రైల్వే మంత్రిని కోరనున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిధిలోని రైల్వే ప్రాజెక్టులపై రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు సోమవారం భేటీ కానున్నారు. రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హైదరాబాద్ వస్తున్న సురేశ్‌ప్రభు.. కేసీఆర్‌ను సచివాలయంలో కలవనున్నారు.
త్వరలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో జరుగుతున్న ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. వచ్చే బడ్జెట్‌లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని, 13 పెండింగ్ ప్రాజెక్టులపై సానుకూలంగా స్పందించాలని కోరనున్నారు. ముఖ్యంగా కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్, కాజీపేటకు రైల్వే డివిజన్ హోదా అంశాలను ప్రస్తావించనున్నట్లు సమాచారం.
నేడు 2 కొత్త రైళ్ల ప్రారంభోత్సవం
గత రైల్వే బడ్జెట్‌లో చోటు దక్కించుకున్న సికింద్రాబాద్-విశాఖ ఏసీ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో సురేశ్‌ప్రభు జెండాఊపి ప్రారంభించనున్నారు. అలాగే నాందెడ్-ఔరంగాబాద్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ఇక్కడి నుంచే రిమోట్ వీడియో లింక్ ద్వారా ప్రారంభించనున్నారు. అనంతరం రైల్వేలో పీపీపీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనే అంశంపై నిర్వహించే జాతీయ సదస్సులో పాల్గొననున్నారు.
రాష్ట్ర ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వండి
Published Mon, Jan 19 2015 1:42 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM
Advertisement
Advertisement