communal conflicts
-
హరియాణా మత ఘర్షణల కేసులపై కమిటీ: సుప్రీం
న్యూఢిల్లీ: సమాజంలో వివిధ వర్గాల మధ్య సామరస్యం, పరస్పర మర్యాదపూర్వక ప్రవర్తన అత్యంత అవసరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విద్వేషపూరిత ప్రసంగాల్ని ఎవరూ అంగీకరించరని పేర్కొంది. హరియాణాలో ఆరుగురు ప్రాణాలను బలిగొన్న మత ఘర్షణలకు సంబంధించి రిజిస్టర్ అయిన కేసుల విచారణకు రాష్ట్ర డీజీపీ నేతృత్వంలో ఒక కమిటీ వేయాలని సుప్రీం కోర్టు ప్రతిపాదించింది. హరియాణా సహా వివిధ రాష్ట్రాల్లో ఒక మతం వారిని చంపేయాలంటూ చేసిన విద్వేష పూరిత ప్రసంగాల వల్ల హింస చెలరేగుతోందన్న ఆరోపణలతో దాఖలైన పిటి:షన్లను శుక్రవారం సుప్రీం విచారణ చేపట్టింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టిలతో కూడిన డివిజన్ బెంచ్ ఆగస్టు 18లోగా కమిటీ ఏర్పాటుపై కోర్టుకు సమాచారం ఇవ్వాలని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం. నటరాజ్‌ను ఆదేశించింది. సమాజంలో వివిధ వర్గాల మధ్య సమరస్యపూర్వక వాతావరణం ఉండాలని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. -
టీడీపిలో వర్గ విభేదాలు
-
కాంగ్రెస్‌లో రచ్చరచ్చ
తమిళనాడు కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి రోడ్డెక్కాయి. వర్గ విభేదాలు నిప్పు లేకుండానే భగ్గుమన్నాయి. శనివారం ఉదయం ముట్టడి, బాహాబాహీలతో సత్యమూర్తి భవన్ ప్రాంగణం అట్టుడికింది. చెన్నై, సాక్షి ప్రతినిధి:విడతలవారీగా రాష్ట్రస్థాయి సమావేశాలను నిర్వహించుకుంటూ వస్తున్న తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ముందు గా నిర్ణయించుకున్న షెడ్యూలు ప్రకారం శనివారం బీసీ విభాగం సమావేశం జరపాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత కిల్లివళవన్ మృతి చెందడంతో సమావేశం వాయిదా పడింది. ఉదయం 11 గంటల సమయంలో సీనియర్ కాంగ్రెస్ నేతలతో కలిసి సత్యమూర్తి భవన్‌కు చేరుకున్న ఇళంగోవన్ కిల్లివళవన్ మృతికి సంతాప సూచకంగా కొద్ది సేపు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘిటించారు. అనంతరం సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి బైటకు వచ్చారు. అదే సమయంలో మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం వర్గీయులు బిగ్గరగా వ్యతిరేక నినాదాలు చేస్తూ ఇళంగోవన్‌ను ముట్టడించారు. సత్యమూర్తి భవన్లో జరిగే సమావేశాలకు తమను ఆహ్వానించడం లేదని, బహిష్కరించినట్లు వ్యవహరిస్తున్నారని, శుక్రవారం నిర్వహించిన ఎస్సీ విభాగం సమావేశానికి సైతం పిలుపు లేదని నిలదీశారు. ‘ఈనాటి సమావేశం వాయిదాపడింది, మిగతా విషయాలు మళ్లీ మాట్లాడుకుందాం’అని ముక్తసరిగా బదులిచ్చిన ఇళంగోవన్ చుట్టుముట్టిన కార్యకర్తలను తోసుకుంటూ కారు ఎక్కి వెళ్లిపోయారు. ఆ తరువాత టీఎన్‌సీసీ అధ్యక్షుడి వర్గంతో మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం వర్గం వాదం పెట్టుకున్నారు. మాటామాట పెరిగి ఒకరినొకరు తోసుకున్నారు. ఒక దశలో పరస్పరం తలపడి బాహాబాహీకి దిగారు. రెండు వర్గాల కేకలు, అరుపులు, జిందాబాద్, మురా్దాబాద్ నినాదాలతో సత్యమూర్తి భవన్ ప్రాంగణం దద్దరిల్లింది. వారిని అదుపుచేసే సాహసం ఎవ్వరూ చేయలేక పోయారు. ఇంతలో అక్కడ మీడియా ప్రతినిధులు ఉన్నారని గ్రహించి ఎవరికివారే జారుకున్నారు. ఈ సందర్భంగా చిదంబరం వ ర్గానికి చెందిన బీసీ నేత సత్యశీలన్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు కాంగ్రెస్‌లో తమ నేత వర్గీయులకు చోటే లేకుండా చేశారని, అంతా ఇళంగోవన్ వర్గంతో నింపివేశారని విమర్శించారు. పైగా పార్టీ సమావేశాలకు తమవారెవ్వరికీ ఆహ్వానాలు అందడం లేదని చెప్పారు. ఈ ఏకపక్ష ధోరణిపై ఇళంగోవన్‌ను తాము నిలదీయగా బదులివ్వకుండానే జారుకున్నారని వ్యాఖ్యానించారు. ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం పెద్ద ఎత్తున సాగింది. పార్టీపరమైన 24 జిల్లాల్లో కేవలం రెండు స్థానాలు చిదంబరం వర్గానికి కేటాయించి, మిగిలిన 22 స్థానాల్లో ఇళంగోవన్ తనవారికి ఇచ్చుకున్నారు. వేలూరు కార్పొరేషన్ పరిధి అధ్యక్షుడిగా పి.టిక్కారాజు, వేలూరు తూర్పు అధ్యక్షుడిగా సి.పంచాక్షరంలను నియమించారు. మిగిలిన వారంతా టీఎన్‌సీసీ అనుచరులు కావడం పార్టీలో కల్లోలం సృష్టించింది. -
అధ్యక్షుడికే పిలుపు లేదు!
పార్టీ జిల్లా అధ్యక్షుడిని బాయ్‌కాట్ చేస్తున్న గంటా వర్గం పతాక స్థాయికి టీడీపీ వర్గ విభేదాలు పిలుపు లేదంటున్న గవిరెడ్డి ‘గంటా’ పర్యటనకు దూరం విశాఖపట్నం: ‘పిలవని పేరంటం’ అవమానం జిల్లా పార్టీ అధ్యక్షుడికే ఎదురైతే!?.. జిల్లా పార్టీ అధ్యక్షుడి ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోతే!?... అదీ ఆయన సొంత నియోజకవర్గంలోనే ఇంతటి చేదు అనుభవం ఎదురైతే ఎలా ఉంటుంది... అచ్చు జిల్లా టీడీపీలో పతాక స్థాయికి చేరిన వర్గ విభేదాల మాదిరిగా ఉంటుంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడుకు పొగపెడుతున్న మంత్రి గంటా వర్గం కథను వ్యూహాత్మకంగా క్లైమాక్స్‌కు తీసుకువస్తోంది. ఓ వైపు అధిష్టానం వద్ద గవిరెడ్డికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న గంటా వర్గం... మరోవైపు మాడుగుల నియోజక వర్గంలోనే ఆయన చాపకిందకు నీళ్లు తెస్తోంది. ఏకంగా గవిరెడ్డినే బాయ్‌కాట్ చేస్తూ ఆయన నియోజకవర్గంలో శుక్రవారం మంత్రి గంటా పలు కార్యక్రమాల్లో పాల్గొనడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. మాడుగుల నియోజకవర్గం సాగరం పంచాయతీ సురవరం గ్రామంలో రూ.కోటి 25 లక్షలతో నిర్మించిన కస్తూరిబా ఆశ్రమ పాఠశాల భవన సముదాయానికి రాష్ర్ట మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లాలం భవానీతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షతో పాటు నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఇంతపెద్దఎత్తున కార్యక్రమాలను ఏర్పాటు చేసి మాడుగుల నియోజవ ర్గ టీడీపీ ఇన్చార్జి గవిరెడ్డిని పూర్తిగా విస్మరించారు. ఆయనేమి గత ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి. మాజీ ఎమ్మెల్యే, గ్రామీణజిల్లా పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంతటికీలకమైన నాయకుడిని విస్మరించడం స్థానికంగా ఆయన కేడర్‌కు సైతం మింగుడుపడడం లేదు. కనీసం జిల్లా పార్టీ అధ్యక్షునిగా కాదు... కనీసం నియోజకవర్గ ఇన్చార్జిగా కూడా గవిరెడ్డికి ఆహ్వానం అందలేదు. మంత్రి, ఎంపీలిద్దరూ గవిరెడ్డిని పట్టించుకోలేదు. దీంతో తీవ్ర అసంతృప్తి చెందిన గవిరెడ్డి అనుచరులు, వివిధ పార్టీల మండలాధ్యక్షులు సైతం మంత్రి పర్యటనకు దూరంగా ఉండిపోయారు. ఒక జెడ్పీటీసీతో పాటు నాలుగు మండలాల ఎంపీలు టీడీపీకి చెందిన వారే అయినప్పటికీ ఈ పర్యటనలోఅటిండెన్స్ వేయించుకోవడానికే పరిమితమయ్యారు. క్యాడర్ జాడపెద్దగా కన్పించలేదు. పరిస్థితిలా ఉంటుందని ముందుగానే గమనించిన గంటా వర్గీయుడైన విశాఖ డైయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు ఆఫీస్ నుంచి రాత్రికి రాత్రే గ్రామాల రైతులకు ఫోన్లు వెళ్లాయి. గంటా పర్యటనలో పాల్గొనాల్సిందిగా ఆ ఫోన్ల సమాచారం. దీంతో ఈ పర్యటనలో రైతులతో పాటు పార్టీనుంచి సస్పెండైన నేతల హల్చల్ ఎక్కువగా కన్పించింది. సొంత నియోజకవర్గంలో మంత్రి పర్యటిస్తుంటే పార్టీ జిల్లా అధ్యక్షుడు హాజరు కాకపోవడం పట్ల పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇదే తొలిసారికాదు. గతంలో కూడా ఇదేరీతిలో తనకు చెప్పకుండా నియోజకవర్గంలో గంటా పర్యటించడాన్ని గవిరెడ్డి తీవ్రంగా గర్హించడంతో గవిరెడ్డి వ్యతిరేకవర్గీయులు ఆయన దిష్టిబొమ్మల దహనం చేసిన విషయం విధితమే. ఇప్పుడు మరోసారి గవిరెడ్డికి ఆహ్వానం లేకుండా గంటా మాడుగలలో పర్యటించడం పార్టీలో చర్చనీయాంశమైంది. గంటా విజ్ఞతకే వదిలేస్తున్నా పార్టీ జిల్లా అధ్యక్షునిగా తాను ఎప్పుడు, ఏ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా ముందుగా ఆ నియోజకవర్గ ఇన్చార్జికి చెప్పి వారి అనుమతితోనే నిర్వహించేవాడిని. ఎక్కడైనా ఇదే సంప్రదాయం కొనసాగుతుంది. నా నియోజక వర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు.. సమీక్షలు.. సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు మంత్రి స్వయంగా నాకు చెప్పాలి. లేదా సమాచారం అందించాలి. కానీ అలా చేయలేదు. నేను ఓడిపోయి ఉండవచ్చు.. కానీ నియోజకవర్గ ఇన్చార్జిగా, మాజీ ఎమ్మెల్యేగా, జిల్లా పార్టీ అధ్యక్షునిగా కనీస గౌరవం ఇవ్వాలి. నాకు చెప్పకుండా నా నియోజకవర్గంలో పర్యటిస్తుండడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. -‘సాక్షి’తో ఫోన్లో గవిరెడ్డి రామానాయుడు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు -
నువ్వా.. నేనా
పీలేరులో టీడీపీ వర్గాల మధ్య తీవ్ర విభేదాలు ఇప్పటికే రోడ్డెక్కిన ఇరు వర్గాలు జీవీ చేరిక వార్తతో పార్టీ శ్రేణుల్లో అలజడి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇక్భాల్ వర్గం వర్గ రాజకీయాలతో ముఖ్యమంత్రికి తలనొప్పి తిరువతి: జిల్లాలోని టీడీపీలో వర్గ విభేధాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇలాంటి పరిణామాలు తలెత్తడం పార్టీకి ఇబ్బంది కరంగా మారుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం పార్టీలోని నాయకులపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పీలేరు నియోజకవర్గంలో ఇప్పటికే డాక్టర్ ఇక్భాల్ అహమ్మద్, మల్లారపు రవిప్రకాశ్నాయుడు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. పార్టీ కార్యకర్తల సమావేశం సైతం మదనపల్లెలో నిర్వహించాల్సిన దుస్థితి. అక్కడ జరి గిన సమావేశంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పార్టీనేత ముద్దు కృష్ణమనాయుడు సమక్షంలోనే ఇరువర్గాలు బా హాబాహీకి దిగాయి. ఇక్బాల్‌పై రవిప్రకాశ్ వర్గీయులు చేయి చేసుకున్నారు. దీంతో ఇక్భాల్ వర్గం దాడి చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని అధిష్టానం వద్ద పట్టుపట్టింది. రవిప్రకాశ్ వర్గీయులు హైదరాబాద్ స్థాయిలో చక్రం తిప్పడంతో అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయింది. దీంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. పీలేరు మార్కెట్ కమిటీ నియామకం విషయంలో సైతం రెండు సామాజికవర్గాల మధ్య అంత ర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆయనొస్తే మూడు ముక్కలాట.. ఇప్పటికే వర్గ పోరులో నలిగిపోతున్న కార్యకర్తలకు మరో ఉపద్రవం మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథరెడ్డి రూపంలో ముంచుకొచ్చింది. ఆయన టీడీపీలో చేరుతున్నారనే వార్త పార్టీ శ్రేణుల్లో కలకలం రేపింది. ఈయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇక్బాల్ వర్గం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి తీవ్ర ఆరోపణలు చేసింది. రెండు వర్గాలతోనే అల్లాడుతున్న పీలేరు నియోజక వర్గంలోని దేశం కార్యకర్తలకు శ్రీనాథరెడ్డి చేరిక వార్త తీవ్ర అలజడి రేపుతోంది. ఈయన పార్టీలో చేరితే మూడు ముక్కలాటలో నలిగి పోవాల్సిందేనని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పెరుగుతున్న గ్రూపు తగాదాలు.. ఎమ్మెల్సీ సీటు విషయంలో గల్లా అరుణకుమారి, ముద్దు కృష్ణమనాయుడు మధ్య పోరు నడుస్తోంది. ఈ విషయంతో జిల్లాలోని పార్టీ నేతలు వర్గాలుగా విడిపోయారు. మదనపల్లె నియోజకవర్గంలో దేశం నాయకుల పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారింది. పలమనేరు నియోజకవర్గంలో దేశం నేతలు లక్కనపల్లె శ్రీనివాసులరెడ్డి, సుభాష్‌చంద్రబోస్ వర్గాల మధ్య గొడవలు ఇప్పటికే పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లాయి. తిరువతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇరువర్గాల మధ్య విబేధాలు ఎన్నికల సమయంలో తేటతెల్లమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, లోకేష్ రంగంలోకి దిగి పార్టీ కార్యకర్తలకు నచ్చజెప్పాల్సి వచ్చింది. పార్టీలో గ్రూపు తగాదాలు పెరిగి పోతున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ పరిస్థితి ఉంటే దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా చూపుతుందేమోనని అధిష్టానం అందోళన చెందుతోంది. -
‘దేశం’లో వర్గ పోరు
పీలేరు నియోజక వర్గంలో పోటాపోటీగా లోకేష్ జన్మదిన వేడుకలు సుగుణమ్మ నామినేషన్‌కు సీనియర్ నేతలు డుమ్మా పలు నియోజక వర్గాల్లో ముదిరి పాకానపడుతున్న వర్గ విభేదాలు ఆందోళన చెందుతున్న అధిష్టానం తిరుపతి: జిల్లాలో తెలుగుదేశం పార్టీ వర్గ రాజకీయాలు రోజురోజుకు ముదిరి పాకాన పడుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో బహిరంగానే నేతలు వర్గాలుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగా చేపడుతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. ఇటీవల పీలేరు నియోజకవర్గంలో చోటుచేసుకొన్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. శక్రవారం జరిగిన నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో పార్టీలో విభేదాలు బట్టబయలయ్యాయి.. పీలేరు, కలికిరి, కలకడ మండలాల్లో లోకేష్ జన్మదిన వేడుకలను డాక్టర్ ఇక్బాల్, మల్లారపు రవికుమార్ నాయుడు పోటాపోటీగా నిర్వహించారు. ఇంతకు మునుపు నెలరోజుల క్రితం సైతం నియోజకవర్గ పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని పీలేరులో నిర్వహించకండా మదనపల్లెలో నిర్వహించారు. అక్కడ సమావేశం నిర్వహిస్తే పార్టీలోని రెండువర్గాల మధ్య గొడవలు జరుగుతాయని ముందు జాగ్రత్తగా సమావేశాన్ని మదనపల్లెకు మార్చినా పార్టీలో నేతల మధ్య తన్నులాట మాత్రం ఆగలేదు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు సమక్షంలోనే అక్కడ ముష్టియుద్ధాలు కూడా జరిగాయి. అయినప్పటికీ అధిష్టానం దిద్దుబాటు చర్యలను చేపట్టకపోవడం వల్లే మళ్లీ లోకేష్ జన్మదిన వేడుకలను సైతం నియోజకవర్గంలోని రెండు వర్గాలు పోటాపోటీగా జరిపాయని ఆ పార్టీలోని కొంతమంది నేతలు పెదవి విరుస్తున్నారు. సుగుణమ్మ నామినేషన్‌కు సీనియర్ నేతల డుమ్మా తిరుపతి నియోజకవర్గ ఉప ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ సతీమణి సుగుణమ్మ శుక్రవారం నామినేషన్‌ను వేశారు. ఈ కార్యక్రమానికి గల్లా అరుణకుమారి తదితర పార్టీ సీనియర్ నేతలు హాజరు కాకపోవడం దేశం వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని ముఖ్య నేతల మధ్య సమన్వయం కొరవడిందని అందువల్లే నామినేషన్‌కు రాలేదని పార్టీ జోరుగా చర్చ సాగుతోంది. ఎమ్మెల్సీ పదవికి ముద్దుకృష్ణమ నాయుడు, గల్లా అరుణకుమారి పోటీపడుతూ ఇప్పటికే వర్గాలు విడిపోయినట్లు పార్టీలో నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.. మొత్తం మీద జిల్లాలో తెలుగు దేశం నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తుండడంతో వర్గ విభేదాలు పెరిగిపోతున్నాయి. పార్టీ అధినేత రంగంలోకి దిగి పార్టీకి కాయకల్ప చికిత్స చేయకపోతే పార్టీ పరుపు మంట కలవడం ఖాయమని నాయకులు ఆందోళన చెందుతున్నాయి. -
‘దేశం’లో భగ్గుమన్న వర్గవిభేదాలు
ప్రహరీ నిర్మాణంపై సర్పంచ్ అభ్యంతరం ఎంపీపీ కార్యాలయం నుంచి సర్పంచ్ గెంటివేత బుచ్చెయ్యపేట : మండల టీడీపీ నా యకుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. గతంలో మాజీ ఎంపీపీ బత్తు ల తాతయ్యబాబు, ప్రస్తుత మండల ఉపాధ్యక్షుడు దాడి సూరినాగేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీలు గోకివాడ కోటీశ్వరరావు, వియ్యపు అప్పారావు, విశాఖ డెయిరీ డెరైక్టర్ గేదెల సత్యనారాయణ, తదితరుల మధ్య వర్గవిభేదాలు బయటపడ్డాయి. తాజాగా పోలేపల్లి టీడీపీ సర్పంచ్ సీతా వెంకటరమణ, గ్రామ టీడీపీ పాలసంఘం అధ్యక్షుడు సీతా నర్సింహనాయుడుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇటీవల బంజరు భూములకు సర్పంచ్ అనుమతి కోరగా, ఎమ్మెల్యే ద్వారా డి ఫారం పట్టాలు అవ్వకుండా నర్సింహనాయుడు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ అనుమతి లేకుండా పాల సంఘానికి నర్సింహనాయుడు ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టగా, సర్పంచ్ సీతా వెంకటరమణ పంచాయతీ అధికారుల ద్వారా అడ్డుకున్నాడు. దీనిపై సోమవారం బుచ్చెయ్యపేట ఎంపీపీ కార్యాలయంలో ఇరువురిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అభివృద్ధి పనులకు ఎవరూ అడ్డరాదని వైస్ ఎంపీపీ, డెయిరీ డెరైక్టర్, మాజీ జెడ్పీటీసీలు సర్పంచ్ సీతా వెంకటరమణకు సూచిం చారు. అయితే తమ గ్రామ రాజకీయాల్లోకి ఎవరు తల దూర్చినా సహించమంటూ సర్పం చ్, మండల నాయకులు సూచించారు. దీనిపై ఇరువర్గాలవారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి తోపులాట వరకు వెళ్లింది. కానీ, డెయిరీ చైర్మన్‌ను, ఎమ్మెల్యేను విమర్శిస్తావా అంటూ సదరు నాయకులు సర్పంచ్ సీతా వెంకటరమణను ఎంపీపీ కార్యాలయం గది నుంచి బయటకు తోసేశారు. తాను తమ గ్రామ నాయకుల్ని విమర్శిస్తే, తనపై తప్పును రుద్దడానికి ఎమ్మెల్యేను, డెయిరీ చైర్మన్‌ను దూషించానని చెప్పడం సిగ్గులేని తనమంటూ సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కార్యాలయంలోనే నాయకులు రచ్చకెక్కడంపై మండల అధికారులు ఎవరికి కొమ్ము కాయాలో తెలియక అయోమయంలో పడ్డారు.