Zomato Responds Man Orders Coffee Finds Piece Of Chicken - Sakshi
Sakshi News home page

Piece Of Chicken in Coffee: ఆన్‌లైన్‌లో కాఫీ ఆర్డర్‌, కంగుతిన్న సుమిత్‌!

Published Sun, Jun 5 2022 9:39 AM | Last Updated on Sun, Jun 5 2022 12:50 PM

Zomato Respond Man Orders Coffee Finds Piece Of Chicken - Sakshi

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టిన కాఫీ తాగుతున్నారా? అయితే ఒక్క క్షణం. కాఫీ తాగే ముందు చెక్‌ చేసుకొని తాగండి. లేదంటే కాఫీ బదులు చికెన్‌ ముక్కల్ని తినాల్సి వస్తుంది. ఏం నమ్మడం లేదా?

ఢిల్లీకి చెందిన సుమిత్‌ కాఫీ తాగి రిలాక్స్‌ అవ్వాలని అనుకున్నాడు. అందుకే 10 నిమిషాల్లో డెలివరీ చేసే జొమాటోలో కాఫీ ఆర్డర్‌ పెట్టాడు. ఇలా ఆర్డర్‌ పెట్టాడో లేదో థర్డ్‌ వేవ్‌ ఇండియా అనే తన రెగ్యులర్‌ ప్లేస్‌లో ఒక బ్రాంచి నుండి కాఫీ ఇలా వచ్చేసింది. వేడి వేడి కాఫీని తన భార్యతో కూర్చొని తాగుతున్నాడు. ఆ కాఫీ తాగే సమయంలో చికెన్‌ ముక్క బయట పడడంతో సుమిత్, అతని భార్య షాక్‌ తిన్నారు. దీంతో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్వీట్టర్‌లో షేర్‌ చేశాడు.

"@జొమాటో, @థర్డ్‌ వేవ్‌ నుంచి కాఫీని ఆర్డర్ చేశాను. ఇది చాలా దారుణం. కాఫీలో ఒక చికెన్ ముక్క కనిపించింది. మీతో నా అనుబంధం ఈరోజుతో అధికారికంగా ముగిసింది" అని పోస్ట్‌లో పేర్కొన్నారు.దీంతో తప్పై పోయింది క్షమించండి అంటూ జొమాటో ఆయనను క్షమాపణలు కోరింది. జరిగిన పొరపాటుకు విచారం వ్యక్తం చేస్తూ ఆ వ్యక్తికి ప్రో మెంబర్ షిప్‌ను అందిస్తామని ఆఫర్ చేసింది. అతని వివరాలను షేర్ చేయమని కోరింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను సుమిత్ పోస్ట్ చేశారు.ఈ ఇన్సిడెంట్‌పై నెటిజన్లు జొమాటోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మెషిన్‌లో తయారు చేసే కాఫీలోకి చికెన్‌ ముక్కలు ఎలా వస్తాయి. ఇది కావాలనే ఎవరో చేశారని ఓ నెటిజన్‌ అనుమానం వ్యక్తం చేశాడు

నేను శాఖా హారిని సుమిత్‌కు జరిగినట‍్లు నాకు జరిగితే.. ఇక ఆర్డర్‌ పెట్టడం మానేస్తానంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement