combustion
-
హ్యుందాయ్ సంచలన నిర్ణయం..! ఇకపై ఆ కార్లకు స్వస్తి..!
ప్రముఖ దక్షిణ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ల అభివృద్ధిని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలపైనే దృష్టిసారించాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఇంజిన్ డెవలప్మెంట్ సెంటర్ మూసివేత..! హ్యుందాయ్ కొత్త అంతర్గత దహన ఇంజిన్లను అభివృద్ధి చేయడం ఆపివేస్తోందని కొరియన్ ఎకనామిక్ డైలీ పేర్కొంది. దీంతో డెవలప్మెంట్ సెంటర్లోని ఇంజిన్ డెవలప్మెంట్ విభాగం మూసివేసినట్లు తెలుస్తోంది. పవర్‌ట్రెయిన్ విభాగంను ఇప్పుడు ఎలక్ట్రిఫికేషన్ డెవలప్మెంట్ టీమ్‌గా మార్చినట్లు కొరియన్ ఎకనామిక్ డైలీ వెల్లడించింది. వీటితో పాటుగా బ్యాటరీ డెవలప్మెంట్ సెంటర్‌ను కూడా హ్యుందాయ్ అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. ఈ కొత్త కేంద్రంలో బ్యాటరీ డిజైన్ బృందం, బ్యాటరీ పర్ఫార్మెన్స్ డెవలప్మెంట్ అనే రెండు బృందాలు పనిచేయనున్నాయి. 2030 నాటికి 30 శాతం వరకు.. 2040 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల నుంచే ఆదాయాలను రాబట్టేందుకు హ్యుందాయ్ ప్రణాళికలను రచిస్తోంది. 2030 నాటికి మొత్తం అమ్మకాలలో 30 శాతం జీరో-ఎమిషన్ వాహనాల నుంచి పొందాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ వాహనాలు కనుమరుగు..! హ్యుందాయ్ అనేక రకాలైన కంబ్యూషన్ ఇంజిన్ వాహనాలను తయారుచేస్తోంది. వాటిలో ముఖ్యంగా 1.1-లీటర్ల నుంచి 2.0-లీటర్ల సామర్ధ్యం కల్గిన ఇంజిన్స్ ఉన్నాయి. టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్లు, సీఎన్జీ, డిజీల్ ఇంజిన్ వాహనాలు ఉన్నాయి. కంపెనీ నిర్ణయం మేరకు ఈ వాహనాల అభివృద్ధి పూర్తిగా నిలిచిపోనుంది. కొత్తగా ఆరు మోడల్స్‌తో..! భారత ఆటోమొబైల్ మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ వాహనాలపై కసరత్తు ప్రారంభించినట్లు హ్యుందాయ్ ఇప్పటికే ప్రకటించింది. 2028 నాటికి భారత్‌లో ఆరు ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీ లాంచ్ చేయనుంది. కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయడానికి 4,000 కోట్లను కంపెనీ ఖర్చు చేయనుంది. ఇప్పటికే IONIQ 5, కోనా ఎలక్ట్రిక్ వాహనాలు భారత్‌లో తారసపడ్డాయి. చదవండి: పేరుకు సెకండ్ హ్యాండ్ కార్లే..! హాట్‌కేకుల్లా అమ్ముడైన బ్రాండ్స్ ఇవే..! -
అవి పనిచేస్తే.. కోవిడ్ అంత్యక్రియలు సులువే!
