దేవతా వస్త్రాల చక్రవర్తి
బైలైన్
విజయానికి ఎందరో తల్లి దండ్రులు, ఓటమి మాత్రం అనాథ . ఇది మానన సంఘర్షణ మొదలైన నాటి నుంచి రూఢిగా స్థిరపడ్డ సత్యం. ఒకవేళ మీరు ఆ విషయాన్ని మరచిపోయి ఉంటే భారత రాజకీయాలే మీకు దాన్ని గుర్తు చేస్తాయి. మే 21, శనివారంనాడు ఒక జాతీయ పత్రికలో ఆసక్తికర కథనం వచ్చింది. ఇది శుక్రవారం రాసినదో లేక కాంగ్రెస్‌ను చావు దెబ్బ తీసిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డ ఆ మరునాడు రాసినదో అయి ఉండాలి. తిరిగి అధికా రంలోకి వస్తామని ఆశిస్తున్న అసోం, కేరళలలోనూ, మిత్రుల సహాయంతో అధికారంలోకి రాగలమని నమ్మకం పెట్టుకున్న బెంగాల్, తమిళనాడులలోనూ ఆ పార్టీ కుప్ప కూలింది.
గుర్తు చెప్పడానికి నిరాకరించిన ‘ఆధారాల’కు ఆపాదించిన ఆ కథనం ప్రకారం... బెంగాల్‌లో కమ్యూనిస్టు లతో కూటమికి, కాంగ్రెస్ పార్టీకి ఆచరణలో అధినేతగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ ‘విముఖుడు’. సోనియా గాంధీకి మమతా బెనర్జీతో ఉన్న ‘అత్యంత సన్నిహితత్వం’ కార ణంగా బెంగాల్‌లో ప్రచారం సాగించ డానికి ఆమె అంతే ‘విముఖం’గా ఉన్నారని సైతం అది జోడించింది. ఆ ‘ఆధారాలు’ తమ పేరేమిటో చెప్పడానికి ఇష్టపడక పోవడం కొంత విచిత్రమే. అయితే ఇదేమీ పరిశోధ నాత్మక పత్రికా రచన కాదు కాబట్టి చెప్పక పోయినా ఫర్వాలేదు. కాంగ్రెస్‌కు నాయకత్వం వహిస్తున్న కుటుంబ వైఫల్యం బయటపడ్డప్పుడు దాన్ని కాపాడటానికి విధేయతతో కూడిన సమర్థనను ప్రయోగిం చారని దీని అర్థం.
ఈ సమర్థన ఉత్త చెత్తవాగుడు. బెంగాల్‌లో మమతా బెనర్జీని గద్దె దించే మంత్రంగా... రాహుల్ గాంధీయే, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరితో కలసి కుమ్మక్కైఆ కూటమిని నిర్మించారు. ఆయన ప్రయత్నమే సఫలమై ఉంటే, ఇదే కథకులు రాహుల్‌ను సాటిలేని మేటి వ్యూహకర్తగా ఆకాశానికెత్తేవారు, కాబోయే రాజుగా పట్టం కట్టేవారు. బహుశా పదిహేను రోజుల్లోపలే ఓ ప్రత్యేక ఏఐసీసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయనను పార్టీ అధ్యక్షుణ్ణి చేసేవారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ ఎలాంటి విముఖతను కనబరచలేదు. గత వామపక్ష ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యతో కలసి వేదికపై ఆయన చాలా సంతోషంగా కనిపించారు. మమతా బెనర్జీని ‘అవినీతిపరురాలు’గా, ‘అసమర్థు రాలు’గా అభి వర్ణించడంలో కాంగ్రెస్ ప్రత్యేక ఆనందాన్ని పొందింది కూడా. అసలు సమస్య ఈ సమర్థన బూట కపుది కావడం కాదు, నిస్సహాయంగా కాంగ్రెస్ దాన్ని ఆమోదించడం.
గెలుపు, ఓటములు ప్రజాస్వామ్యంలో భాగం. ఒక రాజకీయ పార్టీ ఈ రెంటిలో దేనిలోనూ పడి కొట్టుకు పోకూడదు. విజయం కడుపున పొంచి ఉండేటన్ని ప్రమా దాలు ఓటమిలోనూ ఉంటాయి. పేదలకు ప్రయోజనాలను కలిగించే విధానం గల నిజాయితీతో కూడిన మంచి పాల నను అందించడమే విజయం పట్ల విజ్ఞతాయుతమైన ప్రతి స్పందన. ఇది తెలిసిన వారు తిరిగి ఎన్నికవుతారు, తెలి యనివారు ఉన్న అధికారం కోల్పోతారు.
ఓటమి పర్యవసానంగా ఉండాల్సింది ఒకే ఒక్కటి... నిజాయితీ. ఇతరుల గురించి కంటే మీ గురించి మీరు నిజాయితీగా ఉండటం అవసరం కావడమే ఇందులో ఉన్న ఇబ్బంది. షేక్‌స్పియర్ అన్నట్టు దోషం గ్రహాల్లో కాదు, మనలోనే ఉంటుంది . మాటలతో సరిపుచ్చడం, ‘ఆత్మ శోధన’ అనే పదాన్ని, దాని అర్థం దిగజారేంతగా పదే పదే వల్లె వేయడం వల్ల ప్రయోజనమేమీ లేదు. ఇది ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా అదే ఇంకా ఎందుకు సమస్య అవుతుంది? సీనియర్ కాంగ్రెస్ నేత ద్విగిజయ్‌సింగ్ నిస్సందేహంగా వారి పార్టీకి అంతా మంచే జరగాలని కోరుకునే వ్యక్తి. ఆయన తమ పార్టీకి ‘శస్త్ర చికిత్స’ అవసరమని అంగీకరించారు. అంటే ఆస్పిరిన్ మాత్రతోనో లేదా బ్యాండ్ ఎయిడ్ పట్టీతోనో క్యాన్సర్ వ్యాధిని నయం చేయలేమని అర్థం.
అయితే ఉన్న విషయం ఇది. కాంగ్రెస్ నేతలే నిజాయితీగా ఉంటే... వారు తమ కళ్లకు కట్టుకున్న గంతలను విప్పేసి, చక్రవర్తి లేదా చక్రవర్తి వారసునిగా కనిపిస్తున్నవారి ఒంటిపైన బట్టలు లేవని చెప్పి ఉండేవారు. సుప్రసిద్ధై మెన ఆ నీతి కథలో ఒక పసివాడు మాత్రమే ఆ ధైర్యం ప్రదర్శించగలి గాడు. ఎందు కంటే ఆ బాలుడు ఆ చక్రవర్తికి విధేయుడూ కాదు, చక్రవర్తి నుంచి ముందు ముందు తనకు ఏమైనా ప్రయోజనం జరగాలని ఆశిం చడమూ లేదు. కాంగ్రెస్ నాయక- చక్రవర్తి అంటి పెట్టుకుని ఉండేదల్లా ఎలాంటి తర్కమూ లేదా సారమూ లేని ప్రతికూలాత్మకతకే.
కాంగ్రెస్ చూడటానికి నిరాక రిస్తున్న దానిని ఓటర్లు గమనించ గలుగుతారు. మీ నాయకుని ప్రత్యేక ఆదేశాలను అనుసరించి పార్లమెంటును స్తంభింపజే యడం ద్వారా ప్రజలకు నష్టాన్ని కలుగజేస్తూ మీ ప్రయోజనాలను ఈడేర్చుకుంటున్నారు. మీరు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తుంటే, వృద్ధి వల్ల లబ్ధిని పొందే ప్రజ లకు దెబ్బ తగులుతోంది, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి సముచితమైన స్థానం ఉంది. ప్రతిపక్షంలేనిదే ప్రజా స్వామ్యం లేదనేదీ నిజమే. అయితే అతి తీవ్రమైన, అర్థరహితమైన ఈ దుర్నీతికి మాత్రం తావు లేదు. హుందాగా వ్యవహరించడం, అతి స్పష్టమైన ప్రత్యా మ్నాయ ఆర్థిక వేదికను చూపడం ద్వారా మాత్రమే మీరు ప్రజలపై సానుకూల ప్రభావాన్ని కలుగజేయగలుగుతారు.
ఆ రెంటిలో ఏదీ జరిగేట్టు లేదు. ఈ ఓటమి తర్వాత వెంటనే కొన్ని అసమ్మతి స్వరాలు వినిపిస్తాయి. ఇక ఆ తదుపరి పెడబొబ్బలు పెట్టే సమర్థకులు టీవీల్లో ప్రత్యక్షమై చక్రవర్తి ఏ తప్పూ చేయజాలడని వాదిస్తారు. ఏదో సరైన సమయం చూసి, వానలు పడి కాస్త వాతావరణం చక్కబ డ్డాక, ఓ పూట ఏఐసీసీ సమావేశం జరపి... మనం ఇంతకు ముందు చాలా తరచుగా విన్న సాకులనే ఆమోదిస్తూ తీర్మానం చేసేస్తారు. ఎన్నడూ టైలర్ దగ్గరకు పోకుండానే చక్రవర్తి బతికేయగలుగుతాడు. ఇలా మీరు ఒకసారి తప్పించుకోగలరు. అదృష్ట వంతులైతే ఒకటి కంటే ఎక్కువ సార్లే తప్పించుకో గలుగుతారు. అయితే అది అతి తరచుగా ‘ఒకసారి’గా మారే సమయమూ వస్తుంది.
ఎం.జె. అక్బర్
సీనియర్ సంపాదకులు
వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి