Country Politics
-
భారత రాజకీయాలపై ఆర్థిక అభద్రతా ప్రభావం
న్యూఢిల్లీ: భారత్ యువతలో ఆర్థిక అభద్రతాభావం నెలకొందనీ, దేశ రాజకీయాలపై దీని ప్రభావం పెరుగుతోందని ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) పరిశోధనా నివేదిక ఒకటి పేర్కొంది. దేశాభివృద్ధిలో మందగమన ధోరణులు, నిరుద్యోగ సమస్యలను నివేదిక ఈ సందర్భంగా ప్రస్తావించింది. భారత్ నిరుద్యోగ సమస్య దేశ రాజకీయాలతో విడదీయరాని అంశంగా రూపొందుతోందని నివేదిక పేర్కొంది, ఆర్థిక వృద్ధి మందగమనం నిరుద్యోగ సమస్యను తీవ్రతరం చేసిందని వివరించింది. ‘‘పటిష్ట నాయకత్వం, సామాజిక, భద్రతా అంశాల ప్రాతిపదికన ఈ ఏడాది రెండవసారి ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ విజయం సాధించినప్పటికీ, పెద్ద సంఖ్యలో ఉన్న యువత ఆర్థిక అభద్రతాభావమే దేశ రాజకీయాలకు రూపునిస్తున్న పరిస్థితి పెరుగుతోంది’’ అని ఈఐయూ పేర్కొంది. సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటాను ఈఐయూ నివేదిక ప్రస్తావిస్తూ, ‘‘2019 సెప్టెంబర్‌లో 7.2 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు మరుసటి నెల అక్టోబర్‌లోనే మూడేళ్ల గరిష్ట స్థాయి 8.5%కి పెరిగిన విషయాన్ని గుర్తు చేసింది. పెద్ద సంఖ్యలో ఉన్న యువతను చక్కటి మానవ వనరుగా వినియోగించుకుంటూ, రానున్న కొద్ది దశాబ్దాల్లో ఆర్థిక ప్రయోజనాలు పొందాలని దేశం భావిస్తున్నప్పటికీ, ఉపాధి కల్పనలో మాత్రం వెనుకబడుతున్నట్లు విశ్లేషించింది. -
దేశ రాజకీయాల్లో తెలంగాణ కీలకం
నేరడిగొండ(బోథ్) : దేశ రాజకీయాల్లో తెలంగాణ కీలకం కానుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో మిషన్ కాకతీయ నాలుగో విడతలో భాగంగా మంజూరైన రూ.24.60 లక్షలతో మంగల్లొద్దిలో ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న పథకాలు దేశం దృష్టిని ఆకర్శిస్తున్నాయని అన్నారు. బోథ్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే నెం.1 ఉండేలా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ రాథోడ్ కమల్‌సింగ్, బోథ్ ఏఎంసీ చైర్మన్ దావుల భోజన్న, ప్రముఖ కవి జీఆర్ కుర్మె, మండల నాయకులు రాథోడ్ సజన్, ఆడెపు రమేష్, మందుల రమేష్ పాల్గొన్నారు. -
ప్రమాదకరంగా దేశ రాజకీయాలు
ఆసిఫాబాద్ క్రైం: దేశంలో రాజకీయాలు ప్రమాదకరంగా మారాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆసిఫాబాద్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలక వర్గాలు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని, నిరసన తెలిపిన వారిని హింసిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఈ నెల 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో జరిగే జాతీయ మహాసభలో భవిషత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. -
భారత గళానికి ప్రతినిధి ఎవరు?!
