coffiee
-
అయ్యయ్యో..తప్పై పోయింది క్షమించండి..!
ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన కాఫీ తాగుతున్నారా? అయితే ఒక్క క్షణం. కాఫీ తాగే ముందు చెక్ చేసుకొని తాగండి. లేదంటే కాఫీ బదులు చికెన్ ముక్కల్ని తినాల్సి వస్తుంది. ఏం నమ్మడం లేదా? ఢిల్లీకి చెందిన సుమిత్ కాఫీ తాగి రిలాక్స్ అవ్వాలని అనుకున్నాడు. అందుకే 10 నిమిషాల్లో డెలివరీ చేసే జొమాటోలో కాఫీ ఆర్డర్ పెట్టాడు. ఇలా ఆర్డర్ పెట్టాడో లేదో థర్డ్ వేవ్ ఇండియా అనే తన రెగ్యులర్ ప్లేస్‌లో ఒక బ్రాంచి నుండి కాఫీ ఇలా వచ్చేసింది. వేడి వేడి కాఫీని తన భార్యతో కూర్చొని తాగుతున్నాడు. ఆ కాఫీ తాగే సమయంలో చికెన్ ముక్క బయట పడడంతో సుమిత్, అతని భార్య షాక్ తిన్నారు. దీంతో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్వీట్టర్లో షేర్ చేశాడు. Ordered coffee from @zomato , (@thirdwaveindia ) , this is too much . I chicken piece in coffee ! Pathetic . My association with you officially ended today . pic.twitter.com/UAhxPiVxqH — Sumit (@sumitsaurabh) June 3, 2022 "@జొమాటో, @థర్డ్ వేవ్ నుంచి కాఫీని ఆర్డర్ చేశాను. ఇది చాలా దారుణం. కాఫీలో ఒక చికెన్ ముక్క కనిపించింది. మీతో నా అనుబంధం ఈరోజుతో అధికారికంగా ముగిసింది" అని పోస్ట్‌లో పేర్కొన్నారు.దీంతో తప్పై పోయింది క్షమించండి అంటూ జొమాటో ఆయనను క్షమాపణలు కోరింది. జరిగిన పొరపాటుకు విచారం వ్యక్తం చేస్తూ ఆ వ్యక్తికి ప్రో మెంబర్ షిప్‌ను అందిస్తామని ఆఫర్ చేసింది. అతని వివరాలను షేర్ చేయమని కోరింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను సుమిత్ పోస్ట్ చేశారు.ఈ ఇన్సిడెంట్‌పై నెటిజన్లు జొమాటోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. I am really curious, how in the world, coffee which is prepared in a very different counter/machine has chicken piece in it? Unless it is deliberately done. — Lutyens' Rasputin™ (@hujodaddy1) June 3, 2022 మెషిన్లో తయారు చేసే కాఫీలోకి చికెన్ ముక్కలు ఎలా వస్తాయి. ఇది కావాలనే ఎవరో చేశారని ఓ నెటిజన్ అనుమానం వ్యక్తం చేశాడు I can feel this .. I am a Vegetarian too and if this would have happened with me.. I would never have ordered anything from this store — IDidNotCodeThis (@dreamersan18) June 3, 2022 నేను శాఖా హారిని సుమిత్‌కు జరిగినట్లు నాకు జరిగితే.. ఇక ఆర్డర్ పెట్టడం మానేస్తానంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు -
కాఫీ తాగడంపై జన్యు ప్రభావం
స్కాట్లాండ్: మన చుట్టూవున్న వాతావరణం చలి, చలిగా ఉన్నప్పుడు వేడి వేడి కాఫీ తాగాలని అనిపించడం ఎవరికైనా అనుభవమే. అయితే కొందరు తక్కువ తాగుతారు. కొందరు ఎక్కువ కప్పులు తాగుతారు. మరి కొందరు గబ,గబా తాగేస్తారు. ఇంకొందరు అసలే తాగరు. కాఫీ తాగడంలో వ్యక్తికి, వ్యక్తికి మధ్య వ్యత్యాసానికి కారణం ఏమిటీ? మన అలవాట్లా, మన ప్రవర్తనా? ఇదే అంశాన్ని తేల్చుకుందామని ఎడిన్బర్గ్ యూనివర్శిటీకి చెందిన ‘యుషర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ హెల్త్ సెన్సైస్ ఇన్ఫార్మిటిక్స్’కు చెందిన నిపుణులు పరిశోధనలు చేశారు. మానవ డీఎన్ఏలో ఉండే ‘పీడీఎస్‌ఎస్2’ అనే జన్యు రకం మానవులు కాఫీ తాగడాన్ని ప్రభావితం చేస్తోందని, ఈ జన్యువును కలిగిన వారు అది లేనివారికన్నా తక్కువ కప్పుల కాఫీ తాగుతారని పరిశోధనల్లో తేలింది. మరో విధంగా చెప్పాలంటే కాఫీ తాగడాన్ని ఈ జన్యువు నియంత్రిస్తుంది. మన ఆహారపు అలవాట్లు, రుచులకు మనలోని జన్యువులకు ప్రత్యక్ష సంబంధం ఉంటుందని శాస్త్రవేత్తలు ఎప్పుడో కనిపెట్టినప్పటికీ కాఫీ తాగే అలవాటుపై జన్యువుల ప్రభావం ఎలా ఉంటుందో విఫులంగా పరిశోధించడం దాదాపు ఇదే మొదటిసారి. దక్షిణ ఇటలీలోని 370 మంది, ఈశాన్య ఇటలీకి చెందిన 843 మంది కాఫీ తాగే అలవాటున్న వారి డీఎన్ఏలోని జన్యువుల క్రమాన్ని శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. పీడీఎస్‌ఎస్ 2 రకం జన్యువు ఉన్నవారు తక్కువ కప్పుల టీ తాగగా ఇది లేని వారు ఎక్కువ కప్పుల టీ తాగుతున్నట్లు తేలింది. నెదర్లాండ్స్‌కు చెందిన 1731 మందిపై కూడా ఈ పరిశోధనలు జరపగా ఒకే రకమైన ఫలితాలు వచ్చాయి. అసలు టీ అనేది తాగడానికి పరిస్థితులు, పరిసరాలు, సంస్కృతి, అలవాటు కారణం అనే విషయం తెల్సిందే. అయితే కాఫీ ఎక్కువ, తక్కువ తాగడానికి మానవ జీర్ణక్రియకున్న ప్రత్యక్ష సంబంధం ఏమిటో తెలుసుకునేందుకు ఈ అంశంలో మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కాఫీ తాగే అలవాటు మనుషుల్లో ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటుందన్న విషయం తెల్సిందే. అమెరికాలో 65 శాతం మంది ప్రజలు రోజుకు ఒక్క కప్పయిన కాఫీ తాగుతారు.