cp mahesh bhagavath
-
కరోనా బాధితుల ఇంటికే ఆక్సిజన్
-
Rachakonda Police Commissionerate: కరోనా బాధితుల ఇంటికే ఆక్సిజన్
నేరేడ్మెట్: కరోనాతో పోరాడుతున్న బాధితులకు ఆక్సిజన్ ఎంతో కీలకం. ఆక్సిజన్ కొరత నేపథ్యంలో పలు ఆసుపత్రుల్లో బాధితులు ఇబ్బందులు పడుతుండగా.. కొందరు మృత్యువాత పడిన దాఖలాలూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో హోం ఐసోలేషన్‌లో ఉంటూ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న బాధితులకు ప్రాణవాయువును అందించే కార్యక్రమానికి రాచకొండ పోలీసులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా డీఆర్డీఓ, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ (ఆర్కేఎస్సీ), లయన్స్ క్లబ్, హెట్ ఫౌండేషన్, సెకండ్ చాన్స్ ఫౌండేషన్లతో కలిసి రాచకొండ పోలీసులు నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ‘ప్రాణవాయు సేవ బ్యాంకు’ను ఏర్పాటు చేశారు. శనివారం రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఈ బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ఆక్సిజన్ సిలిండర్లు అవసరమైన వారు రాచకొండ కోవిడ్ కంట్రోల్ రూం నెంబర్ 9490617234కి ఫోన్ చేసి, రోగికి సంబంధించిన వివరాలు, డాక్టర్ ప్రిస్కిప్షన్, ఆధార్ కార్డు తదితర వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలు పరిశీలించి వారి ఇంటికి ఆక్సిజన్ సిలిండర్‌ను పంపించడం జరుగుతుందని సీపీ వివరించారు. డొనేట్‌ప్లాస్మా.ఆర్కేఎస్సీ.ఇన్ వెబ్‌పేజీని సీపీ ప్రారంభించారు. ప్లాస్మా దాతలు, ప్లాస్మా అవసరమైన వారు ఈ వెబ్‌పేజీలో పేరు, వివరాలు నమోదు చేసుకోవాలని సీపీ కోరారు. చదవండి: కరోనా వ్యాక్సిన్: స్పుత్నిక్–వి భేష్.. సామర్థ్యం ఎంతంటే Corona Warriors: డాక్టర్ల కన్నా ముందే..‘ఊపిరి’ పోస్తున్నారు -
‘ఆపన్న హస్తం అందించడం విశేషం’
సాక్షి, హైదరాబాద్: రాచకొండ కమీషనరేట్ ఆధ్వర్యంలో గుడ్ సమారిటన్ అవార్డు వేడుక నాగోలు శుభం కన్వెన్షన్ హాలులో వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సంక్షోభ సమయంలో పోలీసులకు సహకరించి పలువురికి సేవలు చేసిన వారికి అవార్డులను బహుకరించారు. పనులు లేక అవస్థలు పడుతున్న పేదవారికి నిత్యావసర వస్తువులను అందజేసిన చిలుకనగర్ డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్‌కు రాచకొండ సీపీ మహేష్ భగవత్ గుడ్ సమారిటన్ అవార్డును అందజేశారు. సీపీ మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలంలో ఆపన్న హస్తం అందించడం విశేషమని బన్నాల ప్రవీణ్‌ను కొనియాడారు. అవార్డు అందుకున్న ప్రవీణ్ మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలంలో వికలాంగులు, ఒంటరి మహిళలతో పాటు ఇతరులకు నిత్యావసర వస్తువులను అందజేసినట్లు తెలిపారు. ఇక తాను చేసిన సేవలకు గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. కోవిడ్-19 సమయంలో ఈ సేవా కర్యక్రమాలు చేయడానికి తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. -
ఆమె వీడియోను పోర్న్సైట్లలో పోస్ట్ చేశాడు..
సాక్షి,హైదరాబాద్: ఓ యువతి ప్రైవేట్ వీడియోలను పోర్న్ వెబ్సైట్లలో పోస్టు చేసి వేధిస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లాకు చెందిన పాటిబండ్ల సంజయ్ ఓ ప్రైవేట్ టీవీ ఛానల్లో సౌండ్ టెక్నీషియన్‌గా పనిచేస్తూ సికింద్రాబాద్ కార్ఖానలో నివాసముంటున్నాడు. ఎల్బీనగర్కు చెందిన బాధితురాలు మిర్యాలగూడలో ఓ టీవీ సీరియల్ షూటింగ్‌ను చూసేందుకు వచ్చిన సందర్భంలో సంజయ్‌తో పరిచయం ఏర్పడింది. మొబైల్ నంబర్లు మార్చుకొని తరచూ చాట్ చేసుకోవడం మొదలెట్టారు. కొన్నిరోజుల తర్వాత బాధితురాలిని మాటలతో కవ్వించి వీడియో చాట్ చేస్తున్న సమయంలో ప్రైవేట్ భాగాలు చూపించేలా చేశాడు. ఆమెకు తెలియకుండానే వీడియో క్యాప్చరింగ్ అప్లికేషన్‌ను ఉపయోగించి వీడియో ఫుటేజ్‌ను రికార్డు చేశాడు. ఆ తర్వాత తనతో ఉండాలని లేకపోతే ఆ వీడియోను పోర్న్ వెబ్సైట్లో పెడతానని బెదిరించాడు. అలా చేయవద్దంటూ ఆమె తీవ్రంగా మందలించింది. అయినప్పటికీ వివిధ పోర్న్ సైట్లలో సంజయ్ ఆ వీడియో పోస్టు చేశాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదుచేసిన పోలీసులు సికింద్రాబాద్ కార్ఖానలో ఉన్న సంజయ్‌ను సోమవారం అరెస్టు చేసి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఆ వీడియో లింక్‌లను తొలగించాలంటూ సంబంధిత వెబ్సైట్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. -
యాదాద్రికి మూడంచెల భద్రత
రాచకొండ నేర వార్షిక సమావేశంలో సీపీ మహేశ్ భగవత్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఆలయ క్షేత్రం యాదాద్రికి మూడంచెల భద్రతను కల్పించను న్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. టెంపుల్, టెంపుల్ టౌన్, వీవీఐపీ జోన్లో ప్రత్యేక భద్రతా చర్యలు త్వరలోనే చేపడతామని గచ్చిబౌలిలోని సైబ రాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో శనివారం రాచకొండ నేర వార్షిక నివేదిక సమావేశంలో ఆయన విలేకరులతో చెప్పారు. తిరుపతి తరహాలో యాదాద్రిలోనూ భద్రత చర్యలు ఉంటాయన్నారు. యాదాద్రి టూరి జం డెవలప్మెంట్ అథారిటీతో కలసి పని చేస్తున్నామని, ఇందులో భాగంగానే ఐదు కొత్త ఠాణాలు ఏర్పా టు చేస్తున్నామని చెప్పారు. కీసర గుట్టలోని శ్రీరామ లింగేశ్వర స్వామి గుడి, మౌలాలిలోని హజ్రత్ అలీ దర్గా, పహడీషరీఫ్‌లోని బాబా సర్ఫుద్దీన్ దర్గాలో కూడా శాంతిభద్రతలను అనుక్షణం పర్యవేక్షిస్తున్నామన్నారు. రాచకొండ కమిషనరేట్‌లోని ఐటీ కారిడార్‌లో మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నామని చెప్పారు. పోచారంలోని ఇన్ఫోసిస్ క్యాంపస్, ఉప్పల్‌లోని జెన్‌ప్యాక్, ఆదిభట్లలోని టీసీఎస్ కంపెనీలతో పాటు అనేక ఎంఎన్సీ కంపెనీలు ఉన్నాయని పేర్కొ న్నారు. ఆయా కంపెనీల నుంచి ‘మార్గద ర్శక్’లను ఎంపిక చేసినట్లు.. వీరు కంపెనీకి, పోలీసులకు మధ్య వారధిగా పనిచేస్తారని వెల్లడించారు. అలాగే యువతులు, ఉద్యోగి ణుల భద్రత కోసం సేఫ్ స్టే ప్రాజెక్టుకు సైబ రాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో కలసి శ్రీకారం చుట్టి నట్లు తెలిపారు. త్వరలో షీ షటిల్ బస్సు లు ప్రారంభించబోతున్నామని వివరించారు. అలాగే గ్యాంగ్‌స్టర్ నయీంకు సంబంధించి 152 కేసులు నమోదయ్యాయని, తాజాగా 19 మంది బాధితులు తనను ఆశ్రయించగా ఆ కేసులు నమోదు చేయాలని భువనగిరి డీఎస్పీని ఆదేశించినట్లు తెలిపారు.