రాహుల్ చెడిపోయిన పిల్లాడు! | Rahul Gandhi is the spoiled child of Indian politics: BJP | Sakshi
Sakshi News home page

రాహుల్ చెడిపోయిన పిల్లాడు!

Published Sat, Sep 26 2015 3:37 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

రాహుల్ చెడిపోయిన పిల్లాడు! - Sakshi

రాహుల్ చెడిపోయిన పిల్లాడు!

బెంగళూరు: దేశ రాజకీయాల్లో రాహుల్‌గాంధీ చెడిపోయిన పిల్లాడని, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని బీజేపీ విమర్శించింది. దేశంలోనే తప్పుదారి పట్టించే వ్యక్తుల్లో రాహుల్ ప్రముఖుడిగా మారాడని ఎద్దేవా చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి ఎంజే అక్బర్ శుక్రవారం బెంగళూరులో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో, విపక్షంలో ఉన్న ఢిల్లీలో రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోంది. రాహుల్ భారత రాజకీయాల్లో చెడిపోయిన పిల్లాడు.

ఎప్పుడూ వాస్తవాలు మాట్లాడడు. అనుభవం లేదు. తప్పుదారి పట్టించే వ్యక్తుల్లో   ప్రముఖుడిగా రోజురోజుకూ మరింతగా స్పష్టమవుతోంది..’’ అని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement