coffiee shop
-
అయ్యయ్యో..తప్పై పోయింది క్షమించండి..!
ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన కాఫీ తాగుతున్నారా? అయితే ఒక్క క్షణం. కాఫీ తాగే ముందు చెక్ చేసుకొని తాగండి. లేదంటే కాఫీ బదులు చికెన్ ముక్కల్ని తినాల్సి వస్తుంది. ఏం నమ్మడం లేదా? ఢిల్లీకి చెందిన సుమిత్ కాఫీ తాగి రిలాక్స్ అవ్వాలని అనుకున్నాడు. అందుకే 10 నిమిషాల్లో డెలివరీ చేసే జొమాటోలో కాఫీ ఆర్డర్ పెట్టాడు. ఇలా ఆర్డర్ పెట్టాడో లేదో థర్డ్ వేవ్ ఇండియా అనే తన రెగ్యులర్ ప్లేస్‌లో ఒక బ్రాంచి నుండి కాఫీ ఇలా వచ్చేసింది. వేడి వేడి కాఫీని తన భార్యతో కూర్చొని తాగుతున్నాడు. ఆ కాఫీ తాగే సమయంలో చికెన్ ముక్క బయట పడడంతో సుమిత్, అతని భార్య షాక్ తిన్నారు. దీంతో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్వీట్టర్లో షేర్ చేశాడు. Ordered coffee from @zomato , (@thirdwaveindia ) , this is too much . I chicken piece in coffee ! Pathetic . My association with you officially ended today . pic.twitter.com/UAhxPiVxqH — Sumit (@sumitsaurabh) June 3, 2022 "@జొమాటో, @థర్డ్ వేవ్ నుంచి కాఫీని ఆర్డర్ చేశాను. ఇది చాలా దారుణం. కాఫీలో ఒక చికెన్ ముక్క కనిపించింది. మీతో నా అనుబంధం ఈరోజుతో అధికారికంగా ముగిసింది" అని పోస్ట్‌లో పేర్కొన్నారు.దీంతో తప్పై పోయింది క్షమించండి అంటూ జొమాటో ఆయనను క్షమాపణలు కోరింది. జరిగిన పొరపాటుకు విచారం వ్యక్తం చేస్తూ ఆ వ్యక్తికి ప్రో మెంబర్ షిప్‌ను అందిస్తామని ఆఫర్ చేసింది. అతని వివరాలను షేర్ చేయమని కోరింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను సుమిత్ పోస్ట్ చేశారు.ఈ ఇన్సిడెంట్‌పై నెటిజన్లు జొమాటోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. I am really curious, how in the world, coffee which is prepared in a very different counter/machine has chicken piece in it? Unless it is deliberately done. — Lutyens' Rasputin™ (@hujodaddy1) June 3, 2022 మెషిన్లో తయారు చేసే కాఫీలోకి చికెన్ ముక్కలు ఎలా వస్తాయి. ఇది కావాలనే ఎవరో చేశారని ఓ నెటిజన్ అనుమానం వ్యక్తం చేశాడు I can feel this .. I am a Vegetarian too and if this would have happened with me.. I would never have ordered anything from this store — IDidNotCodeThis (@dreamersan18) June 3, 2022 నేను శాఖా హారిని సుమిత్‌కు జరిగినట్లు నాకు జరిగితే.. ఇక ఆర్డర్ పెట్టడం మానేస్తానంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు -
ఫొటోలు తీసింది ఆయనే ..!
