Coimbatore district
-
తమిళనాడు కోయంబత్తూరులో హై అలర్ట్
-
వాట్సాప్ యాడ్.. హీలర్ భాస్కర్ అరెస్ట్
కోయంబత్తూర్: ప్రకృతి వైద్యం పేరిట ప్రజలను మభ్య పెడుతున్న హీలర్ భాస్కర్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 26న నిట్శాయ్ ట్రెయినింగ్ సెంటర్లో భారీ ఎత్తున్న వర్క్షాపు నిర్వహించేందుకు భాస్కర్ ప్రజలకు పిలుపునిచ్చాడు. ప్రసవం సమయంలో వైద్యులు అవసరం లేకుండా.. సహజ పద్ధతిలోనే కాన్పులు చేయొచ్చన్న అంశం అవగాహన కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు వాట్సాప్ గ్రూప్లలో వైరల్ చేశాడు. ఈ నేపథ్యంలో యాడ్లు ఇండియన్ మెడికల్ అసోషియేషన్ దృష్టికి చేరటంతో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఆరోగ్యశాఖ దర్యాప్తునకు ఆదేశించింది. అతని చర్యలు అనైతికమని.. జనాల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తున్నాయని, ప్రమాదకరమైన వైద్య విధానాన్ని భాస్కర్ అవలంభిస్తున్నాడని ఐఎంఏ వాదిస్తోంది. సివిల్ ఇంజనీరింగ్ చదివిన భాస్కర్.. గత కొన్నేళ్లుగా ప్రాణిక్ హీలింగ్, సహజ పద్ధతులంటూ వంద సంఖ్యలో పెషంట్లకు చికిత్స చేశాడు. పలు టీవీ షోల్లో కూడా అతను పాల్గొంటుడటం విశేషం. ప్రసవానికి సంబంధించిన వీడియోలు చూసి ఈ మధ్యే తిరువూరుకు చెందిన కీర్తిక(28) అధిక రక్తస్రావంతో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కూడా ఏఎంఏ దర్యాప్తుకు ఆదేశించింది. యూట్యూబ్లో వీడియోలు చూస్తూ... -
అక్కడ టీవీలున్నాయి, కరెంట్ లేదు!
కోయంబత్తూరు: ఆ ఊళ్లలో టీవీలు, ఫ్యాన్లు, గ్రైండర్లు ఉన్నాయి కరెంట్ తప్ప. ఇదేలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా? మన రాజకీయ పార్టీల ఊకదంపుడు వాగ్దానాలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేకపోకపోవడంతో ఇలాంటి సిత్రాలు సాధ్యమవుతున్నాయి. కరెంట్ లేకపోయినా విద్యుత్ లో పనిచేసే వస్తువులు అక్కడకు ఎలా వచ్చాయో తెలుసుకోవాలంటే తమిళనాడులోని సెంబుక్కరై, తూమనూర్ గ్రామాలకు వెళ్లాల్సిందే. కోయంబత్తూరు జిల్లాలోని కొండ ప్రాంతంలో ఉన్నఈ రెండు గిరిజన గ్రామాలకు స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి విద్యుత్ సౌకర్యం లేదు. కాదుకాదు మన పాలకులు కల్పించలేదు. కవుందంపలయమ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఈ గ్రామాలకు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రాజకీయ నాయకులు వచ్చారు, హామీలు ఇచ్చి వెళ్లారు. కానీ ఇప్పటివరకు కరెంట్ మాత్రం రాలేదు. అయితే గత 10 ఏళ్లలో డీఎంకే, అన్నాడీఎంకే ఉచిత కానుకలు ఇచ్చాయి. కరుణానిధి కలర్ టీవీ ఇస్తే, 'అమ్మ' గ్రైండర్లు కరుణించింది. కరెంట్ లేకుండా ఇవేం చేసుకోమని గ్రామస్తులు వాపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. నాయకులను ఎన్నిసార్లు వేడుకున్నా కరెంట్ మాత్రం రాలేదని అమాయక పల్లెజనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సెంబుక్కరైలో 45 కుటుంబాలు, తూమనూర్ లో 110 కుటుంబాలు చీకటిలోనే మగ్గుతున్నాయి. పశ్చిమ కోయంబత్తూరుకు కూతవేటు దూరంలో ఉన్నా తమ బతుకుల్లో వెలుగులు లేవని గిరిజన ప్రజలు వాపోతున్నారు. కిరోసిన్ దీపాలతో చీకటిని ఛేదించే ప్రయత్నం చేస్తున్నామని, కరెంట్ లేకపోవడంతో పిల్లలకు చదువులకు చాలా ఇబ్బంది కలుగుతోందని సెంబుక్కరై గ్రామానికి చెందిన కె. రంగమ్మ తెలిపింది. కరెంట్ ఇవ్వండి మహాప్రభో అని ఎన్నిసార్లు మొత్తుకున్నా పాలకులు పెడచెవిన పెట్టారని, ఇక ఆందోళనకు దిగడమే తమ ముందున్న మార్గమని ఆమె వెల్లడించింది. -
అన్నాడీఎంకేను సాగనంపండి!
టీనగర్: డీఎంకే ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చేందుకు అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని సాగనంపాలని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ప్రజలకు పిలుపునిచ్చారు. స్టాలిన్ శుక్రవారం కోయంబత్తూరు జిల్లాలో ప్రచారం చేశారు. శనివారం నీలగిరి జిల్లా, కున్నూరులోను, సాయంత్రం ఈరోడ్ జిల్లాలోను ప్రచారం జరిపారు. సత్యమంగళం బస్టాండ్లో భవానిసాగర్ నియోజకవర్గం డీఎంకే అభ్యర్థి సత్య, కచ్చేరిమేడులో గోపి నియోజకవర్గం అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి శరవణన్, అందియూరు డీఎంకే అభ్యర్థి వెంకటాచలం, మొడకురిచ్చిలో డీఎంకే అభ్యర్థి సచ్చిదానందం, పెరుందురైలో డీఎంకే అభ్యర్థి కేపీ స్వామిలకు మద్దతుగా ప్రసంగించారు. ఈరోడ్ వెస్ట్ నియోజకవర్గం డీఎంకే అభ్యర్థి ముత్తుసామి, ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గం మక్కల్ డీఎండీకే అభ్యర్థి చంద్రకుమార్కు మద్దతుగా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొందరు తామే బడా నాయకులమని చెప్పుకుంటూ ప్రజల గుర్తింపునకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. వారు ఎవరనే విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. 2011లో జయలలితను ముఖ్యమంత్రి పదవిలో అధిష్టింపచేసిన వ్యక్తుల్లో చంద్రకుమార్ కూడా ఒకరన్నారు. అప్పట్లో తాను పెద్ద పొరపాటు చేసినట్లు ప్రస్తుతం ఆయన ఒప్పుకుంటున్నట్లు తెలిపారు. గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి జయలలిత ఒక్క రోజైనా ఈరోడ్ను సందర్శించారా? అన్ని ప్రశ్నించారు. జయ ఉత్తర్వుల ప్రకారం నాడు శశిపెరుమాళ్ ప్రాణాలను కాపాడేందుకు విఫలమైన పోలీసు శాఖ అధికారులు, నేడు మనసు మార్చుకుని తమ వైపు వస్తున్నట్లు తెలిపారు. తదుపరి డీఎంకే అధికారం చేపట్టడం ఖాయమన్న భావనతో వారు అప్రమత్తమైనట్లు తెలిపారు. కరుణానిధి వడ్డితో కలిపి విద్యారుణాన్ని మాఫీ చేయనున్నట్లు ప్రకటించారన్నారు. ప్రస్తుతం ఉన్న అమ్మ క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్ల పేరిట ఆధునీకరించి అప్గ్రేడ్ చేస్తారని అన్నారు. రాష్ట్ర స్థాయిలో కాకుండా నియోజకవర్గం స్థాయిలో కరుణానిధి ఎన్నికల మేనిఫెస్టో రూపొందించారని, ప్రజలందరి కోర్కెలు నెరవేర్చబడతాయన్నారు. అందుకు ప్రజలంతా చేయాల్సింది అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమేనన్నారు.