Corruption-free economy
-
భారత్‌లో అవినీతి తగ్గుతోంది..!
భారతదేశంలో వేళ్లూనుకుపోయిన అవినీతి తగ్గుముఖం పడుతోందని 2018 ప్రపంచ అవినీతి సూచి వెల్లడించింది.మన పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్ కంటే మన దేశంలో అవినీతి చాలా తక్కువగా ఉందని ప్రపంచ దేశాల అవినీతిపై అధ్యయనం చేసే ‘ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్’సంస్థ తన వార్షిక నివేదికలో తెలిపింది. మొత్తం 180 దేశాల్లో అవినీతి అతి తక్కువ ఉన్న దేశాల్లో భారత్ 78వ స్థానంలో నిలిచింది. ఇక చైనా 87వ స్థానంలో ఉంటే, పాకిస్తాన్ 117వ స్థానంలో ఉందని ఆ అధ్యయనంలో తేలింది. ‘ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్’ఏటా కరప్షన్ పెర్సెప్షన్ ఇండెక్స్ (సీపీఐ)ను విడుదల చేస్తూ ఉంటుంది. ఇందులో అవినీతి స్కేల్‌ని జీరో నుంచి 100 వరకు కొలుస్తూ ఉంటారు. జీరో వస్తే అవినీతి బలంగా వేళ్లూనుకుందని అర్థం. అదే 100 పాయింట్లు వస్తే అవినీతి రహిత దేశంగా పేర్కొంటారు. ఈ ఏడాది సీపీఐలో మూడింట రెండు వంతుల దేశాల స్కోర్ 50 కంటే తక్కువగానే వచ్చాయి. 2017లో భారత్ సీపీఐ స్కోర్ 40 ఉంటే, ఈ ఏడాది 41కి చేరింది. భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అవినీతిలో ఆ మాత్రం తగ్గుదల కనిపించడం మంచి పరిణామమేనని ఆ నివేదిక అభిప్రాయపడింది. అన్నాహజారే నేతృత్వంలో ఉద్యమ ప్రభావంతో... 2011లో అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువత ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే నేతృత్వంలో కదం తొక్కింది. జన లోక్‌పాల్ చట్టాన్ని తీసుకువచ్చి అవినీతిని అంతం చేయాలంటూ డిమాండ్లు మిన్నంటాయి.దీనిపై ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోయినప్పటికీ, క్షేత్రస్థాయిలో అవినీతిని అరికట్టడానికి ఎలాంటి ప్రత్యేకమైన చర్యల్ని తీసుకోకపోయినప్పటికీ ఆనాటి ఉద్యమ ప్రభావంతో అవినీతి కాస్తో కూస్తో తగ్గిందని ఆ నివేదిక అభిప్రాయపడింది. మొదటి ర్యాంకు డెన్మార్క్, అట్టడుగు స్థానంలో సోమాలియా ఇక అవినీతి అత్యంత తక్కువగా ఉన్న దేశాల్లో మొదటి స్థానంలో డెన్మార్క్ నిలవగా, రెండో స్థానంలో న్యూజిలాండ్ ఉంది. ఆ దేశాల సీపీఐ స్కోర్లు 88, 87గా ఉన్నాయి. ఇక అవినీతి ఊబిలో కూరుకుపోయిన దేశాల్లో సోమాలియా 10 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత సిరియా, దక్షిణ సూడాన్ చెరో 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. అమెరికాలో కాస్త పెరిగిన అవినీతి ఇక అమెరికాలో గత ఏడాది కంటే సీపీఐ పాయింట్లు నాలుగు తగ్గి 75 నుంచి 71 కి పడిపోయాయి. దీంతో అమెరికా అవినీతి అతి తక్కువగా ఉన్న మొదటి 20 దేశాల జాబితాలో స్థానం పొందలేకపోయింది. 2011 తర్వాత మొదటి 20 దేశాల్లో చోటు దక్కకపోవడం అమెరికాకు ఇదే మొదటిసారి. ఈ పరిణామం కచ్చితంగా అగ్రదేశానికి ఆందోళన కలిగించేదే. సీపీఐ స్కోర్ నాలుగు పాయింట్లు దిగజారడం అంటే అత్యున్నత స్థాయిలో నైతిక విలువలు పడిపోతున్నాయనే ఆందోళన కలుగుతోందని ‘ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్’అమెరికా ప్రతినిధి జియో రాయటర్ అన్నారు. దేశంలో ఇదే స్థాయిలో అవినీతి కొనసాగితే దేశానికి అదే పెద్ద సమస్య అవుతుందని జియో పేర్కొన్నారు – సాక్షి, నాలెడ్జ్ సెంటర్ -
దీర్ఘకాలంలో మంచి ఫలితాలు
కొన్నేళ్లలోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవినీతి రహిత ఆర్థిక వ్యవస్థ బ్యాంకుల వద్ద అపారంగా నిధులు తక్కువ వడ్డీకే బ్యాంక్ రుణాలు పెద్ద నోట్ల రద్దుపై అరుణ్ జైట్లీ అంచనా న్యూఢిల్లీ: పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన ఇబ్బందులకు చింతిస్తున్నామని, ఈ ఇబ్బందులను ముందే ఊహించామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. అయితే ఈ చర్య వల్ల దీర్ఘకాలంలో మంచి వృద్ధి సాధించగలమని, రుణాలివ్వడానికి బ్యాంకుల వద్ద నిధులు అపారంగా ఉంటాయని, అవినీతి రహితమైన ఆర్థిక వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ జరిగిన పెట్రోకెమికల్ సమావేశంలో దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లనుద్దేశించి ఆయన ప్రసంగించారు. భవిష్యత్తులో భారీ మార్పులు.. భవిష్యత్తులో భారత్ చాలా పెద్ద పెద్ద మార్పులకు గురికానున్నదని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు చేయడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని విశ్వాసం వెలిబుచ్చారు. అరుుతే పెద్ద కరెన్సీ నోట్ల రద్దు వలన దేశంలో కరెన్సీ కొరత ఏర్పడిందని ఆయన అంగీకరించారు. ఆర్బీఐ కొంత మొత్తంలో నగదును సర్దుబాటు చేసిందని, దీనికి సమాంతరంగా డిజిటల్ లావాదేవీల సంఖ్య పెంచడం ద్వారా ఈ కొరత సమస్యను అధిగమించాలని సూచించారు. డిజిటల్ లావాదేవీల విషయమై గత కొన్ని దశాబ్దాల్లో సాధించిన వృద్ధి కన్నా రానున్న 2/3 నెలల్లో మరింత వృద్ధి సాధించగలమని చెప్పారు. పన్ను ఆదాయం పెరుగుతుంది.. ఈ చర్య కారణంగా బ్యాంకుల వద్ద నిధులు పెరుగుతాయని, ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునిచ్చే శక్తి బ్యాంకులకు మరింతగా పెరుగుతుందని, తక్కువ వడ్డీరేట్లకే బ్యాంక్ రుణాలు లభిస్తాయని జైట్లీ వివరించారు. ఈ చర్య వల్ల బ్యాంక్ లావాదేవీలు పెరుగుతాయని, పన్ను ఆదాయం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాదీ అదే జోరు... మన దేశంలో 80 కోట్లకు పైగా డెబిట్, క్రెడిట్ కార్డులున్నాయని, అయితే వీటిల్లో 45 కోట్ల కార్డులను మాత్రమే చురుగ్గా ఉపయోగిస్తున్నారని, ఈ దృష్ట్యా డిజిటల్ లావాదేవీల జోరును పెంచాల్సి ఉందని జైట్లీ వివరించారు. గత కొన్నేళ్లుగా సరైన సంస్కరణలు లేక మన దేశం నీరసించిందని, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ అవతరించిందని పేర్కొన్నారు. గత రెండేళ్లలో మంచి వృద్ధి సాధించామని, ఈ ఏడు కూడా అదే జోరు కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొన్నేళ్లలోనే వర్థమాన దేశం స్థాయి నుంచి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి రియల్ ఎస్టేట్, మరికొన్ని రంగాల్లో 2 విధాలుగా చెల్లింపులు జరపడం (నల్లధనం, తెల్ల ధనం) ప్రజలకు అలవాటు అయిపోయిందని.. దీన్ని ప్రభుత్వం మార్చాలని గట్టిగా ప్రయత్ని స్తోందని జైట్లీ స్పష్టం చేశారు.