computer virus
-
వైరస్ వల.. సాయం వంకతో భారీగా సైబర్ నేరాలు
బెంగళూరు: టెక్నికల్ సపోర్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మీ చింతలు తీరుస్తామంటూ చిక్కుల్లో పడేస్తున్నారు. ముఖ్యంగా ఇండియాలో ఈ తరహా నేరాలు భారీగా జరుగుతున్నాయి. సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థలు విడుదల చేసిన తాజా గణాంకాలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. వల విసురుతున్న సైబర్ నేరగాళ్లు ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే టెక్ సపోర్ట్ పేరుతో మెసాలకు పాల్పడుతున్న 2,00,00ల మంది సైబర్ నేరగాళ్లను గుర్తించామంటూ ప్రముఖ టెక్ సర్వీసెస్ సంస్థ అవాస్ట్ పేర్కొంది. ఇలా గుర్తించిన వారందరినీ బ్లాక్ చేయడం చేసినట్టు తెలిపింది. హానికర మాల్వేర్ సైబర్ నేరగాళ్లు టెక్ సపోర్ట్ పేరుతో వల వేస్తున్నారు. సామాన్యుల కంప్యూటర్లతో యాక్సెస్ దొరకగానే ... మాల్వేర్లను చొప్పిస్తున్నారు. అనంతరం డేటాను దొంగిలిస్తున్నారు. కొన్నిసార్లు సిస్టమ్ మొత్తం క్రాష్ అయ్యేలా హానికరమైన మాల్వేర్ను సైతం పంపిస్తున్నారు. దీంతో వీరి వలలో పడినవారు తీవ్రంగా నష్టపోతున్నట్టు అసలైన టెక్సపోర్ట్ సంస్థలు వెల్లడిస్తున్నాయి. సపోర్ట్ పేరుతో.. టెక్ సపోర్ట్ పేరుతో ఫోన్లు చేయడం, మెసేజ్‌లు పంపడం ద్వారా కంప్యూటర్ యూజర్లతో సైబర్ నేరగాళ్లు కాంటాక్ట్‌లోకి వస్తున్నారు. కంప్యూటర్, ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్‌లో సమస్య ఉందని దాన్ని పరిష్కరించుకోవాలంటూ సూచిస్తారు. తమ టెక్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్లను వాడితే సమస్య దూరమైపోతుందంటూ నమ్మిస్తున్నారు. ఆ వెంటనే తమ ప్రణాళికను అమల్లో పెడుతున్నారు. ఆర్థిక నేరాలు కంప్యూటర్లలో విలువైన సమాచారం చేతికి వచ్చిన తర్వాత కొందరు నేరగాళ్లు బ్యాంకు ఖాతాల ఆధారంగా ఆర్థిక నేరాలకు పాల్పడుతుంటే మరికొందరు వ్యక్తిగత సమాచారం ఆధారంగా బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. ఆన్లైన్ టెక్ సపోర్ట్ పేరుతో సంప్రదించే నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ సైబర్ సెక్యూరిటీ సంస్థలు సూచిస్తున్నాయి. -
బ్యాడ్‌యూఎస్‌బీ.. మహా మొండి వైరస్!
హ్యాకర్లు ఇప్పటిదాకా రకరకాల కంప్యూటర్ వైరస్‌లను వ్యాప్తి చేశారు. ఐటీ నిపుణులు వాటిని తొలగించే సాఫ్ట్వేర్లనూ తయారు చేశారు. అయితే.. ఎలాంటి యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లూ గుర్తించలేని, దాదాపుగా గుర్తించినా తొలగించలేని ఓ ప్రమాదకర వైరస్ ఇప్పుడు యూఎస్బీ డ్రైవ్‌ల ద్వారా వ్యాప్తి చెందుతోందట. ‘బ్యాడ్‌యూఎస్‌బీ’ అనే ఈ మాల్వేర్ ఒక్కసారి యూఎస్బీ డ్రైవ్‌కు ఇన్ఫెక్ట్ అయిందంటే చాలు.. డ్రైవ్‌ను కనెక్ట్ చేసిన ప్రతిసారీ కంప్యూటర్, ల్యాప్‌టాప్ వంటి అన్ని పరికరాల్లోకీ చేరిపోతుందని, గుర్తుతెలియని ప్రోగ్రామ్‌ను వాటిలో రన్ చేసి ఆ కంప్యూటర్లను హ్యాకర్లు ఆన్లైన్లో నియంత్రణలోకి తీసుకునేందుకు తోడ్పడుతుందని బెర్లిన్‌కు చెందిన సెక్యూరిటీ రీసెర్చ్ ల్యాబ్స్ పరిశోధకులు చెబుతున్నా రు. కంప్యూటర్లోకి బ్యాడ్‌యూఎస్‌బీ మాల్వేర్ ప్రవేశిస్తే గనక .. ఆపరేటింగ్ సిస్టమ్‌ను రీఇన్‌స్టాల్ చేసుకోవడంతోపాటు అన్ని యూఎస్బీ పరికరాలనూ మార్చుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. -
వై-ఫైతో సరికొత్త వైరస్!!
కంప్యూటర్లో గానీ, ఇంటర్నెట్ ద్వారా గానీ వైరస్ ఏమైనా వస్తే.. మీ యాంటీ వైరస్ దాన్ని సమర్ధంగా అడ్డుకోగలదేమో. కానీ వై-ఫై ద్వారా వస్తున్న సరికొత్త వైరస్‌ను మాత్రం ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారట. గాలి ద్వారా.. వై-ఫై సిగ్నళ్లతో వస్తున్న ఈ వైరస్‌ను అడ్డుకోవడం ఎలాగో తెలియక నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా విమానాశ్రయాలు, కాఫీ షాపులలో ఉచితంగా లభించే ఓపెన్ యాక్సెస్ వై-ఫై ద్వారానే ఈ వైరస్ వస్తోందని గమనించారు. సాధారణంగా ఇళ్లలో గానీ, కార్యాలయాల్లో గానీ ఉండే వై-ఫై అయితే సెక్యూరిటీ పాస్‌వర్డ్‌తో ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే తప్ప వై-ఫై సిగ్నల్ అందదు. కానీ, కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం కొన్ని పెద్దపెద్ద మాల్స్‌లోను, కాఫీ షాపుల్లోను, చివరకు పెద్దస్థాయి సినిమా థియేటర్లలో కూడా ఉచితంగా వై-ఫై సదుపాయం కల్పిస్తున్నారు. సింగపూర్ లాంటి చోట్ల అయితే ఏకంగా నగరం మొత్తానికి ఉచితంగా వై-ఫై సిగ్నళ్లు అందుతున్నాయి. ఇలాంటి చోట్లే ప్రధానంగా ఈ సరికొత్త వైరస్ వస్తోందని బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్ పరిశోధకులు చెబుతున్నారు. 'కెమిలియన్' అనే ఓ వైరస్‌ను వాళ్లు సృష్టించి, నమూనా కోసం ప్రయోగించారు కూడా. ఎన్క్రిప్షన్ గానీ, పాస్వర్డ్లు గానీ లేని వై-ఫైలను అది సులభంగా పసిగట్టి, లోనికి ప్రవేశించింది. కంప్యూటర్ హ్యాకర్లు ఎక్కువగా వై-ఫై కనెక్షన్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారని, అందువల్ల తప్పనిసరిగా పాస్వర్డ్ పెట్టుకోవాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.