Compensation distribute
-
TG: వరద బాధితులకు ప్రభుత్వ సాయం.. డబ్బు, ఇల్లు ఇంకా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముంపు ప్రాంతాల వరద బాధితులకు నష్టపరిహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరదల్లో నష్టపోయిన ప్రతీ కుటుంబానికి రూ.16,500 ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్టు తాజాగా ప్రకటించింది. అలాగే, తడిచిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని రైతులకు రేవంత్ సర్కార్ హామీ ఇచ్చింది.కాగా.. భారీ వర్షాలు, వరదలపై సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ‘చివరి బాధితుడి వరకు సహాయం అందిస్తాం. భారీ వర్షాలతో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగింది. కూలిపోయిన, దెబ్బతిన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ప్రతీ కుటుంబానికి రూ.16,500 ఆర్థిక సహాయం అందజేస్తాం. మృతుల కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లుతో పాటు రూ.5 లక్షల సహాయం చేస్తాం. వరద ముప్పునకు గురైన ప్రతీ ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సహాయం ఇస్తాం. వరదల కారణంగా తడిచిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం. యుద్ధ ప్రతిపాదికన తాత్కాలికంగా రహదారుల మరమత్తులు చేపడతాం. డాక్యుమెంట్స్ కొట్టుకుపోయాయని ఆందోళన చెందకండి. ప్రతీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. -
ఈ ప్రదర్శనను ఆపండి...!
న్యూఢిల్లీ: ఒక వైపు కన్నకొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగి ఉన్న ఓ మాతృమూర్తి..పరిహారం చెక్కు ఇస్తూ ఫొటో తీయించుకోవాలనే మంత్రి యావను చూసి అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ ప్రదర్శనను ఆపండి’ అంటూ అక్కడున్న వారిని వేడుకున్నారు. యూపీలో చోటుచేసుకున్న ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మంత్రి తీరును ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఎండగట్టారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో గురువారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో యూపీలోని ఆగ్రాకు చెందిన కెప్టెన్ శుభమ్ గుప్తా అసువులు బాశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం చెక్కు అందజేసేందుకు మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ శుక్రవారం ఆయన కుటుంబాన్ని కలుసుకున్నారు. తీవ్ర శోకంలో ఉన్న కెప్టెన్ శుభమ్ గుప్తా తల్లితో మంత్రి మాట్లాడారు. అనంతరం పరిహారం చెక్కు ఇచ్చేందుకు మంత్రి ప్రయత్నించగా ఆమె తీసుకోలేదు. ‘నాకు ఏమీ వద్దు, ఈ ఎగ్జిబిషన్(ప్రదర్శని మత్ లగావో)ను ఇక ఆపండి’ అంటూ వేడుకున్నా చెక్కును అలాగే పట్టుకుని ఫొటో తీయించుకునేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో రికార్డయింది. -
‘సిలికా’ పరిహారంపై సుమోటో పిల్
సాక్షి, హైదరాబాద్: సిలికా గనుల్లో పనిచేసి కాలుష్యం బారిన పడిన వారికి తగిన నష్టపరిహారం అందించాలన్న తమ ఉత్తర్వులు అమలుకు నోచుకోవడం లేదంటూ పత్రిక ల్లో వచ్చిన కథనాలపై హైకోర్టు స్పందిం చింది. ఈ కథనాలను హైకోర్టులో సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్లు, కేంద్ర గనుల శాఖ కార్యదర్శి తదితరులను ప్రతివాదులుగా పేర్కొంది. దీనిపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ నేతృత్వం లోని ధర్మాసనం విచారణ జరపనుంది. రంగారెడ్డి జిల్లాలోని సిలికా గనుల్లో పనిచేసి కాలుష్యం వల్ల పలువురు మృత్యువాత పడ్డా రు. దీనిపై హైకోర్టులో 2013లో పిల్ దాఖ లైంది. ఈ పిల్ విచారణ సందర్భంగా అప్ప టి అడ్వొకేట్ జనరల్ (ఏజీ) సిలికా బాధితులను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరపున హైకోర్టుకు హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పటి వరకు అమలు కాకపోవడంపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. మరోవైపు ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో ఉస్మానియా ఆస్పత్రికి ఉన్న స్థలా న్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించింది. దీనిపై కూడా సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరపనుంది. -
సుప్రీం’ ఆదేశాలపై స్పందించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అనేక జైళ్లలో 2012 నుంచి 2015 మధ్య కాలంలో అసహజ మరణానికి గురైన ఖైదీల కుటుంబ సభ్యులను గుర్తించి, వారికి పరిహారం చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్పందించింది. ఉభయ రాష్ట్రాల్లోని జైళ్లలో నెలకొని ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు, అసహజ మరణానికి గురైన వారి కుటుంబ సభ్యులను గుర్తించేందుకు హైకోర్టు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఈ మొత్తం వ్యవహారాన్ని సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)గా పరిగణించింది. ఇందులో ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, హోంశాఖ ముఖ్య కార్యదర్శులు, డీజీపీలు, జైళ్ల శాఖ డీజీలతో పాటు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) డైరెక్టర్లను ప్రతివాదులుగా చేర్చింది. ఈ పిల్‌పై శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. జైళ్లలో అమానవీయ పరిస్థితులు, అసహజ మరణాలకు గురైన వారి కుటుంబ సభ్యులను గుర్తించి పరిహారం చెల్లించేందుకు తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలను తెలపాలని ఉభయ రాష్ట్ర ప్రభు త్వాలను హైకోర్టు కోరనుంది. జైళ్లలో దుర్భర పరిస్థితులపై 2013లో దాఖలైన పిల్‌ను ఇటీవల విచారించిన సుప్రీంకోర్టు, 2012–15 మధ్య కాలంలో జైళ్లలో పెద్ద ఎత్తున అసహజ మరణాలు చోటు చేసుకుంటున్నాయన్న ఎన్సీఆర్బీ గణాంకాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా అసహజ మరణం చెందిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం పొందే హక్కు ఉందని తెలిపింది. ఇలాంటి వారిని గుర్తించి పరిహారాన్ని అందించాలని, అందుకు ఈ వ్యవహారాన్ని సుమోటో పిల్‌గా పరిగణించాలని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కోరింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ నుంచి తీర్పు కాపీ అందుకున్న హైకోర్టు ఈ మేర చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా సుమోటో పిల్‌గా పరిగణిస్తూ నిర్ణయం తీసుకుంది. -
పరిహారం బాగోతం
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : 2011 సంవత్సరం ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటనష్టం సంభవించింది. ప్రభుత్వం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించింది. సర్వే చేపట్టి 3.17 లక్షల హెక్టార్లలో 4.07 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.190.28 కోట్ల పంట నష్టం సంభవించినట్లు అధికారులు నిర్ధారించారు. 2012లో పంట నష్ట పరిహారం మంజూరైంది. పరిహారం పంపిణీలో అక్రమాలకు తావు లేకుండా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామాలవారీగా పంట నష్టపోయిన రైతుల ఖాతా నంబర్లు సేకరించి వాటిలో పరిహారం జమ చేయాలని సూచించింది. ఇంతకుముందు పంట నష్టపరిహారం వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసేది. రైతుల సంఖ్యకు అనుగుణంగా పరిహార వ్యయాన్ని జేడీఏ నుంచి మండల వ్యవసాయ అధికారిఖాతాకు బదిలీ చేసేవారు. రైతుకు పరిహారాన్ని చెక్కు రూపంలో మండల వ్యవసాయ అధికారి, తహశీల్దార్ జాయింట్ సంతకం చేసి ఇచ్చేవారు. ఈ విధానంలో సర్వే సమయంలోనే అనేక మంది బోగస్ రైతుల పేర్లు జతచేసి పరిహారాన్ని వ్యవసాయ, రెవెన్యూ శాఖా ధికారులు స్వాహా చేసేవారు. అయితే 2012 నుంచి పరిహారం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశాలు రావడం అధికారులకు మింగుడు పడలేదు. 2012లో మంజూరైన రూ.190 కోట్ల పరిహారం పంపిణీకి సంబంధించి ఆ ఏడాదే డిసెంబర్ 12 వరకు 3.60 లక్షల మంది రైతులకు రూ.166 కోట్లు ఖాతాల్లో జమ చేశారు. ఈ చెల్లింపులు నడుస్తుండగానే ప్రభుత్వం నిధుల చెల్లింపులకు సంబంధించి ఫ్రీజింగ్ విధించడంతో మిగతా చెల్లింపులు ప్రభుత్వ ఖజానాలో అంటే ట్రెజరీల్లో నిలిచాయి. 47వేల మంది రైతులకు సంబంధించి రూ.24కోట్ల చెల్లింపులు నిలిచాయి. ఇక్కడివరకు సాఫీగానే సాగింది. ఆ తర్వాత పలువురు రైతులు పరిహారం కోసం ఆందోళన చేయడంతో మిగిలిన రూ. 24 కోట్ల చెల్లింపునకు ప్రభుత్వం మధ్యలో గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో దాదాపుగా 20 వేలకు పైగా రైతులకు సంబంధించి రూ.13.75 లక్షలను అధికారులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. మరో 23 వేలకు పైగా రైతులకు సంబంధించి రూ. 11.25 లక్షల పంట నష్టపరిహారం ట్రెజరీలోనే నిలిచింది. ఆ రైతులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలు లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైందని అప్పట్లో వ్యవసాయ శాఖాధికారులు పేర్కొన్నారు. అప్పటికీ పంట నష్టపరిహారం రాని పలువురు రైతులు పరిహారం కోసం ఆందోళన చేయడంతో మరోసారి రైతులకు సంబంధించి గ్రామాలవారీగా బ్యాంక్ ఖాతా నంబర్లను సేకరించారు. దీనికి సంబంధించి రూ.11.25 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. రూ.92 లక్షలు మిగులు అసలు కథ ఇక్కడే మొదలైంది. 23 వేలకు పైగా పరిహారం పొందాల్సి న రైతులు ఉండగా 22 వేల మందికి రూ.10.20 కోట్లు బ్యాంక్ ఖాతా ల్లో జమ చేశారు. మరో రూ.92లక్షలు అలాగే మిగిలాయి. జాబితాలో పలువురి పేరు ఉన్నా వారి వివరాలు, ఖాతాలు లేకపోవడంతో ఈ డబ్బులు అలాగే మిగిలినట్టు తెలుస్తోంది. సర్వే సమయంలో పరిహా రం నేరుగా అందజేసే క్రమంలో స్వాహా చేద్దామనే ఆలోచనతోనే పలువురు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు బోగస్ రైతుల పేర్లను చేర్చారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మిగిలిన పరిహారానికి సం బంధించి 90 రోజుల్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం గడువు విధించిం ది. ఇప్పటికీ 62 రోజులు దాటినా ఆ తతంగం ముందుకు సాగడం లేదు. దీనిని బట్టి 1300 మంది రైతుల పేరు మీద పరిహారం సొమ్మును స్వాహా చేద్దామనుకున్నప్పటికీ వ్యక్తిగత ఖాతాల కారణంగా అడ్డంగా దొరికిపోతామని భావించిన అధికారులు ఏమీ చేయలేక మిన్నకుండి పోయారు. ఒకవేళ పాత విధానమే అమల్లో ఉంటే ఈ పాటికి ఆ సొమ్ము స్వాహా అయ్యేది. మిగతా రైతులకు సంబంధించి ఖాతా నంబర్లు సేకరించాలని ఆదేశించినా ముందుకు సాగడం లేదు.