conspiracy theory
-
భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో కుట్రకోణం?
చెన్నై: భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం వెనక కుట్రకోణం ఉందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. శుక్రవారం ఎన్ఐఏ, రైల్వే అధికారులు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రైలు ప్రమాదానికి రైల్వే ఉద్యోగులేనన్న అనుమానాలు వస్తున్నాయి.విచారణలో ప్రమాద ప్రాంతంలో స్విచ్ పాయింట్ల బోల్టులు తొలగించినట్లు అధికారులు గుర్తించారు. లూప్ లైన్లో పట్టాలు ట్రాక్‌గా మారే చోట బోల్ట్‌నట్ విప్పడంతో గూడ్స్ ట్రాక్ మారింది. దీంతో గూడ్స్ ట్రైన్‌ను భాగమతి ఎక్స్ ప్రెస్ ఢీకొట్టినట్లు అధికారులు చెబుతున్నారు.20 మందికి పైగా రైల్వే సిబ్బంది, అధికారులను సౌత్‌జోన్ రైల్వే సేఫ్టీ కమిషనర్ చౌదరి ప్రశ్నించారు. బోల్ట్ విప్పింది బయటి వ్యక్తులు కాదని, రైల్వే ఉద్యోగులేనని ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందనే దానిపై విచారణ కొనసాగుతుంది. దాని వెనుక కుట్ర కోణంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.కాగా, గత శుక్రవారం (అక్టోబర 11)న రాత్రి 8.27 సమయంలో తమిళనాడులో భారీ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మైసూరు నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్‌ప్రెస్ (12578) రైలు పొన్నేరి స్టేషన్ దాటింది. తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. కవరైపెట్టై స్టేషన్‌కు వస్తున్న సమయంలో ఆ రైలు ప్రధాన లైనుపై నుంచి కాకుండా లూప్లైన్లోకి వెళ్లడం, ఆ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడం క్షణాల్లో జరిగిపోయాయి.ఈ ప్రమాదంలో 13 వరకు కోచ్‌లు పట్టాలు తప్పాయి. పార్సిల్ వ్యానులో మంటలు చెలరేగాయి. రైలు ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు,ఎన్ఐఏ అధికారులు విచారణ చేపట్టారు. తాజాగా జరిగిన విచారణలో భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై కుట్రకోణం ఉందని సమాచారం. దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది -
మియామీ బిల్డింగ్ దుర్ఘటనలో కుట్ర కోణం.. జాన్ మెక్‌అఫీతో లింక్!!
ఫ్లోరిడా: మియామీలో బహుళ అంతస్తుల భవనం అపార్ట్మెంట్లు కుప్పకూలడం పెనువిషాదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా.. ఇప్పటికే శకలాల నుంచి ఐదు మృతదేహాల్ని వెలికి తీశారు. మరో 156 మంది ఆచూకీని అధికారులు ధృవీకరించాల్సి ఉంది. అయితే ఈ విషాద ఘటనలో కుట్ర కోణం దాగుందని కొందరు భావిస్తున్నారు. టెక్ దిగ్గజం జాన్ మెక్‌అఫీతో ఈ ఘటనకు ముడిపెడుతూ.. పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మెక్అఫీ యాంటీ వైరస్ సృష్టికర్త జాన్ మెక్అఫీ ఈమధ్యే జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలిసిందే. అయితే చనిపోయే ముందు ఆయనొక ఇంపార్టెంట్ ట్వీట్ చేశాడని.. దానిని తెరమీదకు తెచ్చారు కొందరు. ‘‘నాకేదైనా జరిగితే.. ఫ్లోరిడా సర్ఫ్సైడ్ మియామీ బీచ్ కొల్లిన్స్ అవెన్యూలో ఉన్న కాంప్లెక్స్‌లో 31 టీబీ సైజులో ఉన్న ఫైల్స్ ఉన్నాయని, అందులో అమెరికా ప్రభుత్వపు అవినీతి సమాచారం ఉంద’ని ఆ ట్వీట్లో జూన్ 8న పేర్కొన్నాడాయన. ఆ తర్వాత వారానికి ఆయన చనిపోయాడు. మెక్అఫీ చనిపోయిన రెండు రోజులకే 55 అపార్ట్మెంట్లతో కూడిన మియామీ బిల్డింగ్‌లో 55 అపార్ట్మెంట్ల భాగం కుప్పకూలింది. దీంతో ఆయన చావుకి.. ఆ దుర్ఘటనకు సంబంధం ఉందనే వాదన తెరపైకి వచ్చింది. ట్వీట్ ఫేక్? డిలీట్ చేశారా? నిజానికి మెక్అఫీ ఆ ట్వీట్ 2019లో చేశాడనేది కొందరి వాదన. ‘ప్రభుత్వ అవినీతికి సంబంధించిన సమాచారం నా దగ్గర ఉంది. సీఐఏలో ఉన్న అవినీతి ఏజెంట్, ఇద్దరు బహైమన్ అధికారుల పేర్లతో ఆ చిట్టాను రిలీజ్ చేస్తా. నేను కనిపించకుండా పోయినా.. అరెస్టయినా 31 టెర్రాబైట్స్ ఉన్న డేట్.. మీడియాకు రిలీజ్ అవుతుందని చెబుతూ 2019లో ఓ ట్వీట్ చేశాడని కొందరు అంటున్నారు. ఈ విషయాన్ని జాన్ సిల్వా ఎన్బీసీటీ ట్విటర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. అలాగే కుట్ర కోణంలో ఎలాంటి ధృవీకరణ లేదని, అసలు ఆ అపార్ట్మెంట్లో మెక్అఫీకి ఎలాంటి అపార్ట్మెంట్ లేదని వెల్లడించాడు. అయితే 2020కి ముందు మెక్అఫీ అకౌంట్లోని ట్వీట్లన్ని డిలీట్ అయ్యి ఉన్నాయి. మరి అవి ఆయన డిలీట్ చేశాడా? లేదంటే నిజంగానే ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా? నిజంగానే కుట్ర కోణం ఉందా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. ఐదు మృతదేహాల వెలికితీత ఇక మియామీ అపార్ట్మెంట్లో ఓ పోర్షన్ కుప్పకూలిన ఘటనలో ఐదు మృతదేహాలను రెస్క్యూ టీంలు వెలికితీశాయి. మరో 156 మంది ఆచూకీని నిర్ధారించాల్సి ఉంది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేకపోయినా.. భూమిలో సముద్రపు అలల వల్ల పునాదులు కొట్టుకుపోయాయని గతంలో నివేదికలు ఇచ్చాయని పలువురు ప్రస్తావిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ప్రమాదపు కారణాల్ని దృవీకరించాల్సి ఉంది. చదవండి: మెక్అఫీ మరణం.. ముందే అనుమానించిన ఆమె -
ఆ పెట్టెలో ఏముంది?
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన సందర్భంగా ఆయన హెలికాప్టర్లో నలుపురంగు పెట్టెను ప్రైవేటు కారులో తరలించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఆ పెట్టెలో ఏముందో ప్రధాని మోదీ వెంటనే చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ‘ఈ నెల 9న చిత్రదుర్గ సభకు మోదీ హెలికాప్టర్‌కు రక్షణగా మరో మూడు హెలికాప్టర్లు వచ్చాయి. ఇవి ల్యాండ్ కాగానే ఓ హెలికాప్టర్ నుంచి నలుపురంగులో ఉన్న పెట్టెను ఇన్నోవా కారులో ఎక్కించారు. ఈ కారు ఎస్పీజీ వాహనశ్రేణిలో భాగం కాదు’ అని తెలిపారు. ఈ పెట్టెలో భారీగా నగదు ఉందని ఆయన ఆరోపించారు. ఒకవేళ ఇది నిజం కాకుంటే మోదీ విచారణకు సహకరించాలన్నారు. ఈ విషయమై కర్ణాటక పీసీసీ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని ఆనంద్ శర్మ వెల్లడించారు. అంబేడ్కర్ జయంతి రోజున ప్రతిపక్షాలపై విమర్శలు మాని, గత ఐదేళ్లకాలంలో ఏం చేశారో దేశప్రజలకు చెప్పాలని మోదీకి సూచించారు. దమ్ముంటే రఫేల్ ఒప్పందంపై అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేతో జరిగిన సమావేశం మినిట్స్‌ను బయటపెట్టాలని మోదీని డిమాండ్ చేశారు. దీనివల్ల అన్ని ఆరోపణలకు ఒకేసారి తెరపడుతుందని వ్యాఖ్యానించారు. సాయుధ బలగాల త్యాగాలను ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. 1971 బంగ్లాదేశ్ యుద్ధంతో అప్పటి ప్రధాన ఇందిరాగాంధీ రాజకీయంగా లబ్ధిపొందారని కేంద్ర మంత్రి వీకే సింగ్ చెప్పడాన్ని తప్పుపట్టిన ఆనంద్ శర్మ, ఈ వ్యాఖ్యలపై సింగ్ వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. -
చంద్రుడిపై ఏలియన్స్..!!
వాషింగ్టన్ : యువ శాస్త్రవేత్త చంద్రుడిపై తీసిన వీడియో సోషల్‌మీడియాలో సంచలనంగా మారింది. రాత్రి పూట చంద్రుడిని 4కే కెమెరా ద్వారా పరిశీలిస్తున్న అతనికి మూడు వింత ఆకృతులు ఎగురుతూ వెళ్లడం కనిపించింది. ఈ వీడియోను పరిశీలించిన కాన్స్పిరసీ థియరిస్టులు అవి ఏలియన్స్ అనే పేర్కొంటున్నారు. మూడు అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్(యూఎఫ్ఓ)లో రెండు కలసి ప్రయాణిస్తుండగా.. ఒకటి మాత్రం వాటి వెనుక ఫాలో అవుతూ వీడియోలో కనిపించింది. అయితే, ఈ వీడియోను నమ్మలేకపోతున్నాయని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు మాత్రం అవి రాళ్లు అని కొట్టిపారేస్తున్నారు. -
చంద్రుడిపై ఏలియన్స్..సోషల్‌మీడియాలో సంచలనం
-
లేటెస్ట్ ‘డెడ్’లైన్ నవంబర్ 19
సాక్షి,న్యూఢిల్లీ: భూమి అంతమవుతుందని కౌంట్‌డౌన్‌లతో బెంబెలెత్తించే కాన్స్పిరెసీ థీరియస్ట్‌లు ఈసారి మహా విపత్తుకు ముహుర్తం నవంబర్ 19 అంటూ బాంబు పేల్చారు. ఆ రోజుతో భూమి అంతమవుతుందని లెక్కలు కట్టారు. గతంలో డేవ్ మీడ్ సెప్టెంబర్ 23న భూమి అంతమవుతుందని జోస్యం చెప్పాడు. బైబిల్ ప్రకారం చూసినా, న్యూమరాజికల్‌గా చెప్పుకున్నా సెప్టెంబర్ 23న మహా విధ్వంసం తప్పదని అప్పట్లో వాషింగ్టన్ పోస్ట్‌కు చెప్పారు. ఈ జోస్యం పెద్దఎత్తున ప్రచారమైంది. అయితే సెప్టెంబర్ 23న ఎలాంటి సునామీ చోటుచేసుకోలేదు. ఇక ఏడు సంవత్సరాల వరుస ప్రకృతి విపత్తుల తర్వాత అక్టోబర్ 15న ప్రపంచ వినాశనం తప్పదని డేవ్ మీడ్ తదుపరి డెడ్‌లైన్ ఇచ్చాడు.అయితే ఆ రోజు అతిమామూలుగా గడిచిపోయింది. నిబిరు సిద్ధాంతం ఆధారంగా తాము లెక్కగట్టిన తేదీలు తప్పిపోయినా మరోసారి అలాంటిదేమీ ఉండదని నవంబర్ 19న మహా విధ్వంసం తప్పదని, భూమి అంతం తథ్యమని తాజా డెడ్‌లైన్ ప్రకటించేశారు. నవంబర్ 19న ‘నిబిరు’గప్పిన నిప్పులా భారీ భూకంపాలు ప్రపంచాన్ని అంతం చేస్తాయని వాషింగ్టన్ పోస్ట్‌లో డేవ్ మీడ్ చెప్పారు. గత కొద్దినెలలుగా ప్రపంచంలో చోటుచేసుకుంటున్న భూ ప్రకంపనలు ఈ మహా ప్రకంపనలకు సంకేతాలుగా కాన్స్పిరెసీ థీరియస్టులు చెబుతున్నట్టు పలు వెబ్సైట్లు కథనాలతో హోరెత్తిస్తున్నాయి. సెస్మిక్ కార్యకలాపాలు పెచ్చుమీరి బ్లాక్‌స్టార్ (నిబిరుకు మరోపేరు) చక్రాలు సోలార్ వ్యవస్థలో చురుకుగా కదులుతూ గ్రహాలను తారుమారు చేస్తాయని మరో రచయిత టెరాల్ క్రాఫ్ట్ రాబోయే ప్రళయాన్ని విశ్లేషించారు. -
ఎంహెచ్ -17: పుతిన్ విమానాన్ని పేల్చబోయారా?
మలేషియా విమానాన్ని పేల్చింది ఎవరు? రష్యన్ దళాలే తమ సైనిక విమానాలను గత కొన్ని వారాలుగా లక్ష్యం చేసుకుంటున్నాయని.. అందువల్ల ఈ విమానాన్ని కూడా తమ సైనిక విమానం అనుకుని వాళ్లు పేల్చేశారని ఉక్రెయిన్ వర్గాలు అంటున్నాయి. కానీ తమమీద ఎలాంటి మచ్చ పడకుండా ఉండేందుకు రష్యా మరో కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది. వాస్తవానికి బ్రిక్స్ సదస్సు ముగించుకుని వస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమానం కూడా సరిగ్గా అదే మార్గంలో వస్తోందని, దాన్ని పేల్చేయాలనుకుని.. గురి తప్పి మలేషియా విమానాన్ని ఉక్రెయిన్ వర్గాలే కూల్చేశాయని చెబుతోంది. వాస్తవానికి విమాన ప్రమాదం సంభవించిన తర్వాత చాలాసేపటి వరకు రష్యా నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. తమ దేశం మీద విధించిన ఆంక్షలను తొలగించాలంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మాట్లాడిన పుతిన్.. పనిలో పనిగా ఆయనకు విమాన ప్రమాదం గురించి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో రష్యా పాత్ర ఏంటన్న ప్రశ్నలు వస్తాయనే ఆలోచనతోనో ఏమో గానీ.. ఈ సరికొత్త కుట్ర సిద్ధాంతం ఒకటి వెలుగులోకి వచ్చిందని కొన్ని వార్తా సంస్థలు చెబుతున్నాయి. కానీ నిజానికి ఇంతవరకు ఏ దేశానికి సంబంధించిన క్షిపణి దాడి వల్ల విమానం కూలిపోయిందో మాత్రం నిర్ధారణ కాలేదు. ప్రమాదం సంభవించడానికి దాదాపు గంట ముందుగా వార్సా సమీపంలో ఎంహెచ్ 17 విమానాన్ని పుతిన్ ప్రయాణిస్తున్న విమానం దాటిందని అనధికార వర్గాలను ఉటంకిస్తూ రష్యా వార్తా సంస్థ ఇంటర్ఫాక్స్ తెలిపింది. దూరం నుంచి చూస్తే రెండు విమానాలు ఒకేలా ఉంటాయంటూ ఓ కల్పిత గ్రాఫిక్‌ను కూడా తయారుచేసింది. అయితే ఇదంతా తనకేమీ తెలియదన్నట్లు పుతిన్ మాత్రం చాలా భారంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ''ఈ భూమ్మీద శాంతి ఉండి ఉంటే ఈ విషాదం జరిగి ఉండేదే కాదు. లేదా.. కనీసం ఆగ్నేయ ఉక్రెయిన్ ప్రాంతంలో సైనిక దాడులు పునరుద్ధరించకపోయినా ఇలా జరిగేది కాదు'' అని ఆయన అన్నారు.