కొనుగోలు శక్తిలో భారత్ ది 3వ స్థానం
న్యూఢిల్లీ: కొనుగోలు శక్తి పరంగా చూస్తే భారత్ ప్రపంచంలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థ, జీడీపీ పరంగా చూస్తే 9వ ఆర్థిక వ్యవస్థ. ఆ కొనుగోలు శక్తే ప్రపంచదేశాలను మన వైపు చూసేలా చేస్తోంది. 2030 నాటికి 836 లక్షల కోట్లతో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ప్రపంచబ్యాంకు అంచనా. రోడ్ నెట్వర్క్, ఔషధాల ఉత్పత్తిలోనూ మనది 3వ స్థానం.