*రాష్ట్ర ప్రభుత్వానికి సీఐడీ నివేదిక *స్పష్టం చేసిన సీఐడీ డీజీపీ బిపిన్ గోపాలకృష్ణ *ఔరాద్కర్‌కు క్లీన్చిట్ ! *న్యాయ పోరాటం చేస్తాం : రవీంద్రనాథ్ *ఎస్ఐ రవిపై చర్యలకు సిఫార్సు బెంగళూరు : ఏడీజీపీ డాక్టర్ రవీంద్రనాథ్‌పై వచ్చిన ఆరోపణలు వాస్తవ రూపును దాలుస్తున్నాయి. ఇందుకు రాష్ట్ర సీఐడీ ఇచ్చిన నివేదికలు అదే స్పష్టం చేస్తున్నాయి. గతనెల ఓ కాఫీ షాప్‌లో యువతుల ఫొటోలు తీశారని కేఎస్ఆర్పీ ఏడీజీపీ రవీంద్రనాథ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌసిక్ ముఖర్జీకి ఐదు పేజీల నివేదిక సమర్పించామని సీఐడీ డీజీపీ బిపిన్ గోపాలకృష్ణ స్పష్టం చేశారు. మే 26న ఉదయం బెంగళూరులోని కన్నింగ్హ్యాం రోడ్డులోని ఓ కాఫీ షాప్‌లోకి వచ్చిన కేఎస్‌ఆర్‌సీ ఏడీజీపీ రవీంద్రనాథ్ పక్క టేబుల్లో కూర్చున్న యువతిని ఫొటోలు తీశారనే ఆరోపణ తీవ్ర దుమారం రేగింది. కాగా ఆయనపై హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర సంచలనం రేగడంతో రాష్ట్ర ప్రభుత్వం కేసు విచారణ మొత్తం సీఐడీకి అప్పగించింది. కేసును ఆది నుంచి జాగ్రత్తగా విచారణ చేసిన సీఐడీ పోలీసులు రవీంద్రనాథ్ మొబైల్‌ను గుజరాత్ గాంధీనగర్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అంతకు ముందు ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసు నగర పోలీస్ కమిషనర్ ఔరాద్కర్‌తో పాటు డీసీపీ రవికాంత్ గౌడ కూడా విచారణ ఎదుర్కొన్నారు. అయితే సీఐడీ పోలీసులు ఔరాద్కర్‌కు క్లీన్చిట్ ఇచ్చారు. ఏడీజీపీని ఎవ్వరూ లాకప్‌లో వేయలేదని, ఆయనే లాకప్‌లోకి వెళ్లారని సీఐడీ నివేదికలో పేర్కొంది. ఇదిలా ఉంటే రవీంద్రనాథ్‌పై హైగ్రౌండ్స్ పోలీసులు సెక్షన్ 354, 506, 509 కింద కేసులు నమోదు చేశారు. అయితే సీఐడీ అధికారులు సమర్పించిన నివేదికలో సెక్షన్ 509 మాత్రమే రవీంద్రనాథ్‌పై కేసు నమోదు చెయ్యాలని సిఫార్సు చేసింది. ఎస్ఐని సస్పెండ్ చెయ్యండి : సీఐడీ *ఈ కేసు విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన హైగ్రౌండ్స్ పీఎస్ ఎస్ఐ రవిపై చర్యలు తీసుకోవాలని సీఐడీ నివేదికలో పేర్కొంది. ఉన్నతాధికారి అని తెలిసి కూడా దురుసుగా వ్యవహరించాడని అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. కోర్టును ఆశ్రయిస్తాం : న్యాయవాదులు * ఏడీజీపీ రవీంద్రనాథ్‌పై నమోదైన సెక్షన్ 354, 506లను సీఐడీ అధికారులు తొలగించారని, ఈ కేసు నుంచి ఆయనను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని బాధితురాలి న్యాయవాదులు పేర్కొన్నారు. కోర్టును ఆశ్రయిస్తామన్నారు. నేను ఫొటోలు తియ్యలేదు : ఏడీజీపీ *యువతి ఫొటోలు తాను తియ్యలేదని ఏడీజీపీ రవీంద్రనాథ్ అంటున్నారు. అనవసరంగా తనపై కేసు నమోదు చేశారని, కోర్టును ఆశ్రయిస్తామని రవీంద్రనాథ్ స్పష్టం చేశారు.