సాక్షి, సిటీబ్యూరో: కరోనా (కోవిడ్–19) వ్యాధి సోకి బాధ పడుతుండటం ఒక ఎత్తయితే.. వ్యాధితో, లక్షణాలతో మృతి చెందిన వారి అంత్యక్రియల వ్యవహారం మరో ఎత్తు. ప్రభుత్వ నిబంధనల మేరకు కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రత్యేక విధానాలు పాటించాల్సి ఉండటం.. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించడం వంటి నిబంధనలు ఉన్నాయి. అంతేకాదు ఆస్పత్రి నుంచి అంత్యక్రియలు నిర్వహించే స్థలం వరకు మృతదేహం తరలింపు తదితర అంశాలకూ ప్రత్యేక రక్షణ చర్యలు పాటించాలి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయా ప్రాంతాల్లోని స్థానికులు అంగీకరించకపోవడంతో అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిబంధనల మేరకు కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలకు ఆయా శ్మశానవాటికల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ఇందుకు స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో వారికి నచ్చజెప్పి ఒప్పించేందుకు సంబంధిత అధికారులు నానాతంటాలు పడుతున్నారు. విద్యుత్ దహన వాటికలుంటే ఇబ్బందులు తప్పేవి.. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో విద్యుత్ దహన వాటికలుంటే ఈ ఇబ్బందులు ఉండేవి కావని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. విద్యుత్ దహనవాటికల్లో వైరస్ అనుమానాలు కూడా ఉండవని చెబుతున్నారు. ఏర్పాటు చేశారు.. విస్మరించారు.. జీహెచ్ఎంసీ గతంలో నగరంలోని నాలుగు ప్రాంతాల్లో విద్యుత్ దహనవాటికలను ఏర్పాటు చేసింది. ఒక్కోదానికి దాదాపు రూ.60 లక్షల చొప్పున రూ.2.40 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన వాటిని కొంతకాలం పాటు నిర్వహించారు. పరిసరాల ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం.. విద్యుత్ వినియోగ బిల్లులు చెల్లించకపోవడం తదితర కారణాలతో వాటిని పట్టించుకోలేదు. అనంతరం అవి ఎందుకు పనికిరాకుండా పోయాయి. బన్సీలాల్‌పేట, అంబర్‌పేట, పంజగుట్ట, ఎస్సార్‌నగర్‌లలో వీటిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటిలో ఒక్కటి కూడా పనిచేయకపోవడం గమనార్హం. కనీసం ఒక్కటి వినియోగంలో ఉన్నా... దహనం అనంతరం వెలువడే పొగ, ధూళి వల్ల తమకు ముప్పు అని పరిసరాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనట్లు జీహెచ్ఎంసీ అధికారి తెలిపారు. మరో వైపు ఒక్కో కేంద్రానికి నెలకు దాదాపు రూ.2లక్షల విద్యుత్ బిల్లులు రాగా, వాటిని చెల్లించలేదని తెలిపారు. పొగ బయటకు వెళ్లకుండా, ఇతరులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లకు సైతం సిద్ధమైనప్పటికీ వాటి గురించి ఎవరూ పట్టించుకోలేదు. కనీసం ఒక్క విద్యుత్ దహనవాటిక అయినా వినియోగంలో ఉండి ఉంటే కరోనా మృతుల దహన సంస్కారాలకు ఇబ్బందులు లేకుండా సులువుగా జరిగేవని సంబంధిత అధికారులు అభిప్రాయపడుతున్నారు. అంతటా ఇబ్బందులే.. సొంత మనుషులనుకున్న వారు, రక్తసంబంధీకులు సైతం కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలకు హాజరు కాకపోతుండటం తెలిసిందే. హైదరాబాద్‌లోనే కాకుండా చెన్నై, భోపాల్ తదితర ప్రాంతాల్లోనూ శ్మశానవాటికల్లో వారి అంత్యక్రియలకు ఆటంకాలు ఎదురవుతుండటం, దాడులకు సైతం పాల్పడుతుండటం తెలిసిందే. -
విధి ఆడిన వింతనాటకం
సాక్షి, చెన్నై : విధి ఆడిన నాటకంలో ఇద్దరు బాలురు అనాథలయ్యారు. తొమ్మిదేళ్ల క్రితం తండ్రి హఠాన్మరణం ఓ వైపు, తల్లిని వెంటాడుతున్న కేన్సర్ మహమ్మారి మరో వైపు వెరసి పుస్తకాలను పక్కనపెట్టి ముక్కుపచ్చలారని పసి వయస్సులోనే కూలీలుగా మారారు. జన్మనిచ్చిన తల్లిని కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేసినా ఫలితం శూన్యం. చివరకు తల్లి తనువు చాలించడంతో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు కూడా చేయించలేని ఆర్థిక దుస్థితితో తల్లడిల్లారు. బంధువులు, ఆప్తులు ముఖంచాటేయడంతో గత్యంతరం లేక ఆ ఇద్దరు భిక్షాటనకు దిగారు. తల్లి అంత్యక్రియలకు సాయం చేయండంటూ కన్నీటి పర్యంతంతో అభ్యర్థించారు. చివరకు మంచి హృదయాలు స్పందించడంతో తల్లికి ఎలక్ట్రిక్ శ్మశానవాటికలో అంత్యక్రియలు చేశారు. గురువారం దిండుగల్ ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారకర ఘటన వివరాలు... దిండుగల్ జిల్లా ఎరియోడు సమీపంలోని మేట్టుపట్టికి చెందిన కాళియప్పన్ , విజయ దంపతులకు మోహన్ (14), వేల్ మురుగన్(13) అనే ఇద్దరు కుమారులు, కాళీశ్వరి కుమార్తె ఉన్నారు. బంధువులు, ఆప్తులతో ఆనందకరంగా సాగిన ఈ కుటుంబంలో తొమ్మిదేళ్ల క్రితం విషాదకర çఘటన చోటుచేసుకుంది. గుండెపోటుతో హఠాత్తుగా కాళియప్పన్ మరణించడంతో కుటుంబ భారం విజయకు బరువైంది. కుటుంబ పెద్ద దూరమైనా, ఆప్తులు ముఖం చాటేసినా, రెక్కల కష్టంతో పిల్లల్ని చదివించాలని తపన పడింది. తన స్తోమత మేరకు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినా, కాల క్రమేనా విధి ఆడిన నాటకం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. పుస్తకాలు చేతబట్టాల్సిన కుమారుల్ని కూలి పనికి, రక్తం పంచుకుని పుట్టిన కుమార్తె అనాథ ఆశ్రమానికి పరిమితం చేయాల్సిన పరిస్థితి విజయకు ఏర్పడింది. కేన్సర్ మహమ్మారి : విజయను కేన్సర్ మహమ్మారి తాకింది. బ్రెస్ట్ కేన్సర్‌తో తల్లి బాధ పడుతుండడంతో ఆ ఇద్దరు బాలుర కష్టాలు మరింత జఠిలమయ్యాయి. ఇద్దరు మగ పిల్లలు ఎలాగైనా బతక గలరని భావించిన విజయ, తన కుమార్తెను మాత్రం రక్షించాలని ఆ దేవుడ్ని వేడుకుంది. ఇందుకు తగ్గట్టు ఒట్టన్ చత్రంలోని ఓ ఆశ్రమ వర్గాలు కాళీశ్వరి ఆలనాపాలన చూసుకునేందుకు సిద్ధమయ్యారు. క్రమంగా కేన్సర్ తీవ్రత పెరగడంతో ఆస్పత్రికి వెళ్ల లేనంతగా , మంచానికే పరిమితం అయ్యే స్థాయికి విజయ పరిస్థితి చేరింది. తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్ల లేని