Communion
-
రేపటి నుంచి ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు
విజయవాడ: రేపటి నుంచి ప్రకాశం బ్యారేజీపై వాహనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ప్రకాశం బ్యారేజీని మంగళవారం మంత్రి దేవినేని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.100 కోట్లతో ప్రకాశం బ్యారేజీ ఆధునీకరణ చేపట్టామని తెలిపారు. 14 కొత్తగేట్లను మార్చామని, 43 గేట్లకు మరమ్మతులు చేపట్టామని వివరించారు. ఈ పనులపై నిపుణల కమిటీ బ్యారేజీని పరిశీలిస్తుందన్నారు. కృష్ణా డెల్టాలో 13 లక్షల ఆయకట్టుకు నీరందించేలా మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. -
బస్సులు ఖాళీ
హైదరాబాద్‌కు తగ్గిన రాకపోకలు ఆరుశాతం తగ్గిన ఆక్యుపెన్సీ ప్రైవేట్ బస్సుల్లోనూ ఇదే పరిస్థితి ఆదివారమూ అంతే సంగతులు రాష్ట్రం విడిపోయాక హైదరాబాద్‌కు అంతరం పెరిగింది. విజయవాడ నుంచి భాగ్యనగరికి రాకపోకలు తగ్గిపోతున్నాయి. గతంలో నిత్యం వేలాదిమంది వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లేవారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. తుళ్లూరును రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ప్రయాణాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నారుు. హైదరాబాద్ బస్సులు ఖాళీగా తిరుగుతుండటంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ శాతం తగ్గడమే కాదు..ఆదాయానికీ భారీగానే గండి పడుతోంది. విజయవాడ : నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి హైదరాబాద్‌కు రోజూ 240 ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నారుు. రాత్రివేళల్లో సుమారు 150 వరకు ప్రైవేట్ బస్సులు వెళ్తున్నారుు. వీటిద్వారా సుమారు 12వేల నుంచి 14వేల మంది నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ఇక వారాంతాల్లో మరో 20 శాతం ప్రయాణికులు అదనంగా ఉంటారు. ఇవికాకుండా వివిధ రైళ్లలో నిత్యం మరో రెండువేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో.. ఇటీవలి కాలంలో నగరం నుంచి హైదరాబాద్‌కు రోజుకు సగటున వెళ్లే వారి సంఖ్య మూడువేలకు తగ్గింది. ప్రజల్లో పొరుగు రాష్ట్రం అనే భావన రావడం, హైదరాబాద్‌కు వెళ్లకుండానే ఇక్కడే సాధ్యమైనంత వరకు పనులు పూర్తిచేసుకునే యత్నాలు చేస్తున్నారు. దీంతో రాకపోకలు గణనీయంగా తగ్గాయి. ఇటు ఆర్టీసీకి, అటు ప్రైవేట్ ట్రావెల్స్ ఆదాయానికీ గండిపడింది. ఆరు శాతం తగ్గిన ఆక్యుపెన్సీ విజయవాడ బస్టాండ్ నుంచి రోజూ రాష్ట్రంలోని 13 జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు సుమారు 2,500 వరకు సర్వీసులు నడుస్తారుు. ఇవికాక జిల్లాలోని 14 డిపోల నుంచి నుంచి పల్లెవెలుగు బస్సులతో కలిపి 1,200 వరకు సర్వీసులు ఉన్నాయి. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఎక్స్‌ప్రెస్, ఏసీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో కచ్చితంగా 65 శాతంపైన, పల్లెవెలుగు బస్సులకైతే 50 శాతంపైన ఉండాలి. హైదరాబాద్ బస్సులకు రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఆక్యుపెన్సీ ఉంటున్నప్పటికీ గతం కంటే కొంత తగ్గిందనే చెప్పొచ్చు. గడిచిన రెండు నెలల్లో 80 నుంచి 77 శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ ఈ నెలలో 72 శాతానికి పడిపోయింది. ఆదివారాలు అయితే గతంలో నూరుశాతం ఆక్యుపెన్సీ ఉండేది. ఇప్పుడు ఆదివారాల్లో కూడా 80 నుంచి 85 శాతానికి మించి ఉండట్లేదు. నవంబర్ నుంచి ఆక్యుపెన్సీ సగటున నాలుగు శాతం నుంచి తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఆరు శాతంగా ఉంది. దీనివల్ల ఆర్టీసీకి ప్రత్యక్షంగా సుమారు మూడు లక్షల వరకు నష్టం వాటిల్లుతోంది. విజయవాడ నుంచి నిత్యం హైదరాబాద్‌కు వెళ్లే 240 బస్సుల్లో జిల్లా, నగరంలోని డిపోల నుంచే అత్యధికంగా 175 వరకు వెళుతున్నాయి. ప్రత్యామ్నాయం దిశగా ఆర్టీసీ ఆర్టీసీ అధికారులు తగ్గిన ఆక్యుపెన్సీని భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పండుగ రోజుల్లో స్పెషల్ బస్సులు ఏర్పాటుచేసి ఒకటిన్నర రెట్లు చార్జీ వసూలు చేస్తున్నారు. ఆక్యుపెన్సీ తగ్గడంతో రాకపోకలు తగ్గాయనేది సుస్పష్టం. మరోవైపు ప్రైవేట్ బస్సులదీ ఇదే పరిస్థితి. హైదరాబాద్‌కు రద్దీ తగ్గిపోవడంతో ప్రైవేట్ బస్సులను బెంగళూరు, చెన్నైకు రూట్ మార్చి తిప్పుతున్నారు. గతంలో అయితే సుమారు 150 వరకు ప్రైవేట్ బస్సులు హైదరాబాద్ వెళ్లేవి. ఇప్పుడు వాటిలో 10 నుంచి 20 బస్సులు తగ్గాయి. -
డబుల్‌డెక్కర్ రెడీ
13 నుంచి అందుబాటులోకి.. కాచిగూడ నుంచి గుంటూరుకు బైవీక్లీ సర్వీసులు రెండంతస్తుల రైలు పట్టాలపెకైక్కనుంది. ఒకప్పటి డబుల్ డెక్కర్ బస్సును గుర్తుకు తెచ్చే ఈ ట్రైన్ కాచిగూడ నుంచి వారానికి రెండుసార్లు గుంటూరు, తిరుపతి పట్టణాలకు పరుగులు తీయనుంది. రైల్వే భద్రతా కమిషన్ అనుమతితో కూత పెట్టేందుకు సిద్ధమైన ఈ ట్రైన్.. తొలిసర్వీసు 13వ తేదీన కాచి గూడ నుంచి గుంటూరుకు, 14వ తేదీన కాచి గూడ నుంచి తిరుపతికి బయలు దేరనుంది. - సాక్షి, నల్లగొండ రెండు మార్గాల్లో ప్రయాణికులకు ఊరట.. నల్లగొండ నుంచి ప్రతిరోజూ పలుఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. తిరుపతి, గుంటూరు పట్టణాలకు మాత్రం రద్దీ ఉంటుంది. ప్రతిరోజు చాలా మంది భక్తులు తిరుపతి పుణ్యక్షేత్రానికి బయలుదేరుతారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వయా నల్లగొండ ద్వారా డెల్టా ఫాస్ట్ ప్యాసింజర్, నర్సాపూర్, చెన్నై సూపర్‌ఫాస్ట్, నారాయణాద్రి, విశాక, పుష్పుల్, ఫలక్‌నుమా, ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్, పల్నాడు, శబరి, భావనగర్, రేపల్లె, జన్మభూమి, భువనేశ్వర్ రైళ్లు గుంటూరు, తిరుపతికి రాకపోకలు సాగిస్తున్నాయి. ఇన్ని అందుబాటులో ఉన్నప్పటికీ వేలాదిమంది ప్రయాణికులకు నిరీక్షణ తప్పడం లేదు. డబుల్‌డెక్కర్ వల్ల ఈ రెండు మార్గాల్లోను ప్రయాణికులకు ఎంతో ఊరట లభించనుంది. పైగా ఈ సర్వీసులు పూర్తిగా పగటిపూట మాత్రమే నడుస్తాయి. ఉదయం బయలుదేరి సాయంత్రం తిరుపతికి చేరుకొనే విధంగా, మధ్యాహ్నం గుంటూరుకు చేరుకొనే విధంగా అందుబాటులో ఉంటాయి. ప్రత్యేకతలివీ.. - ఈ ట్రైన్ లోయర్ డెక్‌లో 48 సీట్లు, అప్పర్ డెక్‌లో 50 సీట్లు ఉంటాయి. మిడిల్ డెక్‌లో 22 సీట్లు ఉంటాయి. - ఒక బోగీలో 120 సీట్ల చొప్పున మొత్తం 14 బోగీలలో 1680 సీట్లు ఉంటాయి. - కాచిగూడ నుంచి తిరుపతికి 10 గంటల్లో, గుంటూరుకు 5 గంటల్లో చేరుకుంటుంది. - డబుల్ డెక్కర్ ట్రైన్ చార్జీలు : నగరం నుంచి గుంటూరుకు రూ. 415,కర్నూలుకు రూ. 335, తిరుపతికి రూ. 720