competitor
-
అమెజాన్ ప్రత్యర్థి కంపెనీలో సంక్షోభం! భారీగా ఉద్యోగాల తొలగింపు..
Zulily: ఒకప్పుడు 7 బిలియన్ డాలర్ల విలువతో అమెజాన్‌కు ప్రత్యర్థిగా ఉన్న ఆన్లైన్ షాపింగ్ సంస్థ జులిలీ.. అమెరికాలో కార్యకలాపాలను మూసివేస్తూ వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తోంది. సీటెల్‌తోపాటు వాషింగ్టన్‌లోని పలు ప్రాంతాలలో 292 మంది కార్మికులను జులిలీ తొలగించిందని, ఇది ఫిబ్రవరి 7 నుంచి అమలులోకి వస్తుందని అక్కడి రాష్ట్ర ఉపాధి భద్రతా విభాగం నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైనట్లు సీటెల్ టైమ్స్ వార్తా సంస్థ నివేదించింది. గీక్‌వైర్ అనే న్యూస్ సైట్ ప్రకారం.. 13 ఏళ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్న జులిలీ తన పయనీర్ స్క్వేర్ ప్రధాన కార్యాలయంతోపాటు ఇతర రాష్ట్రాల్లోని అనేక ఇతర కేంద్రాలను కూడా మూసివేస్తోంది. నెవాడా, ఒహియోలోని గిడ్డంగులను మూసివేయడం వల్ల మరో 547 మంది కార్మికుల తొలగింపులు జరుగుతాయని రెండు రాష్ట్రాల నోటీసుల ప్రకారం తెలుస్తోంది. తాజా ఉద్యోగాల కోతలకు ముందు కూడా జులిలీలో పలు రౌండ్ల తొలగింపులు జరిగాయి. అక్టోబర్‌లో కంపెనీ సీఈవో టెర్రీ బాయిల్ రాజీనామా చేశారు. 2010లో ప్రారంభం ఆన్లైన్ జ్యువెలరీ రిటైలర్ బ్లూ నైల్ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు మార్క్ వాడోన్, డారెల్ కావెన్స్ 2010లో జులీలీని ప్రారంభించారు. 2013 నాటికి జులీలీ 1.26 కోట్ల మంది యాక్టివ్ కస్టమర్లను కలిగి ఉంది. 331 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది 2010 కంటే దాదాపు 700 శాతం అధికం. 2013లో ఐపీఓకి వచ్చినప్పుడు జులీలీ 2.6 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉండగా మొదటి రోజు ముగిసే సమయానికి ఆ సంఖ్య దాదాపు రెండింతలు పెరిగింది. 2014 నాటికి జులీలీ 1 బిలియన్ డాలర్ల అమ్మకాలతో 7 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కలిగి ఉంది. అమెజాన్, ఓల్డ్ నేవీ కంపెనీలు మాత్రమే తక్కువ సమయంలో బిలియన్ డాలర్ల ఆదాయ మార్కును చేరుకున్నాయి. 2015లో జులిలీని లిబర్టీ ఇంటరాక్టివ్-క్యూవీసీ 2.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. తర్వాత దాన్ని క్యూరేట్‌గా పేరు మార్చింది. ఈ ఏడాది మేలో కంపెనీని లాస్ ఏంజిల్స్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ రీజెంట్‌కు విక్రయించింది. -
నాకు నేనే పోటీ
ఇండస్ట్రీలోకి రోజూ కొత్త టాలెంట్ వస్తూనే ఉంటుంది. కొత్త కొత్త ఆర్టిస్ట్స్ వస్తున్న కొద్ది పోటీ పెరుగుతూ ఉంటుంది. మరి ఆ పోటీని మీరు ఎలా తట్టుకోగలరు? అసలు మీరు పోటీని సీరియస్‌గా తీసుకుంటారా? అన్న ప్రశ్నను దిశా పాట్నీని ముందుంచితే.. ‘ఈరోజు వరకూ కూడా నా బిగ్గెస్ట్ కాంపిటేటర్ నేనే అని ఫీల్ అవుతాను’ అని పేర్కొన్నారు. ఇంకా ఇండస్ట్రీలో పోటీ వాతావరణం గురించి, హీరోయి¯Œ గా తన లక్ష్యం గురించి మాట్లాడుతూ–‘‘కాంపిటీషన్‌లా ఫీల్ అవ్వడం, వేరే వాళ్లతో పోటీపడటం లాంటివి నాకు పెద్దగా నచ్చవు. ఎవరి టాలెంట్‌ని బట్టి వాళ్లు వాళ్ల రేంజ్లో ఎదుగుతారని నమ్ముతాను. నా దృష్టి అంతా చేసే పని మీద ఫోకస్ చేయడమే. ప్రతీరోజూ వర్క్‌లో ఏదో ఓ కొత్త ప్రయోగం చేయడానికి ఆలోచిస్తాను. నా పనిలో బాగా కష్టపడి, ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయడమే హీరోయిన్గా నా లక్ష్యం. సినిమాకు వచ్చిన వాళ్లు థియేటర్ బయటకు వెళ్లేటప్పుడు హ్యాపీగా, ఎంటర్టైన్డ్గా ఫీల్ అవ్వాలి. వాళ్లు ఖర్చు చేసిన డబ్బులు, సమయానికి న్యాయంగా ఫీల్ అవ్వాలి’’ అని పేర్కొన్నారు. -
టాప్ హీరోయిన్‌తో వీధి వ్యాపారి పోటీ
ఆమె దేశంలోనే టాప్ హీరోయిన్. అతను వీధుల్లో పండ్లమ్ముకునే చిరు వ్యాపారి. ఇప్పుడీ ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. జిల్ జిగేల్ మెరుపులు తోడవడంతో సహజంగానే హీరోయిన్ ముందంజలో ఉంది. బతుకుపోరులో వెనుకపడిపోయిన ఆ వృద్ధ వ్యాపారి.. తారను నేలకు దించి, వెలిగిపోగలడా? నిద్రపోని నగరం ముంబైలో అడుగుకో మనిషి. మనిషి మనిషికో జీవితం. దానికో చరిత్ర. వాటిలో ఉత్తమమైనవాటిని పాఠకులకు అందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్లను సంపాదించుకుంది 'హ్యూమన్స్ ఆఫ్ ముంబై' ఫేస్ బుక్ పేజ్. 24 గంటల కిందట ఆ పేజ్ లో ఓ మామిడిపండ్ల వ్యాపారి మనోగతాన్ని ప్రచురించారు. కథనంలో వ్యాపారి మనోగతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ వ్యాపారి ఏమన్నారంటే.. 'ఫుట్ పాత్ మీద మామిడి పండ్లు అమ్ముకోవడమే నా జీవనాధారం. నేనే కాదు తరతరాలుగా మా కుటుంబం ఇదే వృత్తిలో కొనసాగుతోంది. అయితే అప్పటితో పోల్చుకుంటే మా పరిస్థితి దారుణంగా దిగజారింది. అదేం విచిత్రమో జనం ఇప్పుడు మా దగ్గర మామిడిపండ్లు కొనట్లేదు. హీరోయిన్ కత్రినా కైఫ్ టీవీల్లో చూపించినట్లు.. బాటిళ్లు కొనుక్కుని తాగుతున్నారు. బాటిళ్లలోని కెమికల్ రసాలతో పోల్చుకుంటే మా దగ్గర దొరికే తాజా మామిడి పండ్లే మంచివి. కానీ ఇది వ్యాపారం. వ్యాపారమన్నాక పోటీ తప్పదు. ఒకప్పుడు వ్యాపారికి, వ్యాపారికి మధ్య పోటీ ఉండేది. ఇప్పుడది విచిత్రంగా మారిపోయింది. నా వరకైతే నా ప్రధాన పోటీదారు కత్రినా కైఫే. ఆమె సరుకుల అమ్మకాలు తగ్గితేనే నాకు లాభం దొరుకుతుంది' అంటూ టాప్ హీరోయిన్ తో పోటీపడుతున్నట్లు వెల్లడిస్తాడు వీధి వ్యాపారి.