collapsed missing
-
ప్రారంభోత్సవం రోజునే పరాభవం... హఠాత్తుగా కుప్పకూలిన వంతెన: వీడియో వైరల్
Bridge collapsed immediately after an official cut the ribbon to inauguration: డెమొక్రెటిక్ రిపబ్లక్ ఆఫ్ కాంగో(డీర్సీ)లో ఒక వంతెన ప్రారంభోత్సవంలో అధికారులు ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మాధ్యమంలో చక్కర్లు కొడుతుండటంతో ఈ ఘటన వెలుగు చూసింది. వాస్తవానికి కాంగ్లోలో వర్షాకాలంలో స్థానికులు నదిని దాటేందుకు ఒక చిన్న వంతెనను నిర్మించారు. ఆ వంతెన ప్రారంభోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. పైగా పెద్ద ఎత్తున్న అధికారులు కూడా వచ్చారు. సరిగ్గా ఒక మహిళా అధికారి రిబ్బన్ కటింగ్ చేస్తుండగా... హఠాత్తుగా వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అధికారులు అంతా ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ బెంబేలెత్తిపోయారు. దీంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమై అధికారులను రక్షించి సురక్షిత ప్రాంతాలకి తరలించారు. అదృష్టవశాత్తు ఎవరు కిందపడిపోలేదు, పైగా ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఐతే ఈ వంతెనను మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి నిర్మించారు. కానీ వంతెన నిర్మాణ నాణ్యతల్లో లోపాలు కారణంగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో... స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున్న ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తిపోస్తున్నారు. అదీగాక ఈ వంతెనకు ముందు ఉన్న తాత్కాలికా నిర్మాణం తరుగచుగా కూలిపోతుంటుందని ఒక స్థానిక వార్త సంస్థ పేర్కొనడం గమనార్హం. (చదవండి: యూకే హోం సెక్రటరీగా భారత సంతతి మహిళ) -
ఎక్కడున్నారయ్యా..!
ఎక్కడున్నావయ్యా.. రోజు బడికిపోయేటోడివి.. ఉండలేక నాయినవెంట పోయి చావుతెచ్చుకుంటివి.. పండగపూట ఇంటికాడున్నా సరిపోయేది.. చేతులారా నిన్ను పోగొట్టుకుంటిమి కదరా..అంటూ నదిలో గల్లంతైన కుమార్ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు కలిచివేసింది. ఉదయం నుంచి చీకటి పడే వరకు బాధిత కుటుంబసభ్యులు నది ఒడ్డున ఉంటూ పిల్లలకోసం విలపించారు. ఈ విషాదకరమైన పరిస్థితిని చూసిన వారి కళ్లు చెమర్చాయి. - అలంపూర్ తుంగభద్ర నదిలో మరబోటు బోల్తాపడి గల్లంతైన కుమార్(11), వేణు(26)ల ఆచూకీ రెండోరోజు కూడా లభించనే లేదు. స్థానిక మత్స్యకారులు నదిలో ఆచూకీ కోసం బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమించినా ఫలితం దక్కలేదు. సుమారు దాదపు 20 మంది మత్స్యకారులు నదిలో ఉదయం గాలాలతో వెతికారు. లాభం లేకపోవడంతో పెద్ద వల సహాయంతో ప్రయత్నిస్తున్నారు. ఆర్డీఓ అబ్దుల్ హమీద్, తహశీల్దార్ మంజుల, ఎస్ఐ వెంకటేష్‌లు సంఘటన స్థలంలోనే ఉంటూ గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. గురువారం జిల్లాలోని గత ఈతగాళ్లను రప్పించి గాలింపు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు మత్స్య శాఖ అధికారులను అలంపూర్‌కు పిలిపించి వారితో సమావేశమయ్యారు. ఇదిలావుండగా పట్టణంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఎక్కడ చూసినా ఈ సంఘటన గురించే మాట్లాడుకుంటున్నారు. తుంగభద్ర నది, మరబోటు, బోల్తాపడి గల్లంతైన