కోస్ట్‌గార్డు విమాన శకలాలు లభ్యం
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై కోస్ట్‌గార్డ్ విమానం తీరని విషాదాన్ని మిగిల్చింది. ఇద్దరు పెలైట్లు, ఒక అసిస్టెంట్ కమాండర్‌ను పొట్టనపెట్టుకుని కుటుంబసభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. చెన్నైలో గత నెల 8వ తేదీన అదృశ్యమైన కోస్ట్‌గార్డ్ విమానం సముద్రంలో కూలిపోయిందని, ముగ్గురు అధికారుల ఎముకలు, విమాన శకలాలు దొరికాయని ఇండియన్ కోస్ట్‌గార్డ్ (తూర్పు) ఐజీ సత్యప్రకాష్ శర్మ సోమవారం రాత్రి అధికారికంగా ప్రకటించారు.
అయితే డీఎన్ఏ పరీక్షలు తరువాతనే అధికారులు ప్రాణాలతో ఉన్నారా లేదా అనే అంశాన్ని అధికారికంగా నిర్ధారిస్తామని స్పష్టం చేశారు. కూలిన కోస్ట్‌గార్డ్ విమానానికి చెందిన 80 శాతం శకలాలు లభ్యమైనందున గాలింపును నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.