cow cattle
-
చెల్లిని వదిలేసిన భర్త.. న్యాయం కోసం ఎడ్లబండిపై సుప్రీంకోర్టుకు..
సాక్షి, ఖమ్మం: చెల్లిని పెళ్లి చేసుకుని వదిలేసిన భర్త, ఆయన కుటుంబీకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ వ్యక్తి ఎడ్ల బండిపై ఢిల్లీలోని అత్యున్నత న్యాయస్థానానికి బయలుదేరాడు. ఈమేరకు ఆయన మంగళవారం సాయంత్రం బోనకల్‌కు చేరుకోగా వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్లకు చెందిన నేలవెల్లి నాగదుర్గారావు చెల్లి నవ్యతను అదే మండలంలోని చందాపురానికి చెందిన కొంగర నరేంద్రనాథ్‌కు ఇచ్చి 2018లో వివాహం జరిపించారు. కట్నంగా నగదు, ఆభరణాలు, భూమి ఇచ్చారు. అయితే ఆమెను సరిగా చూసుకోకపోవడమే కాక నరేంద్రనాథ్, కుటుంబ సభ్యులు నవ్యతను బెదిరించి ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకుని గెంటేశారు. ఈ విషయమై చందర్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, నరేంద్రనాథ్ కుటుంబ సభ్యుల ఫొటోలతో ఎడ్లబండిపై ఫ్లెక్సీ ఏర్పాటుచేయగా రూ.50 లక్షలకు పరువునష్టం దావా వేశారని నాగదుర్గారావు తెలిపారు. ఈమేరకు సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు నాగదుర్గారావు చెల్లెలితో కలిసి ఎడ్లబండిపై ఢిల్లీ బయలుదేరగా, బోనకల్లో పలువురు సంఘీభావం ప్రకటించారు. చదవండి: కోఠి మహిళా కళాశాల అధ్యాపకుడి అరాచకాలు.. ఫొటోలు మార్ఫింగ్ చేసి.. -
గో ఆధారిత వ్యవసాయం అత్యద్భుతం
కడ్తాల్ మండలం చల్లంపల్లి గ్రామానికి చెందిన చల్లా పవన్‌రెడ్డి అనే రైతు గో ఆధారిత వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశవాళీ పాడి ఆవులతో శ్రేష్టమైన పాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఎంబీఏ వంటి ఉన్నత చదువులు చదివి, మెడికల్ ఇన్‌ప్లాంట్ డిస్ట్రిబ్యూషన్ డీలర్‌గా ఏడేళ్లు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళానాడు రాష్ట్రాలలో వ్యాపారం నిర్వహించారు. వ్యాపార పనుల నిమిత్తం ఆయా రాష్ట్రాలకు తరుచూ వెళుతుండటం, హోటళ్లలో భోజనం చేస్తుండటం జరిగేది. అనుకోకుండా అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. ఎలాంటి చెడు అలవాట్లు లేకున్నా లివర్ సంబంధిత జబ్బు రావడంతో షాక్‌కు గురయ్యారు. జబ్బుకు కారణం విషతుల్యమైన ఆçహారం తీసుకోవడమే కారణమని తెలిసింది. దీంతో వ్యాపారానికి స్వస్తి చెప్పారు. తనలా మరొకరు ఇలా విషతుల్య ఆహార పదార్థాల బారిన పడకూడదని నిర్ణయించారు. వెంటనే స్వగ్రామమైన చల్లంపల్లికి చేరుకుని తనకున్న