వర్సిటీని ఎక్కడ నెలకొల్పుతారనే అంశాన్ని ఆయన నేరుగా ప్రస్తావించలేదు. ప్రతిష్టాత్మాక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)తోపాటు కాకతీయ వర్సిటీ వరంగల్‌లో ఉన్నందున ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుకు కాజీపేట అనువైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. సాధ్యాసాధ్యాలను బట్టి ఈ వర్సిటీని కాజీపేటలో ఏర్పాటు చేసే దిశగా... జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదుగురు ఎంపీలు ఇప్పటి నుంచే కృషి చేయాల్సిన అవసరం ఉంది. మహిళలకు ప్రత్యేక కోచ్‌లు మహిళలకు ప్రత్యేక కోచ్‌లు ప్రవేశపెడుతున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. ప్రయాణికులకు ఎస్ఎంఎస్ ద్వా రా భోజనం అందించనున్నట్లు, రైళ్లలో మహిళల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రైళ్ల లో, రైల్వే స్టేషన్లలో ఆహారం బాగా లేకపోతే వెండర్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని, రైల్వే ఆస్తుల పరిరక్షణ విషయంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పోలీసులకు సెల్ఫోన్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రైల్వే బడ్జెట్ నిరాశపరిచింది... రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి, జిల్లాకు ప్రత్యేక ప్రతిపాదనలు ఏమీ లేవు. రెండు రాష్ట్రాలకు కలిపి కమిటీ వేసినట్లు ప్రకటించడానికే పరిమితమయ్యారు. ఇందులో ఏముంటుందో వారికే తెలియాలి. రైల్వే బడ్జెట్ నిరాశజనకంగా ఉంది. జిల్లాకు సంబంధించిన కాజీపేట కోచ్, వ్యాగన్ ఫ్యాక్టరీలు, డివిజన్ గురించి ఏం తేలలేదు. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి ఒక ప్రిమియర్ రైలు వేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణను పక్కనపెట్టినట్లున్నది. మోడీ తరహా బడ్జెట్ అంటున్నప్పటికీ... మనకు వచ్చిందేమీలేదు. రానున్న రోజుల్లో కేంద్రం... తెలంగాణతో ఇదే తీరుగా వ్యవహరిస్తుందా... అనే అనుమానం కలుగుతోంది. - సీతారాం నాయక్, మహబూబాబాద్ ఎంపీ ప్రస్తావనకు రాని అంశాలు కాజీపేట రైల్వే ఆస్పత్రిని సబ్ డివిజన్ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్, రైల్వే మిక్స్డ్ హైస్కూల్లో సెంట్రల్ సిలబస్ ప్రవేశ పెట్టడం, ఎలక్ట్రిక్, డీజిల్ లోకోషెడ్లలో అప్రెంటీస్ ట్రైనింగ్ సెంటర్, పిరియాడికల్ ఓవరాలింగ్ షెడ్ (పీఓహెచ్) ఏర్పాటు అంశాలు రైల్వే బడ్జెట్లో ప్రస్తావనకే రాలేదు. కాజీపేట జంక్షన్ మీదుగా సికింద్రాబాద్ -గౌహతి వెళ్లే గౌహతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-విశాఖపట్నం వెళ్లే గరీబ్థ్ ్రఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-కాకినాడ ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కాజీపేటలో హాల్టింగ్ కల్పిస్తారని ఆశించిన ప్రయాణికులకు నిరాశే ఎదురైంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ను వారం రోజులు పొడిగిస్తారని అనుకున్నప్పటికీ ఆశాభంగమే మిగిలింది. - కాజీపేట రూరల్ కార్మిక, ప్రజా వ్యతిరేక ప్రాజెక్ట్ రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ రైల్వే కార్మికులు, ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ (పీపీపీ) విధానానికి పెద్దపీట వేశారు. చైనా దేశంలో అనుసరిస్తున్న రైల్వే విధానాన్ని భారత్ రైల్వేలో ప్రవేశపెడతామని, అభివృద్ధి చేస్తామన్న రైల్వే మంత్రి మాటలు సాధ్యమయ్యేవి కావు. కాజీపేట డివిజన్, వ్యాగన్‌షెడ్ ప్రస్తావనకు రాకపోవడం శోచనీయం. ఈ రైల్వే బడ్జెట్లో కార్మికుల సమస్యలు పట్టించుకోలేదు. - కె.శ్రీనివాస్, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ జోనల్ ప్రెసిడెంట్ తెలంగాణ ప్రాజెక్ట్‌లపై స్పష్టత లేదు రైల్వే బడ్జెట్లో తెలంగాణ ప్రాజెక్ట్‌లపై స్పష్టత లేదు. 2010-11 బడ్జెట్లో రైల్వే కార్మికులకు సొంత ఇల్లు కట్టిస్తామని అప్పటి మంత్రి ప్రకటించారు. ఈ రైల్వే బడ్జెట్లోనైనా కార్మికుల సొంతింటి కల నెరవేరుతుందని అనుకున్నారు. కార్మికుల ఆశలు అడియాసలే అయ్యూరుు. కార్మికుల పిల్లలకు ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదు. - దేవులపెల్లి రాఘవేందర్, కాజీపేట రైల్వే జేఏసీ కన్వీనర్ -
బడ్జెట్ రైలు పెండింగ్ ఫైలు!
