అదే పనిగా ఉత్తమ్ అబద్ధాలు
కర్నె
సాక్షి, హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన గ్యాంగ్ నిత్యం అదే పనిగా అబద్ధాలు మాట్లాడు తు న్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ నాయకత్వ అవార్డు రావడంపై కూడా ఉత్తమ్ రాజకీయం చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చీకటి ఒప్పందంతో ముందుకు సాగుతున్నాయని ఆరోపించారు.