నేటి ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి | today zptc,mptc counting of votes arrangements are ready | Sakshi

నేటి ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

May 13 2014 2:42 AM | Updated on Aug 14 2018 4:24 PM

నేటి ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి - Sakshi

నేటి ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు సూర్యాపేట మండలం అరవిందాక్ష ఇంజనీరింగ్ కళాశాలలో అధికారులు రంగం సిద్ధం చేశారు.

సూర్యాపేట రూరల్, న్యూస్‌లైన్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు సూర్యాపేట మండలం అరవిందాక్ష ఇంజనీరింగ్ కళాశాలలో అధికారులు రంగం సిద్ధం చేశారు. మంగళవారం ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను సోమవారం జేసీ హరి జవర్‌లాల్ పర్యవేక్షించారు. బందోబస్తు పకడ్బందీగా నిర్వహించాలని పోలీసులకు సూచించారు. అదే విధంగా మాక్ కౌంటింగ్ నిర్వహణను పరిశీలించారు.

సూర్యాపేట రెవెన్యూ డివిజన్‌లోని 14 మండలాల జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్లను లెక్కించనున్నారు. అరవిందాక్ష ఇంజనీరింగ్ కళాశాలలో మూడో అంతస్తులో సూర్యాపేట, చిలుకూరు, మోతే, నడిగూడెం, మునగాల, ఆత్మకూర్ (ఎస్),  చివ్వెంల మండలాల ఓట్లు లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. నాలుగవ అంతస్తులో తుంగతుర్తి, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, నూతనకల్, కోదాడ,  మేళ్ళచెరువు మండలాల ఓట్ల లెక్కించనున్నారు. ఒక్కో మండలానికి ఆరు నుంచి ఏడు టేబుల్‌లు ఏర్పాటు చేయగా, కౌంటింగ్ నిర్వహించేందుకు ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు సిబ్బంది ఉంటారని అధికారులు పేర్కొన్నారు.

కౌంటింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు, ఏజెంట్‌లు వరుస క్రమంలో కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు భారీకేడ్లు ఏర్పాటు చేశారు.  అదే విధంగా వాహనాల పా ర్కింగ్, మంచినీటి వసతి, తదితర ఏర్పాట్లన్నింటినీ సూర్యాపేట ఆర్డీఓ వి.నాగన్న పర్యవేక్షణలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.  ఓట్ల లెక్కింపునకు హాజరయ్యే వారు తప్పని సరిగా పాస్ తీసుకోవాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement