counting centers
-
కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జ రగనున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీ య ఘటనలకు తావులేకుండా పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండా లని పోలీస్ అధికారులు, సిబ్బందిని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహణపై పోలీస్ ఉన్నతాధికారులతో శనివారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అభ్యర్థుల గెలుపోటముల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అదనపు బలగాలతో పికెట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యా లీల సందర్భంగా దాడులు, ప్రతిదాడులకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసు అధికారులు, సిబ్బంది ఎంతో శ్రమించారని, మరో రెండురోజులు ఇదే స్ఫూర్తితో అప్రమత్తంగా ఉండాలని డీజీపీ కోరారు. -
ఊరూవాడా.. రిజల్ట్‌పై అటెన్షన్!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో జనం దృష్టి అంతా ఫలితాలపైనే పడింది. ఊరూవాడా పల్లెపట్నం ఎక్కడ చూసినా.. చిన్నాపెద్దా ఎవరిని కదిలించినా ఉత్కంఠ కనిపిస్తోంది. ఎవరెవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది? ప్రభుత్వం ఏర్పాటు చేసేదెవరు? కేసీఆర్, కేటీఆర్, రేవంత్, ఈటల వంటి ప్రముఖ నేతల్లో ఎవరెవరికి ఎలాంటి ఫలితం ఎదురవుతుందన్న చర్చ కూడా సాగుతోంది. పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు, కూలీల నుంచి హోటళ్లలో, బస్టాండ్లలో పిచ్చాపాటీ దాకా ఎక్కడ నలుగురు కలసినా ఇదే తీరు. చివరికి ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాల్లో పరిచయస్తులు కనిపించినా ఎలక్షన్ల ప్రస్తావన రాకుండా ఉండటం లేదు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టులపై విస్తృత విశ్లేషణలు చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఫలితాల హీట్ కనిపిస్తోంది. పందెం కాస్తావా? పల్లె, పట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా ఫలితాలపై చర్చలు సాగుతుంటే.. వివిధ పార్టీల అభిమానుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కనిపిస్తున్నాయి. మేం గెలుస్తామంటే, మేం గెలుస్తామంటూ అభ్యర్థులు, పార్టీల తరఫున సరదా పందేలూ జరుగుతున్నాయి. మరోవైపు అసెంబ్లీ ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు కూడా జరుగుతున్నాయని, ఇప్పటికే రంగ ప్రవేశం చేసిన బుకీలు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్‌మీడియా గ్రూపుల్లో హడావుడి చేస్తున్నారని తెలిసింది. సీఎం ఎవరవుతారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై రూ.లక్షల్లోనే బెట్టింగులు సాగుతున్నాయి. కర్ణాటక, ఏపీ వంటి పొరుగు రాష్ట్రాల్లోనూ తెలంగాణ ఫలితాలపై ఆసక్తి కనిపిస్తోంది. అక్కడి వారూ బెట్టింగ్‌లు కడుతున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో జోరుజోరుగా.. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎన్నికల ఫలితాల అంచనాలు, విశ్లేషణలు పోటెత్తుతున్నాయి. ఎక్కడ ఫలితాలు ఎలా ఉంటాయనే అంచనాలు, ఊహాగానాలు క్షణం తీరిక లేకుండా పోస్టు అవుతున్నాయి. ఫోన్లో నోటిఫికేషన్ సౌండ్ వచ్చిందంటే చాలు చేతిలోకి తీసుకుని చెక్చేసుకుంటున్నారు. రాజకీయ పోస్టులను చదవడమే కాదు.. వాటిపై తమ అభిప్రాయాలు, అంచనాలనూ రిప్లైలో ఇస్తున్నారు. తమకు నచ్చినవాటిని ఆయా ప్లాట్‌ఫామ్‌లపై, గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. దీంతో ఎవరు గెలుస్తారన్నది, ఎవరు ఓడుతారన్నది గందరగోళంగా మారిపోయింది. -
కౌంటింగ్ ప్రక్రియ.. ఈసీ కఠిన నిబంధనలు
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ విజృంభిస్తోంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక కరోనా విజృంభణకు తాజాగా దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలే కారణమని జనాలు బలంగా విశ్వస్తున్నారు. ఈ క్రమంలో మద్రాస్ హైకోర్టు ఎన్నికల కమిషన్ మీద ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ వ్యాప్తికి ఈసీనే కారణమని.. హత్యా కేసు పెట్టాలని సూచించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మే 2న జరగబోయే కౌంటింగ్‌కు సంబంధించి ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు, కోవిడ్ నెగిటివ్ రిపోర్టు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపింది. ఈ మేరకు ఈసీ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈసీ ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఈసీ కౌంటింగ్ కేంద్రాల వద్ద జనసమూహానికి అనుమతి లేదని తెలిపింది. కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్లాలనుకునే వారు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు, టీకా రెండు డోసులు తీసుకున్నట్లు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను కౌంటింగ్‌కు 48 గంటల ముందే సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించింది. అభ్యర్థులు కౌంటింగ్ రోజున హాజరయ్యే ఏజెంట్లకు సంబంధించిన లిస్ట్‌ను మూడు రోజుల ముందుగానే అందించాలని తెలిపింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. గురువారం బెంగాల్లో చివరి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు పెద్ద ఎత్తున జనాలతో భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. అందుకే కోవిడ్ విజృంభిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. చదవండి: ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు -
కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల ఫలితాల రోజు ఎలాంటి అవాంతరాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఎల్లుండి (గురువారం) జరగనుందని, అన్ని కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు ఉందని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లను చేశామని, ఫలితాల తర్వాత ఎలాంటి విజయోత్సవాలకు, సంబురాలకు అనుమతి లేదన్నారు. 144 సెక్షన్ అమలు ఉన్నందున కౌంటింగ్ సెంటర్ల నుంచి 100 మీటర్ల లోపు సిబ్బంది మినహా ఎవరిని అనుమతించమని తెలిపారు. వేసవికాలం దృష్ట్యా కౌంటింగ్ సిబ్బందికి మంచినీరు, మజ్జిగ వంటి ఏర్పాట్లు చేశామన్నారు. -
నాయకులు @ బెజవాడ
సాక్షి, అమరావతి బ్యూరో : కౌంటింగ్‌కు కేవలం మూడు రోజులు మాత్రమే గడువుంది. పోలింగ్‌కు కౌంటింగ్‌కు 43 రోజుల సుధీర్ఘ విరామం రావడంతో అందరి దృష్టి ఫలితాలపై పడింది. గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తిని ఈ ఎన్నికలు రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోనూ అలాగే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.? ఏ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమవుతుంది అనే కుతూహలం అందరిలోనూ ఏర్పడింది. విజయవాడలో మకాం.. మే 23న కౌంటింగ్ 8 గంటలకే ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్లు ఉదయం 5 గంటలకే అక్కడికి చేరుకోవాల్సి ఉంది. దీంతో ఆయా రాజకీయ పార్టీలు ఏజెంట్లను ఇతర పార్టీ నాయకులు అపహరించకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మూడురోజుల ముందు నుంచి వారికి సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. జిల్లాకు సంబంధించి మచిలీపట్నం పార్లమెంట్‌కి సంబంధించి కృష్ణా యూనివర్సిటీలో, విజయవాడ పార్లమెంట్‌కు పెనమలూరులోని ధనేకుల ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. లాడ్జీలు, హోటళ్లలో గదులు నిల్.. నాయకులు వారి అనుచరులు, పార్టీ కార్యకర్తలు కౌంటింగ్ రోజు విజయవాడలో ఉండేట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలైన వైఎస్సార్ సీపీ, టీడీపీ కార్యాలయాలు ఇక్కడే ఉండడంతో ఇప్పటికే కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు విజయవాడకు చేరుకున్నారు. నగరంలోని లాడ్జీలు, హోటళ్లు, పలు గెస్ట్ హౌస్‌లు ముందస్తు బుకింగ్ చేసుకున్నారు. ఎన్నికల ఫలితాలకు శుభకార్యాలు తోడవడంతో లాడ్జీల యజమానులు పండుగ చేసుకుంటున్నారు. పనిలో పనిగా డిమాండ్ భారీగా ఉండడంతో అద్దెలు కూడా పెంచేస్తున్నారు. పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లలోని కాన్ఫరెన్స్ హాళ్లలో పెద్ద పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. స్నేహితులంతా ఒక చోట చేరి ఫలితాలు వీక్షించేందుకు అనువుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే పందెం రాయుళ్లు కూడా ఫలితాల వీక్షణపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, యువకులు, రైతులు, వ్యాపారస్తులు ఇలా అన్ని వర్గాల వారు ఫలితాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. పండుగ చేసుకునేందుకు.. కౌంటింగ్ పూర్తయ్యి మధ్యాహ్నం రెండు గంటల సమయానికి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో స్పష్టంగా తెలియనుంది. అలాగే కేంద్రంలో ఏ పార్టీ అధికారం హస్తగతం చేసుకుంటుందో వెల్లడికానుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు గెలుపు సంబరాలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
బ్యాలెట్ బాక్సుల్లో భవితవ్యం
చుంచుపల్లి: జిల్లాలో పరిషత్ పోరు మూడు విడతల్లో ప్రశాంతంగా ముగిసింది. బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు అదృష్టం ఎవరిని వరిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. రెండు, మూడు రోజులుగా అభ్యర్థులు బూత్‌ల వారీగా నమోదైన ఓట్ల ఆధారంగా తమకు ఎన్ని ఓట్లు వస్తాయని బేరీజు వేసుకుంటున్నారు. మరికొందరు ఏకంగా గెలుపు ధీమాలోనే ఉన్నారు. ఫలితాలు రావడానికి ఇంకా 10 రోజుల సమయం ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను ఈ నెల 27వ తేదీన వెల్లడించనున్నారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ పేపర్లను లెక్కిస్తారు. జిల్లాలో ఓట్ల లెక్కింపుకు అధికారులు ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 209 ఎంపీటీసీలకు, 21 జెడ్పీటీసీలకు ఓటింగ్ జరగాల్సి ఉండగా, 21 జెడ్పీటీసీ, 206 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 3 ఎంపీటీసీ స్థానాలు.. కోయగూడెం, అశ్వాపురం, ఎల్చిరెడ్డిపల్లి ఏకగ్రీవమయ్యాయి. ఓట్ల లెక్కింపు కోసం జిల్లా వ్యాప్తంగా అధికారులు 7 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండల యూనిట్‌గా జెడీటీసీ ఓట్లను, గ్రామ యూనిట్‌గా ఎంపీటీసీ ఓట్లను అధికారులు లెక్కిస్తారు. ముందుగా ఎంపీటీసీ ఓట్లను లెక్కించిన తర్వాతనే జెడ్పీటీసీ ఓట్లను లెక్కిస్తారు. జిల్లావ్యాప్తంగా 841 మంది అభ్యర్థులు ఎంపీటీసీ స్థానాల్లో, 121 మంది అభ్యర్థులు జెడ్పీటీసీ స్థానాల్లో, మొత్తం 962 మంది అభ్యర్థులు పరిషత్ ఎన్నికల బరిలో ఉన్నారు. ముందు ఎంపీటీసీ.. తర్వాతే జెడ్పీటీసీ ఓట్ల కౌంటింగ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు మూడు దశల్లో చేపడతారు. మొదటి దశలో బ్యాలెట్ పేపర్లు, సదరు బూత్‌లో ఉన్న ఓటర్ల వివరాలతో లెక్కిస్తారు. ఇది ఆయా పోలింగ్ కేంద్రాల వారీగా జరుగుతుంది. ఆ తర్వాత వాటిని బండిల్ చేస్తారు. అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా విడివిడిగా విడదీసి ఒక్కో బండిల్లో 25 బ్యాలెట్ పత్రాలు ఉండేలా కట్టలు కడతారు. మొదట ఎంపీటీసీ ఓట్లను తరువాత జెడ్పిటీసీ ఓట్లను లెక్కిస్తారు. రెండో దశలో ఎంపీటీసీ ఎన్నికకు కౌంటింగ్ మొదలుపెడుతారు. ఒక్కో ఎంపీటీసీ స్థానానికి రెండు టేబుళ్లు, రెండు రౌండ్లు ఏర్పాటు చేస్తారు. ప్రతీ ఎంపీటీసీ అభ్యర్థికి ఇద్దరు చొప్పున కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉంటుంది. ప్రతి బ్యాలెట్ పేపర్‌ను ఓపెన్ చేసి చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఏజెంట్ల ముందు అధికారులు చూస్తారు. చెల్లుబాటు అయితే వాటిని ఎంపీటీసీ స్థానాల్లోని ట్రేల్లో వేస్తారు. ఒక వేళ అనుమానాలు వ్యక్తం చేస్తే మాత్రం వాటిని రిటర్నింగ్ అధికారుల దగ్గరకు పంపించి, నిర్ణయం తీసుకుంటారు. అభ్యంతరాలున్న బ్యాలెట్ల పేపర్ల విషయంలో రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయం ఉంటుంది. ఒక్కొక్క రౌండ్లో వెయ్యి ఓట్లు లెక్కిస్తారు. ఒక్కో స్థానానికి అధికారులు రెండు రౌండ్లు ఏర్పాటు చేయనున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తరువాత గ్రామాల వారీగా ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఎంపీటీసీ స్థానానికి ఒక టేబులు ఏర్పాటు చేస్తారు. దీని పరిధిలో బ్యాలెట్ పెట్టెలన్నింటినీ ఒకేసారి సీలు తీస్తారు. లెక్కింపునకు ఆరంభంలో పీవో డైరీలో ఉన్న లెక్కకు సమానంగా ఉన్నాయో లేవో సరి చూస్తారు. ఒక్కొక్క ఎంపీటీసీ స్థానం లెక్కింపులో ఒక సూపర్‌వైజర్‌తోపాటు ఇద్దరు ఎన్నికల అధికారులు లెక్కింపులో పాల్గొంటారు. జిల్లాలో మొత్తం 206 ఎంపీటీసీ స్థానాల లెక్కింపులో 618 మంది సిబ్బంది లెక్కింపు విధుల్లో పాల్గొంటారు. వీరికి 10 శాతం అదనంగా సిబ్బంది అందుబాటులో ఉంటుంది. జిల్లాలో 7 లెక్కింపు కేంద్రాలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 7 లెక్కింపు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మూడు విడతల్లో జరిగిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయా మండలాల పరిధిలోగల ప్రధాన పట్టణాలలో బ్యాలెట్ బాక్సులను అధికారులు భద్రపరిచారు. తొలివిడత ఎన్నికలు జరిగిన 7 మండలాలు అశ్వాపురం, చర్ల, బూర్గంపాడు, దుమ్ముగూడెం సంబంధించిన ఓట్ల లెక్కింపు భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతుంది. పాల్వంచ, ములకలపల్లి, టేకులపల్లి మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తారు. రెండో విడతలో ఎన్నికలు జరిగిన అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ, జూలూరుపాడు మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొత్తగూడెం వేపలగడ్డలోని అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతుంది. ఇక పినపాక, కరకగూడెం, మణుగూరు మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కిం పు సమితి సింగారం ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు సంబంధించి న ఓట్ల లెక్కింపు అశ్వారావుపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతుంది. ఇక చివరి విడతలో ఎన్నిక లు జరిగిన ఆళ్లపల్లి, గుండాల, ఇల్లెందు మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇల్లెందులోని టీఎస్టీడబ్ల్యూఆర్ కళాశాలలో నిర్వహిస్తారు. లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్ కళాశాలలో నిర్వహిస్తారు. అధికారులు ఇప్పటికే ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఓట్ల లెక్కింపు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు సిబ్బందికి రెండు రోజులపాటు జిల్లా కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే గురువారం జేసీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం ఎన్నికల సిబ్బందితో జరిగింది. లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నాం జిల్లాలో ఈ నెల 27వ తేదీన చేపట్టనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు విషయంలో 7 కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. సిబ్బందికి ఇప్పటికే ఒక దఫా శిక్షణ తరగతులు నిర్వహించాం. మరో రెండు రోజుల్లో మరోదఫా శిక్షణనిచ్చి అవగాహన కల్పిస్తాం. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎన్నికల నియమావళి అమలుపరుస్తాం. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా చూస్తాం. –కర్నాటి వెంకటేశ్వర్లు, జేసీ -
కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జేసీ
చేబ్రోలు, న్యూస్‌లైన్ :తెనాలి జేఎంజే కళాశాలలో మంగళవారం నిర్వహించిన చేబ్రోలు మండలం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ పక్రియను జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ పరిశీలించారు. మొత్తం 14 టేబుల్స్‌లో ఎన్నికల సిబ్బంది ముందుగా ఎంపీటీసీ ఓట్లను లెక్కించారు. అనంతరం జెడ్పీటీసీ ఓట్లను లెక్కించారు. కౌంటింగ్ పక్రియ వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చేబ్రోలు ఎస్ఐ షేక్ నాగుల్‌మీరా సాహెబ్, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. జేసీ వివేక్ యాదవ్ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించి గెలుపొందిన ఎంపీటీసీ సభ్యుల్లో కొంతమందికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఎన్నికల పక్రియలో పొన్నూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి శ్రీరామచంద్రమూర్తి, మండల రిటర్నింగ్ అధికారి కెజియాకుమారి, ఎంపీడీవో సీహెచ్.నరసరావు, ఇన్చార్జి తహశీల్దారు కె.భువనేశ్వరి, ఈవోపీఆర్డీ బి.శివసత్యనారాయణ, రెవెన్యూ, పంచాయితీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. తెనాలిలో.. తెనాలిటౌన్: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ను స్థానిక ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. కౌంటింగ్ ప్రారంభానికి ముందు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.జ్యోతిరమణి, సహాయ ఎన్నికల అధికారి ఎంఎల్.నరసింహారావులు ఎన్నికల సిబ్బందికి నియమ నిబంధనలను తెలియజేశారు. అధికారులు ఎన్నికల సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, అదనపు జాయింట్ కలెక్టర్ కె.నాగే శ్వరరావు, ఎన్నికల పరిశీలకులు ఎం.లక్ష్మీనరసింహాన్, ఆర్డీవో ఎస్.శ్రీనివాసమూర్తి సందర్శించి సిబ్బందికి సూచనలు తెలియజేశారు. డీఎస్పీ టీపీ విఠలేశ్వర్ ఆధ్వర్యంలో సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ వెంకట్రావులు, పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ప్రాదేశిక ఫలితాలు తేలేది నేడే
-
నేడు ప్రాదేశిక ఫలితాలు
డివిజన్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు - ఉదయం 10 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం - మధ్యాహ్నం 3గంటల్లోగా ఎంపీటీసీ ఫలితాలు - రాత్రి వరకు కొనసాగనున్న జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు - కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు - గెలుపు సంబరాలు, మద్యం దుకాణాలు బంద్ నల్లగొండ, న్యూస్‌లైన్, ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవి తవ్యం మంగళవారం తేలనుంది. ఈ ఓట్ల లెక్కింపు ఐదు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో చేపట్టనున్నారు. జిల్లావ్యాప్తంగా 59 జెడ్పీటీసీ స్థానాలకు 392 పోటీలో ఉండగా, 835 ఎంపీటీసీ స్థానాలకు ప్రధాన పార్టీలతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి 3,311మంది పోటీ చేశారు. తొలి విడత ఎన్నికలు ఏప్రిల్ 6వ తేదీన సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్లలో జరిగాయి. రెండో విడత 11వ తేదీన నల్లగొండ, భువనగిరి డివిజన్ పరిధిలోని మండలాలకు జరిగాయి. ఎన్నికల ఫలితాల కోసం ఎదరుచూస్తున్న అభ్యర్థుల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. ఉదయం 7.30 గంటలకు ఆయా డివిజన్ కేంద్రాల్లో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు ఆ తర్వాత 10గంటల నుంచి బ్యాలెట్ బాక్సులు తెరిచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఎన్నికల కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాల్లో 484 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ నిర్వహణకు రెండువేల మంది సిబ్బందిని నియమించారు. వీరిలో కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు. లెక్కింపు ఇలా.. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఓట్ల లెక్కింపు కోసం ఐదు కేంద్రాల్లో ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. ముందుగా ఆయా గ్రామాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను అభ్యర్థులకు చెందిన ఏజెంట్ల సమక్షంలో సీల్ తీస్తారు. ఇలా తీసిన బాక్సుల్లో ఓట్లను ఒక కుప్పగా వేసి అందులోంచి జెడ్పీటీసీకి కేటాయించిన తెల్లరంగు బ్యాలెట్, ఎంపీటీసీకి కేటాయించిన గులాబీ రంగు బ్యాలెట్లను వేరుచేస్తారు. వేరుచేసిన బ్యాలెట్ పేపర్లను ఆయా గుర్తులతో ముందుగానే సిద్ధం చేసిన ట్రేలల్లో వేస్తారు. ఇలా వేరు చేయడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది. పూర్తిస్థాయి లెక్కింపు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభిస్తారు. ప్రతి ఎంపీటీసీ స్థానం లెక్కింపు మూడురౌండ్లుగా జరుగుతుంది. ఒక్కో రౌండ్‌కు సుమారు వెయ్యి ఓట్లను లెక్కపెడతారు. ప్రతి గంటకు ఒకసారి ఓట్ల లెక్కించిన వివరాలను ఏజెంట్లకు, మీడియాకు సమాచారం అందిస్తారు. మధ్యాహ్నం 3 గంటవరకు ఎంపీటీసీల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. జెడ్పీటీసీల లెక్కింపు రాత్రి వరకు పూర్తికావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 25ఓట్లను ఒక బండిల్‌గా కట్టి ఓట్లను లెక్కపెడతారు. ఇలా చేయడం వల్ల లెక్కింపు సులువుగా ఉండడమే గాకుండా, త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. పకడ్బందీ బందోబస్తు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఘర్షణలూ చోటుచేసుకోకుండా ఉండేందుకు జిల్లా పోలీస్ శాఖ పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగానే మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు మినహా మిగతా ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. అలాగే ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు గెలుపు సంబరాలు, ర్యాలీలు నిర్వహించడాన్ని నిషేధించారు. -
నేటి ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
సూర్యాపేట రూరల్, న్యూస్‌లైన్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు సూర్యాపేట మండలం అరవిందాక్ష ఇంజనీరింగ్ కళాశాలలో అధికారులు రంగం సిద్ధం చేశారు. మంగళవారం ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను సోమవారం జేసీ హరి జవర్లాల్ పర్యవేక్షించారు. బందోబస్తు పకడ్బందీగా నిర్వహించాలని పోలీసులకు సూచించారు. అదే విధంగా మాక్ కౌంటింగ్ నిర్వహణను పరిశీలించారు. సూర్యాపేట రెవెన్యూ డివిజన్లోని 14 మండలాల జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్లను లెక్కించనున్నారు. అరవిందాక్ష ఇంజనీరింగ్ కళాశాలలో మూడో అంతస్తులో సూర్యాపేట, చిలుకూరు, మోతే, నడిగూడెం, మునగాల, ఆత్మకూర్ (ఎస్), చివ్వెంల మండలాల ఓట్లు లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. నాలుగవ అంతస్తులో తుంగతుర్తి, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, నూతనకల్, కోదాడ, మేళ్ళచెరువు మండలాల ఓట్ల లెక్కించనున్నారు. ఒక్కో మండలానికి ఆరు నుంచి ఏడు టేబుల్లు ఏర్పాటు చేయగా, కౌంటింగ్ నిర్వహించేందుకు ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు సిబ్బంది ఉంటారని అధికారులు పేర్కొన్నారు. కౌంటింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు, ఏజెంట్లు వరుస క్రమంలో కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు భారీకేడ్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా వాహనాల పా ర్కింగ్, మంచినీటి వసతి, తదితర ఏర్పాట్లన్నింటినీ సూర్యాపేట ఆర్డీఓ వి.నాగన్న పర్యవేక్షణలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపునకు హాజరయ్యే వారు తప్పని సరిగా పాస్ తీసుకోవాలని తెలిపారు. -
నేడే ‘పరిషత్’ ఫలితాలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మున్సిపల్ లెక్క తేలింది. ఇక పరిషత్ పోరులో గెలుపోటముల లెక్క తేలనుంది. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(జెడ్పీటీసీ), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ)లకు జరిగిన ఎన్నికల ఓట్లను మంగళవారం లెక్కించనున్నారు. నెల రోజులుగా ఎదురుచూస్తున్న ఉత్కంఠకు తెరపడనుంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై రాత్రి వరకు కొనసాగవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని ఐదు డివిజన్లలో స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేసి బ్యాలెట్ బాక్సులను భద్రపర్చారు. ఆయా స్ట్రాంగ్ రూంల పరిధిలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌లోని కోలాం ఆశ్రమ పాఠశాల, నిర్మల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఉట్నూర్‌లోని కేబీ కాంప్లేక్స్, ఆసిఫాబాద్‌లోని ఐటీడీఏ బాలికల వసతిగృహం, మంచిర్యాలలోని ఏపీ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఓట్లు లెక్కించనున్నారు. జిల్లాలోని 52 జెడ్పీటీసీ, 633ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతలుగా ఏప్రిల్ 6న, 11న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులోమూడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 52 జెడ్పీటీసీ.. 633 ఎంపీటీసీలు.. జిల్లాలోని 52 జెడ్పీటీసీ, 636 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో మూ డు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. నేరడిగొండ, కుభీర్, సారంగాపూర్ మండలాల్లో ఒక్కో ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవమైంది. మిగతా 52 జెడ్పీటీసీ, 633 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఓట్లను లెక్కించేందుకు జిల్లాలోని ఐదు స్ట్రాంగ్ రూంల పరిధి లో 541 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్ సూపర్వైజర్లు ఒక్కో టేబుల్‌కు ముగ్గురు అధికారుల చొప్పున నియమించా రు. అయితే 541 టేబుళ్లకు 627 మంది సూపర్వైజర్లు, 1,825 అసిస్టెంట్ సూపర్వైజర్లను నియిమంచారు. 269 మంది సిబ్బందిని రిజర్వులో ఉంచా రు. లెక్కింపుకు మొత్తం 2,696 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. పల్లెల్లో వేడేక్కిన రాజకీయం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదల కానుండటంతో పల్లెలో రాజకీయం వేడెక్కింది. జిల్లాలోని 52 జెడ్పీటీసీ స్థానాలకు ఏకంగా 267 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి సుమారు 5 నుంచి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 633 ఎంపీటీసీ స్థానాలకు 2,710 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఐదు నుంచి 15 మంది వరకు అభ్యర్థులు ఉండడంతో అభ్యర్థులకు కంటిమీదా కునుకు లేకుండా చేస్తోంది. ఏప్రిల్ 11తో ముగిసిన పరిషత్ ఎన్నికలు సుమారు నెల తర్వాత ఫలితాలు విడుదలవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. గెలుపుపై ధీమాగా ఉన్న అభ్యర్థులు కూడా ఫలితాలు చూస్తుంటే మాత్రం ముచ్చేమటలు పడుతున్నాయి. ఇందుకు సోమవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. -
కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
ఏటీఅగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్ :పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై పోలీస్ బాస్‌లు ప్రణాళికబద్ధంగా సిబ్బందికి విధులు కేటాయించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా భారీగా పోలీస్ బలగాలు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ విధానం వల్ల ఓట్ల లెక్కింపులో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన వసతులను ఎస్పీలు జె. సత్యనారాయణ, జెట్టి గోపీనాథ్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీస్ నిబంధ నలు, ఆంక్షలను అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు 144వ సెక్షన్, పోలీస్ యాక్టు-30 అమల్లో ఉన్నందున కౌంటింగ్ కేంద్రాల సమీపంలో గుంపులుగా నిలబడినా, అల్లర్లుకు పాల్పడినా సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక బలగాలను కూడా నియమించారు. కౌంటింగ్ అనంతరం విజయోత్సవ యాత్రలు చేయడాన్ని పోలీసులు పూర్తిగా నిషేధించారు. జిల్లాలోని 12 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ జరుగనుంది. గుంటూరులోని హిందూ ఫార్మశీ, ఏఎల్ బీఈడీ, టీజేపీఎస్, ఏసీ కళాశాల, నల్లపాడులోని సెయింట్ జోసఫ్ మహిళా కళాశాలల్లో కౌంటింగ్ నిర్వహిస్తారు. నరసరావుపేట, తెనాలి పట్టణాల్లోని కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏఎస్పీలు నలుగురు, డీఎస్పీలు 14, సీఐలు 35 మందితోపాటు మొత్తం 1500 మంది అధికారులు, సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. ట్రాఫిక్ మళ్లింపు... కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని, వాహనదారులు సహకరించాలని డీఎస్పీ బిపి.తిరుపాలు కోరారు. కౌంటింగ్ కేంద్రాలకు వచ్చేవారు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను నిర్థేసించిన ప్రాంతాల్లో నిలుపుకోవాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల సమీపంలో రోడ్లపై వాహనాలు నిలిపితే సీజ్ చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వ రకు సమీపంలోని ప్రధాన రోడ్లలో ఓ వైపు రోడ్డును మూసివేస్తున్నారు. అమరావతి రోడులోని కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లేవారు అదే రోడ్డులోని హిందూ ఫార్మసీ బోయస్ హాస్టల్ గ్రౌండ్లో నిలుపుకోవాలి. లాడ్జి సెంటర్లోని కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళేవారు నార్త్ ప్యారిష్ చర్చి వెనుక వైపు వాహనాలు పార్క్ చేయాలి. హిందూ కళాశాలకు వచ్చే వాహనదారులు ఉల్పాహాల్ గ్రౌండ్ , టీజేపీఎస్ కళాశాల వద్దకు వచ్చే వాహనాలను పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పార్క్ చేయాలి. పాతగుంటూరు: నగరంలోని ఆంధ్రా లూథరన్ బీఈడీ కళాశాల, అమరావతి రోడ్డులోని హిందూ ఇంజనీరింగ్ కళాశాలల్లో కౌంటింగ్ కేంద్రాలను సోమవారం వెస్ట్ డీఎస్పీ నాగరాజు పరిశీలించారు. కౌంటింగ్ సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ రెండు కౌంటింగ్ కేంద్రాల్లో 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట అరండల్‌పేట సీఐ వెంకటశేషయ్య, సిబ్బంది తదితరులున్నారు. -
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. మున్సిపాలిటీలకు ఎన్నికలు మార్చి 30న జరిగాయి. ఆరు మున్సిపాలిటీల్లో 189 వార్డులు ఉండగా, ఆదిలాబాద్‌లోని 34వ వార్డు, భైంసాలోని మూడో వార్డు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 187 వార్డులకు ఎన్నికలు జరగ్గా, ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటల నుంచి నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో వార్డుకు పోటీ చేస్తున్న అభ్యర్థులవారీగా ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఆరు మున్సిపాలిటీల ఈవీఎంలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో భద్రపర్చారు. వీటికి నిరంతరం ఉన్నతాధికారుల పర్యవేక్షణ, భారీ భద్రత సిబ్బంది మధ్య స్ట్రాంగ్ గదుల్లో పెట్టారు. వాయిదా పడుతూ వస్తున్న పుర ఫలితాలు దాదాపు 40 రోజుల తర్వాత వెలువడనుండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. ఆరు మున్సిపాలిటీలకు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. ఆరు మున్సిపాలిటీల ఓట్లను లెక్కించేందుకు 58 టేబుళ్లు వేశారు. ఒక్కో టేబుల్‌కు ముగ్గురు అధికారుల చొప్పున నియమించారు. 40 మంది సిబ్బందిని రిజర్వులో ఉంచారు. వీటితో కలిపి మొత్తం కౌంటింగ్ సిబ్బంది 300 మందిని నియమించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆదివారం కౌంటింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది, అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. కంప్యూటర్లు, స్ట్రాంగ్ రూంలో సౌకర్యాలు, వార్డులవారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తుతోపాటు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. అభ్యర్థుల్లో ఆందోళన నలబై రోజులుగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న మున్సిపల్ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. కౌన్సిలర్ అభ్యర్థుల కలలు నేటితో సాకారం అవుతాయా? బెడిసి కొడతాయా? అనేది సోమవారం ఓటరు తీర్పుతో తేటతెల్లంకానుంది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికల ఫలితాలు ఏప్రిల్ 2వ తేదీన వెలువడాలి. కానీ, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాయిదా పడింది. ఇదిలా ఉండగా, ఆరు మున్సిపాలిటీల్లో భైంసా మున్సిపాలిటీ ఫలితాలు ఉదయం 10 గంటల వరకు వెలువడే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొంటు న్నారు. -
స్థానిక కౌంటింగ్ కేంద్రాల్లో మార్పులు
- మొత్తం ఆరు చోట్ల లెక్కింపు - ఏర్పాట్లు సిద్ధం చేసిన యంత్రాంగం చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: జిల్లాలో ఏప్రిల్‌లో నిర్వహించిన 65 జెడ్పీటీసీ, 901 ఎంపీటీసీ స్థానాల ఫలితాలను ఈనెల 13వ తేదీ ప్రకటించడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఐదు చోట్ల స్థానిక సంస్థల ఎన్నికల బ్యాలెట్ పత్రాలను లెక్కించాలని అధికారులు నిర్ణయించారు. అయితే మదనపల్లెలోని వశిష్ట కళాశాలలో స్థలం చాలకపోవడంతో పక్కనే ఉన్న కేశవరెడ్డి పాఠశాలను సైతం ఎన్నికల కౌంటింగ్ కేంద్రంగా ఎంపిక చేస్తూ శనివారం జిల్లా కలెక్టర్ రాంగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా ప్రజాపరిషత్ సీఈవో వేణుగోపాలరెడ్డి, రిటర్నింగ్ అధికారి రవిప్రకాష్‌రెడ్డి తదితరులు కేశవరెడ్డి పాఠశాలలో స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటుతో పాటు కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. కౌంటింగ్ కేంద్రాలు జిల్లాలో మొత్తం ఆరుచోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 65 మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు. ఈ ప్రక్రియ 13వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వివాదాలు ఏర్పడితే రీకౌంటింగ్ ఏర్పాటు చేయడం లాంటి అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ఏ సమయానికి పూర్తవుతుందనే విషయంపై అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ఇక డివిజన్లు, మండలాల వారీగా ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలిస్తే.. చిత్తూరు.. చిత్తూరు మండలంలోని చిత్తూరు, గుడిపాల, యాదమరి, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, పెనుమూరు, బంగారుపాళెం, తవణంపల్లె, ఐరాల, ఎస్ఆర్.పురం, వెదురుకుప్పం, రామచంద్రాపురం, వడమాలపేట, పుత్తూరు, పాలసముద్రం, కార్వేటినగరం, నారాయణవనం, నగరి, నిండ్ర, విజయపురానికి చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలను పూతలపట్టు మండల సమీపంలోని వేము ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కిస్తారు. పలమనేరు.. రామకుప్పం, గుడుపల్లె, శాంతిపురం, కుప్పం, పలమనేరు, గంగవరం, బెరైడ్డిపల్లె, వీ.కోట, రామసముద్రం, పెద్దపంజాణి, పుంగనూరు, చౌడేపల్లె, పీలేరు, ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు, కేవీ.పల్లె, రొంపిచెర్ల, సదుం, సోమల మండలాలకు చెందిన బ్యాలెట్ పత్రాలను పలమనేరులోని మదర్ థెరిస్సా జూనియర్ కళాశాలలో లెక్కిస్తారు. మదనపల్లె.. మదనపల్లెలోని మాచిరెడ్డిగారిపల్లెలో ఉన్న కేశవరెడ్డి పాఠశాలలో నిమ్మనపల్లె, కలికిరి, కలకడ, వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాలకు చెందిన బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు. ఇక మదనపల్లె పట్టణంలోని వశిష్ట పాఠశాలలో మదనపల్లె, కురబలకోట, బీ.కొత్తకోట, పెద్దమండ్యం, తంబళ్లపల్లె, పీటీఎం, ములకలచెరువు మండలాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. తిరుపతి.. తిరుపతిలోని శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాలలో పాకాల, చంద్రగిరి, తిరుపతి, రేణిగుంట, ఏర్పేడు, పులిచెర్ల, శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అలాగే తిరుపతి నగరంలోని శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు, బీఎన్.కండ్రిగ, కేవీబీ.పురం, వరదయ్యపాళెం మండలాలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు.