counting supervisors
-
కౌంటింగ్‌కు విస్తృత ఏర్పాట్లు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈనెల 16న ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల లోపు అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఖమ్మం పార్లమెంట్ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపునకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 10 నియోజకవర్గాలకు గానూ 99 టేబుళ్ల ద్వారా మొత్తం 253 రౌండ్లలో ఓట్లు లెక్కించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అత్యధికంగా సతుపల్లి 36 రౌండ్లు, తరువాత అశ్వారావుపేట నియోజకవర్గానికి 29 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థానం పరిధిలో ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, అశ్వారావుపేట, కొత్తగూడెం, సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో 197 రౌండ్లలో ఖమ్మం ఎంపీ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఆయా నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద గెలుపొందిన అసెంబ్లీ అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తారు. అలాగే ఎంపీ అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్ల వివరాలు కూడా అసెంబ్లీ ఫలితాల రౌండ్ల మాదిరిగానే వెల్లడిస్తారు. అయితే పార్లమెంట్ పూర్తి ఫలితాల వివరాలు విజయ ఇంజనీరింగ్ కళాశాలలో వెల్లడిస్తారు. ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక వెబ్ సైట్‌ను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు వేర్వేరుగా ప్రత్యేకంగా టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇల్లెందు, పినపాక, ఖమ్మం అసెంబ్లీ ఫలితాలు ముందుగా వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికల కౌంటింగ్‌కు 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 99 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 700 మంది సిబ్బందిని నియమించారు. వారిలో 200 మందిని కౌంటింగ్ సూపర్వైజర్లుగా, 500 మందిని కౌంటింగ్ అసిస్టెంట్లుగా నియమించారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా సాగేందుకు కేంద్రాల వద్ద మూండంచెల భద్రత కల్పిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ రౌండ్ల వారీ ఫలితాల కోసం ఉఇఐ.ూఐఇ.ఐూ వెబ్సైట్లో సంప్రదించవచ్చు. -
ప్రాదేశిక ఫలితాలు తేలేది నేడే
-
నేడు ప్రాదేశిక ఫలితాలు
డివిజన్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు - ఉదయం 10 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం - మధ్యాహ్నం 3గంటల్లోగా ఎంపీటీసీ ఫలితాలు - రాత్రి వరకు కొనసాగనున్న జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు - కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు - గెలుపు సంబరాలు, మద్యం దుకాణాలు బంద్ నల్లగొండ, న్యూస్‌లైన్, ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవి తవ్యం మంగళవారం తేలనుంది. ఈ ఓట్ల లెక్కింపు ఐదు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో చేపట్టనున్నారు. జిల్లావ్యాప్తంగా 59 జెడ్పీటీసీ స్థానాలకు 392 పోటీలో ఉండగా, 835 ఎంపీటీసీ స్థానాలకు ప్రధాన పార్టీలతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి 3,311మంది పోటీ చేశారు. తొలి విడత ఎన్నికలు ఏప్రిల్ 6వ తేదీన సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్లలో జరిగాయి. రెండో విడత 11వ తేదీన నల్లగొండ, భువనగిరి డివిజన్ పరిధిలోని మండలాలకు జరిగాయి. ఎన్నికల ఫలితాల కోసం ఎదరుచూస్తున్న అభ్యర్థుల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. ఉదయం 7.30 గంటలకు ఆయా డివిజన్ కేంద్రాల్లో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు ఆ తర్వాత 10గంటల నుంచి బ్యాలెట్ బాక్సులు తెరిచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఎన్నికల కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాల్లో 484 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ నిర్వహణకు రెండువేల మంది సిబ్బందిని నియమించారు. వీరిలో కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు. లెక్కింపు ఇలా.. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఓట్ల లెక్కింపు కోసం ఐదు కేంద్రాల్లో ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. ముందుగా ఆయా గ్రామాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను అభ్యర్థులకు చెందిన ఏజెంట్ల సమక్షంలో సీల్ తీస్తారు. ఇలా తీసిన బాక్సుల్లో ఓట్లను ఒక కుప్పగా వేసి అందులోంచి జెడ్పీటీసీకి కేటాయించిన తెల్లరంగు బ్యాలెట్, ఎంపీటీసీకి కేటాయించిన గులాబీ రంగు బ్యాలెట్లను వేరుచేస్తారు. వేరుచేసిన బ్యాలెట్ పేపర్లను ఆయా గుర్తులతో ముందుగానే సిద్ధం చేసిన ట్రేలల్లో వేస్తారు. ఇలా వేరు చేయడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది. పూర్తిస్థాయి లెక్కింపు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభిస్తారు. ప్రతి ఎంపీటీసీ స్థానం లెక్కింపు మూడురౌండ్లుగా జరుగుతుంది. ఒక్కో రౌండ్‌కు సుమారు వెయ్యి ఓట్లను లెక్కపెడతారు. ప్రతి గంటకు ఒకసారి ఓట్ల లెక్కించిన వివరాలను ఏజెంట్లకు, మీడియాకు సమాచారం అందిస్తారు. మధ్యాహ్నం 3 గంటవరకు ఎంపీటీసీల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. జెడ్పీటీసీల లెక్కింపు రాత్రి వరకు పూర్తికావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 25ఓట్లను ఒక బండిల్‌గా కట్టి ఓట్లను లెక్కపెడతారు. ఇలా చేయడం వల్ల లెక్కింపు సులువుగా ఉండడమే గాకుండా, త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. పకడ్బందీ బందోబస్తు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఘర్షణలూ చోటుచేసుకోకుండా ఉండేందుకు జిల్లా పోలీస్ శాఖ పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగానే మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు మినహా మిగతా ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. అలాగే ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు గెలుపు సంబరాలు, ర్యాలీలు నిర్వహించడాన్ని నిషేధించారు. -
స్థానిక కౌంటింగ్ కేంద్రాల్లో మార్పులు
- మొత్తం ఆరు చోట్ల లెక్కింపు - ఏర్పాట్లు సిద్ధం చేసిన యంత్రాంగం చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: జిల్లాలో ఏప్రిల్‌లో నిర్వహించిన 65 జెడ్పీటీసీ, 901 ఎంపీటీసీ స్థానాల ఫలితాలను ఈనెల 13వ తేదీ ప్రకటించడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఐదు చోట్ల స్థానిక సంస్థల ఎన్నికల బ్యాలెట్ పత్రాలను లెక్కించాలని అధికారులు నిర్ణయించారు. అయితే మదనపల్లెలోని వశిష్ట కళాశాలలో స్థలం చాలకపోవడంతో పక్కనే ఉన్న కేశవరెడ్డి పాఠశాలను సైతం ఎన్నికల కౌంటింగ్ కేంద్రంగా ఎంపిక చేస్తూ శనివారం జిల్లా కలెక్టర్ రాంగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా ప్రజాపరిషత్ సీఈవో వేణుగోపాలరెడ్డి, రిటర్నింగ్ అధికారి రవిప్రకాష్‌రెడ్డి తదితరులు కేశవరెడ్డి పాఠశాలలో స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటుతో పాటు కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. కౌంటింగ్ కేంద్రాలు జిల్లాలో మొత్తం ఆరుచోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 65 మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు. ఈ ప్రక్రియ 13వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వివాదాలు ఏర్పడితే రీకౌంటింగ్ ఏర్పాటు చేయడం లాంటి అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ఏ సమయానికి పూర్తవుతుందనే విషయంపై అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ఇక డివిజన్లు, మండలాల వారీగా ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలిస్తే.. చిత్తూరు.. చిత్తూరు మండలంలోని చిత్తూరు, గుడిపాల, యాదమరి, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, పెనుమూరు, బంగారుపాళెం, తవణంపల్లె, ఐరాల, ఎస్ఆర్.పురం, వెదురుకుప్పం, రామచంద్రాపురం, వడమాలపేట, పుత్తూరు, పాలసముద్రం, కార్వేటినగరం, నారాయణవనం, నగరి, నిండ్ర, విజయపురానికి చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలను పూతలపట్టు మండల సమీపంలోని వేము ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కిస్తారు. పలమనేరు.. రామకుప్పం, గుడుపల్లె, శాంతిపురం, కుప్పం, పలమనేరు, గంగవరం, బెరైడ్డిపల్లె, వీ.కోట, రామసముద్రం, పెద్దపంజాణి, పుంగనూరు, చౌడేపల్లె, పీలేరు, ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు, కేవీ.పల్లె, రొంపిచెర్ల, సదుం, సోమల మండలాలకు చెందిన బ్యాలెట్ పత్రాలను పలమనేరులోని మదర్ థెరిస్సా జూనియర్ కళాశాలలో లెక్కిస్తారు. మదనపల్లె.. మదనపల్లెలోని మాచిరెడ్డిగారిపల్లెలో ఉన్న కేశవరెడ్డి పాఠశాలలో నిమ్మనపల్లె, కలికిరి, కలకడ, వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాలకు చెందిన బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు. ఇక మదనపల్లె పట్టణంలోని వశిష్ట పాఠశాలలో మదనపల్లె, కురబలకోట, బీ.కొత్తకోట, పెద్దమండ్యం, తంబళ్లపల్లె, పీటీఎం, ములకలచెరువు మండలాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. తిరుపతి.. తిరుపతిలోని శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాలలో పాకాల, చంద్రగిరి, తిరుపతి, రేణిగుంట, ఏర్పేడు, పులిచెర్ల, శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అలాగే తిరుపతి నగరంలోని శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు, బీఎన్.కండ్రిగ, కేవీబీ.పురం, వరదయ్యపాళెం మండలాలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు. -
ఓట్ల లెక్కింపునకు 1320 మంది
- 14న సిబ్బందికి శిక్షణ చిత్తూరు(జిల్లాపరిషత్)న్యూస్‌లైన్: జిల్లాలో ఈనెల 7వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా కేంద్రం చిత్తూరులో మూడు కాలేజీల్లో ఓట్లను లెక్కిస్తారు. ఇందుకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కే.రాంగోపాల్ సారథ్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మూడు (రాజంపేట, చిత్తూరు, తిరుపతి) లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల లెక్కింపునకు అవసరమైన సిబ్బంది ఎంపికను పూర్తి చేశారు. దీనికి గాను జిల్లాలో 1320 మంది సిబ్బందిని ఓట్ల లెక్కింపు విధులకు ఎంపిక చేశారు. మూడు లోక్‌సభ స్థానాల పరిధిలో పోలైన అసెంబ్లీ, లోక్‌సభ ఓట్ల లెక్కింపునకు మొత్తం 364 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మూడు చోట్ల ఓట్ల లెక్కింపు జిల్లాలోని చిత్తూరు, రాజంపేట, తిరుపతి లోక్‌సభ పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును చిత్తూరులోని శ్రీనివాస ఇన్స్టిట్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీటమ్స్), ఒకే క్యాంపస్‌లో ఉన్న ఎస్వీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ, ఆర్కేఎం లా కాలేజీలో నిర్వహించనున్నారు. శ్రీవేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టె క్నాలజీలో తంబళ్లపల్లె, శ్రీకాళహస్తి, సత్యవేడు, చిత్తూ రు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను లెక్కిస్తారు. ఆర్కేఎం లా కాలేజ్ క్యాంపస్‌లో పీలేరు, మదనపల్లె, పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్లు లెక్కిస్తారు. ఇందుకు గాను అసెంబ్లీకి 86 టేబుళ్లు, లోక్‌సభకు పోలైన ఓట్ల లెక్కింపునకు 86 టేబుళ్లు ఏర్పాటు చేశారు.చిత్తూరులోని శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల జీ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ (సీటమ్స్)లో చిత్తూరు, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని చంద్రగిరి, నగరి, జీడీనెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పంతో పాటు, తిరుపతి అసెంబ్లీ ఓట్లను లెక్కిస్తారు. ఈ కేంద్రంలో అసెంబ్లీ కౌంటింగ్‌కు 98 టేబుళ్లు, లోక్‌సభకు 94 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 1320 మంది ఉద్యోగులను ఉపయోగించనున్నారు. 14న శిక్షణ జిల్లాలో 16వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎంపిక చేసిన కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ సహాయకులు, సూక్ష్మపరిశీలకులకు బుధవారం చిత్తూరులోని మహతి ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కే.రాంగోపాల్ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియకు ఎంపికైన సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, సిబ్బంది అందరూ సకాలంలో ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరారు