conditions must
-
నిబంధనలు పాటించాల్సిందే !
సాక్షి, కడప : నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలల అనుమతి ఇక రద్దు కానుంది. రాష్ట్ర ప్ర భుత్వం ఇటువంటి పాఠశాలలపై కొరఢా ఝు లి పించడానికి చర్యలు తీసుకుంటోంది. ఇందుకుగాను జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో డీఈవో, డీటీసీ లాంటి అధికారులు సభ్యులుగా ఉంటూ పాఠశాలల్లో వసతులు పరిశీలించనున్నారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా అనుమతి పునరుద్ధరించాలా? వద్దా? అన్నది నిర్ణయించి చర్యలు తీసుకోనున్నారు. ఇలా ప్రైవేటు బడుల్లో వసతులను తరగతులు ప్రారంభం కాక ముందే పరిశీలించడానికి విద్యాశాఖ కొన్ని నిబంధనలు తయారు చేయనుంది. ఈ మేరకు ఈనెల 24న సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. జిల్లాలో మొత్తం ప్రైవేటు పాఠశాలలు 1151 ఉన్నాయి. వీటిల్లో 1,99,524 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, ఉన్నత పాఠశాలలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. వీరంతా ప్రభుత్వ నిబంధనల మేరకు గదులు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఎక్కువ పాఠశాలలు కనీస సదుపాయాలు లేకుండానే నడిపిస్తున్నారు. వీరిలో కొందరికి రాజకీయ పలుకుబడి ఉండడంతో నెట్టుకొస్తున్నారు. ఇలాంటి వాటి నిర్వహణ ఇక కష్టం కానుంది. జిల్లాస్థాయి కమిటీ పరిశీలన తర్వాత సదుపాయాలపై నివేదిక ఇస్తారు. ఈ నివేదిక ఆధారంగా బడులకు అనుమతి పునరుద్ధరణ చేస్తారు. ప్రైవేటు పాఠశాలలు నిర్వహణ కోసం గదులు, మరుగుదొడ్లు, ప్రాంగణం, నిపుణులైన ఉపాధ్యాయులు ఉండాలి. చాలా వరకు పాఠశాలలు అద్దె భవనాల్లో నడిపిస్తున్నారు. అక్కడ గదుల కొరత ఉంది. ఇరుకు గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఎక్కువ పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉండటం లేదు. ఒకటో రెండో మరుగుదొడ్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. సొంత భవనాలున్న బడులకు సైతం మౌలిక వసతులు లేవు. క్రీడా ప్రాంగణం లేని బడులు 80 శాతం వరకు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. పిల్లలను చదువుల యంత్రాలుగా చేస్తున్న సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. అగ్నిమాపక శాఖ అనుమతి తప్పనిసరి.. బహుళ అంతస్తులున్న భవనాల్లో ప్రమాదాల సమయంలో రక్షణ చర్యలు కోసం ప్రతి పాఠశాల ప్రత్యేక మెట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకు గాను అగ్నిమాపక శాఖ ఇచ్చే ధ్రువీకరణ తీసుకోవాల్సి ఉంది. అదే విధంగా శానిటేషన్ ధ్రువీకరణ స్థానిక సంస్థల ద్వారా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవన్ని లేని పాఠశాలలు జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అలాగే పాఠశాల ఆడిట్ క్రమం తప్పకుండా చేయించా లి. వీటిని ఏటా సంబంధిత విద్యాశాఖకు నివేదించాలి. వచ్చే ఆదాయంలో 10 శాతం మాత్రమే యాజమాన్యం తీసుకోవాల్సి ఉంది. మిగిలిన సొమ్ము పాఠశాల మౌలిక వసతులు, ఉపాధ్యాయులు జీతభత్యాలకు ఖర్చు చేయాల్సి ఉంది. ఉపాధ్యాయులకు అరకొర జీతాలు ఇస్తున్న సంస్థలు ఎక్కువే ఉన్నాయి. అలాంటి యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటారు. నిపుణులు తక్కువే.. ఇక్కడ పనిచేస్తున్న వారిలో ఎక్కువ బీఈడీ చేసిన వారు ఉండటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్న మాట. ఇలాంటి ఉపాధ్యాయుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. వారి వివరాలకు ఆధార్‌కు అనుసంధానం చేస్తారు. అర్హత ఉన్న ఉపాధ్యాయులంతా టెట్ పాసై ఉండాలి. ధ్రువపత్రాలు ఒకరివి చదువులు చెప్పేది వేరొకరు ఉండరాదు. ఇవన్ని పరిశీలన చేయనున్నారు. ఎక్కువ పాఠశాలల్లో ధ్రువీకరణ పత్రాలకు పనిచేస్తున్న వారికి తేడా ఉంటోంది. తక్కువ మొత్తంలో నగదు చెల్లించి వీరిని చదువుల కోసం తీసుకుంటున్నారు. ఇలాంటి వారికి ఇక చెక్ పడనుంది. -
వరిలో సస్యరక్షణ తప్పనిసరి
అనంతపురం అగ్రికల్చర్: సస్యరక్షణ చర్యలు పాటిస్తేనే వరిలో అధిక దిగుబడులు సాధ్యమని ఏరువాక కేంద్రం (డాట్‌సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. జిల్లాలో వరి సాధారణ విస్తీర్ణం 22,169 హెక్టార్లు కాగా, ప్రస్తుతానికి 6,500 హెక్టార్ల విస్తీర్ణంలో నాట్లు వేశారన్నారు. వరికి తెగుళ్లు, పురుగులు ఆశించినందున సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టి నివారించుకోవాలని సూచించారు. ఆకుముడత నివారించాలి కాల్వల కింద నీళ్లు విడుదల చేయకపోవడంతో ప్రస్తుతం ఎక్కువగా బోర్ల కిందే వరి నాట్లు వేస్తున్నారు. నాటిన ప్రాంతాల్లో అక్కడక్కడా ఆకుముడుత ఆశించి నష్టం కలిగిస్తోంది. ఉధృతి ఎక్కువైతే ఆకులు తెల్లగా మారుతాయి. కంకి, గింజ దశలో పురుగు ఆశిస్తే ఎక్కువ నష్టం కలుగుతుంది. ఆకుముడుత నివారణకు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. గొంగలి పురుగు ఆకుముడుతలో ఉంటూ పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకులు తెల్లబడిపోతాయి. దిగుబడులు బాగా తగ్గిపోతాయి. నివారణలో భాగంగా పిలకదశలో తాడు తీసుకుని చేనుకు అడ్డంగా రెండు మూడు సార్లు లాగితే పురుగులు కింద పడిపోతాయి. ఆ తర్వాత 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్ లేదా 1.5 గ్రాములు అసిఫేట్ లేదా 2 గ్రాములు కాపర్ హైడ్రోక్లోరైడ్ లేదా 0.25 మి.లీ ఫ్లూబెండమైడ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎకరాకు 8 కిలోలు కార్భోఫ్యూరాన్ గుళికలు వేసుకోవాలి. కాలిబాటలు తప్పనిసరి వరిలో ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల మేర కాలిబాటలు వదులుకుంటే గాలి, వెలుతురు పంటకు బాగా ప్రసరించడంతో పాటు ఎరువులు, పురుగు మందుల పిచికారీకి అనువుగా ఉంటుంది. వరికి అక్కడక్కడా సుడిదోమ ఆశించినందున ఎకరాకు 330 మి.లీ అఫ్లాడ్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే అక్కడక్కడా పొడతెగులు కనిపిస్తున్నందున నివారణకు ప్రస్తుతం పైపాటుగా నత్రజని ఎరువులు వేసుకోకూడదు. మురుగు నీరు లేకుండా జాగ్రత్త పడాలి. 2 మి.లీ హెక్సాకొనజోల్ లేదా 2 మి.లీ వాలిడామైసిన్ లేదా 1 మి.లీ ప్రొపికొనజోల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వరిలో కాండంతొలిచే పురుగు నివారణకు 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్ లేదా 1.5 గ్రాములు అసిఫేట్ లేదా 2 గ్రాములు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. -
థియేటర్లలో ప్రమాణాలు పాటించాలి : జేసీ
అనంతపురం అర్బన్ : సినిమా థియేటర్లలో ప్రభుత్వం నిర్ధేశించిన ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని జాయింట్ కలెక్టర్ టి.కె.రమామణి వాటి యాజమానులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఆమె డీఆర్వో సి.మల్లీశ్వరిదేవితో కలిసి జిల్లాలోని సినిమా థియేటర్ల యజమానులు, మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. థియేటర్ల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు వివిధ శాఖల నుంచి అనుమతులను సకాలంలో పొందాలని ఆదేశించారు. ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్ టికెట్లను కొంత మేర విక్రయించుకుని మిగిలినవి తప్పనిసరిగా థియేటర్ బుకింగ్ కౌంటర్లలోనే విక్రయించాలన్నారు. బహిరంగ ధూమపానం, ఉమ్మి వేయుటను కఠినంగా నిషేధించాలని ఆదేశించారు. తినుబండారాల ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించి ఆ ధరలకే విక్రయించాలన్నారు. అధిక ధరలు వసూలు చేసినా, కాలపరిమితి దాటిన వాటిని విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. థియేటర్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సమావేశంలో అనంతపురం, కళ్యాణదుర్గం ఆర్డీఓలు మలోల, రామారావు, ధియేటర్ల యజమానులు, మేనేజర్లు పాల్గొన్నారు.