breaking news
Corn cultivation
-
రైతు కథ.. కన్నీటి వ్యధ.. కర్షకుల కష్టం దళారుల పాలు
ఆరుగాలం శ్రమించి అన్నదాత చిందించిన చెమటకు ఫలితం దక్కడం లేదు. పండించిన పంటకు మద్దతు ధర లేనే లేదు. చేతికొచ్చిన పంటను అమ్ముకునే దారే కనిపించడం లేదు. తొలి పంట వైపరీత్యాలతో దెబ్బతింటే.. రెండో పంటకు మద్దతు ధర దక్కక, కొనేవారు లేక రైతులు నష్టపోతున్నారు. మద్దతు ధర కల్పించడంలో బాబు ప్రభుత్వం చేతులెత్తేయడంతో అప్పులతో సాగు చేసి పండించిన పంటను అయినకాడకి తెగనమ్ముకుంటూ ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఏ పల్లెకు వెళ్లినా రాసులు పోసిన పంటలు దర్శనమిస్తున్నాయి. కొనేవారు లేక, మద్దతు ధర దక్కక, కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేక అన్నదాతలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని సుమారు 30కి పైగా పల్లెల్లో ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలనలో అన్నదాతల వెతలు వర్ణనాతీతం. ఏ పల్లెకు వెళ్లినా రైతుల ఆక్రందనలే.. ఏ రైతును కదిపినా కన్నీటి గాధలే. కళ్లెదుట పంటకు మద్దతు ధర దక్కక పోవడంతో చమర్చిన కళ్లతో దుఃఖాన్ని పంటి కింద అదిమి పెట్టుకొని రైతన్నలు మౌనంగా రోదిస్తున్న తీరు గుండెలను పిండేస్తోంది. పెట్టుబడులు పెరిగిపోయాయి రెండెకరాల్లో కౌలుకు చేస్తున్నా. ఎకరాకు రూ.20 వేలు కౌలుకు చెల్లించాను. రబీలో మొక్క జొన్న సాగుకు ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి పెట్టాను. 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కోతకు రూ.4 వేలు తీసుకుంటున్నారు. పంటను తోలేందుకు ట్రాక్టర్‌కు రూ.1,000 డిమాండ్ చేస్తున్నారు. పెట్టుబడులు ఏటా పెరిగిపోతున్నాయి. ధర మాత్రం పెరగడం లేదు. మార్కెట్లో చూస్తే రూ.1,650కి మించి కొనడం లేదు. ఎకరాకు రూ.15 వేలకు పైగా నష్టపోతున్నా. – తాళ్లూరి ఇసాక్, గణపవరం, పల్నాడు జిల్లా ఈ రైతు పేరు లగడపాటి వీరాంజనేయులు. బాపట్ల జిల్లా పర్చూరుకు చెందిన ఈయన రబీలో కౌలుకు తీసుకున్న 30 ఎకరాల్లో శనగ, 10 ఎకరాల్లో తెల్లజొన్న వేశాడు. ఎకరాకు రూ.15 వేల చొప్పున రూ.6 లక్షలు కౌలుకే చెల్లించాడు. రెండు పంటలకు రూ.15 లక్షల వరకు రూ.2కు వడ్డీకి తెచ్చి సాగు చేశాడు. తెల్లజొన్న 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే, శనగ 8 క్వింటాళ్లకు మించి రాలేదు. తెల్లజొన్న రూ.1,600కు అమ్ముకున్నాడు. శనగకు క్వింటాకు రూ.4,900కు మించి ధర లేదు. ‘అతి కష్టమ్మీద 40 క్వింటాళ్ల శనగను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్ముకున్నా రెండు నెలలైనా పైసా జమ కాలేదు. గతేడాది నల్లబర్లి పొగాకు సాగుతో రూ.10 లక్షలు నష్టపోతే ఈసారి మరో రూ.15 లక్షలకు పైగా నష్టపోతున్నా’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.ఈ రైతు పేరు శివ వెంకటరెడ్డి. గుంటూరు జిల్లా చుండూరు మండలం చిన్న పరిమి గ్రామానికి చెందిన ఈయన 10 ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశాడు. ఎకరాకు రూ.32 వేలు కౌలు చెల్లించాడు. అదునుకు యూరియా దొరకక బ్లాకులో బస్తా రూ.350–450 మధ్య కొనుగోలు చేశాడు. పంటను కాపాడుకునేందుకు మోటార్లతో ఐదుసార్లు నీళ్లు పెట్టాల్సి వచ్చింది. ఇలా ఎకరాకు రూ.50 వేల చొప్పున అప్పులు చేసి పెట్టుబడి పెట్టాడు. తీరా పంట చేతికొచ్చేసరికి క్వింటా రూ.1,600కు మించి కొనడం లేదని, ఈ ధరకు అమ్ముకుంటే కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని వాపోయాడు. వైఎస్ జగన్ హయాంలో ఇదే మొక్కజొన్నను రూ.2,650కు అమ్ముకున్నానని, పచ్చి వడ్లకు రూ.2,200 ధర దక్కిందని చెప్పాడు. జగన్ ప్రభుత్వంలో మంచి ధరలు లభించాయని, ఇప్పుడు రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ రైతు పేరు వేటు వెంకటేశ్వరరెడ్డి. బాపట్ల జిల్లా తెనాలి మండలం ఐతానగరానికి చెందిన ఈయనకు సెంటు భూమి కూడా లేదు. వ్యవసాయంపై మక్కువతో 40 ఎకరాలు కౌలుకు తీసుకొని తొలి పంట వరి వేశాడు. ఎకరాకు రూ.35 వేల వరకు పెట్టుబడి పెడితే అకాల వర్షాలకు 30 బస్తాలకు మించి దిగుబడి రాలేదు. దాంట్లో సగం కౌలుకే ఇవ్వాల్సి వచ్చింది. మిగిలిన ధాన్యం బస్తా (75 కేజీలు) రూ.1,350 చొప్పున అమ్ముకున్నాడు. రబీలో ఎకరాకు రూ.25 వేల పెట్టుబడితో జొన్న సాగు చేశాడు. మోంథా తుపానుకు మూడొంతులు పంట పోతే రెండోసారి విత్తగా ఎకరాకు 18 క్వింటాళ్ల దిగుబడులొచ్చాయి. తీరా మార్కెట్‌కు తెస్తే కొనేవారు లేరు. ‘రెండు పంటలకు రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఇప్పటి వరకు రూ.5 లక్షలే చేతికొచ్చింది. ఈ సీజన్లో రూ.7 లక్షలకు పైగా నష్టపోయాను’ అని ఈ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ రైతు పేరు నల్లమోతు సత్యనారాయణ. పల్నాడు జిల్లా నాదెళ్ల గ్రామానికి చెందిన ఈయన తనకున్న 3.5 ఎకరాల్లో మొక్కజొన్న, 1.60 ఎకరాల్లో బొప్పాయి పంటలు సాగు చేశాడు. ఎకరాకు మొక్కజొన్నకు రూ.50 వేలు, బొప్పాయికి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాడు. మొక్కజొన్న ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి రాగా, క్వింటా రూ.1,600కు అమ్ముకోగా, బొప్పాయి పంటకు నాందేడ్ తెగులు సోకడంతో నాణ్యత తగ్గింది. ‘ఎకరాకు 10 టన్నులకు మించి దిగుబడులు రావడం లేదు. మార్కెట్లో కిలో రూ.10కి మించి కొనేవారు లేరు. తెగులు సోకిందంటే కిలో రూ.5కే అడుగుతున్నారు. కనీసం కిలోకు రూ.15–16 ధర వస్తే కానీ గిట్టుబాటు కాదు. గతేడాది 10 ఎకరాల్లో వంగ తోట వేసి నష్టపోయాను. ఈసారి మొక్కజొన్న, బొప్పాయి వేసి తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాను. ఏం చేయాలో పాలుపోవడం లేద’ని కన్నీటి పర్యంతమయ్యాడు. పల్నాడు జిల్లా నాదెళ్లలో తెగుళ్ల బారిన పడిన బొప్పాయి పంట (పంపాన వర ప్రసాదరావు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి సాక్షి ప్రతినిధి) : రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి చందాన తయారైంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో రైతులు గతేడాది సాగు చేసిన నల్ల బర్లీ పొగాకుతో తీవ్ర నష్టాలను మూట గట్టుకున్నారు. ఇప్పటికీ వందలాది మంది రైతుల ఇళ్లల్లో పొగాకు బేళ్లు బేలచూపులు చూస్తూనే ఉన్నాయి. మిర్చి, పత్తి పంటలకు గిట్టుబాటు ధర దక్కక ఒక్కో రైతు రూ.5–10 లక్షల వరకు నష్టపోయారు. నల్లబర్లి పొగాకు సాగు చేయొద్దు.. లాభసాటిగా ఉన్న మొక్కజొన్న, శనగ సాగు చేయండని ప్రభుత్వం ఊరూ వాడ ప్రచారం చేసింది. మరొక వైపు గతేడాది నష్టపోయిన మిర్చి, పత్తి రైతులు సైతం ఈసారి జొన్న, మొక్కజొన్న, శనగ, కంది సాగు వైపు మళ్లారు. బాపట్ల లంక గ్రామాలతో పాటు పల్నాడు జిల్లాలో సాగు చేసే టమాటా, ఉల్లి, బెండ, వంగ, గోరుచిక్కుడు, దోసకాయలు, బంగాళదుంప తదితర కూరగాయల పంటలకు కూడా గిట్టుబాటు ధర లేక దళారులకు అప్పనంగా ఇవ్వలేక రైతులు మౌనంగా రోదిస్తున్నారు. పల్నాడు జిల్లా అమీన్‌సాహెబ్ పాలెంలో మిర్చిని ఆరబోస్తున్న రైతులు తీపిని పంచాల్సిన పుచ్చకాయ, కర్బూజ తోటలు రైతులకు కన్నీటి చేదును మిగిలిస్తున్నాయి. రెండేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొందని.. ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కలేదని రైతులు బాహాటంగానే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రకృతి ప్రకోపం వల్లనో, మార్కెట్ వైఫల్యం వల్లనో నష్టపోవడం లేదని.. ముమ్మాటికీ పాలకులు చేస్తున్న నమ్మక ద్రోహం వల్లే నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి, టమాటా వంటి పంటలకైతే కనీసం కోత ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేక పొలాల్లోనే వదిలేస్తున్నామని తెనాలికి చెందిన ఎం.భాస్కరరావు అనే కౌలు రైతు వాపోయారు. అరటి, బొప్పాయి పంటలు కొనే వారు లేక తోటల్లోనే పక్వానికి వచ్చి రాలిపోతున్నాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. మొంథా తుపాను వల్ల నష్టపోతే పైసా పరిహారం కూడా ఇవ్వలేదని అయ్యారుపేటకు చెందిన పొపూరి బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు. పంటను అమ్మగా వచ్చిన అరకొర ఆదాయం కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని మరో కౌలు రైతు కుసుమర్తి ముసలయ్య కన్నీరు పెట్టుకున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి జలగల్లా పీలుస్తుంటే ప్రభుత్వం కళ్లున్నా చూడలేని కబోదిలా తయారైందని మండిపడుతున్నారు. మార్కెట్ యార్డులు వెలవెలఎప్పుడూ కళకళలాడే మార్కెట్ యార్డులు కొనుగోళ్లు లేక నిశ్శబ్దానికి వేదికలవుతున్నాయి. జొన్న, మొక్కజొన్న సాగు చేస్తే కొనేవారు లేక చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక హమాలీలుగా పని చేయాల్సి వస్తోందని ఐతానగర్‌కు చెందిన శనవం గోపిరెడ్డి వాపోయారు. పేరుకు శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా మూణ్ణాళ్ల ముచ్చటగా మూసేశారని, క్వింటాకు రూ.4,800కే దళారులకు తెగనమ్ముకుంటున్నామని రైతులు చెబుతున్నారు. కొద్ది మంది రైతులు మాత్రమే కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకుంటున్నారని చెప్పారు. మరొక వైపు మొక్కజొన్న రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. మద్దతు ధర రూ.2,400 కాగా, మార్కెట్లో రూ.1,400 నుంచి రూ.1,650 మధ్య పలుకుతోంది. అది కూడా వ్యాపారుల కాళ్లా వేళ్లా పడితే కానీ కొనడం లేదంటున్నారు. జొన్న రైతుల పరిస్థితీ అంతే.. మద్దతు ధర క్వింటా రూ.3,749 కాగా, మార్కెట్లో రూ.1,600–1,850 మధ్య దక్కుతోంది. దాచుకునేందుకు డబ్బుల్లేక సన్న, చిన్నకారు రైతులు ఈ ధరకే అమ్ముకుని నష్టపోతున్నారు. కాస్త ఆర్థిక స్థోమత ఉన్న వారైతే గోదాముల్లో నిల్వ చేసుకుంటున్నారు.ఇలాంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే⇒ వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏనాడూ మద్దతు ధర కోసం ఇబ్బంది పడలేదని రైతులు ముక్త కంఠంతో చెప్పారు. ఏదైనా సందర్భంగా మార్కెట్లో కాస్త ధర తగ్గితే చాలు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకునేదని గుర్తు చేస్తున్నారు. రెండేళ్లుగా ఆ పరిస్థితి మచ్చుకైనా కన్పించడం లేదని వాపోతున్నారు.. చంద్రబాబు ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ నిధి ఉందో లేదో కూడా అర్థం కావడం లేదని వాపోయారు. ⇒ తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లలో ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్క జొన్న కొనుగోళ్లకు శ్రీకారం చుడితే.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కేంద్రానికి లేఖలు రాస్తూ కాలయాపన చేస్తోంది. పైగా కేంద్రం ఆర్థిక చేయూత ఇవ్వకపోతే మొక్కజొన్నే కాదు ఏ పంటనూ కొనుగోలు చేయలేమని తెగేసి చెబుతుండటాన్ని రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఉన్నా ఊడినా ఒకటేనని మండిపడుతున్నారు. ⇒ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు రైతులకు లాభసాటి ధరలు దక్కేలా చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. కనీసం కేంద్రం ప్రకటించిన మద్దతు ధర లభించేలా చేయడంలో విఫలమవుతోంది. ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పథకం, పంట నష్టపరిహారం వంటి పథకాలు అందక పోవడం వంటి కారణాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల రెండేళ్లలో రూ.25 వేల కోట్ల సంపదను రైతులు నష్టపోయారు.గతంలో బస్తా రూ.2 వేలు పలికేది ఐదెకరాల్లో గోరు చిక్కుడు సాగు చేశా. రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. 60 బస్తాలు (బస్తాకు 10 కేజీలు) దిగుబడులొచ్చాయి. మార్కెట్‌కు పోతే 10 కేజీల బస్తా రూ.240కు మించి కొనడం లేదు. గతంలో రూ.2 వేల వరకు ధర పలికేది. ఈసారి తీవ్రంగా నష్టపోతున్నా. – ఎరుపల్లి శ్రీనివాసరావు, విఠంరాజుపల్లె, పల్నాడు జిల్లాబాండ్ ఇచ్చినా..ఇబ్బందులే..ఐదెకరాల్లో వర్జీనియా పొగాకు సాగు చేశాను. ఐటీసీ బాండ్ కూడా ఇచ్చింది. రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. తీరా పంట చేతికొచ్చేసరికి గోదాములు ఖాళీగా లేవంటూ రేపురా మాపురా అంటూ తిప్పుతున్నారు. కొనే సమయానికి నాణ్యత లేదంటున్నారు. ధర తగ్గించేస్తున్నారు. గతేడాది నల్లబర్లి సాగు చేసి నష్టపోయాం. ఈసారి వర్జీనియా సాగు చేసి ఇబ్బంది పడుతున్నాం. – మందుల నాగరాజు, విఠంరాజుపల్లె, పల్నాడు జిల్లాఅప్పులోళ్లకు జమ చేశారు ఎకరం సొంత పొలం ఉంది. మరో ఎకరన్నర కౌలుకు తీసుకుని తెల్లజొన్న పంట వేశాను. ఎకరాకు రూ.30 వేలు చొప్పున రూ.75 వేల వరకు రూ.2 వడ్డీకి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాను. ఎకరాకు 40 టిక్కీలు (టిక్కీ 60 కేజీలు) చొప్పున 24 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కనీస మద్దతు ధర రూ.3,749 మాట దేవుడెరుగు.. కనీసం మార్కెట్లో కొనేవారు లేరు. అప్పులోళ్లు వడ్డీల కోసం ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. చేసేది లేక క్వింటా రూ.1,850కు ఓ వ్యాపారికి తెగనమ్ముకున్నా. చేతికి రూ.44 వేలు రావడంతో దాన్ని అప్పులోళ్లకు జమ చేశాను. ఇంకా కౌలుకు చెల్లించాల్సి ఉంది. ఇంటికి పైసా కూడా తీసుకెళ్లలేదు. – పాటిపండ్ల వీరయ్య, ఐతానగరం, బాపట్ల జిల్లారెండు పంటల్లోనూ నష్టాలే..ఎనిమిది ఎకరాల్లో టమాటా వేశా. ఎకరాకు రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టాను. మరో 4 ఎకరాల్లో గుమ్మడి సాగు చేశాను. రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టాను. గుమ్మడి నాలుగు టన్నులొచ్చింది. టన్ను రూ.8400 ధర పలికింది టమాటా 4 వేల బాక్సులొస్తే.. బాక్స్ (25 కేజీలు) రూ.80–110 లోపే తెగనమ్ముకోవాల్సి వచ్చింది. నా చేను సమీపంలోనే మార్కెట్లో టమాటా కిలో రూ.40 తక్కువకు అమ్మడం లేదు. నాకు మాత్రం కిలో రూ.3–4 మధ్య దక్కింది. – కళ్లం అనిల్‌కుమార్ రెడ్డి, సాహెబ్‌పాలెం, పల్నాడు జిల్లాగోరుచిక్కుడుకూ ధర లేదు..కౌలుకు తీసుకున్న 10 ఎకరాల్లో గోరుచిక్కుడు, ఐదెకరాల్లో పెసలు సాగు చేశాను. వర్షాలు ఎక్కువగా పడడంతో గోరుచిక్కుడు పంట దెబ్బతింది. ఎకరాకు రూ.30 వేల చొప్పున పెట్టుబడులు పెట్టాను. గోరుచిక్కుడు 10 కేజీల బస్తా రూ.150 పలికింది. పెసలుకు పెట్టుబడి కూడా దక్కలేదు. – భవనం కోటిరెడ్డి, విఠంరాజుపల్లె, పల్నాడు జిల్లారెండు పంటల్లోనూ నష్టాలే..ఎనిమిది ఎకరాల్లో టమాటా వేశా. ఎకరాకు రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టాను. మరో 4 ఎకరాల్లో గుమ్మడి సాగు చేశాను. రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టాను. గుమ్మడి నాలుగు టన్నులొచ్చింది. టన్ను రూ.8400 ధర పలికింది టమాటా 4 వేల బాక్సులొస్తే.. బాక్స్ (25 కేజీలు) రూ.80–110 లోపే తెగనమ్ముకోవాల్సి వచ్చింది. నా చేను సమీపంలోనే మార్కెట్లో టమాటా కిలో రూ.40 తక్కువకు అమ్మడం లేదు. నాకు మాత్రం కిలో రూ.3–4 మధ్య దక్కింది. – కళ్లం అనిల్‌కుమార్ రెడ్డి, సాహెబ్‌పాలెం, పల్నాడు జిల్లాగోరుచిక్కుడుకూ ధర లేదు..కౌలుకు తీసుకున్న 10 ఎకరాల్లో గోరుచిక్కుడు, ఐదెకరాల్లో పెసలు సాగు చేశాను. వర్షాలు ఎక్కువగా పడడంతో గోరుచిక్కుడు పంట దెబ్బతింది. ఎకరాకు రూ.30 వేల చొప్పున పెట్టుబడులు పెట్టాను. గోరుచిక్కుడు 10 కేజీల బస్తా రూ.150 పలికింది. పెసలుకు పెట్టుబడి కూడా దక్కలేదు. – భవనం కోటిరెడ్డి, విఠంరాజుపల్లె, పల్నాడు జిల్లాఆ ఐదేళ్లూ... అన్నదాతకు భరోసావైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. ధర లేని ప్రతీసారీ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఆ పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. వాటి ధరలు పెరిగేందుకు కృషి చేశారు. ఇలా ఐదేళ్లలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,796.47 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు కొనుగోలు చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని కొనుగోలు చేశారు. కేంద్రం నుంచి అనుమతి ఇవ్వకపోయినా 2019–20లో 4,17,268 టన్నులు, 2020–21లో 3,06,713 టన్నులు, 2022–23లో 73,302 టన్నుల మొక్కజొన్నను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. చివరకు ఎన్నికల వేళ రబీ 2023–24 సీజన్లో ఓ దశలో జొన్న ధర పతనమవుతుందని తెలియగానే కేంద్రం నుంచి అనుమతులు రాకున్నా మార్క్‌ఫెడ్ ద్వారా రూ.38.60 కోట్ల విలువైన 12,136 టన్నులు కొనుగోలు చేసి తమది రైతు ప్రభుత్వమని వైఎస్ జగన్ నిరూపించారు. -
ఉచితంగా రైతన్నలకు విత్తనాలు సరఫరా..!
-
మొక్కజొన్న సాగుతో మంచి లాభాలు మరియు డిమాండ్ ఎక్కువ
-
ఈ జాగ్రత్తలు పాటిస్తే మొక్కజొన్న పంటకు అధిక దిగుబడులు ఖాయం
-
వాతావరణం నుంచి నత్రజనిని గ్రహించే మొక్కజొన్న!
పరస్పర ఆధారితంగా జీవించడమే ప్రకృతిలో అత్యద్భుతమైన సంగతి. సూక్ష్మజీవులు, మొక్కలు ఇచ్చి పుచ్చుకోవటం ద్వారా సజావుగా జీవనం సాగించడం విశేషం. మెక్సికో దేశంలో సియెర్ర మిక్సె అనే ఒక దేశవాళీ మొక్కజొన్న రకం.. తన పెరుగుదలకు అవసరమైన నత్రజనిని.. మేలుచేసే సూక్ష్మజీవరాశి ద్వారా సమకూర్చుకుంటూ.. సమస్యాత్మక నేలల్లోనూ నిక్షేపంగా చక్కని దిగుబడినిస్తోందని ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. మొక్కజొన్న మొక్క కాండం కణుపుల వద్ద వేర్లు(ఏరియల్ రూట్స్) వంటివి పెరుగుతూ ఉంటాయి. కొన్ని మొక్కజొన్న జాతుల్లో బయట ఉండే ఈ వేర్లు పొడుగ్గా పెరిగి, భూమిలోకి చొచ్చుకెళ్తాయి కూడా. మొక్క పడిపోకుండా ఉండటానికి, నీటి తేమను అదనంగా గ్రహించడానికి ఇవి ఉపయోగపడుతుంటాయి. అయితే, తాజా పరిశోధనలో తేలిందేమంటే.. మెక్సికోలోని ఓక్సక దగ్గర ఒక ప్రాంతంలో నత్రజని లోపించిన నేలల్లో దేశవాళీ రకం మొక్కజొన్న మొక్కలు రసాయనిక ఎరువులు పెద్దగా వాడకపోయినా లేదా అసలు వాడకపోయినా నిక్షేపంగా పెరుగుతూ చక్కగా దిగుబడినిస్తున్నాయి. దీనిపై కాలిఫోర్నియా యూనివర్సిటీ(డేవిస్)కు చెందిన ప్రొ. అన్ బెన్నెట్, అల్లెన్ వాన్ డెన్జ్ నేతృత్వంలో శాస్త్రవేత్తలు సుదీర్ఘ పరిశోధన జరిపిన తర్వాత ఇటీవల నిర్ధారణకు వచ్చిందేమంటే.. సూక్ష్మజీవుల ద్వారా ఈ మొక్కజొన్న మొక్కలు నత్రజనిని అసాధారణంగా గ్రహిస్తున్నాయని! మొక్కజొన్న మొక్కల కాండానికి ఉన్న కణుపుల దగ్గర గాలిలో తేలాడుతుండే వేర్లు(ఏరియల్ రూట్స్) ఒక రకమైన జిగురు వంటి తీపి ద్రవాన్ని స్రవిస్తుంటాయి. తద్వారా మేలు చేసే సూక్ష్మజీవరాశిని ఇవి ఆకర్షిస్తున్నాయి. మేలు చేసే సూక్ష్మజీవులు ఈ తీపి ద్రవాన్ని ఆహారంగా స్వీకరించి జీవిస్తూ.. అందుకు ప్రతిగా వాతావరణంలోని నత్రజనిని గ్రహించి మొక్కజొన్న మొక్క కణజాలానికి అందిస్తూ రుణం తీర్చుకుంటున్నాయి. 29–82% వరకు నత్రజనిని ఈ సూక్ష్మజీవులు మొక్కజొన్న మొక్కలకు అందిస్తున్నాయని తేలింది. పప్పుధాన్య పంటలు తమ వేరు వ్యవస్థలోని మేలు చేసే సూక్ష్మజీవుల ద్వారా వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరిస్తున్నాయని మనకు తెలుసు. అయితే, ఏకదళ జాతికి చెందిన మెక్సికోకు చెందిన మొక్కజొన్న నత్రజనిని వాతావరణం నుంచి గ్రహిస్తుండటం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరచిన వాస్తవం! ప్రధాన ఆహార పంటయిన మొక్కజొన్న సాగులో శిలాజ ఇంధనాల ద్వారా ఉత్పత్తి చేసిన రసాయనిక ఎరువులను ప్రపంచవ్యాప్తంగా విస్తారంగా వాడుతున్న నేపథ్యంలో.. అసలు నత్రజని ఎరువులు వేయనవసరం లేని మొక్కజొన్న రకాలను, ఆ మాటకొస్తే జొన్న రకాలను సైతం సృష్టించడం సాధ్యపడవచ్చని ప్రొఫెసర్ బెన్నెట్, ఆయన సహచర శాస్త్రవేత్తలు ఉత్సుకతతో భావిస్తున్నారు. ‘కొన్ని దేశవాళీ మొక్కజొన్న రకాలు కొన్నిటికి వాతావరణం నుంచి నత్రజనిని గ్రహించే శక్తి ఉన్న విషయం మాకు కొత్తేమీ కాదు. అయితే, సియెర్ర మిక్సె రకం దేశీ మొక్కజొన్నకు ఆ లక్షణం ఉంది? ఆ మొక్కకు అవసరమయ్యే నత్రజనిని సూక్ష్మజీవ రాశి ద్వారా ఎంతమేరకు వాస్తవంగా గ్రహిస్తున్నదీ నిర్ధారించుకోవడానికి, అనేక విభాగాల శాస్త్రవేత్తలు కలిసి పనిచేస్తే, మాకు పదేళ్లు పట్టింది’ అని ప్రొ. బెన్నెట్ అన్నారు. -
23 జిల్లాల్లో వరికి పంట బీమా
సాక్షి, హైదరాబాద్: జిల్లాకో ప్రధాన పంటను పరిగణనలోకి తీసుకుని గ్రామం యూనిట్‌గా బీమా అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఆ ప్రకారం 23 జిల్లాల్లో వరికి గ్రామం యూనిట్‌గా పంటల బీమా అమలు చేస్తారు. రెండు జిల్లాల్లో సోయాబీన్, 5 జిల్లాల్లో మొక్కజొన్న పంటలకు గ్రామం యూనిట్‌గా బీమా అమలుచేస్తారు. ఆయా జిల్లాల్లో మిగిలిన పంటలకు మండలం యూనిట్‌గా బీమా అమలు చేస్తారు. వచ్చే ఖరీఫ్‌కు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై), పునరుద్ధరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్), యూనిఫైడ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీం(యూపీఐఎస్)ల అమలు మార్గదర్శకాలపై వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి మంగళవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుములకు రైతులు 2 శాతం, పసుపు రైతులు 5శాతం ప్రీమియం చెల్లించాలి. పంటల నష్టాన్ని పది రోజుల్లోగా అంచనా వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వరికి ప్రీమియం చెల్లించే గడువును ఆగస్టు 31గా నిర్ధారించారు. జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుములు, వేరుశనగ, సోయాబీన్, పసుపు పంటలకు జూలై 31 గడువుగా ప్రకటించారు. మేడ్చల్ మినహా అన్ని జిల్లాల్లో పత్తికి బీమా వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద మేడ్చల్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో పత్తికి బీమా వర్తింపజేస్తారు. ఎండు మిర్చిని 15 జిల్లాల్లో అమలుచేస్తారు. ప్రమాద మరణానికి రూ.2 లక్షల బీమా పరిహారం.. యూనిఫైడ్ ప్యాకేజీ ఇన్సూరెన్స్ స్కీంలో వ్యక్తిగత ప్రమాద బీమా, జీవిత బీమా, విద్యార్థి భద్రత బీమా, గృహ బీమా, వ్యవసాయ పంపుసెట్ల బీమా, ట్రాక్టర్ బీమాలను అమలుచేస్తారు. వీటిలో ఏ రెండింటినైనా రైతులు ఎంపిక చేసుకోవాలి. వీటికి రైతు రూ.12 బీమా ప్రీమియం చెల్లించాలి. ప్రమాదవశాత్తు చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.2 లక్షల బీమా పరిహారం అందుతుంది. -
ఆదివాసుల పెన్నిధి ‘పెద్ద జొన్న’!
- ఆదిలాబాద్ సంప్రదాయ జొన్న రకాల్లో రారాజు ‘పెద్ద జొన్న’ - అధిక పోషక విలువలతో కూడిన జొన్నలతో పాటు.. బలవర్ధకమైన చొప్పనూ పుష్కలంగా అందించే అపురూప వంగడం - ఐదేళ్లుగా తిరిగి సాగు చేసుకొని తింటున్న రాజ్‌గోండ్ ఆదివాసీ రైతులు - మైదాన ప్రాంత రైతులకూ అనువైనదేనంటున్న శాస్త్రవేత్తలు రైతు కుటుంబానికి రుచికరమైన, పుష్టికరమైన ఆహారాన్ని.. పశువులను బలిష్టంగా ఉంచే ఇంపైన గడ్డిని సమృద్ధిగా అందించే పంటే ఆదివాసుల దృష్టిలో మంచి పంట కింద లెక్క. సంప్రదాయ జొన్న రకాలు ఎన్ని ఉన్నప్పటికీ ఆదిలాబాద్ జిల్లాలో రాజ్ గోండ్ ఆదివాసీల దృష్టిలో ‘పెద్ద జొన్న’ (పెర్స జొన్న)కు మించినది లేదు. కొండ ప్రాంతాల్లో తరతరాలుగా సాగులో ఉన్న ఈ అపురూప వంగడం కాలక్రమంలో కనుమరుగైన పరిస్థితుల్లో ఐదేళ్లుగా ‘పెద్ద జొన్న’ మళ్లీ ఆదివాసీ రైతుల పొలాల్లోకి, కంచాల్లోకి వచ్చింది. అమ్మటం కోసం కాకుండా.. ఇంట్లో వాళ్లంతా తినడం కోసం మాత్రమే కొద్ది విస్తీర్ణంలో పెద్ద జొన్నను వారు సాగు చేసుకుంటున్నారు. దీని చొప్ప గొప్ప రుచిగా ఉండడంతో ఎద్దులు, ఆవులు కూడా తృప్తిగా తిని సత్తువను పెంచుకుంటున్నాయి. నాగోబా జాతరలో బండి లాగుడు పోటీల్లో తమ యజమానులను విజేతలుగా నిలబెడుతున్నాయి. చిరుధాన్యాలపై మళ్లీ ఆసక్తి పెరుగుతున్న ప్రస్తుత కాలంలో మార్కెట్లోనూ మంచి గిరాకీ ఉన్న పెద్ద జొన్న సాగు ఏ ప్రాంత రైతులకైనా ప్రయోజనకరమైనదే.. సారవంతమైన పొలాలు, పుష్కలమైన వర్షపాతం కలిగిన ఆదిలాబాద్ జిల్లాను పత్తి, సోయా వంటి వాణిజ్య పంటలు చుటుముట్టక ముందు గిరిజనులు తమ సంప్రదాయ పంటలనే పండించుకునేవారు. అందువల్లనే ఆ జిల్లాలో పంటల జీవవైవిధ్యం చాలా ఎక్కువ. అయితే, గత కొన్ని దశాబ్దాలుగా వాణిజ్య పంటల ధాటికి సంప్రదాయ పంటలు కనుమరుగయ్యాయి. ఈ నేపథ్యంలో సిరికొండ మండలం మల్లాపూర్‌కు చెందిన రాజ్ గోండ్ గిరిజన రైతులు పాతకాలం నాటి ‘పెద్ద జొన్న’ (పెర్స జొన్న)ను మళ్లీ సాగులోకి తెచ్చుకున్నారు. గత ఐదేళ్లుగా ప్రతి ఏడాది రబీ సీజన్లో పెద్ద జొన్నను వారు సాగు చేస్తున్నారు. తాము పండించిన పంటకు మార్కెట్లో అధిక ధర పలుకుతున్నప్పటికీ విక్రయించకుండా తమ ఇంటి అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవటం విశేషం. మదురైకి చెందిన స్వచ్ఛంద సంస్థ ధన్ ఫౌండేషన్, మల్లాపూర్ రైతులకు విత్తనాలు ఇచ్చి పెద్ద జొన్న సాగు పునరుద్ధరణను ప్రోత్సహించింది. ఆ తరువాత క్రమంగా పక్క గ్రామాలకు దీని సాగు విస్తరించింది. 6 నెలల పంట.. మల్లాపూర్ గ్రామంలో 95 గిరిజన రైతు కుటుంబాలున్నాయి. ఆ గ్రామంలోని ప్రతి రైతు ఎకరం పొలంలో పెద్ద జొన్నను సాగు చేస్తున్నారు. ఇక్కడి నల్లరేగడి భూముల్లో ఖరీఫ్ పంటగా పత్తి, సోయా సాగు చేస్తున్నప్పటికీ.. రబీ పంటగా పెద్ద జొన్నను సాగు చేస్తున్నారు. ముందటేడాది పండిన జొన్నలను తీసిపెట్టుకొని తర్వాత విత్తనంగా వాడుకుంటున్నారు. ఎకరాకు మూడు కిలోల విత్తనం సరిపోతుంది. ఆకు ఈనె తెలుపు రంగులో ఉంటుంది. గింజ లేత పసుపు రంగులో మెరుస్తూ ఉంటుంది. పంటకాలం ఆరు నెలలు. ఏటా నవంబర్‌లో ఈ పంటను విత్తుకుంటారు. రబీ పంటకు రెండు తడులు దుక్కిలో చివికిన పశువుల ఎరువు తప్ప ఎలాంటి ఇతర ఎరువులు వేయరు. చీడపీడలు ఆశించకపోవటం వల్ల పురుగు మందులు చల్లరు. దీనివల్ల రైతుకు ఖర్చు తగ్గటమే గాక పెద్దగా పంటను పర్యవేక్షించాల్సిన అవసరమూ తప్పింది. రబీ నీటి ఎద్దడికి పెద్ద జొన్న సాగును సమర్థ పరిష్కారంగా చెప్పవచ్చు. విత్తనాలు వేసినప్పుడు మొలకెత్తేందుకు, కంకి దశలో గింజ పోసుకునేందుకు రెండుసార్లు నీటి తడులు ఇస్తే చాలు. పంట చేతికొస్తుంది. కిందికి వంగి ఉండే పెద్ద జొన్న కంకి.. హైబ్రిడ్ జొన్న సాగులో పొలానికి వారం వారం తడులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటికి పిట్టలు, చిలుకల బెడద కూడా ఎక్కువే. అయితే పెద్ద జొన్నలో మాత్రం కంకులు కిందకు వంగి ఉండటం వల్ల పక్షుల బెడద ఉండదు. పెద్ద జొన్న సాగులో స్వంత విత్తనాన్ని వాడటం, ఎరువులు, పురుగుమందులు వాడకపోవటం వల్ల రైతుకు ఖర్చు కాదు. పెద్ద జొన్న చొప్పంటే పశువులకు ఇష్టం హైబ్రిడ్ రకాల చొప్ప రుచిగా ఉండకపోవడం వల్ల పశువులు మొదళ్లను వదలి చివర్లను మాత్రమే మేస్తాయి. అయితే పెద్ద జొన్న చొప్ప తియ్యగా ఉండటం వల్ల వేర్లతో సహా పశువులు ఇష్టంగా మేస్తాయని, పశువులకు ఈ చొప్ప మంచి బలమని గిరిజన రైతులు చెబుతున్నారు. పెద్ద జొన్నల దిగుబడి హైబ్రిడ్ జొన్నల కన్నా ఎకరానికి 5 క్వింటాళ్లు తక్కువ దిగుబడి వచ్చినప్పటికీ.. ఎకరం పొలం నుంచి వచ్చే పెద్ద జొన్న చొప్ప రెండు ఎడ్లు, 8 ఆవులకు ఏడాదంతా సరిపోతుందని రైతులు చెబుతున్నారు. నాగోబా జాతరలో బండి లాగుడు పోటీల్లో తమ ఎడ్లకు ఎదురు లేకపోవడానికి కారణం బలవర్ధకమైన పెద్ద జొన్న చొప్పేనని రాజ్ గోండ్ రైతులు గర్వంగా చెబుతున్నారు. పెద్ద జొన్నలతో తయారుచేసిన ఆహారోత్పత్తులు చాలా రుచిగా ఉంటాయి. జొన్న అంబలి, గట్క, రొట్టె వంటి వాటిని తయారు చేస్తారు. వేసవి కాలంలో గిరిజనులు అంబలిని చలువ పానీయంగా తీసుకుంటారు. మధుమేహాన్ని నియంత్రిస్తుందని చెబుతారు. అందుకే మల్లాపూర్ రైతులు తమ పెద్ద జొన్నలను విక్రయించకుండా ఇంటి అవసరాలకు మాత్రమే వాడుతున్నారు. విత్తనం ఇచ్చి పుచ్చుకుంటారు.. రైతులకు విత్తనాలను ఉచితంగానే ఇస్తారు. మరుసటి పంట వచ్చాక వారి నుంచి రెట్టింపు పరిమాణంలో విత్తనాలను తీసుకుంటారు. పెద్ద జొన్నలో ఎకరాకు 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వీటితో చేసిన ఆహారోత్పత్తులు రుచిగా ఉండటం, ఆరోగ్యకరమైన పోషకాలను కలిగి ఉండటం వల్ల పెద్ద జొన్నలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ౖహెబ్రిడ్ జొన్నలు క్వింటాల్ రూ. 3 వేల వరకు ఉండగా పెద్ద జొన్నలకు మాత్రం రూ. 10 వేల వరకు ధర పలుకుతోంది. – రొడ్డ దేవిదాస్, సాక్షి, ఆదిలాబాద్ రుచికరం.. ఆరోగ్యదాయకం.. మా పూర్వీకులు పండించిన పంటను మళ్లీ మేం సాగు చేస్తున్నాం. ఏ పంటను సాగు చేసినా కనీసం ఎకరాకు రూ. 10 వేల ఖర్చు చేయాలి. పెద్ద జొన్న సాగులో రూపాయి పెట్టే అవసరం ఉండదు. రెండంటే రెండే తడులు చాలు. పెద్ద జొన్న వంటలు రుచిగా ఉంటాయి. ఆరోగ్యదాయకమైనవి కూడా. – పూసం ఆనంద్‌రావు (95509 61811),పెద్ద జొన్న రైతు, మల్లాపూర్, ఆదిలాబాద్ జిల్లా పశువుల ఎరువు మాత్రమే వేస్తాం.. పెద్ద జొన్న పంటను మా ఊళ్లోని రైతులందరు వేస్తారు. జొన్నలను మా అవసరాల కోసం మాత్రమే సాగు చేస్తున్నాం. పొలంలో పశువుల ఎరువును మాత్రమే వేస్తాం. – ఆత్రం భీంరావు (85009 12214) పెద్ద జొన్న రైతు, మల్లాపూర్ పెద్ద జొన్న రొట్టెలే ఎక్కువగా తింటాం.. మా పెద్దలు కూడా పెద్ద జొన్నలు తినేవారు. మధ్యలో వీటి జాడలేకుండాపోయింది. గత ఐదేళ్లుగా మళ్లీ ఈ పంటను పండిస్తున్నాం. నాకున్న మూడు ఎకరాల్లో పెద్ద జొన్న సాగు చేస్తున్నా. మా ఇంట్లో ఈ జొన్నతో చేసిన అంబలి, గట్క, రొట్టెలే ఎక్కువగా తింటాం. – మడావి భారతి బాయి, పెద్ద జొన్న రైతు, మల్లాపూర్ మైదాన ప్రాంత రైతులకూ అనువైన వంగడం పెద్ద జొన్న వంటి సంప్రదాయ పంటను కొన్ని వందల సంవత్సరాల నుంచి గిరిజన రైతులు సాగు చేస్తూ వచ్చారు. ఈ మధ్య కాలంలో పెద్ద జొన్న సాగు నిలిచిపోయింది. ఐదేళ్లుగా మళ్లీ కొనసాగిస్తున్నారు. గిరిజనులు వారి తిండి గింజల కోసమే వీటిని సాగు చేస్తున్నారు. మైదాన ప్రాంతాల రైతులు మేలైన యాజమాన్య పద్ధతులతో సాగు చేస్తే మంచి దిగుబడి, ఆదాయం కూడా లభిస్తుంది. – డాక్టర్ దండు మోహన్‌దాస్ (96037 16774),శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్


