COC
-
అనిల్ అంబానీ రాజీనామా తిరస్కరణ
న్యూఢిల్లీ: దివాలా స్మృతి కింద చర్యలు ఎదుర్కొంటున్న టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) డైరెక్టర్‌గా అనిల్ అంబానీ రాజీనామా చేయడాన్ని రుణదాతల కమిటీ (సీవోసీ) తిరస్కరించింది. ఆయనతో పాటు మరో నలుగురు డైరెక్టర్ల రాజీనామాలను కూడా తోసిపుచ్చింది. నవంబర్ 20న జరిగిన సమావేశంలో సీవోసీ ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు కంపెనీ తెలియజేసింది. ఆర్‌కామ్ డైరెక్టర్లుగా కొనసాగాలని, దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించి పరిష్కార నిపుణునికి అవసరమైన సహాయ, సహకారాలు అందించాలని సీవోసీ సూచించినట్లు వివరించింది. స్వీడన్‌కు చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ పిటీషన్ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఆర్కామ్పై దివాలా ప్రక్రియ జరుగుతున్న సంగతి తెలిసిందే. రుణాలిచి్చన బ్యాంకులు, ఆరి్థక సంస్థల క్లెయిమ్ ప్రకారం ఆర్‌కామ్ దాదాపు రూ. 49,000 కోట్లు బాకీ పడింది. -
12,000 దివాలా కేసులు దాఖల్డు
న్యూఢిల్లీ: దివాలా చట్టం అమలు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు 12,000 కేసులు దాఖలయ్యాయని కంపెనీ వ్యవహారాల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ తెలిపారు. వీటిల్లో రూ.2 లక్షల కోట్ల సొమ్ములతో ముడిపడిన 4,500 కేసులు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. 1500 కేసులను విచారించనున్నారని, మరో 6,000 కేసులు విచారణ కోసం వరుసలో వేచి ఉన్నాయని వివరించారు. కేసుల పరిష్కారానికి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ) చివరి అవకాశమని పేర్కొన్నారు. దివాలా కేసుల పరిష్కారానికి ఎన్సీఎల్టీ సాహసోపేతంగా వ్యవహరిస్తోందని వివరించారు. సీఐఐ, బ్రిటిష్ హై కమిషన్ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రికవరీలో మంచి ఫలితాలు.... పెద్ద కేసులు పరిష్కారం కావడానికి 270కి మించిన రోజులు పడుతోందని, కొన్ని కేసులకు దీనికి రెట్టింపు సమయం కూడా పట్టొచ్చని, అయితే రికవరీ విషయంలో మంచి ఫలితాలే వస్తున్నాయని వివరించారు. ఎస్సార్ కేసు విషయంలో రూ.42,000 కోట్లు రికవరీ అయ్యాయని తెలిపారు. ఐబీసీ అమల్లోకి రాకముందు పెద్ద కేసుల పరిష్కారానికి నాలుగు నుంచి ఐదేళ్లు పట్టేదని, ఇప్పుడు ఒకటి, రెండేళ్లలోనే కేసులు పరిష్కారమవుతున్నాయన్నారు. సీఒసీ కీలక పాత్ర.... దివాలా ప్రక్రియలో రుణదాతల కమిటీ(సీఓసీ)ది కీలకమైన బాధ్యత అని ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ)చైర్మన్ ఎమ్.ఎస్. సాహూ వ్యాఖ్యానించారు. కంపెనీ మనుగడ సాగిస్తుందో, లేదో గుర్తించడం, తగిన రిజల్యూషన్ ప్లాన్‌ను రూపొందించడం వంటి కీలక బాధ్యతలను సీఓసీ నిర్వర్తించాల్సి ఉంటుందని వివరించారు. -
విదేశాల్లో పనిచేసే ఉద్యోగులకు ఆన్లైన్లోనే సీవోసీ
న్యూఢిల్లీ: విదేశాల్లో వ్యవస్థీకృత రంగంలో పనిచేసే భారతీయ ఉద్యోగులు ఇకపై భవిష్య నిధి (పీఎఫ్) ఖాతాకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లోనే సమర్పించి సర్టిఫికెట్ ఆఫ్ కవరేజ్(సీవోసీ)ని పొందవచ్చు. పనిచేస్తున్న దేశంలో సామాజిక భద్రతా పథకాలను పొందేందుకు అవసరమైన సీవోసీని 3 రోజుల్లోనే ఆన్లైన్లో తీసుకోవచ్చు. దరఖాస్తుదారులు తమ పేర్లు, పీఎఫ్ ఖాతాల వివరాలు, సీవోసీ కాలపరిమితి వంటి వివరాలను తప్పులు లేకుండానే ఆన్లైన్లో సమర్పించేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ను మెరుగుపర్చినట్లు ఈ మేరకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) ఓ సర్క్యులర్‌లో వెల్లడించింది. ఆన్లైన్లో దరఖాస్తులు నింపిన తర్వాత వాటిని డౌన్లోడ్ చేసుకుని, యాజమాన్యం సంతకంతో రీజినల్ పీఎఫ్ కమిషనర్‌కు ఆన్లైన్లోనే సమర్పించి సీవోసీ పొందవచ్చని తెలిపింది. కాగా ఈపీఎఫ్‌వో ఆధ్వర్యంలోని సామాజిక భద్రతా పథకాలు ఇతర దేశాల్లోని వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న భారతీయులు కూడా పొందేందుకు వీలుగా ఈపీఎఫ్‌వో పలు దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం బెల్జియం, జర్మనీ, స్విట్జర్లాండ్, డెన్మార్క్, లక్సెంబర్గ్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, హంగరీ దేశాల్లోని భారతీయులకు ఈ అవకాశం అందుబాటులో ఉంది. అయితే ఈ ప్రయోజనం పొందాలంటే ఉద్యోగులు అక్కడి అధికారులకు సీవోసీ సమర్పించాల్సి ఉంటుంది.