ఈ వారం దేశ రాజకీయాలు హై వోల్టేజ్ కరెంటులా కొనసాగాయి. ముఖ్యంగా ముగ్గురి ప్రసంగాలు ప్రజలను అమితంగా ఆకర్షించాయి. దేశభక్తి, దేశప్రగతి, భావప్రకటన స్వేచ్ఛల చుట్టూ తిరిగిన వీరి వాదనలు, విమర్శలను ప్రజలు పత్రికల్లో, ప్రత్యక్ష ప్రసారాల్లో గమనించారు. ఆ ముగ్గురు.. ప్రధాని మోదీ, విపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్!! మోదీ ప్రభుత్వం ముంబై దాడుల కేసు, నల్లధనం వెలికితీత వంటి అనేక అంశాల్లో విఫలమైందని రాహుల్ పార్లమెంటులో దాడి చేశారు. జేఎన్‌యూ, రోహిత్ అంశాలను ప్రచారం చేశారు. మోదీ కూడా దీటుగా కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేశారు. అయితే జేఎన్‌యూ, రోహిత్ విషయాల జోలికి పోలేదు. ఈ రెండు అంశాలతో ప్రచారంలోకి వచ్చి, జైలు కెళ్లిన కన్హయ్య మాత్రం ఒక్కసారిగా దేశాన్ని ఆకర్షించారు. తొణకని స్వరంతో అనుకున్నది కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. మరి మోదీ, రాహుల్, కన్హయ్యల్లో ఎవరి స్వరం దేశ గళంలా మారింది? ఈ ప్రశ్నకు మేధావులు, మీడియా, నెటిజన్లలో అత్యధిక శాతం కన్హయ్యకే ఓటేస్తున్నారు. అతడు ఈ దేశ యువత ఆకాంక్షలకు ప్రతినిధి అంటున్నారు. దేశానికి కన్హయ్యలాంటి నాయకుడు కావాలని స్క్రోల్ వంటి ఆన్లైన్ పత్రికలు కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురూ ఈ వారంలో ఏమేం అన్నారో క్లుప్తంగా.. * ముంబై దాడుల తర్వాత యూపీఏ ప్రభుత్వం కష్టపడి పాకిస్తాన్‌ను బోనులో పెడితే, మోదీ ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో కప్పు టీ కోసం దాన్ని విడిపించేశారు. యూపీఏ ఆరేళ్ల కష్టాన్ని ఒక్క చేత్తో బూడిదపాలు చేశారు. * ప్రధాని ఒక్కరే దేశాన్ని నడపలేరు. దేశమంటే ప్రధాని మాత్రమే కాదు. * ఉద్యోగులకు మేలు చేయండి, దొంగలకు కాదు(ఈపీఎఫ్ విత్డ్రాయల్స్పై పన్ను విషయంలో). అదొక ఫెయిల్ అండ్ లవ్లీ స్కీం(నల్లధనాన్ని స్వచ్ఛందగా వెల్లడించే పథకంపై) - బుధవారం లోక్‌సభలో రాహుల్ గాంధీ ⇒ 60 ఏళ్లలో తాము చేయని పనులను ఎన్డీయే ఇప్పుడు పూర్తిచేస్తోంది కాబట్టి కాంగ్రెస్ అసూయతో రగులుతోంది. ఆత్మన్యూనతతో బాధపడుతోంది. విపక్షానికి అనుభవం ఉంది. ఆ జ్ఞానంతో దేశాభివృద్ధి కోసం పనిచేద్దాం. ⇒ యువనేతలను ప్రోత్సహిస్తే రాహుల్‌ను మించిపోతారని కాంగ్రెస్‌కు భయం. కొందరికి వయసు పెరుగుతుంది కానీ అర్థం చేసుకునే శక్తి పెరగదు(రాహుల్ ఉద్దేశించి పరోక్షంగా). ⇒ నన్ను 14 ఏళ్లుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. నాకు అలవాటైపోయింది. - గురువారం లోక్‌సభలో ప్రధాని మోదీ ♦ మేం భారత్ నుంచి స్వేచ్ఛ కోరుకోవడం లేదు. భారత్‌లో స్వేచ్ఛ కోరుతున్నాం. ఆకలి, అవినీతి నుంచి విముక్తి కోసం నేను నినదించాను. ♦ రాజద్రోహానికి, ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి మధ్య చాలా తేడా ఉంది. ♦ దేశంలో 69 శాతం మంది బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. 31 శాతం మందిని మాత్రమే వారు మాటల గారడీతో మోసగించారు. ♦ అఫ్జల్ గురు నాకు ఆదర్శం కాదు. హెచ్‌సీయూ పాలకవర్గం వివక్ష వల్ల ఆత్మహత్య చే సుకున్న రోహిత్ వేముల నాకు అదర్శం. - గురు, శుక్రవారాల్లో కన్హయ్య కుమార్ -
రాహుల్ చెడిపోయిన పిల్లాడు!
బెంగళూరు: దేశ రాజకీయాల్లో రాహుల్‌గాంధీ చెడిపోయిన పిల్లాడని, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని బీజేపీ విమర్శించింది. దేశంలోనే తప్పుదారి పట్టించే వ్యక్తుల్లో రాహుల్ ప్రముఖుడిగా మారాడని ఎద్దేవా చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి ఎంజే అక్బర్ శుక్రవారం బెంగళూరులో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో, విపక్షంలో ఉన్న ఢిల్లీలో రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోంది. రాహుల్ భారత రాజకీయాల్లో చెడిపోయిన పిల్లాడు. ఎప్పుడూ వాస్తవాలు మాట్లాడడు. అనుభవం లేదు. తప్పుదారి పట్టించే వ్యక్తుల్లో ప్రముఖుడిగా రోజురోజుకూ మరింతగా స్పష్టమవుతోంది..’’ అని విమర్శించారు.