పరిస్థితుల్లో బంధువులు, ఆప్తుల్ని కలిసి వేడుకున్నారు. వారిలో మాన వత్వం కొరవడింది. ఇక, చేసేది లేక ఇరుగు పొరుగున ఉన్న మానవతావాదుల సాయంతో దిండుగల్ ఆస్పత్రిలో చేర్పించారు. అమ్మకు వెన్నంటి ఉంటూ ఆ ఇద్దరు పిల్లలు సాయం అందించారు. వైద్యులు సైతం విజయకు వైద్య పరీక్షలు అందించారు. అయితే, ఫలితం శూన్యం. భిక్షాటనతో : చేతిలో చిల్లి గవ్వకూడా లేకుండా, సర్కారు వారి వైద్యంతో కాలం నెట్టుకు వచ్చిన ఆ ఇద్దరు పిల్లల్లో గురువారం ఉదయం పిడుగు పడ్డట్టు పరిస్థితి మారింది. విజయ ఇక, లేదన్న సమాచారంతో కన్నీటి పర్యంతం అయ్యారు. ఆస్పత్రిలోని వార్డులో మంచం మీద విగతజీవిగా పడి ఉన్న తల్లి మృతదేహం వద్ద బోరున విలపించారు. వీరి వేదనను చూసిన పక్కనే మరో మంచం మీదున్న మరో రోగి కుటుంబీకులు, ఆ పిల్లల బంధువులకు సమాచారం అందించారు. కనీసం ఆ ఇద్దరు పిల్లల్ని ఓదార్చేందుకు సైతం బంధువులు, ఆప్తులు రాలేదు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని స్థితిలో తమ తల్లికి ఎలా అంత్యక్రియలు చేయగలమన్న వేదనతో ఆ మంచం వద్దే కన్నీటి పర్యంతంతో నిలుచుండి పోయారు. చివరకు ఆ ఇద్దరు తమ తల్లికి అంత్యక్రియలు జరిపించేందుకు సహకరించాలని ఆస్పత్రిలో ఉన్న ఇతర రోగుల కుటుంబీకుల వద్ద చేతులు చాపక తప్పలేదు. ఆస్పత్రిలోని అన్ని వార్డుల్లో తిరుగుతూ భిక్షాటనకు దిగారు. మానవతావాదులు, అనేక మంది రోగులు తమ వద్ద ఉన్న తలా పదో, ఇరవయ్యే ఇచ్చి సాయం అందించే పనిలో పడ్డారు. ఈ ఇద్దరు పిల్లలు బిక్షాటన చేస్తుండడాన్ని అక్కడి సిబ్బంది గుర్తించారు. తాము సైతం అంటూ సాయం అందించడమే కాదు, ఆస్పత్రి అధికారి మాలతి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణం స్పందించిన ఆమె అంత్యక్రియలకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆ తదుపరి స్పత్రి వర్గాలు మృతదేహాన్ని దిండుగల్ ప్రభుత్వ ఎలక్ట్రిక్ శ్మశాన వాటికలో మృతదేహాన్ని దహనం చేశారు. తల్లిని, తండ్రిని కోల్పోయి, చెల్లిని ఆశ్రమంలో వదలి పెట్టిన ఈ ఇద్దరు బాలురు అనాథలుగా గమ్యం ఎటో అన్న ట్టు ఆస్పత్రి ఆవరణలో కూర్చుని ఉండడం మనస్సున్న హృదయాల్ని కలచివేసింది. -
వానరానికి దహన సంస్కారాలు
మానవత్వాన్ని చాటుకున్న భవన నిర్మాణ కార్మికులు ఏటూరునాగారం : ఓ వానరం మృతి చెందగా కొందరు భవన నిర్మాణ కార్మికులు అంత్యక్రి యలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నా రు. వివరాలు.. మండల కేంద్రంలోని ఎంపీడీ ఓ కార్యాలయం ఆవరణలో ప్రతి ఏటా ఆగస్టు 1న భవన నిర్మాణ కార్మికులు వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుం టారు. సోమవారం సమావేశానికి వచ్చిన కార్మికులు మృతి చెంది ఉన్న వానరాన్ని చూసి చలించిపోయారు. వెం టనే దానికి అంతిమ సంస్కారాలు చేశారు. కార్మికులు నాగరాజు, సమ్మయ్య, నసిరొద్దీన్, స్వామి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.