Commerce Department data
-
ఎగుమతులు మూడో నెలా డౌన్
న్యూఢిల్లీ: భారత్ నుంచి ఎగుమతులు వరుసగా మూడో నెలా క్షీణించాయి. ఏప్రిల్‌లో 12.7 శాతం తగ్గి 34.66 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కేంద్ర వాణిజ్య శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దిగుమతులు కూడా వరుసగా అయిదో నెలా క్షీణించాయి. ఏప్రిల్‌లో 14 శాతం క్షీణించి 49.9 బిలియన్ డాలర్లకు తగ్గాయి. గత ఏప్రిల్‌లో ఇవి 58.06 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. భారత్‌కు ప్రధాన మార్కెట్లుగా ఉన్న అమెరికా, యూరప్‌లో డిమాండ్ అంతగా లేకపోవడం .. ఎగుమతులు మందగించడానికి కారణమైంది. పరిస్థితి మెరుగుపడటానికి మరికొద్ది నెలలు పట్టే అవకాశం ఉందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) సంతోష్ కుమార్ సారంగి తెలిపారు. ‘యూరప్, అమెరికాలో డిమాండ్ క్షీణించింది. వచ్చే 2–3 నెలలు కూడా అంత ఆశావహంగా కనిపించడం లేదు. అయితే, చైనా ఎకానమీ కోలుకుని.. యూరప్, అమెరికా మార్కెట్లలో కూడా కాస్త డిమాండ్ నెలకొనే అవకాశం ఉన్నందున ఆగస్టు–సెప్టెంబర్ తర్వాత నుంచి ఎగుమతులు మళ్లీ పుంజుకోవడానికి ఆస్కారం ఉంది‘ అని ఆయన పేర్కొన్నారు. 20 నెలల కనిష్టానికి వాణిజ్య లోటు .. ఎగుమతులు, దిగుమతుల మందగమనంతో ఏప్రిల్‌లో వాణిజ్య లోటు 20 నెలల కనిష్టమైన 15.24 బిలియన్ డాలర్లకు తగ్గింది. చివరిసారిగా 2021 ఆగస్టులో వాణిజ్య లోటు ఇంతకన్నా తక్కువగా 13.81 బిలియన్ డాలర్లుగా నమోదు కాగా.. గతేడాది ఏప్రిల్‌లో ఇది 18.36 బిలియన్ డాలర్లుగా ఉంది. కమోడిటీల ధరలు, రత్నాభరణాల్లాంటి ఉత్పత్తులకు డిమాండ్ క్షీణించడంతో దిగుమతులు తగ్గినట్లు సారంగి వివరించారు. ఎగుమతులపరంగా రాబోయే రోజుల్లోనూ రత్నాభరణాలు, కొన్ని రకాల ఇంజినీరింగ్ ఉత్పత్తులు, దుస్తులపై ప్రభావం ఉండవచ్చన్నారు. ఎక్కువగా ఎగుమతులు చేసేందుకు ఆస్కారమున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, నూనె గింజల్లాంటి వాటిపై వ్యాపారవర్గాలు మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు. 2022–23 గణాంకాల సవరణ.. గత ఆర్థిక సంవత్సరం గణాంకాలను వాణిజ్య శాఖ ఎగువముఖంగా సవరించింది. దీని ప్రకారం.. ► 2022–23లో ఉత్పత్తులు, సర్వీసుల ఎగుమతులు 14.68 శాతం వృద్ధి చెంది 676.53 బిలియన్ డాలర్ల నుంచి 775.87 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 17.65 శాతం పెరిగి 894.19 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 118.31 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ► ఉత్పత్తుల ఎగుమతులు 6.74% వృద్ధితో 450.43 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 16.47% పెరిగి 714 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► సేవల ఎగుమతులు 27.86 శాతం ఎగిసి 325.44 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 22.54 శాతం పెరిగి 180 బిలియన్ డాలర్లకు చేరాయి. -
అమెరికన్ల వాలెట్లు తెరుచుకున్నాయ్..
నెమ్మదస్తుగా ఉన్న శీతాకాల అనంతరం అమెరికన్ ఆర్థికవ్యవస్థ పుంజుకుంది. ఏప్రిల్ నెలలో అమెరికన్ వినియోగదారుల ఖర్చులు పెరిగాయి. మార్చి నెల కంటే ఏప్రిల్ నెలలో అమెరికన్ల ఖర్చు 1శాతం పెరిగాయని వాణిజ్య విభాగ డేటాలో తేలింది. వినియోగదారుల వ్యయాలు పెరగడం 2009 ఆగస్ఠు తర్వాత ఇదే మొదటిసారని గణాంకాలు పేర్కొన్నాయి. ఈ పెరుగుదల అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనం నుంచి బయటపడి, వినియోగదారుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందనే సంకేతాలను అందిస్తోంది. రిటైల్ అమ్మకాలు పెరిగాయనే గణాంకాలు వెల్లడైన కొన్ని వారాల్లోనే వినియోగదారుల వ్యయ సూచి పెరగడం విశేషం. రిఫ్రిజిరేటర్లు, రూఫ్స్, కార్లు, డెలివిజన్లు వంటి భారీ ఉత్పత్తుల కొనుగోలు ఎక్కువగా నమోదైనట్టు గణాంకాలు తెలిపాయి. అమెరికన్ వినియోగదారులు ప్రస్తుతం ఆత్మవిశ్వాసంతో వారి వాలెట్లను తెరుస్తున్నారని పేర్కొంది. రెండో త్రైమాసిక ఆర్థిక వృద్ధికి ఈ వ్యయాలు పెరగడం ఎక్కువ ప్రయోజనం కల్పించబోతుందని హై ఫ్రీక్వెన్సీ ఎకనామిక్స్ రీసెర్చ్ సంస్థ చీఫ్ అమెరికన్ ఆర్థిక వేత్త జిమ్ ఓ సులీవాన్ అభిప్రాయం వ్యక్తంచేశారు. అదేవిధంగా మిచిగాన్ యూనివర్సిటీ వినియోగ వ్యయ ఇండెక్స్ సైతం పెరిగింది. ఏప్రిల్ లో 89శాతంగా ఉన్న ఈ ఇండెక్స్ మే నెలలో 95శాతంగా నమోదైంది. ఖరీదైన వస్తువుల కొనుగోళ్లలో కార్లు ఎక్కువ మొత్తంలో వాటాను నమోదుచేశాయని వాణిజ్య విభాగం గణాంకాలు తెలిపాయి. సెడాన్లు, మినీ వ్యాన్లను అమెరికన్ కారు డీలర్స్ రికార్డు స్థాయిలో అమ్మారని గణాంకాలు పేర్కొన్నాయి. జనవరి, ఫిబ్రవరి లో ఓ మోస్తారుగా నమోదైన ఆటో అమ్మకాలు, మార్చి నెలలో పడిపోయి, మళ్లీ ఏప్రిల్ నెలలో పుంజుకున్నాయని గణాంకాలు వెల్లడించాయి. కేవలం కార్లు మాత్రమే కాకుండా గృహోపకరణాలు డిష్ వాషర్స్, డ్రైయర్స్, స్టవ్ లు ఇటీవల ఎక్కువ మొత్తంలో విక్రయాలు నమోదై, అధికమొత్తంలో రాబడులు సాధించాయని గణాంకాలు తెలిపాయి. అధికమొత్తంలో వినియోగదారుల వ్యయాలు పెరగడం, వృద్ధి అంచనాలపై ఆర్థికవేత్తల్లో ఆశాభావాన్ని నింపడానికి, ఏప్రిల్, జూన్ లో వృద్ధి అంచనాలు పెరగడానికి దోహదంచేస్తున్నాయని అమెరికన్ ఎకానమీ సూచిస్తోంది.