వైజాగ్ స్టీల్‌కు కోల్ బ్లాక్‌లు కేటాయించండి
బొగ్గు శాఖను కోరిన ఉక్కు శాఖ
న్యూఢిల్లీ: వైజాగ్ స్టీల్ ప్లాంట్ విస్తరణ కోసం అవసరమయ్యే థర్మల్, కోకింగ్ కోల్ బ్లాక్‌లను కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖను ఉక్కు మంత్రిత్వశాఖ కోరింది. రాష్ట్రీయ ఇస్పాత నిగమ్ లిమిటెడ్(ఆర్ఐఎన్ఎల్-వైజాగ్ స్టీల్) తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.3 మిలియన్ టన్నులకు పెంచుకుంది. అధునికీకరణ, యూనిట్ల అప్‌గ్రెడేషన్‌తో ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని 7.3 మి. టన్నులకు పెంచుకోవాలని యోచి స్తోంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని 20 మిలియన్ టన్నులకు పెంచుకునే ప్రయత్నాలను కూడా ఈ కంపెనీ చేస్తోంది. ఉత్పత్తి సామర్త్యం పెంపు కోసంవ థర్మల్, కోకింగ్ కోల్ బ్లాక్‌లను నేరుగా కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖను వైజాగ్ స్టీల్ కోరింది. నవరత్న హోదా ఉన్న ఆర్ఐఎన్ఎల్కు ఇప్పటిదాకా సొంత ఇనుము, బొగ్గు వనరులు లేవు.