వ్యవసాయ పొలంలో సేంద్రియ పంటలను పండిస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సాక్షి, కడ్తాల్: మూడు ఆవులతో గో ఆధారిత వ్యవసాయం మొదలు పెట్టాడు రైతు పవన్‌రెడ్డి. గ్రామంలో తమకు గల 11 ఎకరాల పొలంలో మూడు బోరు బావులను తవ్వించారు. ఎందులోనూ సరిపడా నీరు పడలేదు. అదే సమయంలో సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడరిటీ సంస్థకు చెందిన రామ్మోహన్ సాంకేతిక తోడ్పాటుతో పొలంలో వర్షం నీరు చేరుకునే చోటును గుర్తించి, అక్కడ బోరును వేయించి, బోరు చుట్టూ ఇంకుడు గుంతను తవ్వించారు. దీంతో బోరులో కొద్దిపాటి నీరు వచ్చింది. మిగతా మూడు బోరులు ఎండిపోకుండా బోరు చుట్టూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. క్రమంగా గో ఆ«ధారిత సాగును విస్తరించారు. 20 దేశవాళీ రకం గిర్, సాహివాల్, తార్పాకర్, రెడ్‌సింధి, హర్యనాభీ తదితర అవులను గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల నుండి తీసుకువచ్చారు. దేశావాళీ ఆవులను పోషిస్తూ, వాటి పేడ జీవామృతం, ఘనా జీవామృతం, అజోల్లా పెంపకంతో తన భూమిని సారవంతంగా మార్చుకుంటున్నారు. అలాగే ఆరోగ్యదాయకమైన పాలను, ఆహార పదార్థాల ఉత్పత్తికి కృషి చేస్తున్నారు. ఐదు ఎకరాలలో మామిడి తోటతో పాటు అంతర పంటగా కూరగాయాల సాగు, రెండు ఎకరాలల్లో వరి సాగు చేయడం, ఎకరా పొలంలో పచ్చిగడ్డి సాగు చేస్తున్నారు. నిత్యం వంద లీటర్ల పాల ఉత్పత్తి పొలంలో షెడ్డును నిర్మించి 20 దేశ వాళీ రకం ఆవులను పోషిస్తున్నారు. ఒక్కో ఆవు ధర రూ.70 వేల నుంచి రూ. లక్ష వరకు ఉంటుంది. ఆవులకు ఆహారంగా ఎండుగడ్డి, పచ్చిగడ్డి, నిల్వ చేసి, సైలేజ్ గడ్డిని తయారు చేసి, ఆహారంగా అందిస్తున్నారు. అలాగే అజోల్లా గడ్డిని అందిస్తున్నారు. ప్రత్యేకంగా గానుగ నుంచి తీసిన పల్లి చెక్కను సైతం దాణాలో కలుపుతున్నారు. ఒక్కో ఆవు రోజుకు 10 నుంచి 12 లీటర్ల పాలు ఇస్తున్నాయి. మొత్తం ఆవులన్నీ 100 నుంచి 120 లీటర్ల వరకు పాలు ఇస్తున్నాయి. అలాగే గో మూత్రం వృథా కాకుండా ప్రత్యేకంగా ఒక ట్యాంకును ఏర్పాటు చేశారు. గో మూత్రాన్ని లీటరు రూ.25 చొప్పన విక్రయిస్తున్నారు. అదే విధంగా పంటల సాగుకు ఉపయోగిస్తున్నారు. జీవామృతంతో అధిక దిగుబడులు.. ఆవుల పేడ, గో మూత్రం, బెల్లం, పప్పుల పిండి, పుట్టమట్టిని కలిపి జీవామృతం తయారు చేస్తున్నారు. దీనిని నేరుగా ట్యాంకు నుంచి పంట పోలాలకు పైపులైను ద్వారా అందిస్తున్నారు. పంటకు సమృద్ధిగా పోషకాలు అందడంతో వరి పంట దిగుబడులు అధికంగా రావడం మొదలయ్యాయి. ఎకరా వరి ధాన్యం ఉత్పత్తి 40 బస్తాలకు పైగా వస్తోంది. వరిపంటకు జీవామృతం, అజోల్లా సాగుతో, చీడ పీడల సమస్య కూడా తలెత్తడంలేదు. వరితోపాటు టమాటా, వంకాయ, క్యాప్సికం, గోరుచిక్కుడు, మిర్చి, కొత్తిమీర, పుదీన, మెత్తికూర లాంటి ఆకుకూరలను పండిస్తున్నారు. మామిడి తోటకు, అంతర పంటలైన కూరగాయలకు కూడా జీవామృతాన్ని పైపులైను ద్వారా అందిస్తుండటంతో వాటి ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. అలాగే నాటుకోళ్లను సైతం పెంచుతున్నారు. ఆదర్శంగా నిలుస్తూ.. పవన్‌కుమర్‌రెడ్డి గో పోషణతో పాటు, సాగులో చేస్తున్న శ్రమను, కృషిని గుర్తించి హైదరాబాద్ వెటర్నరీ యూనివర్శిటీ వారు దేశవాళీ పాడి పశువుల పునరుత్పత్తి, సంకరణ కోసం సాహివాల్ కోడెను అందజేశారు. పవన్‌రెడ్డి చేస్తున్న గో ఆధారిత వ్యవసాయాన్ని చూసి గ్రామంలో పలువురు ఆయనను ఆదర్శంగా తీసుకుని గో ఆధారిత వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. పలువురికి ఉపాధి.. పాడిపోషణ, వ్యవసాయం చేయడానికి ఇద్దరు వ్యక్తులు పనిచేస్తుండగా, పాల విక్రయాలు, ధాన్యం, కూరగాయలు, ఆకుకూరలను నేరుగా వినియోగదారుల ఇంటికి వెళ్లి విక్రయించడానికి నలుగురు వ్యక్తులను నియమించుకుని ఉపాధి కల్పిస్తున్నారు. సాగు శ్రేష్టమైనది రసాయన ఎరువులతో పండించిన పంటలతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రజారోగ్యానికి, పర్యావరాణానికి జరుగుతున్న నష్టాన్ని గుర్తించి గో ఆధారిత వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాను. 20 దేశవాళీ ఆవులతో శ్రేష్టమైన పాలను ఉత్పత్తి చేయడంతో పాటు, నాణ్యమైన పండ్లు, కూరగాయాలు, ఆకుకూరలను పండిస్తున్నాను. పలువురికి ఉపాధి కల్పిస్తున్నాను. గ్రామభారతి సభ్యుడిగా, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సభ్యుడిగా, భారతీయ కిసాన్ సంఘం సభ్యుడిగా వ్యవసాయ రంగా అభివృద్ధికి కృషి చేస్తున్నాను. – పవన్‌రెడ్డి, గో ఆధారిత వ్యవసాయ దారుడు, చల్లంపల్లి -
ఆవు ఆరుబయట మేస్తేనే మేలు!
దేశీ ఆవులైనా రోజూ కొన్ని గంటల పాటు ఆరు బయట తిరుగాడుతూ సహజ సిద్ధంగా పెరిగే గరిక, ఔషధ మొక్కలను మేసే వెసులుబాటు ఉన్నప్పుడే ఆ ఆవు ఆరోగ్యంగా ఉంటుందని.. దాని పాల ఉత్పత్తులు, పేడ, మూత్రం కూడా ఔషధ విలువలతో కూడి ఉంటాయని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని గోశాలలకు గౌరవ సలహాదారుగా ఇటీవల నియమితులైన డాక్టర్ ములగలేటి శివరాం చెప్పారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కూరాడలో జన్మించిన ఆయన పశుసంవర్థక శాఖలో సహాయ సంచాలకులుగా ఉద్యోగ విరమణ చేశారు. ఒంగోలు గోజాతిపై లోతైన అవగాహన కలిగిన ఆయన ‘సాక్షి సాగుబడి’తో ముచ్చటించారు. ముఖ్యాంశాలు డా. శివరాం (78936 92277) మాటల్లోనే.. ఔషధ విలువలున్న పేడ, మూత్రంతో తయారు చేసే జీవామృతం, ఘనజీవామృతం, సబ్బులు, షాంపూలు నాణ్యంగా ఉంటాయి. ఆవు పేడ, మూత్రంలో ఔషధ విలువలున్నప్పుడే గో ఆధారిత వ్యవసాయంలో రైతులు ఆశించిన సత్ఫలితాలు పొందగలుగుతారు. రోజంతా కట్టేసి ఉంచకుండా శీతాకాలంలో 7–8 గంటల పాటు దేశీ ఆవులు ఆరుబయట తిరిగే ఏర్పాట్లు చేసుకోవాలి. చాలా గోశాలల్లో ఉన్న ఆవుల సంఖ్యకు తగినట్లు భూమి అందుబాటులో లేకపోవడం వల్ల ఆవులు ఆరుబయట తిరగలేని స్థితి నెలకొంది. ఏ గోశాలలోనూ దేశీ గోజాతుల అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదు. గోశాలలను సక్రమంగా నిర్వహించాలంటే వంద గోవులకు తిరిగి మేత మేయడానికి 50 ఎకరాలు, పచ్చిగడ్డి పెంపకానికి 15 ఎకరాలు, షెడ్లకు 70 ఎకరాల చొప్పున భూమి అవసరం ఉంటుంది. 100 ఆవులకు 3 ఇంచుల నీటిని ఇచ్చే 2 బోర్లు ఉండాలి. ఆవులు తిరిగి గడ్డి మేయడానికి కేటాయించిన భూమిని 6 భాగాలుగా చేసి, ఒక్కో భాగంలో పదేసి రోజుల చొప్పున ఆవులను మేపాలి. రెండు నెలల్లో గడ్డి బాగా పెరుగుతుంది కాబట్టి ఆవులు తిరుగుతూ గడ్డి మేయడానికి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం అన్నవరం, సింహాచలంలలో గోశాలలకు తప్ప.. దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహిస్తున్న చాలా గోశాలలకు ఈ వసతుల్లేవు. పచ్చిగడ్డి పెంచడానికి తగినంత స్థలం అందుబాటులో ఉంటే ఆవులకు దాణా పెట్టాల్సిన అవసరం ఉండదు. ఖర్చు కూడా తగ్గుతుంది. ఒంగోలు, పుంగనూరు వంటి దేశీ గోజాతుల అభివృద్ధిపై ఏ గోశాలలోనూ దృష్టి కేంద్రీకరించడం లేదు. దేశీ గోజాతులను అభివృద్ధి చేసుకుంటేనే ఆలయాలకు స్వచ్ఛమైన దేశీ ఆవుల పాలు అందుబాటులోకి వస్తాయి. పాలకొల్లులోని క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్యాకెట్ల పాలతో అభిషేకం చేయడం వల్ల శివలింగం కరిగిపోతున్నదని గుర్తించి, నేరుగా లింగంపై అభిషేకం చేయడమే నిలిపివేసే పరిస్థితి నెలకొంది. గతంలో ద్వారకా తిరుమల గోశాలలో రైతులకు గో ఆధారిత వ్యవసాయంపై శిక్షణ ఇవ్వటం వల్ల ప.గో. జిల్లాలో 3–4 వేల మంది రైతులు రసాయనిక వ్యవసాయాన్ని వదిలి గో ఆధారిత వ్యవసాయం చేస్తూ ఆరోగ్యదాయకమైన పంటలు పండిస్తున్నారు. -
పశు మాఫియా.. ఘోరాతి ఘోరం!
ప్రతివారం 25వేల పశువుల రవాణా లారీల్లో కుక్కి, తాళ్లతో కట్టి తరలింపు వారానికి రూ.12.50 కోట్ల లావాదేవీలు చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం విజయనగరం కంటోన్మెంట్: వారపు సంతలంటే ఒకప్పుడు పాడి ఆవులతోనూ, దుక్కిటెడ్లతోనూ కళకళలాడేవి. రైతులే స్వయంగా క్రయవిక్రయాలు జరిపేవారు. అందమైన బలిష్టమైన పాడి, దుక్కిపశువులుండే ఆ సంతలు ఇప్పుడు మాఫియా నీడలో నడుస్తున్నాయి. అప్పట్లో నెలకు రూ.పది వేల వ్యాపారం జరిగితే అదే పెద్ద రికార్డు కింద లెక్క. కానీ ఇప్చడు వారానికే దాదాపు రూ.12 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. బక్కచిక్కిన శరీరంతో దీనంగా ఆహారం కోసం, గుక్కెడు నీటికోసం ఎదురు చూస్తున్న పశువులే సంతల్లో దర్శనమిస్తున్నాయి. ఒడిశాలో పశువుల రవాణా నిషేధం. దీంతో అక్కడి మారుమూల ప్రాంతాల నుంచి దళారులు దాదాపు వారం రోజుల పాటు గ్రాసం, నీరు ఇవ్వకుండా నడిపిస్తూ తీసుకువచ్చి జిల్లాలోని మానాపురం, అచ్యుతాపురం,అలమండ తదితర సంతల్లో లారీల్లో కుక్కి కేరళ, తమిళనాడుకు పశువులను తరలిస్తున్నారు. జిల్లాలో పెదమానాపురం పశురవాణాకు ప్రధాన కేంద్రంగా మారింది. పశువుల రవాణాలో కనీస నిబంధనలు పాటించడంలేదు. ఒక వేగన్లో 30 నుంచి 45 వరకూ పశువులను కుక్కి తరలిస్తున్నారు. మాంసం కోసమే కదా అని పశువుల కాళ్లు విరగొట్టి మరీ ఒక దానిపై మరో పశువును ఎక్కించి తరలిస్తున్నారు. పశువుల తరలింపులో కనీస నిబంధనలు కూడా పాటించడంలేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఈ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. అడ్డుకోవాల్సిన పోలీసు, రెవెన్యూ యంత్రాంగం పశుమాఫియాకు సహకరిస్తుండడంతో వారి వ్యాపారం కోట్లకు పడగలెత్తింది. వారానికి 25 వేలు.. సంతల వారీగా ఒక వారంలో తరలించే పశువుల సంఖ్య ఇది..! జిల్లాలోని పార్వతీపురం, బబ్బిలి, కూనేరు, అడ్డాపుశీల, సాలూరు, అచ్యుతాపురం, కంది వలస, మోపాడలతో పాటు పెదమానాపురం సంతల నుంచి ప్రతీ వారం 25 వేలకు పైబడి పశువులు అక్రమంగా రవాణా అవుతున్నాయి. ఒక్కొక్క పశువును రూ.4వేల నుంచి రూ.15వేల వరకూ కొనుగోలు చేస్తున్నారు. ఒక్కొక్క పశువు ఖరీదు సగటున రూ.5వేలకు లెక్కిస్తే 25 వేల పశువుల ధర రూ.12.50 కోట్లవుతుంది. 44 పోలీసు స్టేషన్లు.. 20 చెక్‌పోస్టులు ఒడిశా నుంచి ఆంధ్రా దాటే వరకూ ఎన్నో చెక్‌పోస్టులు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కానీ ఎక్కడా పశు రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. పశువులతో పాటు, జిల్లాకు చెందిన వాటిని కూడా రవాణా చేస్తున్నారు. ఒడిశా నుంచి ఆంధ్రాకు వచ్చేందుకు రెండు దారులున్నాయి. ఆ మార్గాల గుండా పశువులు ఆంధ్రాలోకి ప్రవేశిస్తున్నాయి. జిల్లాలో 44 పోలీస్ స్టేషన్లు, రెండు పోలీస్ చెక్‌పోస్టులున్నాయి. పాచిపెంట మీదుగా వచ్చినపుడు పి కోనవలస చెక్ పోస్ట్, అక్కడే పోలీస్ స్టేషన్, సాలూరులో సర్కిల్ కార్యాలయం, రామభద్రపురంలో పోలీస్ స్టేషన్, బూర్జి వలస, పెదమానాపురంలలో పోలీస్ స్టేషన్లు, గజపతినగరంలో సర్కిల్ కార్యాలయం ఆ తరువాత బండపల్లి, విజయనగరం పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కానీ ఎక్కడా ఈ పశు రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. స్థానిక నేతల సహకారంతోనే.. జిల్లాలో అన్ని రంగాల వారితో పరిచయముంటున్న కొందరు చోటామోటా స్థానిక నాయకులతో ఇతర రాష్ట్రాలకు చెందిన ఈ పశురవాణా వ్యాపారులు సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు. పశురవాణాలో ఆటంకాలు ఎదురైనప్చడు ఈ నేతలు రంగంలోకి దిగుతారు. వెంటనే సెటిల్ మెంట్లకు తెర తీస్తారు. వారితో బేరం పెట్టుకుని మరెప్పుడూ ఈ పశు రవాణా జోలికి రాకుండా సెటిల్ చేస్తారు. అది ఒక్కసారే కావచ్చు! లేదా ప్రతీ వారం పెన్షన్ పద్ధతిలోనూ కావచ్చు. మొత్తానికి ఏదో ఒక సెటిల్ మెంట్ ఖాయం. ఈ సెటిల్ మెంట్ అనేది చిన్న చిన్న వాళ్లయితే ఒకేసారి ఎంతో కొంత మొత్తాన్ని జేబులో పెట్టి పంపేస్తారు. నిత్యం వీడితో గొడవ పడాల్సి ఉంటుందని భావిస్తే ప్రతీ నెలా కొంత మొత్తం ఇస్తామని పరస్పర అంగీకారం జరుగుతుంది. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలకు మామూళ్లు? జిల్లాలో పశు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ,పోలీస్ అధికారులు ప్రతినెలా పెద్ద ఎత్తున ఠంచనుగా మామూళ్లు అందుతుండడం వల్లే పశుఅక్రమ రవాణాకు అడ్డూ ఆపూ లేకుండా జరిగిపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఉన్న సంతలతో పాటు ఒడిశాలోని చిత్ర తదితర సంతల నుంచి కొనుగోలు చేసి మానాపురం వరకూ తరలిస్తారు. కాలినడకన మానాపురం వరకూ తరలించేందుకు స్థానికులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఒక్కో వ్యక్తికి 20 నుంచి 50 పశువులను అప్పగిస్తారు. వారు పశువులను తరలించినందుకుగాను ఒక్కొక్క పశువుకు రూ.150 నుంచి 200 వరకూ చెల్లిస్తారు. రాత్రీ పగలు అనే తేడా లేకుండా పశువులకు విశ్రాంతి ఇవ్వకుండా వారం రోజుల పాటు నడిపించి మానాపురం సంతకు తీసుకువస్తారు. అలా తీసుకువచ్చిన పశువులకు గడ్డి, నీరు ఇవ్వకుండా మానాపురం వద్ద సామర్థ్యానికి మించి లారీల్లో కుక్కి తాళ్లతో బంధించి రవాణా చేస్తున్నారు. చెన్నై, కేరళ, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని కబేళాలకు తరలిస్తున్నారు. ఆవేదన భరితంగా అంబారావాలు రవాణా సమయంలో పశువులు దయనీయంగా అరుస్తున్నా పట్టించుకోవడం లేదు. వాటికి గడ్డీ, నీరు ఇవ్వకుండా తాళ్లతో బంధించి వందల కిలోమీటర్లు రవాణా చేస్తుండడంతో ఆకలికి అవి దీనంగా అరుస్తుంటే పెద్ద కర్రలతో కొట్టి వాటి నోరు మూయించి హింసిస్తున్నారు. వారు పెట్టే హింస భరించలేక కబేళాకు వెళ్లకముందే పశువులు వాహనాల్లోనే మరణిస్తున్నాయి.