ఇండస్ట్రీలోకి రోజూ కొత్త టాలెంట్ వస్తూనే ఉంటుంది. కొత్త కొత్త ఆర్టిస్ట్స్ వస్తున్న కొద్ది పోటీ పెరుగుతూ ఉంటుంది. మరి ఆ పోటీని మీరు ఎలా తట్టుకోగలరు? అసలు మీరు పోటీని సీరియస్‌గా తీసుకుంటారా? అన్న ప్రశ్నను దిశా పాట్నీని ముందుంచితే.. ‘ఈరోజు వరకూ కూడా నా బిగ్గెస్ట్ కాంపిటేటర్ నేనే అని ఫీల్ అవుతాను’ అని పేర్కొన్నారు. ఇంకా ఇండస్ట్రీలో పోటీ వాతావరణం గురించి, హీరోయి¯Œ గా తన లక్ష్యం గురించి మాట్లాడుతూ–‘‘కాంపిటీషన్‌లా ఫీల్ అవ్వడం, వేరే వాళ్లతో పోటీపడటం లాంటివి నాకు పెద్దగా నచ్చవు.
ఎవరి టాలెంట్‌ని బట్టి వాళ్లు వాళ్ల రేంజ్‌లో ఎదుగుతారని నమ్ముతాను. నా దృష్టి అంతా చేసే పని మీద ఫోకస్ చేయడమే. ప్రతీరోజూ వర్క్‌లో ఏదో ఓ కొత్త ప్రయోగం చేయడానికి ఆలోచిస్తాను. నా పనిలో బాగా కష్టపడి, ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడమే హీరోయిన్‌గా నా లక్ష్యం. సినిమాకు వచ్చిన వాళ్లు థియేటర్ బయటకు వెళ్లేటప్పుడు హ్యాపీగా, ఎంటర్‌టైన్డ్‌గా ఫీల్ అవ్వాలి. వాళ్లు ఖర్చు చేసిన డబ్బులు, సమయానికి న్యాయంగా ఫీల్ అవ్వాలి’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment