Configurations
-
విశాఖలో మిలాన్ విన్యాసాలు
అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను సమర్థవంతంగా నిర్వహించి తన సత్తా చాటిన తూర్పు నావికాదళం మరోసారి అంతటి కీలకమైన కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వబోతోంది. పలు దేశాల నావికాదళాలు పాల్గొనే మిలాన్ విన్యాసాలకు విశాఖ వేదిక కానుంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ విన్యాసాలు జరగనున్నాయని తూర్పు నావికాదళం(ఈఎన్సీ) ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్ ప్రకటించారు. నేవీ ప్రధాన కేంద్రంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ శత్రు దేశాలకు మన సాయుధ సంపత్తి, సైనిక బలగాల శక్తి సామర్థ్యాలు ఎప్పటికప్పుడు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. అలాగే మిత్ర దేశాలతో అనుబంధాన్ని పటిష్ట పర్చుకోవాలన్నారు. ఈ రెండు లక్ష్యాల సాధనకు సంయుక్త విన్యాసాలు దోహదపడతాయన్నారు. ఆ లక్ష్యాలతోనే 1995లో మిలాన్ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. గత ఏడాది అండమాన్ నికోబార్ దీవుల్లో నావికాదళం నిర్వహించిన ఈ విన్యాసాల్లో 12 దేశాలు పాల్గొన్నాయి. వచ్చే ఏడాది విశాఖలో నిర్వహించే మిలాన్‌లో అంతకంటే ఎక్కువ దేశాలు పాల్గొననున్నాయి. సాక్షి, విశాఖపట్నం: నౌకాదళ విభాగంలో ప్రతిష్టాత్మకమైన మిలాన్ విన్యాసాలకు తొలిసారిగా విశాఖ వేదిక కానుందని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ ప్రకటించారు. గతేడాది అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన ఈ విన్యాసాల్లో 12 దేశాలు పాల్గొన్నాయని.. ఈసారి అంతకు మించి భారీ ఏర్పాట్లకు ఈఎన్సీ సమాయత్తమవుతోందన్నారు. తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని ఇండోర్ మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈఎన్సీ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ ఎ.కె. జైన్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ ఎస్ఎన్ ఘోర్మడే ఆధ్వర్యంలో ఆర్మ్డ్ గార్డులు, నౌకాదళ సిబ్బంది, డిఫెన్స్ సెక్యూరిటీ సిబ్బంది, సీ క్యాడెట్లు, వివిధ నౌకలు, సబ్మెరైన్ల సిబ్బంది మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. శత్రు సైన్యాన్ని ఎదుర్కొనేందుకు అప్రమత్తం గా వ్యవహరిస్తూ సముద్ర తీరంలో నిత్యం సన్నద్ధంగా ఉన్నామని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలని ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ జైన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇతర దేశాలతో సహృద్భావ వాతావరణంలో స్నేహ పూర్వక సత్సంబంధాలు పెరుగుతుండటం శుభపరిణా మమన్నారు. ఈ బంధం మరింత బలపరచుకునేందుకు మార్చి 2020లో జరగనున్న మిలా న్ బహుపాక్షిక విన్యాసాలను భారత నౌకాదళం నిర్వహిస్తోందన్నారు. ఇండియన్ ఫ్లీట్ రివ్యూ తర్వాత అంతటి చరిత్రాత్మకమైన ఈవెంట్ విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీచ్‌రోడ్డులోని విక్టరీ ఎట్ సీ వద్ద జనరల్ నేవల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వైస్ అడ్మిరల్ నారాయణ్ ప్రసాద్ వీరమరణం పొందిన నౌకాదళ సిబ్బందికి ఘన నివాళులర్పించారు. -
మార్చ్..మార్చ్..మార్చ్..
గుర్తు తెలియని వాహనంతో కొందరు ఆయధాలతో అనుమానాస్పదంగా సంచరిస్తున్నారనే సమాచారాన్ని ఉన్నతాధికారుల నుంచి అందుకున్నారు మహిళా కమేండోలు. వెంటనే రంగంలోకి దిగి ఆ వాహనాన్ని గుర్తించారు... వారిపై మెరుపు దాడి చేసి వాహనంలో ప్రయాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు... ఇవే కాకుండా ఆయుధం లేకుండా శత్రువును మట్టి కరిపించడం... సాయుధులైన శత్రువులను కూడా ఉట్టి చేతులతో అదుపులోకి తీసుకోవడం లాంటి కఠినమైన శిక్షణను పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి మహిళ కమేండో బృందంగా గుర్తింపు పొందారు. కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి అలోచన మేరకు 39 మంది సుక్షితులైన మహిళ కమేండోలు అందుబాటులోకి వచ్చారు... క్రావ్‌మగా యుద్ధతంత్ర కళ గతంలో సూర్యాపేట జిల్లాలో బస్టాండ్‌లో పోలీసులు తనిఖీలు చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా ఆయుధాలతో ఇద్దరు పోలీసు అధికారులను కాల్చి చంపారు... ఇటీవల మొయినాబాద్‌లో కత్తితో పోలీసును గాయపర్చిన సంఘటన... బెంగుళూరులో కత్తిపోట్లు తదితర సంఘటనల దృష్ట్యా పోలీసుల వద్ద ఆయుధం లేని సమయంలో శత్రువు దాడి చేసినప్పుడు ఎలా ఎదుర్కోవాలో నేర్పే శిక్షణ ఇప్పిస్తే బాగుంటుందనుకున్నారు కమలాసన్ రెడ్డి. నిరాయుధులుగా ఉన్న వారిపై శత్రువు అకస్మాత్తుగా సాయుధ దాడి చేస్తే ఆత్మరక్షణ చేసుకుంటూనే శత్రువును లొంగదీసుకునేందుకు ఇజ్రాయిల్దేశం క్రావ్‌మగా అనే యుద్ధతంత్ర కళలను అమలు చేస్తోంది. ఈ కళను వినియోగించి శత్రువును సులభంగా లొంగదీసుకోవడం సులువవుతుంది. 2017 జూన్‌లో పురుష పోలీసులకు శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత మహిళ బృందాన్ని ఎంపిక చేసి వారికి కఠోర శిక్షణ ఇప్పించి వారిని కమెండోలుగా రూపుదిద్దారు. శిక్షణ ఇలా... కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న 97 మంది మహిళ సిబ్బంది నుంచి చురుకుగా ఉన్న 39 మంది మహిళ పోలీసులను ఎంపికచేశారు. వారికి కఠోరమైన క్రావ్‌మగా శిక్షణ ఇచ్చారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ శిక్షణలో మొదటి గంట వరకూ ఫిజికల్ ఫిట్నెస్, పీటీ సర్క్యూట్, అజిలిటి డ్రిల్ (అప్రమత్తతో కూడిన) శిక్షణ ఇస్తారు... ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకూ, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వివిధ పోరాట పద్ధతులు, వాటిని ఎదుర్కొనే తీరుపై 32 రోజులు పాటు నిర్విరామంగా శిక్షణ ఇచ్చారు. సిద్ధమైన కమెండో బృందం రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళ పోలీసు కమెండోల బృందం ఈ నెల 1వ తేదీన ఆవిర్భవించింది. నెల రోజుల పాటు కఠోర శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కమెండోలు వారి నైపుణ్యాలను, విన్యాసాలను ఈనెల 1న కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్ కుమార్, సీపీ కమలాసన్‌రెడ్డి, పలువురు అధికారుల ముందు ప్రదర్శించి అందరినీ అశ్చర్యపరిచారు. ఇజ్రాయిల్ దేశపు యుద్ధతంత్ర కళలో శిక్షణ పొందిన మహిళ కమెండోలు ఎలాంటి ఆయుధాలు లేకుండా అసాంఘిక శక్తులను అడ్డుకోవడం, జనసమూహన్ని చెదరకొట్టడం, అనుమానాస్పద వ్యక్తులు ఎదురు పడిన సందర్భాల్లో అదుపులోకి తీసుకోవడం. ఆయుధాలు ధరించి సంచరించే వారిని గుర్తించడంలో మెళకువలు, శత్రువు ఆయుధం ఎక్కుపెట్టిన సందర్భాల్లో వారిని ఎదిరించి లొంగదీసుకోవడం, వాహనాల్లో పారిపోతున్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకోవడంతోబాటు అధునాతన ఆయుధాలతో యుద్ధతంత్ర కళల్లోని పలు విన్యాసాలను చేసి ఆహూతులను అబ్బురపరిచారు. పూర్తిస్థాయి కమేండోలుగా మారిన ఈ బృందాన్ని అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా క్యూఆర్టీ(క్విక్ యాక్షన్ టీం)గా ప్రత్యేక బాధ్యతలు అప్పగించనున్నారు. వీరికి పెట్రోలింగ్ విధులనూ కేటాయించారు. ఎలాంటి సమస్య వచ్చినా రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారీ కమేండోలు. – పుల్లమళ్ల యాదగిరి, సాక్షి, కరీంనగర్ ఎలాంటి పరిస్థితులనైనా సరే.. మహిళా పోలీస్‌గా పలు ప్రాంతాలు ఒంటరిగా తిరిగే సమయంలో బెరుకుగా, ఇబ్బందిగా ఉండేది. కమేండో శిక్షణ పూర్తయిన తర్వాత ఒంటరిగా ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనే ధైర్యం వచ్చింది. – జ్యోతి, కానిస్టేబుల్ కొండంత ధైర్యం వచ్చింది! గతంలో షీ టీమ్ బృందంలో పని చేసినప్పుడు.. కొంతమంది పోకిరీలను అదుపులోకి తీసుకునే సమయంలో కొంత ఇబ్బందిగా ఉండేది. మాకు కమేండోగా మారే అవకాశం వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకున్నాం. ఇప్పుడు కొండంత ధైర్యం వచ్చింది. శత్రువు చేతిలో ఆయుధం ఉన్నా ఎదుర్కోగలం. – గౌతమి, కానిస్టేబుల్ -
కొరియాపై అమెరికా విమానాల చక్కర్లు
వాషింగ్టన్: అమెరికా, ఉ.కొరియాల మధ్య నెలకొన్న అణు ఉద్రిక్తతల నేపథ్యంలో జపాన్ భూభాగం, కొరియా ద్వీపకల్పంపై అమెరికా యుద్ధ విమానాలు శుక్రవారం విన్యాసాలు నిర్వహించాయి. జపాన్, దక్షిణ కొరియా యుద్ధ విమానాలు వెంట రాగా అమెరికా సూపర్ సోనిక్ బీ–1బీ లాన్సర్ విమానాలు కొరియా గగనతలంపై చక్కర్లు కొట్టాయి. ఆదివారం నుంచి జపాన్, దక్షిణ కొరియాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనకు సన్నాహకంగా నిర్వహించిన ఈ డ్రిల్‌ను ‘ఆకస్మిక అణు దాడి విన్యాసాలు’గా ఉత్తర కొరియా తీవ్రంగా తప్పుపట్టింది. అణ్వాయుధాల్ని మోహరించడం ద్వారా సామ్రాజ్యవాద అమెరికా అణు యుద్ధానికి ఆజ్యం పోసేందుకు చూస్తోందని, అమెరికా చర్యలకు బెదిరే ప్రసక్తే లేదని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. గ్వామ్‌లోని అండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి రెండు బీ–1బీ లాన్సర్ యుద్ధ విమానాలు పశ్చిమ జపాన్‌లో ఆ దేశ ఎయిర్ ఫోర్స్ విమానాలతో కలిసి సంయుక్త విన్యాసాలు జరిపాయని అమెరికా పసిఫిక్ ఎయిర్ ఫోర్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అనంతరం లాన్సర్ విమానాలు యెల్లో సీపై కొరియా యుద్ధ విమానాలతో కలిసి విన్యాసాల్లో పాల్గొని.. గ్వామ్‌లోని యుద్ధ విమానాల స్థావరానికి తిరిగి చేరుకున్నాయని తెలిపింది. పసిఫిక్ ప్రాంతంలో ఉమ్మడి యుద్ధ విన్యాసాల్లో భాగంగానే ఇవి కొనసాగాయని, కొరియా ద్వీపకల్పంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో వీటికి ఎలాంటి సంబంధం లేదని ఆ ప్రకటనలో అమెరికా స్పష్టం చేసింది. -
జిమ్నాస్టిక్స్
అబ్బురపరిచే విన్యాసాలు చేస్తున్న యువతేజాలు కఠోరమైన సాధనతో ప్రత్యేక గుర్తింపు ఓరుగల్లు పేరును నలుదిశలా చాటుతున్న క్రీడాకారులు జాతీయ స్థాయిలో అనేక పతకాలు ‘‘ఒకటే గమనం.. ఒకటే పయనం.. గెలుపు పొందే వరకూ.. అలుపులేదు మనకు..’’ అని ఓ సినీకవి రాసిన పాటను వీరు అక్షరాల పాటిస్తున్నారు. కష్టాలు వచ్చినా.. కన్నీళ్లు వచ్చినా.. వాటిని దిగమింగుకుని లక్ష్యసాధనకు పాటుపడుతున్నారు. నిత్యం కఠోరమైన సాధనతో అబ్బురపరిచే విన్యాసాలు చేస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. క్రమశిక్షణ.. అంకితభావానికి మారుపేరుగా నిలిచే ‘జిమ్నాస్టిక్్స’లో జిల్లాకు చెందిన పలువురు యువతేజాలు రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. –వరంగల్ స్పోర్ట్స్ దీపా కర్మాకర్ స్ఫూర్తిగా.. మేటి జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి ‘దీపా కర్మాకర్’ భారతదేశం గర్వించదగిన ముద్దుబిడ్డ. మునుపెన్నడూ లేని రీతిలో ఆమె దేశచరిత్రను తిరగరాసింది. తాజాగా జరుగుతున్న రియో ఒలింపిక్స్‌లో దీపా కర్మాకర్ అద్భుత ప్రదర్శనతో జిమ్నాస్టిక్స్‌లో ఫైనల్స్‌కు చేరడం గమనార్హం. అయితే ప్రపంచ ప్రజలందరి దృష్టిని ఆక్షరించిన 23 ఏళ్ల దీపా కర్మాకర్‌ను స్ఫూర్తిగా తీసుకుని మన జిల్లాకు చెందిన విద్యార్థులు, యువకులు జిమ్నాస్టిక్స్‌లో సత్తాచాటుతున్నారు. 1570లో ఆవిర్భావం.. జిమ్నాస్టిక్స్ అంటే వాడుక భాషలో సర్కస్ ఫీట్లు అని అర్థం. బలం, సమతుల్యత, చురుకుదనం, ఓర్పు, నియంత్రణ కలగలిపిన వ్యాయామాల ప్రదర్శనే జిమ్నాస్టిక్స్ అని చెప్పొచ్చు. ఈ క్రీడ 1570లో పురాతన గ్రీసులో ఆవిర్భవించింది. 1759–1839 మధ్య కాలంలో జర్మనీలో భౌతిక విద్యావేత్త జోహన్ ఫ్రెడరిక్ యువకులను ఉత్తేజ పరిచేందుకు ఈ ఆటను కనుగొన్నారు. అయితే అనేక పరిణామాల తర్వాత 1928లో జిమ్నాస్టిక్స్ను ఒలింపిక్స్ క్రీడగా గుర్తించారు. అనంతరం ప్రతిదేశం తన సొంత జాతీయ పాలకమండలిని ఏర్పాటు చేసుకుంది. జిమ్నాస్టిక్స్‌లో రిథమిక్, ట్రామ్ఫోలిన్, ఏరోబిక్స్, తదితర ఈవెంట్లు ఉంటాయి. ఈ క్రీడలో జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించారు. ఎనిమిదేళ్లుగా శిక్షణ నేను ఎనిమిదేళ్లుగా హన్మకొండలోని అకాడమీలో ఉంటూ జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాను. ఇప్పటివరకు 12 జాతీయ, 18 రాష్ట్రస్థాయి జూనియర్స్, సీనియర్స్ పోటీలకు హాజరయ్యాను. 2012లో తమిళనాడులో జరిగిన జూనియర్ నేషనల్స్‌లో సిల్వర్, 2013లో హైదరాబాద్‌లో జరిగిన నేషనల్స్‌లో సిల్వర్ మెడల్స్ సాధించాను. అలాగే 2012లో బెంగళూరులో జరిగిన సౌత్ ఇంటర్ నేషనల్స్‌లో పాల్గొన్నాను. ఇప్పటివరకు 30 టోర్నమెంట్లలో పాల్గొని 15 సిల్వర్, 10 బ్రాంజ్ మెడల్స్ సాధించాను. – ఈ. ప్రశాంత్, డిగ్రీ సెకండియర్ పది బంగారు పతకాలు నేను పదేళ్లుగా హన్మకొండలోని అకాడమీలో జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ పొందుతున్నాను. 2008 నుంచి ఇప్పటి వరకు మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన 20 జాతీయస్థాయి, 20కి పైగా రాష్ట్రస్థాయి పోటీలకు హాజరై 10 గోల్డ్, 12 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ సాధించాను. భవిష్యత్‌లో మరింత సాధన చేసి అంతర్జాతీయస్థాయిలో రాణించాలన్నదే లక్ష్యం. – కె. ప్రవళిక, ఇంటర్ సెకండియర్ ఆర్టిస్టిక్ విభాగంలో పట్టు నేను జిమ్నాస్టిక్స్లోని ఆర్టిస్టిక్ విభాగంలో జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఆర్టిస్టిక్పై మరింత పట్టు సాధించేందుకు ఉదయం, సాయంత్రం వేళలో కఠోరంగా ప్రాక్టీస్ చేస్తున్నాను. కోచ్‌ల సూచనలు పాటిస్తూ అంతర్జాతీయస్థాయిలో రాణించే విధంగా శిక్షణ పొందుతున్నాను. ఇప్పటివరకు 20 జాతీయ, 15 రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. జాతీయ స్థాయిలో 10 బంగారు, 20 సిల్వర్ మెడల్స్ సాధించాను. – బి. సంజయ్‌కుమార్, డిగ్రీ సెకండియర్ -
జై జవాన్
-
అబ్రకదబ్ర మాయూ లేదు.. మర్మం లేదు..
నేడు వరల్డ్ మెజీషియన్ డే ఇంద్రజాలం.. ఆనందం, ఉత్కంఠను కలిగిస్తోంది.. కార్పొరేట్ జీవితంలో ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు.. మనసును రీచార్జి చేసేందుకు మేజిక్ దోహదపడుతుంది. మాయలోళ్లు (మెజీషియన్) చేసే విన్యాసాలు అబ్బురపరచడంతో విశ్వవాప్తంగా ఈ కళ పేర్గాంచింది. ఒకప్పుడు ఎంతో ఆదరణ పొందిన ఇంద్రజాలం రానురానూ చిన్నచూపునకు గురవుతోంది. ఉత్సవాలు, వివాహ, పుట్టినరోజు వేడుకలు, రాజకీయ నాయకుల సభావేదికలపై ఆహుతులను ఉత్తేజపరిచేందుకు ఈరోజుల్లో ఎక్కువుగా మేజిక్ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల పలువురు మెజీషియన్లు ఇతర వృత్తులవైపు చూస్తున్నారు. గతంలో జిల్లాలో 100 మందికిపైగా ఉన్న ఇంద్రజాలికులు ప్రస్తుతం 10 మంది మాత్రమే ఉండటం ఇందుకు నిదర్శనం. ఫిబ్రవరి 23వ తేదీన ప్రపంచ ఇంద్ర జాలికుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. - ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) మేజిక్‌లు 23 రకాలు ఇంద్రజాల కళలో 23 రకాలు ఉన్నారుు. ఒక్కో కళాకారుడూ కొన్ని రకాలను మాత్రమే ప్రదర్శించడంలో నిష్ణాతులవుతుంటారు. అన్ని రకాల కళలను ఒకే వ్యక్తి చేసే అవకాశం ఉండదని మెజీషియన్లు అంటున్నారు. సుమారు 10 రకాల మేజిక్‌లు మాత్రమే తరచుగా చేస్తుంటారు. వాటిలో మెకానికల్ రకం మొదటిది దీనిలో కొన్ని రకాల వస్తువులను ఉపయోగించి ఇంద్రజాలికులు మేజిక్ చేస్తారు. హస్త లాఘవం మరో రకం. వస్తువులను చేతిలోనే దాచి, గాలిలో నుంచి తీసినట్టుగా చూపించడం దీని ప్రత్యేకత. సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతూ.. ఇల్యూయన్ మరో రకం. ఇది ఆహుతులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతోంది. మనిషి లేదా జంతువును ముక్కలుగా చేయడం, అక్కడి నుంచి మాయం చేయడం. మరలా యథావిధిగా అమర్చడం దీని ప్రత్యేకత. ఇటువంటి మేజిక్‌లను మనం ఎక్కువుగా ఎగ్జిబిషన్లలో చూస్తుంటాం. వెంట్రిలాక్విజం రకానికి ప్రత్యేక స్థానం ఉంది. బొమ్మతో మాట్లాడించడం ఇందులో మనకు కనిపిస్తోంది. సైంటిఫిక్ మేజిక్ మరో రకం. లెక్కలు, సైన్స్‌పై మేజిక్‌లు చేయడం ఈ రకంలోకి వస్తుంది. ఇటువంటి రకాలు ఎక్కువుగా ప్రాచుర్యంలో ఉన్నారుు. కొత్తవారు రావడం లేదు మెజీషియన్ వృత్తిలోకి కొత్తగా ఎవరూ రావడం లేదని కళాకారులు అంటున్నారు. అభిరుచి మేరకు నేర్చుకుని వారి ఖాళీ సమాయాల్లో స్నేహితులు, కుటుంబసభ్యులను మెప్పించడానికే ఈ కళను నేర్చుకున్న వారు తప్ప ఇదే జీవనాధారంగా గడిపేవారు జిల్లాలో ఒకరిద్దరూ తప్ప ఎవరూ లేరనే చెప్పాలి. 14 ఏళ్ల వయసు నుంచీ.. ఏలూరుకు చెందిన సాయిరామ్ ఈవెంట్స్ అధినేత కొవ్వలి శ్రీనివాస్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఇంద్రజాలికుడిగా నిలిచారు.1964లో కొవ్వలి సేతు మాధవరావు, లక్ష్మి నరసమ్మ దంపతులకు రెండో సంతానంగా జన్మించిన శ్రీనివాస్ చిన్నతనం నుంచి ఇంద్రజాలంపై ఆసక్తి పెంచుకున్నారు. విఠలాచార్య చిత్రాలు చూసి మాయలు, మంత్రాలకు ఆకర్షితులయ్యూరు. 14 ఏళ్ల వయసులో ఏలూరులో ఆచార్య జి.డీలానంద్ అనే సినీ ఆర్చురీ డెరైక్టర్ (లవకుశ చిత్రంలో ధనుర్ విద్య) వద్ద శిష్యునిగా చేరారు. 1979 నుంచి మెజీషియన్‌గా షోలు చేస్తున్నారు. దీనినే జీవనాధారంగా భావించి ముందుకు సాగుతున్నారు. ఆదరణ తగ్గలేదు దేశంలోని పలు ప్రాంతాల్లో వేలాది కార్యక్రమాలను నిర్వహించి అభిమానులను సొంతం చేసుకున్నాను. నా వద్ద సుమారు 30 మంది ఇంద్రజాల విద్యను నేర్చుకుని పలు ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది అభిరుచి ఉన్నవారే. ఇంద్రజాల కళకు ఆదరణ తగ్గలేదు. గతంలో కంటే ఎక్కువ షోలు చేస్తున్నాం. - కొవ్వలి శ్రీనివాస్, సీనియర్ మెజీషియన్