నేడు గవర్నర్ రాక
బాలాజీచెరువు (కాకినాడ):
ఆంధ్ర , తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహ¯ŒS శనివారం జిల్లాకు రానున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 8.40 గంటలకు రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు చేరు కుంటారు. అక్కడ నుంచి బయలుదేరి 9.40 గంటలకు కాకినాడ్ ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. అక్కడ పది నిమిషాల విరామం అనంతరం బయలు దేరి కరప మండలం నడకుదురులో కుసుమ సత్య కన్వెష్ష¯ŒS హల్లో జరిగే రోటరీ క్లబ్ ఫౌండేష¯ŒS సెంటీనియల్ సమావేశంలో పాల్గొంటారు. తిరిగి కాకినాడ చేరుకుని గెస్ట్‌హౌస్‌లో విశ్రాం తి తీసుకున్న అనంతరం కాకినాడ నుంచి ఉదయం 11.20 గంటలకు బయలుదేరి మధురపూడి ఎయిర్ పోర్టుకు చేరుకుని హైదరాబాద్ పయనమవుతారు.