Coke
-
ఆపిల్, ఎయిర్టెల్ సహా కంపెనీలకు చుక్కెదురు
న్యూఢిల్లీ: ప్రకటనల వాచ్ డాగ్ ఆస్కి(ఎడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) దిగ్గజ కంపెనీలకు షాకిచ్చింది. ముఖ్యంగా టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్, స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఆపిల్, కోకా కోలా ఇండియా సహా 143 కంపెనీలు తప్పుదోవపట్టించే ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించింది. ఇలాంటి ప్రకటనల్లో నిజాయితీ లేదనీ భారతీయ ప్రమాణాల మండలి తేల్చి చెప్పింది. ఇవి వాస్తవదూరంగా, ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. మొత్తం 191 ఫిర్యాదులు అందగా వీటిని పరిశీలించిన అనంతరం 143 ప్రకటనలను ఎడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తప్పు బట్టింది. దేశంలో అత్యంత భద్రత గల ఈ వాలెట్ గా ప్రచారం చేసుకుంటున్న డిజిటల్ పేమెంట్ సంస్థ మొబీ క్విక్ కు కూడా ఆస్కి షాకిచ్చింది. వీటితోపాటు హెచ్‌యుఎల్, నివియా, అమూల్, ఒపెరా, స్టాండర్ట్స్ చార్టర్బ్యాంక్ , ఒపెరా, పెర్నాడ్ రికార్డ్ తదితర 191 కంపెనీలపై కస్టమర్ కస్టమర్ ఫిర్యాదుల కౌన్సిల్ రెగ్యులేటరీ కి ఫిర్యాదు చేసింది. వినియోగదారుల ఫిర్యాదుల ఆధారంగా కంపెనీలు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నాయన్నవాదనలను ఆస్కి సమర్ధించింది. వీటిల్లో ఆరోగ్య కేటగిరిలో 102 ఫిర్యాదులు, ఎడ్యుకేషన్ కేటగిరీలో 20, పెర్సనల్ కేర్ రంగంలో 7, ఆహారం, పానీయాలు మరియు ఇతర వర్గాలకు చెందిన ఎనిమిది ఫిర్యాదులను అంగీకరించింది. ముఖ్యంగా ఐ ఫోన్ 7 వేరియంట్ తప్పుడు ఇమేజ్‌తో ప్రచారం చేస్తోందని ఆరోపించింది. దీంతోపాటు ఇంకా 143 ఇతర ఫిర్యాదులను ఆస్కి అంగీకరించింది. వీటిల్లో కోకాకాలా థమ్స్యాప్, ఎయిర్ టెల్ ఉచిత ఆఫర్లు ఉన్నాయి. ప్రముఖ టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్టెల్ వ్యతిరేకంగా మూడు ఫిర్యాదులను ఆస్కి సమర్థించింది. ఎయిర్టెల్-వీ ఫైబర్ అప్‌గ్రేడ్ ద్వారా ఉచిత కాల్స్ స్థానిక + లోకల్ అనే ప్రకటన తప్పుదారి పట్టించేదిగా ఉందని వాదించింది. వినియోగదారుల దృష్టినుంచి ఇది ఫ్రీ ఆఫర్ కాదని, రూ.149 చార్జ్ చేయడంతోపాటు, 500 ఎంబీ డేటా బదులుగా 300 ఎంబీ డేటా మాత్రమే లభిస్తోందని పేర్కొంది. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి ఎయిర్ టెల్ నిరాకరించింది. ఎఫ్ఎంసీజీ మేజర్ హెచ్‌యుఎల్ రిన్యాంటి బాక్టీరియాపై ప్రకటనను ఆస్కి తప్పుబట్టింది. అయితే ఈ అభ్యంతరాలపై స్పందించిన సంస్థ ఆస్కి నిబంధనలను, సూచనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది. కోకా కోలా ప్రకటన వివాదాస్పందంగా ఉందని, ప్రమాదకరమైన ప్రాక్టీస్‌కు దారితీస్తుందని, దీన్ని వీక్షకులు ఆచరించకూడదని రెగ్యులేటరీ చెప్పింది. అయితే మొత్తం ప్రకటన అభ్యంతరకరంగా లేనప్పటికీ ప్రమాదకరమైన పద్ధతులను, నిర్లక్ష్యాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పింది. దీనిపై కోకా కోలా భారతదేశం ప్రతినిధి స్పందించారు. ఫిర్యాదుల మేరకు ప్రకటనను సరిచేస్తున్నట్టు తెలిపింది. టీవీ,డిజిటల్ మీడియాలో ఈ ప్రకటనను అప్డేట్ చేసినట్టు చెప్పింది. మెబీక్విక్ "అతిశయోక్తులతో తప్పుదారి" పట్టిస్తోందని గుర్తించినట్టు చెప్పింది. -
పెప్సీ, కోకోకోలా పానీయాలు బాయ్‌కాట్!
చెన్నై: బహుళజాతి సంస్థలు తయారు చేసిన శీతల పానీయాలపై తమిళనాడులో బహిష్కరణ వేటు పడింది. రాష్ట్రవ్యాప్తంగా పెప్సీ, కోకోకోలా శీతల పానీయాల అమ్మకాలు బుధవారం ఉదయం నుంచి నిలిచిపోయాయి. స్థానిక శీతల పానీయాలనే ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ రెండు కూల్ డ్రింక్స్‌ను బహిష్కరిస్తూ తమిళనాడు వనిగర్ సంఘం ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా ఈ నిర్ణయానికి సానుకూల స్పందన వస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు ఏఎం విక్రమరాజా తెలిపారు. పానీయాల ప్రభావం గురించి వ్యాపారులకు, వినియోగదారులకు అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు. పెప్సీ, కోక్ పానీయాలు ఆరోగ్యానికి హానికరమని, వాటిలో క్రిమిసంహారకాలు ఉన్నాయన్నారు. అందువల్లే దేశీయం ఉత్పత్తి చేసే పానీయాలను ప్రోత్సహించేలా చర్యలు చేపడతామని విక్రమరాజా పేర్కొన్నారు. కాలీ మార్క్, బొవాంటో, టోనిరో వంటి స్థానిక పానీయాలు అమ్మకాలు పెంచేలా చర్యలు చేపడతామన్నారు. దీంతో కోక్.. పెప్సీ అమ్మకాలపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో రూ.1,400 కోట్లు నష్టం వాటిల్లినుంది. కాగా జల్లికట్టు విషయంలో తమ సంప్రదాయాల్ని.. సంస్కృతిని దెబ్బ తీసేలా వ్యవహరించిన పెటాకు ఆర్థిక సాయం అందించే పెప్సీ.. కోకోకోలా ఉత్పత్తుల్ని సినిమా థియేటర్లలో అమ్మకూడదని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
పెప్సీ, కోకోకోలా పానీయాలు బాయ్‌కాట్!
-
తమిళ యూత్ తర్వాతి టార్గెట్ ఫిక్స్!
చెన్నై: జల్లికట్టును కాపాడుకునేందుకు ఉద్యమిస్తున్న తమిళ యువత తర్వాత అన్నదాతల కోసం పోరాడనుంది. కర్షకులను కష్టల్లోకి నెడుతున్న బహుళజాతి సంస్థలకు వ్యతిరేకంగా పోరుబాట పట్టాలని యువకులు భావిస్తున్నారు. శీతల పానీయాలు తయారు చేస్తున్న మల్టీనేషనల్ కంపెనీలపై ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. రైతుల సంక్షేమం తమ తర్వాతి ఎజెండా అని జల్లికట్టు ఆందోళనలో పాల్గొన్న ఉద్యమకారులు వెల్లడించారు. అన్నదాతలకు నీళ్లు దక్కకుండా దోచుకుంటున్న కోకాకోల, పెప్సీలను నిషేధించాలన్న డిమాండ్ తో ఆందోళనలు చేపట్టనున్నట్టు తెలిపారు. బహుళజాతి కంపెనీలు తమ వ్యాపార అవకాశాల కోసం నీటిని వాడుకుంటూ పంటలకు అందకుండా చేస్తున్నాయని మండిపడుతున్నారు. ఎంఎన్సీలకు వ్యతిరేకంగా కోయంబత్తూరులో యువత కూల్ డ్రింక్స్ బ్యాటిల్ ను విసిరేసి నిరసన తెలిపింది. వీరికి పలు హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రాలు మద్దతు ప్రకటించాయి. కోక్, పెప్సి సర్వ్ చేయబోమని పలు హోటళ్లు బోర్డులు పెట్టాయి. ‘మా సంస్థకు అన్ని బ్రాంచుల్లో పెప్సి, కోక్ ఉత్పత్తులు సర్వ్ చేయడం నిలిపివేశామ’ని ఆర్ హెచ్ ఆర్ హోటల్ మెయిన్ కౌంటర్ వద్ద బోర్డు పెట్టింది. బహుళజాతి సంస్థలు తయారు చేస్తున్న శీతలపానీయాలు ఆరోగ్యానికి హానికరమని కొంతమంది ఆందోళనకారులు పేర్కొంటున్నారు. వీటిపై నిషేధం విధించలేకపోయినా కనీసం అమ్మకాలను నియత్రించాలని వారు కోరుతున్నారు.