కాజీపేటకు డివిజన్ హోదాపై చిగురిస్తున్న ఆశలు * వ్యాగన్ నిధుల కేటాయింపు.. కోచ్ ఫ్యాక్టరీ పైనా.. * దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న జిల్లావాసులు * సీఎం కేసీఆర్ దృష్టిసారించడంతో రేకెత్తిన ఆశలు * జిల్లా నుంచి ఐదుగురు ఎంపీల ప్రాతినిధ్యం * ఈ సారి సముచిత స్థానందక్కే అవకాశం సాక్షి, హన్మకొండ : కాజీపేటకు డివిజన్ హోదా... వ్యాగన్ వర్క్‌షాపునకు నిధుల కేటాయింపు... కోచ్ ఫ్యాక్టరీ మంజూరు... ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు ఇవి. గతం సంగతి ఎలా ఉన్నా... నూతన రాష్ట్రం తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం కాజీపేట జంక్షన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల ఎనిమిదో తేదీన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన కసరత్తు ప్రారంభించారు. రైల్వే అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన కాజీపేట అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించడంతో జిల్లా ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నారుు. ఈ క్రమంలో ఈసారి రైల్వే బడ్జెట్ జిల్లాకు అనుకూలంగా ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నారుు. అంతేకాదు... జిల్లా నుంచి రికార్డ్ స్థాయిలో ఐదుగురు ఎంపీలు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభ సభ్యులు గుండు సుధారాణి, రాపోలు ఆనందభాస్కర్, గరికపాటి మోహన్రావుతోపాటు లోక్‌సభ సభ్యులు, కడియం శ్రీహరి, సీతారాంనాయక్ ఉన్నారు. పార్టీలకతీతంగా వీరందరూ కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే బడ్జెట్లో నిధుల కేటారుంపులతోపాటు కొత్త ప్రాజెక్ట్‌లు వస్తాయని జిల్లా ప్రజలు విశ్వసిస్తున్నారు. కాజీపేట డివిజన్ కల నెరవేరేనా... కాజీపేటకు డివిజన్ హోదా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది. హైదరాబాద్ తర్వాత రైల్వే పరంగా కాజీపేట కీలక కేంద్రం. ఈ నేపథ్యంలో కాజీపేట కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలంటూ జూన్‌లో ప్రధాని నరేంద్రమోడీకి సీఎం కేసీఆర్ వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాత్సవతో సమావేశమయ్యారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్, గుంతకల్లు, విజయవాడ, గుంటూరు డివిజన్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేయాల్సి వస్తే విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు దక్షిణ మధ్య రైల్వే నుంచి వేరు చేయాల్సి ఉంటుంది. అప్పుడు దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే మిగులుతాయి. దాదాపుగా తెలంగాణలో రైల్వే పరంగా పాలన అంతా హైదరాబాద్ కేంద్రంగానే జరుగుతుంది. అయితే ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న పెద్దపల్లి-నిజామాబాద్, భద్రాచలంరోడ్డు-కొవ్వూరు రైల్వే లేన్ల నిర్మాణంతోపాటు ప్రతిపాదన దశలో ఉన్న కరీంనగర్-సిద్ధిపేట-మనోహరాబాద్, మణుగూరు-రామగుండం వంటి కీలక ప్రాజెక్టుల పనులు త్వరలో కార్యరూపం దాల్చనున్నాయి. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా కాజీపేట కేంద్రంగా కొత్తగా డివిజన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డివిజన్ హోదా దక్కిన పక్షంలో రాష్ట్రంలో రైల్వే పరంగా అభివృద్ధి కాజీపేట కేంద్రంగా కొత్త పుంతలు తొక్కనుంది. వ్యాగన్‌కు నిధులు మంజూరయ్యేనా... ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో కాజీపేటలో వ్యాగన్ వర్క్‌షాప్ నెలకొల్పేందుకు నాలుగేళ్ల క్రితమే రైల్వే శాఖ అంగీకారం తెలిపింది. గత బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించినా... చివరకు నిరాశే మిగిలింది. అయితే కేంద్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ప్రాజెక్టులు ప్రోత్సహించేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించింది. దీంతో కాజీపేటలో వ్యాగన్ వర్క్‌షాప్‌నకు ఈ సారి నిధులు మంజూరవుతాయని రైల్వే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతకుముందు ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించేందుకు మూడేళ్లకుపైగా సమయం పట్టింది. ప్రస్తుతం అన్ని వివాదాలు దాటి కాజీపేట సమీపంలోని అయోధ్యపురంలో 52 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి గత బడ్జెట్‌కు ముందుగా రైల్వేశాఖకు అప్పగించింది. ఈ మేరకు రైల్వేశాఖ తన వంతుగా నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. కోచ్ ఫ్యాక్టరీకి బీజం పడేనా... ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో తెలంగాణ రాష్ట్రంలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని రైల్వేశాఖను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన హామీని రైల్వేశాఖ అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు అధికారంలో ఉన్నప్పుడు కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరైంది. కానీ... రాజకీయ కారణాలతో ఈ ఫ్యాక్టరీ పంజాబ్‌లోని కపుర్తలాకు తరలిపోరుంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత తిరిగి తెలంగాణ రాష్ట్రంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఈ రైల్‌కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పితే ప్రత్యక్షంగా పది వేల మందికి, పరోక్షంగా మరో 30 వేల మందికి ఉపాధి లభించే అవకాశముంది. కోచ్ ఫ్యాక్టరీ వంటి మదర్ ఇండస్ట్రీ నెలకొనడం వల్ల ప్రైవేట్ రంగంలో అనుబంధ పరిశ్రమలు ఇక్కడికి వచ్చే అవకాశముంది. తద్వారా ఇండస్ట్రియల్ కారిడార్ వేగంగా అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది.